• facebook
  • whatsapp
  • telegram

రసాయన బంధం - అణు నిర్మాణం

1. అణువుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఏమని పిలుస్తారు?
జ‌: ఆంతరిక శక్తి
 

2. కింది ఏ చర్యలో ఉష్ణం జనిస్తుంది?
ఎ) కిరణజన్య సంయోగక్రియ        బి) వియోగ చర్య
సి) ఉష్ణగ్రాహక చర్య                     డి) ఉష్ణమోచక చర్య
జ‌: డి (ఉష్ణమోచక చర్య)
 

3. పదార్థపు ఆంతరిక శక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ‌: పదార్థ నిర్మాణం, భౌతిక స్థితి
 

4. హైడ్రోజన్ బంధ విఘటన శక్తి
జ‌: 104.2 కి.కే./ మోల్
 

5. రసాయన చర్యలో కొత్త బంధం ఏర్పడినప్పుడు విడుదలయ్యే శక్తి
జ‌: బంధ శక్తి
 

6. కిందివాటిలో ఉష్ణగ్రాహక చర్య కానిది.
ఎ) N2 + O2 2 NO (H =44 కి.కేలరీలు)
బి) C + O2 CO2 (

H = -94 కి.కేలరీలు)
సి) CaCO3 + 42 కి.కేలరీలు  CaO + CO2
డి) 2 H2O  2 H2 + O2 - 136 కి.కేలరీలు
జ‌: బి (C + O2  CO2 (H =94 కి.కేలరీలు)

7. కిందివాటిలో ఉష్ణగ్రాహక చర్య ఏది?
ఎ) 2 SO2 + O2 2 SO3 (H = -54 కి.కేలరీలు)
          (వా)     (వా)          (వా)
బి) 2 H2 + O22 H2O + 13,600 కేలరీలు
         (వా)     (వా)            (ద్ర)
సి) 2 H2O  2 H2 + O2 (H = 136 కి.కేలరీలు)
          (వా)               (వా)     (వా)
డి) N2 + 3 H2

 2 NH3 + 22,000 కేలరీలు
       (వా)    (వా)               (వా)
జ‌: సి (2 H2O  2 H2 + O2 (H = 136 కి.కేలరీలు)
            (వా)                 (వా)     (వా)

8. కింది చర్యల్లో ఏది ఉష్ణమోచక చర్యను సూచిస్తుంది?
ఎ) N2 + O2 2 NO (H = 44 కి.కేలరీలు)
       (వా)   (వా)             (వా)
బి) 2 H2O + 1,36,000 కేలరీలు  2 H2 + O2
         (వా)                                              (వా)    (వా)
సి) CaCO3 + 42.0 కి.కేలరీలు  CaO + CO2 
           (ఘ)                                           (ఘ)      (వా)
డి) 2 SO2 + O2 2 SO3 (H = -54 కి.కేలరీలు)
             (వా)    (వా)             (వా)
జ‌: డి (2 SO2 + O2

2 SO3 (H = -54 కి.కేలరీలు)
             (వా)    (వా)             (వా)

9. కింది చర్యల్లో ఉష్ణమోచక చర్య కానిది?
     ఎ) C + O2 CO2 (H = 94,000 కేలరీలు)
    బి) N2 + 3 H2 2 NH3 + 22,000 కేలరీలు)
    సి) N2 + O2 2 NO (H = 44 కేలరీలు)
   డి) 2 SO2 + O2 2 SO3 (H = -54 కేలరీలు)
జ‌: సి (N2 + O2

 2 NO (H = 44 కేలరీలు)

10. కిందివాటిలో ఉష్ణమోచక చర్య కానిది?
ఎ) పొడి సున్నాన్ని నీటిలో కలపడం        బి) విరంజన చూర్ణాన్ని నీటిలో కలపడం
సి) నేల బొగ్గును దహనం చెందించడం      డి) గ్లూకోజ్‌ను నీటిలో కరిగించడం
జ‌: డి (గ్లూకోజ్‌ను నీటిలో కరిగించడం)
 

11. H -- Cl బంధశక్తి
జ‌: 103.0 కి.కే./ మోల్
 

12. ప్రకృతి సిద్ధంగా సంభవించే ఉష్ణగ్రాహక చర్యకు ఒక ఉదాహరణ
జ‌: కిర‌ణ‌జ‌న్య సంయోగ‌క్రియ‌
 

13. కిందివాటిలో ద్విపరమాణు అణువు కానిది
ఎ) HCl      బి) O3        సి) N2                   డి) H2
జ‌: బి (O3)
 

14. కిందివాటిలో ఏది మహా అణువును సూచిస్తుంది?
ఎ) భాస్వరం     బి) ఓజోన్       సి) వజ్రం    డి) అమ్మోనియా
జ‌: డి (అమ్మోనియా)
 

15. ఒక పరమాణు బాహ్య శక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్లను ఏమంటారు?
జ‌: బాహ్య ఎలక్ట్రాన్లు
 

16. కిందివాటిలో బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు లేని జడ వాయువు ఏది?
ఎ) నియాన్      బి) ఆర్గాన్      సి) హీలియం      డి) క్రిప్టాన్
జ‌: సి (హీలియం)
 

17. ఆక్సిజన్ పరమాణువులో వేలన్సీ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 5
 

18. మెగ్నీషియం పరమాణువులో వేలన్సీ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 2
 

19. పరమాణువులు ఎందుకు సంయోగం చెందుతున్నాయి?
జ‌: శక్తిని కోల్పోయి స్థిరత్వాన్ని పొందడానికి, బాహ్య శక్తి స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌ల విన్యాసాన్ని పొందడానికి
 

20. జడవాయువులు సాధారణంగా చర్యలో పాల్గొనవు. దీనికి కారణం
జ‌: బాహ్య శక్తి స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.
 

21. ఒక మూలక పరమాణువు ఎలక్ట్రాన్‌లను పోగొట్టుకోవడం లేదా గ్రహించడం లేదా సమష్టిగా పంచుకోవడం ద్వారా బాహ్య శక్తి స్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను పొందడాన్ని ఏమంటారు?
జ‌: అష్టక నియమం
 

22. ఒక పరమాణువు బాహ్య కర్పరం నుంచి వేరొక పరమాణువు బాహ్య కర్పరంలోకి ఎలక్ట్రాన్‌లు మార్పిడి జరగడం ద్వారా ఏర్పడే బంధం
జ‌: అయానిక బంధం
 

23. సమయోజనీయ బంధం ఏర్పడే విధానం
జ‌: ఎలక్ట్రాన్‌లను సమష్టిగా పంచుకోవడం వల్ల
 

24. ఎలక్ట్రాన్‌లను సమష్టిగా పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధం ఏది?
జ‌: సమయోజనీయ బంధం
 

25. కిందివాటిలో అయానిక పదార్థం ఏది?
ఎ) హైడ్రోజన్ సల్ఫైడ్                 బి) హైడ్రోజన్ క్లోరైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్               డి) కాల్షియం క్లోరైడ్
జ‌: డి (కాల్షియం క్లోరైడ్)
 

26. కిందివాటిలో అయానిక పదార్థం కానిది ఏది?
ఎ) కాల్షియం ఫ్లోరైడ్              బి) పొటాషియం సల్ఫైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్           డి) సోడియం క్లోరైడ్
జ‌: సి (కార్బన్ డై ఆక్సైడ్)
 

27. కిందివాటిలో సమయోజనీయ బంధం ఉన్న అణువు ఏది?
ఎ) NaCl       బి) MgCl2       సి) Cl2        డి) CaCl2
జ‌: సి (Cl2)
 

28. కిందివాటిలో సమయోజనీయ బంధం లేనిది ఏది?
ఎ) H2S          బి) HCl            సి)K2S       డి) O2
జ‌: సి (K2S )
 

29. MgOలో మెగ్నీషియం, ఆక్సిజన్‌ల మధ్య ఉన్న బంధం
జ‌: అయానిక బంధం
 

30. ఆక్సిజన్ అణువులో బంధంలో పాల్గొనే మొత్తం ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 4
 

31. నైట్రోజన్ అణువులో బంధంలో పాల్గొనే మొత్తం ఎలక్ట్రాన్‌ల సంఖ్య
‌జ‌: 6
 

32. అత్యధిక అయానిక స్వభావం ఉన్న సమ్మేళనం
జ‌: CsF
 

33. అయానిక, సమయోజనీయ బంధం రెండూ ఉన్న సమ్మేళనం
జ‌: KCN
 

34. కిందివాటిలో సమన్వయ సమయోజనీయ బంధం ఉన్నది ఏది?
ఎ) H2O              బి) HCl             సి)          డి) H2S
జ‌: సి ()

35. కిందివాటిలో సమన్వయ సమయోజనీయ బంధం లేనిది ఏది?
ఎ) H3O+           బి)                  సి) [Fe(H2O)6]3+    డి) PCl3
జ‌: డి (PCl3)

36. ఎలక్ట్రాన్ దాత, స్వీకర్త అనే పదాలు ఏ బంధానికి చెందినవి?
జ‌: సమన్వయ సమయోజనీయ బంధం
 

37. s - p అతిపాతం ద్వారా ఏర్పడే అణువు ఏది?
జ‌: HCl
 

38. p - p అతిపాతం ద్వారా ఏర్పడే అణువు ఏది?
జ‌: F2
 

39. s - s అతిపాతం ద్వారా ఏర్పడే అణువు ఏది?
జ‌: H2
 

40. కిందివాటిలో త్రికబంధం ఉన్న అణువు ఏది?
ఎ) ఆక్సిజన్          బి) నైట్రోజన్          సి) హైడ్రోజన్         డి) ఫ్లోరిన్
జ‌: బి ( నైట్రోజన్)
 

41. కిందివాటిలో ద్విబంధం ఉన్న అణువు ఏది?
ఎ) హైడ్రోజన్         బి) నైట్రోజన్         సి) ఆక్సిజన్          డి) క్లోరిన్
జ‌: సి (ఆక్సిజన్)
 

42. నీటి అణువులోని ఆర్బిటాళ్ల అతిపాతం ఏది?
జ‌: s - p
 

43. నీటి అణువు ఆకారం
జ‌: కోణీయం
 

44. నీటి అణువులో బంధ కోణం
జ‌: 104°31'
 

45. కిందివాటిలో నీటిలో కరిగేది
ఎ) NaCl            బి) N2             సి) CO      డి) H2S
జ‌: ఎ (NaCl)
 

46. ఒక ద్విబంధంలో రెండు పరమాణువుల మధ్య పంచుకునే ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 4
 

47. కిందివాటిలో సంయోజనీయ సమ్మేళన ధర్మం ఏది?
ఎ) అయాన్‌లను కలిగి ఉండటం               బి) నీటిలో కరగడం
సి) విద్యుత్తును ప్రవహింపజేయడం           డి) తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు
జ‌: డి (తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు)
 

48. రెండు పరమాణువుల రుణవిద్యుదాత్మకతల్లో తేడా 1.9 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే బంధం
జ‌: అయానిక బంధం
 

49. నీటి అణువులో ఆక్సిజన్ పరమాణువుపై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య
జ‌: 2
 

50. అమ్మోనియా అణువులో ఉండే బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య ఎంత?
జ‌: 3
 

51. అమ్మోనియా అణువులో ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య
జ‌: 1
 

52. అమ్మోనియా అణువు ఆకారం
జ‌: త్రికోణీయ పిరమిడ్
 

53. NH3లో బంధ కోణం
జ‌: 107°48'
 

54. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అణువు ఆకృతి
జ‌: ట్రైగోనల్ బైపిరమిడల్
 

55. PCl3 ఆకారం
జ‌: పిరమిడల్
 

56. రేఖీయంగా ఉండే అణువు
జ‌: CO2
 

57. కింది సమ్మేళనాల్లో రేఖీయ ఆకారం లేనిది ఏది?
ఎ) CO2       బి) C2H2         సి) PCl3           డి) HCN
జ‌: సి (PCl3)
 

58. అమ్మోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్‌లో ఉండే బంధం
జ‌: సమన్వయ సమయోజనీయ బంధం
 

59. కిందివాటిలో అయానిక బంధాన్ని ప్రదర్శించనిది
ఎ) అమ్మోనియా                        బి) సోడియం క్లోరైడ్
సి) మెగ్నీషియం క్లోరైడ్               డి) పొటాషియం క్లోరైడ్
జ‌: ఎ ( అమ్మోనియా )
 

60. కిందివాటిలో పిరమిడ్ ఆకృతి ఉండే అణువు
ఎ) H2O              బి) HCl         సి) CH4      డి) NH3
జ‌: డి (NH3)
 

61. CO2 అణువు ఆకృతి
జ‌: రేఖీయం
 

62. N2 అణువులో ఉండే σ , π బంధాల సంఖ్య వరుసగా
జ‌: 1, 2
 

63. O2 అణువులో ఉండే σ, π బంధాల సంఖ్య వరుసగా
జ‌: 1, 1
 

64. ఎలక్ట్రోవేలంట్ బంధం ఉండేది
జ‌: Na2O
 

65. బహు సమయోజనీయ బంధాలు ఉన్న అణువు
జ‌: N2
 

66. కిందివాటిలో బహుబంధాలు లేనిది ఏది?
ఎ) HCN            బి) N2              సి) O2            డి) HCl
జ‌: డి (HCl)
 

67. కిందివాటిలో స్వతంత్రంగా లేని బంధం
ఎ) అయానిక బంధం    బి)  బంధం     సి)  బంధం    డి) ఏదీకాదు
జ‌: సి ( బంధం)

68. బంధంలో పాల్గొనని ఆర్బిటాళ్లు
జ‌: s

69.

బంధం మాత్రమే ఉన్న అణువు 
జ‌: H2

70. వేలన్సీ ఎలక్ట్రాన్‌ల ద్వారా పరమాణువుల మధ్య రసాయన బంధం ఏర్పడుతుందని వివరించినవారు
జ‌: కోసెల్, లూయీ
 

71. క్రిప్టాన్ చుక్కల నిర్మాణంలో సరైంది
జ‌: 
 

72. కిందివాటిలో అయానిక పదార్థం
ఎ) H2O           బి) NH3          సి) MgCl2            డి) CH4
జ‌: సి (MgCl2)
 

73. కిందివాటిలో అయానిక పదార్థం కానిది
ఎ) NaCl         బి) Na2O          సి) AlCl3              డి) BeCl2
జ‌: డి (BeCl2)
 

74. కిందివాటిలో సమయోజనీయ బంధం ఉన్న అణువు
ఎ) MgCl2       బి) BeCl2       సి) AlCl3               డి) NaCl
జ‌: బి (BeCl2 )
 

75. కిందివాటిలో సమయోజనీయ బంధం లేని అణువు
ఎ) NH3              బి) NaCl       సి) F2                     డి) O2
జ‌: బి (NaCl)
 

76. X అనే మూలకం ఆక్సిజన్‌తో కలసి X2O అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. X పరమాణువు బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 1
 

77. అమ్మోనియా అణువులో H - N - H బంధకోణం
జ‌: 107°48'
 

78. సంయోజనీయ బంధం దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ‌: ఆర్బిటాళ్ల అతిపాతం
 

79. X, Y మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు 1s2 2s2 2p6 3s1, 1s2 2s2 2p6 3s2 3p5. అయితే X, Yలు సంయోగం చెందినప్పుడు ఏర్పడే బంధం
జ‌: అయానిక
 

80. వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ‌: లైనస్ పౌలింగ్
 

81. X అనే మూలకం పరమాణుసంఖ్య 6, ద్రవ్యరాశి సంఖ్య 12 అయితే XH4 లో ఉన్న బంధాల రకం
జ‌: సమయోజనీయ బంధం
 

82. జతపరచండి.
1) H2O అణువు          a) సమతల త్రికోణీయ ఆకారం
2) BeCl2 అణువు        b) పిరమిడల్ ఆకారం
3) BF3 అణువు          c) V ఆకృతి
4) NH3 అణువు         d) రేఖీయం
జ‌: సి (1 - c, 2 - d, 3 - a, 4 - b)
 

83. జతపరచండి.
1) 104°31'       a) NH3
2) 180°           b) BF3
3) 107°48'       c) BeCl2
4) 120°           d) H2O
జ‌: సి (1 - d, 2 - c, 3 - a, 4 - b)
 

84. జతపరచండి.
1) సంయోజనీయ బంధం         a) కోసెల్
2) VSEPRT సిద్ధాంతం            b) కోసెల్, లూయీ
3) అయానిక బంధం              c) జి.యన్. లూయిస్
4) వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం     d) సిడ్జివిక్, పావెల్
జ‌: ఎ (1 - c, 2 - d, 3 - a, 4 - b)
 

85. కిందివాటిలో సరికానిది.
ఎ) వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం - కోసెల్, లూయీ
బి) VSEPRT సిద్ధాంతం - సిడ్జివిక్, పావెల్
సి) వేలన్సీ బంధ సిద్ధాంతం - లైనస్ పౌలింగ్
డి) అష్టక సిద్ధాంతం - డాబరీనర్
జ‌: డి ( అష్టక సిద్ధాంతం - డాబరీనర్)
 

86.  
ఎ) Ne            బి) Ar       సి) Kr              డి) అన్నీ సరైనవే
జ‌: డి (అన్నీ సరైనవే)
 

87. కిందివాటిలో sp3 సంకరీకరణం లేనిది?
ఎ) CH4             బి) NH3        సి) BF3      డి) H2O
జ‌: సి (BF3)
 

88. CH4 లో '' బంధాల సంఖ్య
జ‌: 0

89. NaCl స్ఫటికంలో Na+ చుట్టూ ఎన్ని Cl- అయాన్‌లు ఉంటాయి?
జ‌: 6
 

90. కిందివాటిలో అధిక స్థిరత్వం ఉండేది
 ఎ) N               బి) O                  సి) Mg               డి) Ne
జ‌: డి (Ne)
 

91. కిందివాటిలో అధిక బంధకోణం ఉండేది
ఎ) BeCl2           బి) CH4               సి) H2O             డి) NH3
జ‌: ఎ (BeCl2)
 

92. HCl బంధం ఏర్పడటంలో క్లోరిన్ ఇచ్చే ఎలక్ట్రాన్ల సంఖ్య
జ‌: 1
 

93. అమ్మోనియా అణువుకు లూయిస్ చుక్కల నిర్మాణం

94. ఆక్సిజన్ అణువుకు లూయిస్ చుక్కల నిర్మాణం 

95. నైట్రోజన్ అణువుకు లూయిస్ చుక్కల నిర్మాణం

96. మీథేన్ అణువుకు లూయిస్ చుక్కల నిర్మాణం


 

97. నీటి అణువుకు లూయిస్ చుక్కల నిర్మాణం

98. BeCl2 అణువుకు లూయిస్ చుక్కల నిర్మాణం

జ‌: 
 

99. H - Fల మధ్య బంధ దూరం A° లలో
జ‌: 0.918
 

100. F - Fల మధ్య బంధ దూరం
జ‌: 1.44 A°

101. CH4 లో H - C బంధశక్తి
జ‌: 410kj/ mol
 

102. NH3 లో H - N బంధశక్తి
జ‌: 390 kj/ mol
 

103. H2O లో H - O ల మధ్య బంధ దూరం Aº లలో
జ‌: 0.96
 

104. అణువులో మధ్య పరమాణు కేంద్రకం చుట్టూ రెండు బంధ జంటలు, రెండు ఒంటరి జంటలు ఉండే అణువు
జ‌: H2O
 

105. త్రికబంధంలో ఉండే బంధాల సంఖ్య
జ‌: 1  బంధం, 2  బంధాలు
 

106. BeCl2 అణువు ఏర్పడటంలో నైట్రోజన్ పరమాణువు చెందే సంకరీకరణం
జ‌: sp3
 

107. రెండు పరమాణువుల మధ్య గరిష్ఠంగా ఏర్పడే సమయోజనీయ బంధాల సంఖ్య
జ‌: 3
 

108. కిందివాటిలో H2 అణువును సూచించే సరైన పటం
ఎ)  బి)         సి)

  డి)    
జ‌: డి 

109. NaClలో Na+ సమన్వయ సంఖ్య
జ‌: 6
 

110. NaCl లో Cl- సమన్వయ సంఖ్య
జ‌: 6
 

111. సోడియం క్లోరైడ్ (s) స్ఫటిక జాలకం ఎంథాల్పీ విలువ
జ‌: -788 kj/ mole
 

112. ధృవాత్మక సంయోజనీయ బంధం చూపే అణువు
జ‌: HCl

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌