• facebook
  • whatsapp
  • telegram

రసాయన గతిశాస్త్రం, శక్తిశాస్త్రం, రసాయన గణన, స్టాయికియోమెట్రి

రసాయన సంయోగం: రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే పదార్థాన్ని ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటారు.
ఉదా: C + O2 CO2
2 Mg + O2  2 MgO
NH3 + HCl  NH4Cl
S + O2 SO2
CaO + H2O  Ca(OH)2
2 Na + Cl2

 2 NaCl
N2 + 3 H2   2 NH3
MgO + H2O  Mg(OH)2
2 SO2 + O2 2 SO3
2 NO + O2 2 NO2

రసాయన వియోగం: ఒక పదార్థం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఏర్పరచడాన్ని రసాయన వియోగం అంటారు.
ఉదా: CaCO3 CaO + CO2


2 Pb(NO3)2 2 PbO + O2↑ + 4 NO2
2 HgO  2 Hg + O2
CuCO3 CuO + CO2
2 KNO3 2 KNO2 + O2
2 H2O2 2 H2O + O2

ZnCO3   ZnO + CO2
2 NH3 N2 + 3 H2
2 HI  H2 + I2
2 H2O  2 H2 + O2
   2 AgBr         2 Ag + Br2
(లేత పసుపు రంగు)           (బూడిద రంగు)

రసాయన స్థానభ్రంశం: ఒక మూలకం లేదా ప్రాతిపదిక వేరొక మూలకం లేదా ప్రాతిపదికను స్థానభ్రంశం చెందిస్తే దాన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
ఉదా: Zn + 2 HCl  ZnCl2 + H2
Zn + CuSO4 ZnSO4 + Cu
Zn + H2SO4

 ZnSO4 + H2
Cu + 2 AgNO3 Cu(NO3)2 + 2 Ag
Br2 + 2 KI  2 KBr + I2
Mg + 2 AgNO3 Mg(NO3)2 + 2 Ag
2 KI + Cl2  2 KCl + I2
Fe + CuSO4 FeSO4 + Cu
Zn + 2 AgNO3 Zn(NO3)2 + 2 Ag
Pb + CuCl2 PbCl2 + Cu

రసాయన ద్వంద్వ వియోగం: రెండు పదార్థాలు వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్చుకునే చర్యను ద్వంద్వ వియోగం అంటారు.
ఉదా: BaCl2 + Na2SO4

 BaSO4 + 2 NaCl
AgNO3 + HCl  AgC+ HNO3
AgNO3 + NaCl  AgCl + NaNO3
2 KI + Pb(NO3)2 2 KNO3 + PbI2
Na2CO3 + Ca(OH)2CaCO3 + 2 NaOH
Pb(NO3)2 + 2 HCl PbCl2 + 2 HNO3
NH3 + 3 Cl2 NCl3 + 3 HCl
NaOH + HCl  NaCl + H2O

అతివేగ చర్యలు: లిప్తపాటు నుంచి కొన్ని సెకన్లలో జరిగే చర్యలను అతివేగ చర్యలు అంటారు.
ఉదా: మెగ్నీషియం రిబ్బన్‌ను గాలిలో కాల్చడం; చలువరాతి జింక్ ముక్కలపైన ఆమ్లచర్యలు అనేవి అతివేగ చర్యలు
2 Mg + O2 2 MgO
CaCO3 + 2 HCl

 CaCl2 + H2O + CO2
Zn + 2 HCl  ZnCl2 + H2

మితవేగ చర్యలు: కొన్ని నిమిషాల నుంచి గంటల్లో జరిగే చర్యలను మితవేగ చర్యలు అంటారు.
ఉదా: 1) మనం తిన్న ఆహారం జీర్ణం కావడం, పాలు పెరుగుగా మారడం
    2) మిథైల్ ఎసిటేట్‌ను జలవిశ్లేషణం చెందించడం.
   CH3COOCH3  +  H2O    CH3COOH    +    CH3OH
(మిథైల్ ఎసిటేట్)       (నీరు)           (ఎసిటిక్ ఆమ్లం)      (మిథైల్ ఆల్కహాల్)

మందకొడి చర్యలు: కొన్ని గంటల కంటే ఎక్కువ సమయంలో పూర్తయ్యే చర్యలను మందకొడి చర్యలు అంటారు.
ఉదా: ఇనుము తుప్పు పట్టడం మందకొడి చర్య. ఒక ఇనుప ముక్కను గాలిలో ఉంచినప్పుడు అది గాలిలోని తేమ, ఆక్సిజన్‌ను గ్రహించి కొన్ని రోజుల తర్వాత ఐరన్ఆక్సైడ్ (తుప్పు)గా మారుతుంది.
    4 Fe    +    3 O2        2 Fe2O3
(ఇనుము)    (ఆక్సిజన్)            (తుప్పు)
* రసాయనిక చర్య జరిగినప్పుడు క్రియాజనకాలు క్రమంగా ఒక పద్ధతి ప్రకారం క్రియాజన్యాలుగా మారతాయి. ఇలా రూపొందడానికి కొంత సమయం కూడా పడుతుంది. పరిమాణాత్మకంగా చెప్పాలంటే రసాయనిక పదార్థాలను గాఢత ప్రమాణాల్లో తెలియజేస్తాం. గాఢతను 'మోల్స్ సంఖ్య'గా ప్రమాణించి చెబుతారు. చర్య జరగడానికి అవసరమైన కాలాన్ని సెకండ్లలో, నిమిషాల్లో, గంటల్లో లేదా రోజుల్లో సూచిస్తాం.
* చర్య జరిగినప్పుడు క్రియాజనకాల గాఢత క్రమేపీ తగ్గుతూ, క్రియాజన్యాల గాఢత పెరుగుతుంది.

రసాయన చర్యావేగం: 1) నిర్దిష్ట లేదా ప్రమాణ కాలంలో గాఢతలోని మార్పును చర్యావేగం అంటారు.

2) నిర్దిష్ట లేదా ప్రమాణ కాలంలో క్రియాజనకాల గాఢతలోని తగ్గుదలను రేటు అంటారు.
3) నిర్దిష్ట లేదా ప్రమాణ కాలంలో క్రియాజన్యాల గాఢతలోని పెరుగుదలను రేటు అంటారు.

                        = మోల్/లీటరు/సెకన్
రసాయన చర్యావేగాన్ని ప్రభావితం చేసే అంశాలు
* రసాయనిక చర్యావేగం క్రియాజనకాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
* రసాయనిక చర్యావేగం క్రియాజనకాల గాఢతపై ఆధారపడి ఉంటుంది. క్రియాజనకాల గాఢతను పెంచితే చర్యావేగం పెరుగుతుంది.
* ఉత్ప్రేరకం రసాయనిక చర్యావేగాన్ని ప్రభావితం చేస్తుంది.
ఉదా: 2 KClO3 2 KCl + 3 O2   

                          (లేదా)

2 KCl3 (240 °C) 2 KCl + 3 O2
* రసాయన చర్యలో ఉష్ణోగ్రతను పెంచితే చర్యావేగం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలోని 10 °C ల పెరుగుదల చర్యావేగాన్ని రెండింతలు లేదా మూడింతలుగా పెంచుతుంది.

అద్విగత చర్యలు
     క్రియాజన్యాలను తిరిగి క్రియాజనకాలుగా మార్చడానికి వీల్లేని చర్యలను అద్విగత చర్యలు అని పిలుస్తారు.
ఉదా: 2 Mg + O2 2 MgO
CaCO3 + 2 HCl  CaCl2 + CO2 + H2O

ద్విగత చర్యలు: కొన్ని రసాయన చర్యల్లో క్రియాజన్యాలను తిరిగి క్రియాజనకాలుగా మార్చడానికి వీలవుతుంది. ఈ చర్యలను 'ద్విగత చర్యలు' అంటారు.
* ద్విగత చర్యలను  లేదా  వ్యతిరేక దిశల్లో సమాంతరంగా రాసిన
అర్ధ బాణాల గుర్తులతో సూచిస్తారు. ఒక ద్విగత చర్యలో రెండు చర్యలు ఇమిడి ఉంటాయి.
* క్రియాజనకాలు, క్రియాజన్యాలుగా మారే చర్యను పురోగామి చర్యగా వ్యవహరిస్తారు.
* మొదటి చర్యలోని (పురోగామి చర్యలోని) క్రియాజన్యాలు తిరిగి క్రియాజనకాలుగా మార్పు చెందే చర్యను తిరోగామి చర్యగా వ్యవహరిస్తారు.
ఉదా: BiCl3 + H2O  BiOCl + 2 HCl
         N2 + 3 H2 2 NH3
2 SO2 + O2 2 SO3
            PCl5  

 PCl3 + Cl2
* మూసి ఉంచిన పాత్రలోకి 273 °Kవద్ద H2, I2 వాయువులను తీసుకుంటే HI ఏర్పడే చర్య పూర్తిగా జరగదు. కింద సూచించిన రెండు చర్యలు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి.
  H2   +   I2      2 HI
(వా.)      (వా.)              (వా.)
  2 HI    H2  +   I2
(వా.)          (వా.)       (వా.)


ద్విగత చర్య:   H2   +   I2      2 HI
               (వా.)     (వా.)                (వా.)
పురోగామి చర్య: H2 + I2 2 HI
తిరోగామి చర్య: H2 + I2  ←     2 HI

      ద్విగత చర్యల్లో పురోగామి చర్యావేగం, తిరోగామి చర్యావేగం సమానమైతే రసాయనిక చర్య సమతాస్థితిని సాధించిందని చెప్పవచ్చు. ఈ సమతాస్థితిని గతిక సమతాస్థితిగా పరిగణిస్తారు.
* ద్విగత చర్యల్లో క్రియాజనకాల గాఢతను పెంచితే పురోగామి చర్యావేగం పెరుగుతుంది. సమతాస్థితి కుడివైపు మొగ్గు చూపుతుంది.
* ద్విగత చర్యల్లో క్రియాజన్యాల గాఢతను పెంచితే తిరోగమన చర్యావేగం పెరుగుతుంది. సమతాస్థితి ఎడమవైపు మొగ్గు చూపుతుంది.
* ద్విగత చర్యల్లో పాల్గొనే క్రియాజనకాల అణువుల సంఖ్య, క్రియాజన్యాల అణువుల సంఖ్యపై పీడన ప్రభావం ఆధారపడి ఉంటుంది.
* ఒక ద్విగత చర్యలో పీడనాన్ని పెంచితే అది తక్కువ అణువులు ఉన్న చర్యను ప్రభావితం చేస్తుంది.
* క్రియాజనకాలు, క్రియాజన్యాలు సమాన సంఖ్యలో అణువులు కలిగి ఉన్న ద్విగత చర్యపై పీడన ప్రభావం ఉండదు.
* పరిమాణాత్మక రసాయన మార్పులు కొన్ని సూత్రాలకు లోబడి ఉంటాయి. వీటిని రసాయన సంయోగ నియమాలు అంటారు. అవి:
   1. ద్రవ్యనిత్యత్వ నియమం    2. స్థిరానుపాత నియమం    3. బహ్వానుపాత నియమం.

ద్రవ్యనిత్యత్వ నియమం: కర్ర బొగ్గును మండిస్తే దాని భారం తగ్గుతుందని చాలాకాలం భావించారు. కర్ర బొగ్గును మండించినప్పుడు ఏర్పడే పదార్థం బయటకిపోకుండా పూర్తిగా మూసి ఉన్న ఏర్పాటుతో ప్రయోగం చేసినప్పుడు మొత్తం భారంలో ఏ మార్పు లెవోయిజర్ గమనించలేదు. ఈ పరిశీలనల ఆధారంగానే ఆయన ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు.
* 'ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేం, నాశనం చేయలేం' మరోవిధంగా చెప్పాలంటే 'ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి, ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానం'.
* రసాయన చర్యల్లో పదార్థం జనించదు లేదా నశించదు.
2 Mg + O2 2 MgO
CaO + H2O  Ca(OH)2
2 KClO3 2 KCl + 3 O2
Zn + CuSO4

 ZnSO4 + Cu
  పై రసాయన మార్పులన్నింటిలో క్రియాజనకాల భారాల మొత్తం, క్రియాజన్యాల భారాల మొత్తానికి సమానం.
* ద్రవ్యనిత్యత్వ నియమాన్ని లెవోయిజర్ ప్రతిపాదించినప్పటికీ దీన్ని లాండాల్ట్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చెందిన పరికరాలతో ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.

స్థిరానుపాత నియమం
* జోసెఫ్ ప్రౌస్ట్ 1798 నుంచి 1808 మధ్యకాలంలో కాపర్ కార్బోనేట్ (కాపర్, కార్బన్, ఆక్సిజన్‌ల సమ్మేళనం) ప్రకృతిలో లభించే సహజ నమూనాను, ప్రయోగశాలలో తయారుచేసిన కృత్రిమ నమూనాలను సేకరించి వాటి అనుఘటిక మూలకాల భారశాతాలను కనుక్కున్నాడు.



* అదేవిధంగా ప్రౌస్ట్ వివిధ రకాలైన నీటి నమూనాలను సేకరించి పరిశీలించినప్పుడు అన్ని నమూనాల్లో హైడ్రోజన్, ఆక్సిజన్‌ల భారశాతాలు సమానంగా ఉంటాయని కనుక్కున్నాడు. నమూనాను ఏ ప్రాంతం నుంచి లేదా ఏ పద్ధతిలో సేకరించామన్న దానిపై సంఘటన శాతాలు ఆధారపడవని గ్రహించి, ఈ ప్రయోగాల ఆధారంగా స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించాడు.
* 'ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో కలసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది'. అంటే పదార్థాన్ని ఎక్కడ నుంచి సేకరించాం, ఏ విధంగా తయారు చేశామనే వాటితో సంబంధం లేకుండా ఒక సంయోగ పదార్థంలోని మూలకాల భార నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది.
* హైడ్రోజన్‌ను మండించడం, బాగా వేడి చేసిన క్యూప్రిక్ ఆక్సైడ్ పైకి హైడ్రోజన్‌ను పంపడం, ప్రకృతిలో లభించే నీటిని స్వేదనం చేయడం ద్వారా నీటిని పొందవచ్చు. ఈ పద్ధతుల ద్వారా పొందిన నీటిని విద్యుత్ విశ్లేషణం చేసినపుడు ఏర్పడిన ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువుల ఘనపరిమాణాలు 1 : 2 నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్‌ల భారాల నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరమని చెప్పవచ్చు.

బహ్వానుపాత నియమం
* ఈ నియమాన్ని 1803లో డాల్టన్ ప్రతిపాదించాడు.
* కార్బన్, ఆక్సిజన్‌తో కలసి కార్బన్ మోనాక్సైడ్ (CO), కార్బన్ డై ఆక్సైడ్ (CO2)లను ఏర్పరుస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్‌ల్లో స్థిర భారం ఉన్న కార్బన్‌తో చర్య పొందే ఆక్సిజన్‌ల భారాలు 1 : 2 నిష్పత్తిలో ఉంటాయి.
* హైడ్రోజన్, ఆక్సిజన్‌తో కలసి నీటిని (H2O), హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2)లను ఏర్పరుస్తుంది. నీరు, హైడ్రోజన్ పెరాక్సైడుల్లో స్థిరభారం ఉన్న హైడ్రోజన్‌తో చర్య పొందే ఆక్సిజన్ భారాలు 1 : 2 నిష్పత్తిలో ఉంటాయి.
* 'రెండు మూలకాలు కలసి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఏర్పరిచినప్పుడు స్థిరభారం ఉన్న మొదటి మూలకంతో చర్య పొందే రెండో మూలకం యొక్క భారాలు సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటాయి'. దీన్ని బహ్వానుపాత నియమం అంటారు.

రేటు నియమం, రేటు స్థిరాంకం
* క్రియాజనకాల గాఢతపై చర్యారేటు ఆధారపడే పద్ధతిని తెలిపే రేటుకు, గాఢతలకు మధ్య సంబంధాన్ని చూపే గణితాత్మక సమీకరణాన్ని రేటు సమీకరణం అంటారు. రేటు సమీకరణాన్ని ప్రయోగం ద్వారానే రాబడతారు.
చర్యారేటును నిర్ణయించే పద్ధతుల్లో వివిక్తతా పద్ధతి ముఖ్యమైంది.
    A + B  క్రియాజన్యాలు ఈ చర్యలో B గాఢత, A గాఢత కంటే అత్యధికంగా తీసుకుంటే చర్యారేటు A గాఢతపై ఆధారపడుతుంది.
    A + B  క్రియాజన్యాలు
చర్యారేటు r α [A]n [B]m
చర్యారేటు r = K[A]n [B]m
K ని విశిష్టరేటు లేదా రేటు స్థిరాంకం అంటారు.

       

* క్రియాజనకాల గాఢతలు ఏకాంక పరిమాణంలో ఉన్నపుడు చర్య ప్రదర్శించే రేటును విశిష్టరేటు లేదా రేటు స్థిరాంకం K అంటారు.
ప్రమాణాలు K = మోల్n-1 లీn-1 సెకన్-1
ఉదా: CH3COOC2H5 + NaOH  CH3COONa + C2H5OH
చర్యారేటు = K = [CH3COOC2H5]' [NaOH]'

చర్యా క్రమాంకం
* చర్యారేటు సమీకరణంలోని క్రియాజనకాల గాఢత పదాల ఘాతాల మొత్తాన్ని చర్యా క్రమాంకం అంటారు. చర్యా క్రమాంకం సున్నా, భిన్నం, పూర్ణాంకం కావచ్చు. చర్యా క్రమాంకాన్ని ప్రయోగపూర్వకంగానే నిర్ణయిస్తారు.
* స్టాయికియోమెట్రి సమీకరణం ద్వారా ప్రాథమిక చర్యల క్రమాంకాన్ని రాబట్టవచ్చు.
XA + YB + ZC  ఉత్పన్నాలు
R = K[A]X [B]Y [C]Z
క్రమాంకం = X + Y + Z


చర్యా క్రమాంకం: ప్రథమ A  r = K1[A]
రేటు సమీకరణం:  = K1 (a − x)


రేటు స్థిరాంక సమీకరణం: K1
రేటు స్థిరాంకం ప్రమాణాలు sec-1
అర్ధాయువు:  × a0
ఉదా: N2O5

 N2O4 +  O2
(వా)               (వా)       (వా)
SO2Cl2 SO2 + Cl2


చర్యా క్రమాంకం: ద్వితీయ 2 A  ఉత్పన్నాలు,
                   A + B   ఉత్పన్నాలు
r = K2[A]2 లేదా r = K2 [A][B]


* రేటు స్థిరాంక ప్రమాణాలు: లీ. మోల్-1, సెకన్-1

ఉదా: 2 HI

 H2 + I2
   2 NO2 2 NO + O2


చర్యా క్రమాంకం: తృతీయం 3 A  ఉత్పన్నాలు (లేదా)
A + B  ఉత్పన్నాలు (లేదా) A + B + C  ఉత్పన్నాలు
r = K3 [A]3
r = K3 [A]2 [B]1
r = K3 [A]1 [B]1 [C]1


రేటు స్థిరాంకం ప్రమాణాలు: లీ2. మోల్-2. సెకన్-1
అర్ధాయువు 
ఉదాహరణలు: 2 NO + O2 2 NO2
                      2 NO + Cl2 2 NOCl
nవ క్రమాంక చర్య: చర్యా స్థిరాంక ప్రమాణాలు లీn-1 మోల్1-n సెకన్-1
                                          లేదా      (atm)1-n . sec-1


చర్యారేటుల అభిఘాత సిద్ధాంతం
* క్రియాజనకపు అణువులు ఒకదాంతో ఒకటి ఢీకొని వాటి బంధాలను మార్చకొని క్రియాజన్యాలుగా మారతాయి. అణువుల మధ్య జరిగే అభిఘాతాలే రసాయన చర్యకు మూలం అనేది అభిఘాత సిద్ధాంతం.
* అభిఘాత సిద్ధాంతం అణువుల మధ్య చర్యలకు వర్తిస్తుంది కానీ అయాన్‌ల మధ్య చర్యలకు వర్తించదు.
* రసాయన చర్యారేటు ఒక ఉష్ణోగ్రత వద్ద క్రియాజనక అణువుల మధ్య ఏకాంక పరిమాణ కాలంలో జరిగే తాడనాల సంఖ్యకు సమానం కావాలి. కానీ చర్య వాస్తవరేటు విలువ ఏకాంక పరిమాణం గల కాలంలో క్రియాజనక అణువుల మధ్య జరిగే ద్విగుణాత్మాక అభిఘాతాల సంఖ్యతో గణించిన రేటు కంటే బాగా తక్కువగా ఉంటుంది.
* ఒక లీటరు ఘనపరిమాణం ఉన్న H2, O2 వాయువుల సమ మోలార్ మిశ్రమంలో ఒక సెకను కాలంలో STP వద్ద జరిగే తాడనాల సంఖ్య 1030.
* అభిఘాత సిద్ధాంతాన్ని అర్హీనియస్ ప్రతిపాదించాడు.

దీనిలోని ముఖ్య ప్రతిపాదనలు.
రసాయన చర్య జరగాలంటే చర్యలో వాయు అణువుల మధ్య తాడనాలు జరగాలి.
అణువుల మధ్య జరిగే అన్ని తాడనాలు క్రియాజన్యాల అణువులను ఏర్పరచవు.
(ప్రతిపదమైన తాడనాలు మాత్రమే క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి.)
తాడనంలో పాల్గొనే అన్ని క్రియాజనక అణువులకు ఒక కనిష్ఠ శక్తి ఉంటేనే వాటి మధ్య జరిగే తాడనాల మూలంగా క్రియాజన్యాలు ఏర్పడతాయి. లేదా రసాయనచర్య జరుగుతుంది. అణువులకు ఉండే ఈ కనిష్ఠ శక్తినే ఆరంభ శక్తి అంటారు.
STP వద్ద క్రియాజనక అణువులకు ఉన్న శక్తిని వాటి అంతరిక శక్తి అంటారు. ఆ అణువులను సాధారణ అణువులు అంటారు.
సామాన్యంగా క్రియాజనక అణువుల అంతరిక శక్తి, చర్య ఆరంభ శక్తి కంటే తక్కువగా ఉంటుంది.
క్రియాజనకపు అణువుల అభిఘాతంలో క్రియాజన్యాలుగా మారడానికి పొందే శక్తిని ఉత్తేజిత శక్తి అంటారు.
చర్య ఆరంభ శక్తికి, సామాన్య అణువుల అంతరిక శక్తికి మధ్య ఉండే తేడాను ఉత్తేజిత శక్తి అంటారు.
* ఉత్తేజిత శక్తి = ఆరంభ శక్తి - అంతరిక శక్తి


* ఒక చర్య ఉత్తేజిత శక్తి పెరిగితే చర్యారేటు తగ్గుతుంది.
* ఉత్తేజిత తాడనాల సంఖ్య సాధారణ తాడనాల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది.
* చర్య వాస్తవ రేటును సాధారణ తాడనాల సంఖ్య ఆధారంగా గణిస్తే చర్యారేటు కంటే చాలా తక్కువగా ఉంటుంది.


చర్యారేటును ప్రభావితం చేసే అంశాలను అభిఘాత సిద్ధాంతం ప్రకారంగా వివరించడం
గాఢత ప్రభావం: క్రియాజనకాల గాఢత పెరిగితే అభిఘాతాల సంఖ్య పెరిగి చర్యారేటు పెరుగుతుంది.
ఉష్ణోగ్రతా ప్రభావం: ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఉత్తేజిత అణువుల సంఖ్య పెరిగి, ఉత్తేజిత తాడనాల సంఖ్య పెరగడం వల్ల చర్యారేటు పెరుగుతుంది.
ఉత్ప్రేరక ప్రభావం: ఉత్ప్రేరకాన్ని కలిపినప్పుడు చర్య జరిగే విధానం మారుతుంది. అందువల్ల చర్యారేటు మారుతుంది.
రసాయనిక సమీకరణం: ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా, అర్థవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని రసాయనిక సమీకరణం అంటారు.
ఉదా: CuO + CO  Cu + CO2
రసాయనిక చర్యలో పాల్గొనే రసాయనాలను (మూలకాలు లేదా సమ్మేళనాలు) క్రియాజనకాలు అంటారు. చర్య జరిగిన తర్వాత ఏర్పడే కొత్త పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
క్రియాజనకాలను సమీకరణానికి ఎడమవైపు రాస్తారు. అవి ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేస్తారు.
క్రియాజన్యాలను, సమీకరణానికి కుడివైపు రాస్తారు. అవి ఒకటికంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేసి రాస్తారు.
క్రియాజన్యాలు, క్రియాజనకాలను బాణం గుర్తు ()తో వేరుచేసి రాస్తారు.
రసాయనిక చర్యను సూచించే తుల్య సమీకరణంలో క్రియాజనకాల్లోని వివిధ మూలకాల పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల్లోని వివిధ మూలకాల పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుంది.
రసాయనిక సమీకరణాల్లో క్రియాజనకాల, క్రియాజన్యాల భౌతికస్థితిని ఈ విధంగా సూచిస్తారు. ఘనస్థితిలో ఉన్న పదార్థాలను (ఘ.)గా, ద్రవస్థితిలో ఉన్న పదార్థాలను (ద్ర.)గా, ద్రావణాన్ని (ద్రా.) గా, వాయుస్థితిలో ఉన్న పదార్థాలను (వా.)గా సూచిస్తారు.
ఉదా: NaCl + AgNO3 AgCl + NaNO3
(ద్రా.)     (ద్రా.)             (ఘ.)      (ద్రా.)
Zn  +  2 HCl2  

  ZnCl2  +  H2
(ఘ.)     (ద్ర.)                (ద్రా.)     (వా.)
ఉష్ణ రసా యన సమీకరణాలు: ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఉష్ణం వెలువడటం లేదా ఉష్ణాన్ని గ్రహించి చర్య జరిగితే, ఆ చర్యలను ఉష్ణ రసాయన చర్యలు అంటారు.
ఉష్ణమోచక చర్యలు: ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఉష్ణం వెలువడినట్లయితే ఆ చర్యను ఉష్ణమోచక చర్య అంటారు.
                                         (లేదా)
      ఒక రసాయనిక చర్యలో క్రియాజనకాలు సంగ్రహించే ఉష్ణశక్తి, క్రియాజన్యాలు ఏర్పడినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ చర్య 'ఉష్ణమోచక చర్య' అవుతుంది.
ఉదా: బొగ్గును (కార్బన్) గాలి (ఆక్సిజన్) సమక్షంలో మండించినప్పుడు, కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు కొంత ఉష్ణం (94 కి.కాలరీలు) కూడా వెలువడుతుంది.
   C   +   O2    CO2 + 94 కి.కాలరీలు
(ఘ.)    (వా.)          (వా.)
ఈ సమీకరణాన్ని కింద చూపిన విధంగా కూడా రాయవచ్చు.
C   +   O2      CO2 (H = −94 కి.కేలరీలు)
(ఘ.)    (వా.)           (వా.)
  H2  +  O2      2 H2O + 13600 కేలరీలు
(వా.)     (వా.)             (వా.)
N2  +  3 H2      2 NH3 + 22000 కేలరీలు
(వా.)      (వా.)            (వా.)
2 CO   +  O2 2 CO2 + 135000 కేలరీలు
(వా.)      (వా.)           (వా).
2 SO2 + O2 2 SO3 (
H = −54000 కేలరీలు)
(వా.)     (వా.)         (వా.)

ఉష్ణగ్రాహక చర్య: ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా రసాయనిక చర్య జరిగినట్లయితే దాన్ని ఉష్ణగ్రాహక చర్య అంటారు.
                                         (లేదా)
     ఒక రసాయనిక చర్యలో క్రియాజనకాలు సంగ్రహించే ఉష్ణశక్తి, క్రియాజన్యాలు ఏర్పడినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చర్య 'ఉష్ణగ్రాహక చర్య' అవుతుంది.
ఉదా: N2, O2 నుంచి NO ఏర్పడటం కూడా ఉష్ణగ్రాహక చర్యే. ఈ చర్య జరగడానికి 44 కి.కేలరీల ఉష్ణం గ్రహించబడుతుంది.
N2    +    O2      2 NO (H = 44 కి.కేలరీలు)
(వా.)       (వా.)           (వా.)
                                         (లేదా)
N2  + O2  +  44000 కేలరీలు  2 NO
(వా.)    (వా.)                        (వా.)
2 H2O   +   136000 కేలరీలు    2 H2    +     O2
(వా.)                         (వా.)           (వా.)
CaCO3 + 42 కి.కేలరీలు   CaO  +  CO2
(ఘ.)                          (ఘ.)     (వా.)
                         (లేదా)
CaCO3   CaO  +  CO2   (H = 42 కి.కేలరీలు)
(ఘ.)          (ఘ.)      (వా.)

విద్యుత్ రసాయనిక క్రియలు: విద్యుత్ బలాన్ని గ్రహించడం ద్వారా జరిగే రసాయనిక చర్యను విద్యుత్ రసాయనిక క్రియలుగా పరిగణిస్తారు.
ఉదా: నీటి ద్వారా విద్యుత్ (విద్యుత్ బలం)ను పంపినప్పుడు నీరు, హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులుగా విశ్లేషణం చెందుతుంది.

ఉత్ప్రేరక చర్యలు: ఉత్ప్రేరకం సమక్షంలో జరిగే రసాయనిక చర్యలను 'ఉత్ప్రేరక చర్యలు' అంటారు. రసాయన చర్యలో కొత్త మార్పులేమి చేయకుండా చర్యావేగాన్ని మార్పు చేసే పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటారు.

రసాయన సమీకరణాలపై సమస్యలు
* తులనాత్మక రసాయన సమీకరణంలో క్రియాజనకాలు, క్రియాజన్యాలు స్థిర నిష్పత్తుల్లో ఉంటాయి. తుల్యరసాయన సమీకరణాలు క్రియాజనకాల, క్రియాజన్యాల ద్రవ్యరాశుల మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని కూడా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఈ సమీకరణాలు ద్రవ్యరాశి ఘనపరిమాణాలకు మధ్య ఉండే సంబంధాన్ని కూడా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి.
* క్రియాజనకాలు, క్రియాజన్యాలు ఘనస్థితిలో లేదా ద్రవస్థితిలో ఉన్నప్పుడు ద్రవ్యరాశుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి.
* క్రియాజనకాలు, క్రియాజన్యాల్లో కొన్ని మాత్రమే వాయుస్థితిలో ఉన్నట్లయితే ద్రవ్యరాశి, ఘనపరిమాణం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు.
* క్రియాజనకాలు, క్రియాజన్యాలు అన్నీ వాయుస్థితిలో ఉన్నట్లయితే పరస్పర ఘనపరిమాణాలకు మధ్య ఉండే సంబంధాలను అర్థం చేసుకోవచ్చు.
* తుల్య రసాయన సమీకరణాల్లో క్రియాజనకాలు, క్రియాజన్యాల సంబంధాలను కింది విధంగా విభజించవచ్చు.
పరస్పర భార సంబంధింత గణనాలు
భార ఘనపరిమాణ సంబంధిత గణనాలు
పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలు
ద్రవ్యరాశి ఘనపరిమాణం అణువుల సంఖ్య మధ్య సంబంధం
* CaCO3 CaO + CO2 ఈ తుల్య సమీకరణం ప్రకారం ఒక అణువు CaCO3 ను వియోగం చెందిస్తే, ఒక అణువు CaO, ఒక అణువు CO2 లు లభిస్తాయి.
CaCO3 అణుభారం: Ca = 4, C = 12, O = 16
CaCO3 అణుభారం = 40 + 12 + (3 × 16)
                     = 40 + 12 + 48
                     = 100
CaO అణుభారం: Ca = 40, O = 16
CaO అణుభారం = 40 + 16 = 56
CO2 అణుభారం: C = 12, O = 16
CO2 అణుభారం = 12 + (2 × 16) = 44
కాబట్టి 100 గ్రా. CaCO3 ని వియోగం చెందిస్తే 56 గ్రా. CaO, 44 గ్రా. CO2 లు వెలువడతాయి.

* 2 H2 + O2 2 H2O ఈ తుల్య సమీకరణం ప్రకారం రెండు అణువుల H2, ఒక అణువు O2తో చర్యనొంది రెండు అణువుల H2Oను ఇస్తాయి. అంటే 4 గ్రా. హైడ్రోజన్ (H2 అణుభారం = 2), 32 గ్రా. O2 (O2 అణుభారం = 32)తో చర్యనొంది 36 గ్రా. H2O (H2O అణుభారం = 18)ను ఇస్తాయి. అయితే 10 గ్రా. H2 ఎన్ని గ్రాముల O2తో చర్యనొందుతుంది
సాధన: 4 గ్రా. H2 32 గ్రా. O2 తో చర్య జరుపుతుంది.
     10 గ్రా. H2  ---- ? 
     = 80 గ్రా.

* 8 గ్రా. కాల్షియం కార్బోనేట్‌ను వేడిచేస్తే విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ భారమెంత?
(C = 12, Ca = 40, O = 16)
సాధన: CaCO3 CaO + CO2
CaCO3 అణుభారం = 40 + 12 + (3 × 16)
= 40 + 12 + 48
= 100
CO2 అణుభారం = 12 + (2 × 16)
= 12 + 32
= 44
సమీకరణం ప్రకారం
100 గ్రా. CaCO3 44 గ్రా. CO2 ను ఇస్తుంది.
8 గ్రా. CaCO3 ?
 = 3.52 గ్రా.

పరస్పర - ఘనపరిమాణ సంబంధిత గణనాలు: దీనికి సంబంధించిన విషయాలను కూలంకషంగా అర్థం చేసుకోవడానికి అవగాడ్రో నియమం ఉపయోగపడుతుంది.
ఎ) బెర్జీలియస్ నియమం: స్థిర ఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన ఘనపరిమాణాల్లో ఉన్న వాయువులన్నీ సమాన పరమాణువులను కలిగి ఉంటాయి. కానీ బెర్జీలియస్ నియమం డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని పూర్తిగా విశదీకరించలేకపోయింది. ఈ కారణంగా అవగాడ్రో బెర్జీలియస్ సిద్ధాంతాన్ని తగిన మార్పులతో తిరిగి ప్రతిపాదించాడు.
బి) అవగాడ్రో నియమం: నిర్దిష్ట (స్థిర) ఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన ఘనపరిమాణాలతో ఉన్న వాయువులన్నీ సమాన అణువులను కలిగి ఉంటాయి.
గ్రాము అణుభారం: ఒక అణువు, హైడ్రోజన్ పరమాణు భారం కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో ఆ సంఖ్యను సమ్మేళనం యొక్క అణుభారం లేదా గ్రాము అణుభారంగా వ్యవహరిస్తారు.
ఉదా: ఒక నీటి అణువు యొక్క భారం = 18 రెట్లు ఎక్కువ (H పరమాణు భారం కంటే)
* గ్రామ్ పరమాణు భారాన్ని కొన్నిసార్లు 'గ్రామ్ పరిమాణువు'గా, గ్రామ్ అణుభారాన్ని 'గ్రామ్ అణువు'గా పరిగణిస్తారు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌