• facebook
  • whatsapp
  • telegram

రసాయన గతి శాస్త్రం, శక్తి శాస్త్రం, రసాయన గణన, స్టాయికియోమెట్రీ

1. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే పదార్థాన్ని ఏర్పరచడాన్ని ఏమంటారు?
జ‌: రసాయన సంయోగం
 

2. కిందివాటిలో రసాయన సంయోగ చర్య ఏది?
A) A + B  C + D                      B) AB  A + B
C) A + B  AB                          D) AB + C  AC + B
జ‌: C (A + B  AB)

3. కిందివాటిలో రసాయన సంయోగ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) MgO + H2O  Mg(OH)2
B) 2 SO2 + O2

 2 SO3
C) 2 Na + Cl2   2 NaCl
D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

4. కిందివాటిలో రసాయన సంయోగ చర్య ఏది?
A) 
B) Zn + H2SO4 ZnSO4 + H2
C) 2 NO + O2   2 NO2
D) NH3 + 3 Cl2  NCl3 + 3 HCl
జ‌: C (2 NO + O2 2 NO2)

5. కిందివాటిలో రసాయన సంయోగ చర్య కానిది ఏది?
A) C + O2 CO2
B) NH3 + HCl

 NH4Cl
C) N2 + 3 H2 2 NH3      
D) NH3 + 3 Cl2   NCl3 + 3 HCl
జ‌: D (NH3 + 3 Cl2 NCl3 + 3 HCl)

6. ఒక పదార్థం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఏర్పరచడాన్ని ఏమంటారు?
జ‌: రసాయన వియోగం
 

7. 2 Pb(NO3) 2PbO + O2 ↑ + 4 NO2 అనే సమీకరణం ఏ రకమైన రసాయన చర్యను సూచిస్తుంది?
జ‌: రసాయన వియోగం

8. కిందివాటిలో రసాయన వియోగ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) 
B) 
C) NH3 + HCl

NH4Cl
D)
జ‌: D( )
 

9. ఒక మూలకం లేదా ప్రాతిపదిక మరొక మూలకం లేదా ప్రాతిపదికను స్థానభ్రంశం చెందిస్తే దాన్ని ఏమంటారు?
జ‌: రసాయన స్థానభ్రంశం
 

10. కిందివాటిలో రసాయన స్థానభ్రంశ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) 2 SO2 + O2 2 SO3
B) 2 HgO   2 Hg + O2↑ 
C) AgNO3 + NaCl  AgCl ↓ + NaNO3
D) 2 KI + Cl2

 2 KCl + l2
జ‌: D (2 KI + Cl2 2 KCl + l2)

11. కిందివాటిలో రసాయన స్థానభ్రంశ చర్య కానిది ఏది?
A) Pb + CuCl2 PbCl2 + Cu
B) Mg + 2 AgNO3 Mg(NO3)2 + 2 Ag
C) Zn + H3SO4 ZnSO4 + H2↑   
D) Pb(NO3)2 + 2 HCl  PbCl2 + 2 HNO3
జ‌: D( Pb(NO3)2 + 2 HCl PbCl2 + 2 HNO3)

12. రెండు పదార్థాలు వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్చుకునే చర్యను ఏమంటారు?
జ‌: రసాయన ద్వంద్వ వియోగం
 

13. కిందివాటిలో రసాయన ద్వంద్వ వియోగ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) Na2CO3 + Ca(OH)2

 CaCO3 + 2 NaOH
B) BaCl2 + Na2SO4 BaSO4  + 2 NaCl
C) NH3 + 3 Cl2 NCl3 + 3 HCl
D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

14. 2 KI + Pb(NO3)2 2 KNO3 + PbI2అనే సమీకరణం ఏ రకమైన రసాయన చర్యను సూచిస్తుంది?
జ‌: రసాయన ద్వంద్వ వియోగం

15. కాల్షియం కార్బోనేట్‌ను వేడిచేస్తే ఏర్పడే పదార్థాలు ఏవి?
జ‌: CaO, CO2
 

16. సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4) తయారీలో సల్ఫర్ ట్రై ఆక్సైడ్ (SO3) అనే వాయువును నీటిలో కరిగిస్తారు. ఇది ఏ రసాయనిక మార్పు
జ‌: రసాయన సంయోగం
 

17. సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొంది సోడియం క్లోరైడ్, నీటిని ఏర్పరుస్తుంది. ఇది ఏ రసాయన చర్య?
జ‌: రసాయన ద్వంద్వ వియోగం
 

18. Fe2O3 + 2 Al   Al2O3 + 2 Fe ఈ రసాయన చర్య దేనికి ఉదాహరణ?
జ‌: రసాయన స్థానభ్రంశం

19. హైడ్రోజన్, క్లోరిన్‌ల నుంచి హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడటం అనేది ఏ రకమైన రసాయనిక చర్య?
జ‌: రసాయన సంయోగం
 

20. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఇనుప రజను కలిపితే ఏం జరుగుతుంది?
జ‌: ఐరన్ క్లోరైడ్ ఏర్పడి, హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
 

21. 2 PbO + C  2 Pb + CO2
(ఘ.)   (ఘ.)     (ఘ.)   (వా.)
సమీకరణాన్ని అనుసరించి కిందివాటిలో ఏది సరైంది?
A) లెడ్ ఆక్సైడ్ క్షయకరణానికి గురవుతుంది.
B) కార్బన్ డై ఆక్సైడ్ ఆక్సీకరణం చెందుతుంది.
C) కార్బన్ ఆక్సీకరణం చెందుతుంది.
D) లెడ్ ఆక్సైడ్ క్షయకరణానికి గురవుతుంది, కార్బన్ ఆక్సీకరణం చెందుతుంది.
జ‌: A (లెడ్ ఆక్సైడ్ క్షయకరణానికి గురవుతుంది.)

22. కిందివాటిని జతచేయండి.

i) 2 AgNO3 + Na2CrO4 AgCrO4 + 2 NaNO3 a) రసాయన సంయోగం
ii) 2 NH3 N2 + 3 H2 b) రసాయన వియోగం
iii) C2H4 + H2O  C2H6O c) రసాయన స్థానభ్రంశం
iv) Fe2O3 + 3 CO  2 Fe + 3 CO2 d) రసాయన ద్వంద్వ వియోగం

A) i-a, ii-b, iii-c, iv-d          B) i-d, ii-c, iii-b, iv-a
C) i-c, ii-b, iii-a, iv-d          D) i-d, ii-b, iii-a, iv-c
జ‌: D (i-d, ii-b, iii-a, iv-c)
 

23. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే ద్రావణ స్వభావం ఏమిటి?
జ‌: క్షారం
 

24. సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని బేరియం క్లోరైడ్ ద్రావణానికి కలిపితే ఏర్పడే అవక్షేప పదార్థం ఏది?
జ‌: బేరియం సల్ఫేట్
 

25. 2 AgBr   2 Ag + Br2ఈ రసాయన చర్య దేనికి ఉదాహరణ?
     (ఘ.)              (ఘ.)    (వా.)
జ‌: కాంతి రసాయన చర్య

26. జింక్ ముక్కలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపితే ఏర్పడే వాయువు ఏది?
జ‌: H2
 

27. AgNO3 + NaCl  AgCl + NaNO3 చర్యలో అవక్షేపం ఏది?
జ‌: AgCl

28. Pb(NO3)2 + 2 KI  PbI2 + 2 KNO3 చర్యలో అవక్షేపం ఏది?
జ‌: PbI2

29. CuO + H2

 Cu + H2O లోCuO
జ‌: క్షయకరణం చెందుతుంది.

30. CuO + H2 Cu + H2O అనేది .......... చర్య.
జ‌: ఆక్సీకరణ, క్షయకరణ చర్య

31. కిందివాటిలో రిడాక్స్ చర్య ఏది?
A) CaC2O4 + 2 HCl  CaCl2 + H2C2O4
B) Ca(OH)2 + 2 NH4Cl  CaCl2 + 2 NH3 + 2 H2O
C) NaCl + KNO3   NaNO3 + KCl
D) 2 K[Ag(CN)2] + Zn  2 Ag + K2[Zn(CN)4]
జ‌: A (CaC2O4 + 2 HCl  CaCl2 + H2C2O4)

32. కిందివాటిలో రిడాక్స్ చర్య ఏది?
A) Cr2O3 + 6 HCl

 2 CrCl3 + H2O
B) 
C) CrO3 + 2 NaOH  Na2CrO4 + H2O
D) 

33. కిందివాటిలో రిడాక్స్ చర్య కానిది ఏది?
A) CuO + H2 Cu + H2O
B) 2 PbO + C  2 Pb + CO2
C) 2 Fe2O3 + 3 C  4 Fe + 3 CO2
D) Cl2 + H2O

 HOCl + HCl
జ‌: D( Cl2 + H2O  HOCl + HCl)

34. అతివేగ చర్యలు జరగడానికి అవసరమయ్యే కాలం
జ‌: సెకను కంటే తక్కువ కాలం (లిప్తపాటు కాలం)
 

35. మితవేగ చర్యలు జరగడానికి అవసరమయ్యే కాలం
జ‌: కొన్ని గంటలు
 

36. క్రియాజనకాల గాఢతలోని పెంపుదల
జ‌: చర్యావేగాన్ని పెంచుతుంది
 

37. ఉత్ప్రేరకం అనే రసాయన పదార్థం
జ‌: చర్యావేగాన్ని మారుస్తుంది
 

38. రసాయన చర్య ఉష్ణోగ్రతను 10°C లు పెంచినట్లయితే
జ‌: చర్యావేగం ద్విగుణీకృతం లేదా త్రిగుణీకృతం అవుతుంది.
 

39. ఒక ద్విగత చర్య
జ‌: రసాయనిక చర్య సమతాస్థితిని సూచిస్తుంది
 

40. కిందివాటిలో అతివేగ చర్య కానిది ఏది?
A) జింక్ ముక్కలపై ఆమ్లం చర్య      
B) మెగ్నీషియం రిబ్బన్‌ను గాలిలో కాల్చడం
C) చలవరాతి ముక్కలు ఆమ్లంతో చర్య జరపడం   
D) ఇనుము తుప్పు పట్టడం
జ‌: D (ఇనుము తుప్పు పట్టడం)

41. కిందివాటిలో అతివేగ చర్య కానిది ఏది?
A) Zn + 2 HCl

 ZnCl2 + H2    
B) 2 Mg + O2 2 MgO
C) CH3COOCH3 + H2O  CH3COOH + CH3OH
D) NH3 + HCl  NH4Cl
జ‌: C (CH3COOCH3 + H2O  CH3COOH + CH3OH)

42. 4 Fe + 3 O2 2 Fe2O3 లో ఐరన్ ఆక్సైడ్ దేన్ని సూచిస్తుంది?
జ‌: తుప్పు

43. మిథైల్ ఎసిటేట్‌ను జల విశ్లేషణం చేస్తే ఏర్పడనివి
A) CH3COOH    B) CH3OH     C) CH3COOCH3    D) CH3COOH, CH3OH
జ‌: D(CH3COOH, CH3OH)

 

44. నిర్దిష్ట లేదా ప్రమాణ కాలంలో గాఢతలోని మార్పును ఏమంటారు?
జ‌: చర్యావేగం
 

45. చర్యారేటు =
జ‌: 


 

46. చర్యారేటు ప్రమాణాలు
జ‌: మోల్స్/లీటరు/సెకను
 

47. రసాయన చర్యా వేగాన్ని ప్రభావితం చేసేవి ఏవి?
A) క్రియాజనకాల స్వభావం             B) క్రియాజనకాల గాఢత
C) ఉత్ప్రేరకం, ఉష్ణోగ్రత                D) అన్నీ
జ‌: D (పైవన్నీ)
 

48. రసాయనిక చర్యా వేగం క్రియాజనకాల గాఢతను పెంచే కొద్దీ.....
జ‌: పెరుగుతుంది
 

49.  అనే సమీకరణంలో ఉత్ప్రేరకంగా దేన్ని ఉపయోగిస్తారు?
జ‌: MnO3
 

50. క్రియాజన్యాలను తిరిగి క్రియాజనకాలుగా మార్చలేని చర్యలను ఏమంటారు?
జ‌: అద్విగత చర్యలు
 

51. కిందివాటిలో అద్విగత చర్య కానిది ఏది?
A) 2 Mg + O2 2 MgO
B) CaCO3 + 2 HCl   CaCl2 + CO2 ↑ + H2O
C) Zn + 2 HCl

 ZnCl2 + H2 ↑      
D) N2 + 3 H2 2 NH3
జ‌: D ( N2 + 3 H2 2 NH3)

52. ద్విగత చర్యల్లో క్రియాజనకాల గాఢతను పెంచినట్లయితే
జ‌: సమతాస్థితి కుడివైపు మొగ్గు చూపుతుంది.
 

53. ద్విగత చర్యల్లో క్రియాజన్యాల గాఢతను పెంచే కొద్దీ
జ‌: సమతాస్థితి ఎడమవైపు మొగ్గు చూపుతుంది.
 

54. క్రియాజనకాలు, క్రియాజన్యాలుగా మారే చర్య
జ‌: పురోగామి చర్య
 

55. క్రియాజన్యాలు తిరిగి క్రియాజనకాలుగా మారే చర్య
జ‌: తిరోగామి చర్య
 

56. H2 + I2 2 HI అనే రసాయన చర్యకు పురోగామి చర్యావేగం =
జ‌: Kf [H2][I2]

57. H2 + I2

 2 HI అనే చర్యకు తిరోగామి చర్యా వేగం =
జ‌: Kb [HI]2

58. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: లెవోయిజర్
 

59. 'రసాయన చర్యల్లో పదార్థం జనించదు లేదా నశించదు' అని తెలిపే నియమం ఏది?
జ‌: ద్రవ్యనిత్యత్వ నియమం
 

60. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించిన శాస్త్రవేత్త?
జ‌: లాండాల్ట్
 

61. స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
జ‌: జోసెఫ్ ప్రౌస్ట్
 

62. 'ఒక సంయోగ పదార్థంలోని మూలకాల భార నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని' తెలిపే నియమం?
జ‌: స్థిరానుపాత నియమం
 

63. బహ్వానుపాత నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: డాల్టన్
 

64. CH3COOC2H5 + NaOH  CH3COONa + C2H5OH
  పైన సూచించే చర్యకు చర్యారేటు =
జ‌: K[CH3COOC2H5]1  [NaOH]1

65. 'అణువుల మధ్య జరిగే అభిఘాతాలే రసాయన చర్యకు మూలం' అని తెలిపే నియమం
జ‌: అభిఘాత సిద్ధాంతం
 

66. కిందివాటిలో అభిఘాత సిద్ధాంతం దేనికి వర్తించదు?
A) అణువుల మధ్య చర్యలకు                       B) అయాన్‌ల మధ్య చర్యలకు
C) అణువులు, అయాన్‌ల మధ్య చర్యలకు     D) H2, O2 ల మధ్య చర్యలకు
జ‌:  C (అయాన్‌ల మధ్య చర్యలకు)
 

67. ఒక లీటరు ఘనపరిమాణం ఉన్న H2, O2 వాయువుల సమ మోలార్ మిశ్రమంలో ఒక సెకన్ కాలంలో STP వద్ద జరిగే తాడనాల సంఖ్య ఎంత?
జ‌: 1030
 

68. అభిఘాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
జ‌: అర్హీనియస్
 

69. కిందివాటిలో ఉష్ణమోచక చర్యను సూచించేది?
A) N2 + 3 H2 2 NH3 + 22000 కేలరీలు
B) C + O2 CO2 (H = −94 కి.కేలరీలు)
C) 2 CO + O2 2 O2 + 135000 కేలరీలు
D) పైవన్నీ
జ‌: D ( పైవన్నీ)

70. కిందివాటిలో ఉష్ణమోచక చర్య కానిది?
A) 2 CO + O2

 2 CO2 + 135000 కేలరీలు
B) N2 + 3 H2  2 NH3 (H = -22 కి.కేలరీలు)
C) N2 + O2 2 NO (H = 44 కి.కేలరీలు)
D) H2 + O22 H2O + 136000 కేలరీలు
జ‌: C (N2 + O22 NO (H = 44 కి.కేలరీలు))

71. కిందివాటిలో ఉష్ణగ్రాహక చర్య ఏది?
A) 2 H2O + 136000 కేలరీలు  2H2 + O2
B) N2 + O2 2 NO (

H = 44 కి.కేలరీలు)
C) CaCO3 CaO + CO2↑ (H = 42 కి.కేలరీలు)
D) అన్నీ
జ‌: D (అన్నీ)

72. కిందివాటిలో విద్యుత్ రసాయనిక చర్యను సూచించేది?
A) CaCO3 CaO + CO2 ↑
B) 
C) 
D) H2 + O2 2H2O + 136000 కేలరీలు
జ‌: c ()

73. 100 గ్రాముల CaCO3 ని వియోగం చెందిస్తే ఏర్పడే CO2 భారం ఎంత?
జ‌: 44 గ్రా.
 

74. 8 గ్రాముల CaCO3 ని వియోగం చెందిస్తే ఏర్పడే CaO భారం ఎంత?
జ‌: 4.48 గ్రా.
 

75. ఒక మోల్ నీరు (H2O) =
జ‌: 18 గ్రా.
 

76. సాధారణ ఉష్ణోగ్రత (o°C), పీడనం (1 అట్మాస్ఫియర్) వద్ద ఒక మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం
జ‌: 22.4 లీ
 

77. ఒక మోల్ వాయువులో ఉండే అణువుల సంఖ్య
జ‌: 6.023 × 1023
 

78. 100 మి.లీ. ఈథేన్ దహన చర్యలో జనింపచేసే CO2 ఘనపరిమాణం
జ‌: 200 మి.లీ
 

79. 500 మి.లీ. C2H2 ను దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణం ఎంత?
జ‌: 1250 మి.లీ
 

80. 10 గ్రాముల చలువరాయి ముక్కలపై సజల HCl ను వేడి చేసి 27, 750 మి.మీ. పీడనం వద్ద చర్య జరిపారు. అయితే ఈ చర్యలో వెలువడిన CO2 ఘనపరిమాణాన్ని కనుక్కోండి.
జ‌: 2.494 లీ.
 

81. 36 గ్రాముల బొగ్గును STP వద్ద పూర్తిగా దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణాన్ని లెక్కించండి.
జ‌: 89.6 లీ.
 

82. CaCO3 CaO + CO2
 (10 గ్రా.)         (5.6 గ్రా.)    (4.4 గ్రా.)
  పై సమీకరణం ఏ నియమాన్ని పాటిస్తుంది?
జ‌: ద్రవ్యనిత్యత్వ నియమం

83. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య జరిపినప్పుడు STP వద్ద విడుదలైన హైడ్రోజన్ ఘనపరిమాణం ఎంత?(Na పరమాణు భారం = 23)
జ‌: 112 లీ.
 

84. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య జరిపినప్పుడు విడుదలైన హైడ్రోజన్ అణువుల సంఖ్యను కనుక్కోండి. (Na పరమాణు భారం = 23)
జ‌: 3.01 ×  1024
 

85. Fe2O3 క్షయకరణంలో, 1120 కి.గ్రా. ఇనుమును రాబట్టడానికి ఎంత పరిమాణం గల అల్యూమినియం అవసరం అవుతుంది? (Al పరమాణు భారం = 27, Fe పరమాణు భారం = 56)
జ‌: 540 కి.గ్రా.
 

86. 2 NO +   Cl2      2 NOCl
  (వా.)       (వా.)                          (వా.)
     అనే చర్యకు సమతాస్థితి స్థిరాంక సమీకరణం ఏది?
జ‌:   
 

87. కిందివాటిలో ఆక్సీకరణ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) 2 K4 [Fe(CN)6] + H2O   2 K3 [Fe(CN)6] + 2 KOH
B) Mg + S                              MgS
C) CH4 + 2 O2                     CO2 + 2 H2O

D) అన్నీ
జ‌: D (అన్నీ)

88. కిందివాటిలో క్షయకరణ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) 2 HgO                    2 Hg + O2
B) 2 FeCl3 + H2        2 FeCl2 + 2 HCl
C) CH2 = CH2 + H2 H3C - CH3

D) అన్నీ
జ‌: D (అన్నీ)

89. కిందివాటిలో రిడాక్స్ చర్యను సూచించే సమీకరణం ఏది?
A) 2 Cu2O + Cu2S   6 Cu + SO2
B) 2 HBr + Cl2         2 HCl + Br2
C) 2 PbO + C            2 Pb + CO2

      D) అన్నీ
జ‌: D (అన్నీ)

90.  
  
       సమీకరణం ఏ రకమైన ఆక్సీకరణ - క్షయకరణ చర్యను సూచిస్తుంది?
జ‌: సంయోగ చర్య
 

91. 2 KClO3  2 KCl + 3 O2 సమీకరణం ఏ రకమైన ఆక్సీకరణ - క్షయకరణ చర్యను సూచిస్తుంది?
జ‌: వియోగ చర్య

92. CuSO4 + Zn Cu + ZnSO4
 (జల.)     (ఘ.)         (ఘ.)    (జల.)
సమీకరణం ఏ రకమైన ఆక్సీకరణ - క్షయకరణ చర్యను సూచిస్తుంది?
జ‌: లోహ స్థానభ్రంశం

93. Ca + 2 H2O  Ca(OH)2 + H2 సమీకరణం ఏ రకమైన ఆక్సీకరణ - క్షయకరణ చర్యను సూచిస్తుంది?
జ‌: అలోహ స్థానభ్రంశం

94. కింది ఆక్సీకరణ - క్షయకరణ చర్యల్లో అసౌష్ఠవ వియోగ చర్య ఏది?
A) 2 H2O2 2 H2O + O2
B) 2 NaH  2 Na + H2
C) 2 KClO3 2 KCl + 3 O2
D) 2 H2O 2 H2 + O2
జ‌: A (2 H2O2 2 H2O + O2)

95. Kp, Kc ల మధ్య సంబంధం
జ‌: Kp = Kc (RT)n

 

96. 420 kgల HCl ను తయారు చేయడానికి 90% H2SO4 ఎంత అవసరమవుతుంది?
జ‌: 628 kg
 

97. 69.9% ఐరన్, 30.1% డై ఆక్సిజన్ గల ఐరన్ ఆక్సైడ్ అనుభావిక ఫార్ములాను కనుక్కోండి.
జ‌: Fe2O3
 

98. 20°C, 770 mm Hg పీడనం వద్ద 10 cc మీథేన్‌ను పూర్తిగా దహనం చేయడానికి STP పరిస్థితిలో కావాల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణాన్ని లెక్కించండి.
జ‌: 18.88 cc
 

99. గాలిలో ఒక మోల్ కార్బన్‌ను మండించినప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ భారాన్ని లెక్కించండి.
జ‌: 44 g
 

100. 16 g డైఆక్సిజన్‌లో 2 మోల్‌ల కార్బన్‌ను మండించినప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ భారాన్ని లెక్కించండి.
జ‌: 22 g
 

101. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే హైడ్రోజన్ బరువును కనుక్కోండి. (Na పరమాణు భారం = 23)
‌: 10 గ్రా.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌