• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర బోధన లక్ష్యాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయడం' ఇది ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది?
జ: వైఖరి

 

2. వైఖరి ఏ రంగానికి చెందింది?
జ: భావావేశ రంగం

 

3. అవగాహన లక్ష్యాన్ని స్పష్టీకరించింది ఎవరు?
జ: బ్లూమ్

 

4. కిందివాటిలో వినియోగ లక్ష్య స్పష్టీకరణ?
ఎ) ఉదాహరణలివ్వడం                 బి) సంబంధాలను స్థాపించడం  
సి) మాదిరులను సేకరించడం        డి) పుస్తకాలను పఠించడం
జ: బి (సంబంధాలను స్థాపించడం)

 

5. 'సాంద్రతను నిర్వచించండి' అని ప్రశ్నించడం ద్వారా పొందగలిగే లక్ష్యం?
జ: జ్ఞానం

 

6. ఒక విషయాన్ని అంగీకరించడానికి లేదా నిరాకరించడానికి ఆధారాన్ని కోరితే ఆ లక్ష్యం?
జ: వైఖరి

 

7. 'విశ్లేషణ చేయగలగడం' అనే స్పష్టీకరణ కిందివాటిలో ఏ లక్ష్యానికి చెందింది?
ఎ) జ్ఞానం         బి) నైపుణ్యం           సి) వినియోగం          డి) అవగాహన
జ: సి (వినియోగం)

 

8. భావావేశ రంగం అత్యున్నత లక్ష్యం?
జ: శీలనిర్మాణం

 

9. విద్యకు మార్గదర్శనం చేసేది?
జ: ఉద్దేశాలు

 

10. పాఠశాల కార్యక్రమాల ద్వారా అంతిమంగా చేరుకోగల దృక్పథాన్ని ఏమంటారు?
జ: లక్ష్యం
 

11. 'సునిశితత్వం' అనే లక్ష్యం మానసిక చలనాత్మక రంగం క్రమణికలో ఎన్నోది?
జ: 3

 

12. లక్ష్యానికి, లక్ష్యానికి మధ్య ఉన్న తేడాలను సూచించేవి?
జ: స్పష్టీకరణలు

 

13. 'సాధారణీకరించడం' ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థిలో సాధించే లక్ష్యం?
జ: అన్వయం

14. కిందివాటిలో లక్ష్యాలు వేటి గురించి చర్చించవు?
ఎ) బోధనా పద్ధతులు                 బి) పాఠ్యాంశాలు
సి) బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలు      డి) ఏదీకాదు
జ: సి (బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలు)


15. 'విశాల భావాలను కలిగి ఉండటం' అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ?
జ: వైఖరి

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌