మాదిరి ప్రశ్నలు
1. 'అనువైన సహజ వాతావరణంలో పూర్తిచేసిన సమస్యాకృత్యమే ప్రకల్పన' అన్నది ఎవరు?
జ: స్టీవెన్సన్
2. ప్రాజెక్టు పద్ధతిలో తొలి సోపానం?
జ: పరిస్థితులను కల్పించడం
3. సమస్యా పరిష్కార పద్ధతిలో ముఖ్యమైన దశ?
జ: సమస్యను గుర్తించడం
4. కిందివాటిలో ప్రాజెక్టు పద్ధతికి సరిపోయే అంశం?
ఎ) ఆక్సిజన్ తయారీ బి) సాంద్రతను కనుక్కోవడం
సి) పాస్కల్ సూత్రం డి) రంగులు
జ: డి(రంగులు)
5. రిపుల్ ట్యాంక్, నీటి గడియారం నిర్మాణాలను బోధించడానికి అనుసరించే ఉత్తమమైన పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి
6. హ్యూరిస్టిక్ పద్ధతిని రూపొందించినవారు?
జ: ఆర్మ్‌స్ట్రాంగ్
7. 'పాఠశాలలోకి దిగుమతి కాబడిన నిజజీవిత భాగమే ప్రకల్పన' అని నిర్వచించినవారు?
జ: బెల్లార్డ్
8. అన్వేషణా పద్ధతిని విమర్శించిన విద్యావేత్త?
జ: వెస్ట్‌వే
9. సూచన కార్డులో ఉండాల్సిన ముఖ్య అంశం ఏది?
ఎ) ఉద్దేశం బి) పరికరాలు సి) విధానం డి) అన్నీ
జ: డి(అన్నీ)