• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. పదార్థం అతి సూక్ష్మకణాలైన 'అణు', 'పరమాణువు'ల సమ్మిళతమని తెలియజేసింది ఎవరు?
జ‌: కణాదుడు
 

2. పదార్థం అతి సూక్ష్మకణాలైన పరమాణువులను కలిగి ఉంటుందని తెలియజేసింది
జ‌: డెమోక్రటిస్
 

3. ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయి. అన్ని ధర్మాల్లోనూ ఒకేలా ప్రవరిస్తాయని తెలియజేసిన శాస్త్రజ్ఞుడు ఎవరు?
జ‌: డాల్టన్
 

4. పరమాణువును విభజించడానికి వీలవుతుందని ఉత్సర్గనాళిక ప్రయోగాల ద్వారా తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: విలియం క్రూక్స్
 

5. ఉత్సర్గనాళికలో వాయు పీడనాన్ని ఎంతకు తగ్గిస్తారు.
జ‌: 0.001 మి.మీ.
 

6. ఉత్సర్గనాళికలో విద్యుత్ ద్వారాలను ఎన్ని వోల్టుల విద్యుత్ జనకానికి కలుపుతారు?
జ‌: 10000 వోల్టులు
 

7. ఉత్సర్గనాళికలోని మార్పులను గుర్తించడానికి ధన విద్యుత్ ద్వారం వద్ద అమర్చే తెర ఏది?
జ‌: జింక్ సల్ఫైడ్
 

8. ఉత్సర్గనాళికలో రుణ ధృవ కిరణాలను (Cathode rays) కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ‌: థామ్సన్
 

9. రుణ ధృవ కిరణాలను విద్యుత్ క్షేత్రం ద్వారా పంపినప్పుడు అవి విద్యుత్‌క్షేత్రం ఏ దిశ వైపునకు దిశను మార్చి ప్రయాణిస్తాయి?
జ‌: ఆనోడ్ వైపు
 

10. రుణ ధృవ కిరణాల్లోని అతి సూక్ష్మమైన కణాన్ని ఏమంటారు?
జ‌: ఎలక్ట్రాన్
 

11. రుణ ధృవ కిరణాల్లోని కణాలు సంతరించుకున్న ఆవేశం
జ‌: రుణాత్మకం
 

12. కిందివాటిలో రుణ ధృవ కిరణాల ధర్మం
A) రుణ ధృవ కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయి.
B) రుణ ధృవ కిరణాలు యాంత్రిక చలనాన్ని కలగజేస్తాయి.
C) రుణావేశ కణాల సముదాయమే రుణ ధృవ కిరణాలు.
D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

13. రుణ ధృవ కిరణాల్లోని కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: జి.జె. స్టోనీ
 

14. విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు లేనప్పుడు కాథోడ్ కిరణాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి?
జ‌: సరళరేఖలో
 

15. మిల్లికాన్ 'నూనె చుక్క పద్ధతి' ప్రయోగం ద్వారా కనుక్కున్నది
జ‌: ఎలక్ట్రాన్ ఆవేశం
 

16. ఆర్.ఎ. మిల్లికాన్ 'నూనె చుక్క ప్రయోగం' ద్వారా నిర్ధారించిన ఎలక్ట్రాన్ ఆవేశం ఎంత?
జ‌: -1.6 × 10-19C
 

17. ఎలక్ట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: థామ్సన్
 

18. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
జ‌: 9.1 × 10-31 kg
 

19. కాథోడ్ కిరణాలు రుజుమార్గంలో చలిస్తాయి. వీటి కణాలు సంతరించుకున్న ఆవేశం
జ‌: రుణాత్మకం
 

20. కాథోడ్ కిరణాలు కలిగి ఉండేది
జ‌: ద్రవ్యరాశి, ఆవేశం
 

21. ఎలక్ట్రాన్ విశిష్టావేశం (e/m) విలువ
A) 1.76 × 107 e.m.u./గ్రామ్                    B) 1.761 × 108 కూలుంబ్/గ్రామ్
C) 5.28 × 1017 e.m.u./గ్రామ్                  D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

22. పరమాణువులో రుణావేశం ఉన్న ప్రాథమిక కణం
జ‌: ఎలక్ట్రాన్
 

23. అతి తక్కువ ద్రవ్యరాశి ఉన్న ప్రాథమిక కణం ఏది?
జ‌: ఎలక్ట్రాన్
 

24. ఉత్సర్గనాళంలో రుణ ధృవ కిరణాలు వెలువడటానికి అనుకూలమైన పరిస్థితులు
జ‌: తక్కువ పీడనం, ఎక్కువ విద్యుత్
 

25. ధన ధృవ కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ‌: గోల్డ్‌స్టెయిన్
 

26. ఉత్సర్గనాళికలో ఆనోడ్ వైపు నుంచి కాథోడ్ దిశగా రుజుమార్గంలో చలించే కిరణాలు
జ‌: కెనాల్ కిరణాలు
 

27. ఉత్సర్గనాళికలో కాథోడ్ వైపు నుంచి ఆనోడ్ దిశగా రుజుమార్గంలో చలించే కిరణాలు
జ‌: కాథోడ్ కిరణాలు
 

28. పరస్పరం ఎదురెదురు దిశల్లో ప్రయాణించే కిరణాలు ఏవి?
జ‌: కాథోడ్ కిరణాలు, ఆనోడ్ కిరణాలు
 

29. హైడ్రోజన్ వాయువు నుంచి ఏర్పడిన అతి చిన్న తేలికైన ధనావేశ అయాన్‌ను ఏమంటారు?
జ‌: ప్రోటాన్
 

30. ధన ధృవ కిరణాల అతి సూక్ష్మమైన కణాన్ని ఏమంటారు?
జ‌: ప్రోటాన్
 

31. ఆనోడ్ కిరణాలు రుజుమార్గంలో చలిస్తాయి. వీటి కణాలు సంతరించుకున్న ఆవేశం
జ‌: ధనాత్మకం
 

32. పరమాణువులో ధనావేశం ఉన్న ప్రాథమిక కణం
జ‌: ప్రోటాన్
 

33. ఆనోడ్ కిరణాలు కలిగి ఉండేది
జ‌: ఆవేశం, ద్రవ్యరాశి
 

34. ప్రోటాన్ ఆవేశం
జ‌: +1.602 × 10-19 C
 

35. ప్రోటాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: గోల్డ్‌స్టెయిన్
 

36. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది?
జ‌: 1837
 

37. ప్రోటాన్ ద్రవ్యరాశి
జ‌: 1.672 × 10-27 kg
 

38. ఏ కణాల ప్రవాహాన్ని కేనాల్ కిరణాలుగా వ్యవహరిస్తారు?
జ‌: ప్రోటాన్‌లు
 

39. న్యూట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: జేమ్స్ చాడ్విక్
 

40. ద్రవ్యరాశి కలిగి విద్యుదావేశం లేని ప్రాథమిక కణం
జ‌: న్యూట్రాన్
 

41. న్యూట్రాన్ ద్రవ్యరాశి గ్రాముల్లో
జ‌: 1.674 × 10-24
 

42. న్యూట్రాన్, ప్రోటాన్ ద్రవ్యరాశులు వరుసగా amu లలో
జ‌: 1.0087, 1.0078
 

43. బెరీలియం రేకును లేదా బోరాన్ న్యూక్త్లెడ్‌ను α − కణాలతో తాడనం చేసినప్పుడు వెలువడే కణం ఏది?
జ‌: న్యూట్రాన్
 

44. కిందివాటిలో న్యూట్రాన్ లేని మూలకం ఏది?
A) హైడ్రోజన్       B) ఆక్సిజన్       C) నియాన్        D) ఫ్లోరిన్
జ‌: A (హైడ్రోజన్) 
 

45. న్యూటాన్‌ల సంఖ్యలో తేడా కలిగిన ఒకే మూలకానికి చెందిన పరమాణవులు
జ‌: ఐసోటోన్‌లు
 

46. న్యూట్రాన్‌కు సంబంధించి కిందివాటిలో సరికానిది
A) సంకేతం - n                                B) సాపేక్ష ఆవేశం సున్నా
C) ద్రవ్యరాశి 9.109 × 10-31 kg          D) ద్రవ్యరాశి 1.0087 amu
జ‌: C (ద్రవ్యరాశి 9.109 × 10-31 kg)
 

47. విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో విచలనం లేని కణం
జ‌: న్యూట్రాన్
 

48. పరమాణు కేంద్రకంలో లేని కణం
జ‌: ఎలక్ట్రాన్
 

49. పరమాణువులో ఉన్న ప్రాథమిక కణం ఏది?
A) ఎలక్ట్రాన్               B) ప్రోటాన్          C) న్యూట్రాన్          D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

50. కేంద్రకంలో ఉన్న ముఖ్య మూల కణాలు
జ‌: ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు
 

51. తటస్థ పరమాణువులో సమాన సంఖ్యలో ఉండేవి
జ‌: ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్‌లు
 

52. కేంద్రకం చుట్టూ తిరిగే కణాలు
జ‌: ఎలక్ట్రాన్‌లు
 

53. 'ఒక సిద్ధాంతాన్ని అనుసరించి పరమాణువు విభజించడానికి వీలుకాని అతి సూక్ష్మమైన కణం' అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: డాల్టన్
 

54. మొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది
జ‌: జె.జె. థామ్సన్
 

55. థామ్సన్ పరమాణు నమూనాకు మరొక పేరు
A) ప్లమ్ పుడ్డింగ్      B) రైజిన్ పుడ్డింగ్     C) పుచ్చకాయ     D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

56. పరమాణువు గోళాకారం (వ్యాసార్ధం సుమారు 1.0 × 10-10 m) లో ధనావేశం సమంగా పంపిణీ జరిగి, స్థిరమైన స్థిర విద్యుత్ అమరిక కోసం తగినరీతిలో గోళంలో ఎలక్ట్రాన్‌లు కూర్చబడి ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త
జ‌: థామ్సన్
 

57. పరమాణు ద్రవ్యరాశి పరమాణువు అంతటా సమంగా పంపిణీ జరిగే నమూనా
జ‌: థామ్సన్ నమూనా
 

58. పుచ్చకాయ గుజ్జులో ఉన్న గింజలతో పరమాణు నిర్మాణాన్ని పోల్చిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: థామ్సన్
 

59. కాథోడ్ కిరణాలను పల్చటి ఫిల్మ్‌ల లాంటి పదార్థాల ద్వారా పంపి కొన్ని పరిశోధనలను చేసి పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉందని నిర్ధారించిన శాస్త్రవేత్త
జ‌: లీనార్డ్
 

60. α − కణాలు ఏ విధంగా లభ్యమవుతాయి?
జ‌: ఎలక్ట్రాన్‌లను తొలగించిన హీలియం పరమాణువులు
 

61. α − కణాలు ఏ ప్రాథమిక కణాలతో నిర్మితమవుతాయి?
జ‌: రెండు ప్రోటాన్‌లు, రెండు న్యూట్రాన్‌లు

62. 'గ్రహ మండల నమూనా' అని ఏ పరమాణు నమూనాను అంటారు?
జ‌: రూథర్‌ఫర్డ్ నమూనా
 

63. మొత్తం ధనావేశం కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త
జ‌: రూథర్‌ఫర్డ్
 

64. రూథర్‌ఫర్డ్ పరమాణు నిర్మాణం దేనికి వ్యతిరేకం?
జ‌: విద్యుదయస్కాంత సిద్ధాంతం
 

65. మొత్తం ధనావేశం పరమాణు కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుందని రూథర్‌ఫర్డ్ ఎందుకు భావించాడు?
జ‌: α − కణాలు కేంద్రకంతో వికర్షించడం.

66. కిందివాటిలో రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనా వేటిని వివరించలేకపోయింది?
A) పరమాణు స్థిరత్వం
B) హైడ్రోజన్ పరమాణువులో రేఖావర్ణ పటానికి మూలం
C) పరమాణు స్థిరత్వం, హైడ్రోజన్ పరమాణువులో రేఖావర్ణ పటానికి మూలం
D) ఏదీకాదు
జ‌: C (పరమాణు స్థిరత్వం, హైడ్రోజన్ పరమాణువులో రేఖావర్ణ పటానికి మూలం)
 

67. రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం కిందివాటిలో సరైంది?
A) పరమాణువులో మొత్తం ద్రవ్యరాశి ధనావేశ కేంద్రకం అనే కొద్ది ప్రదేశంలో కేంద్రీకృతమై ఉంటుంది.
B) కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌లు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తాయి.
C) కేంద్రకం పరిమాణం పరమాణువుల పరిమాణం కంటే చాలా తక్కువ.
D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

68. రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకం, పరమాణు పరిమాణాలు వరుసగా
జ‌: 10-15 మీ., 10-8 సెం.మీ.
 

69. పరమాణు వ్యాసార్ధం సుమారుగా
జ‌: 10-8 సెం.మీ.
 

70. రూథర్‌ఫర్డ్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణం సరైంది అయితే అది ఏ వర్ణపటాన్ని ఇస్తుంది?
జ‌: అవిచ్ఛిన్న వర్ణపటం
 

71. వీధి దీపాల్లో సోడియం ఆవిరి ఉత్పత్తి చేసే రంగు
జ‌: పసుపు
 

72. జ్వాలా పరీక్షలో క్యూప్రిక్ క్లోరైడ్ ఇచ్చే మంట రంగు
జ‌: ఆకుపచ్చ
 

73. జ్వాలా పరీక్షలో స్ట్రాన్షియం క్లోరైడ్ ఏర్పరిచే మంట రంగు
జ‌: ఎరుపు
 

74. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటం అనేది కిందివాటిలో దేనికి ఉదాహరణ?
జ‌: దృగ్గోచర వర్ణపటం
 

75. ఇంద్రధనస్సులోని రంగుల్లో తక్కువ తరంగదైర్ఘ్యం ఉండే రంగు
జ‌: ఊదా
 

76. దృగ్గోచర వర్ణపటంలోని రంగుల్లో ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండే రంగు
జ‌: ఎరుపు
 

77. హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలో దృశ్యకాంతి పరిధిలో లభించే రేఖల శ్రేణి
జ‌: బామర్
 

78. హైడ్రోజన్ వర్ణపటంలో బ్రాకెట్ శ్రేణి ఏర్పడే ప్రదేశం
జ‌: పరారుణ కాంతి
 

79. హైడ్రోజన్ వర్ణపటంలో బామర్ శ్రేణి ఏర్పడే ప్రాంతం
జ‌: దృగ్గోచర
 

80. అతినీలలోహిత ప్రాంతంలో వర్ణపటాన్ని ఏర్పరిచే హైడ్రోజన్ వర్ణపట శ్రేణి
జ‌: లైమన్
 

81. ఉత్తేజిత ఎలక్ట్రాన్‌లు సాధారణ స్థితిలో చేరినప్పుడు ఉద్గారమయ్యే వర్ణపటం
జ‌: దృశ్య వర్ణపటం
 

82. దృశ్య వ‌ర్ణ‌ప‌టంలో ఏ రంగుకు క‌నిష్ఠ త‌రంగ‌దైర్ఘ్యం ఉంటుంది?
జ‌: ఊదా
 

83. తెల్లని కాంతిని తన అంశ రంగులుగా విడగొట్టే వ్యవస్థ
జ‌: పట్టకం
 

84. పదార్థం శోషించుకున్న శక్తిని ఉద్గారించే వికిరణాల వర్ణపటాన్ని ఏమంటారు?
జ‌: ఉద్గార వర్ణపటం
 

85. ఒక పదార్థంపై నుంచి కాంతిని పంపితే అది కొన్ని తరంగ దైర్ఘ్యాలను శోషించుకొని, మిగిలిన తరంగ దైర్ఘ్యాలను విశ్లేషించి నమోదు చేసే వర్ణపటం
జ‌: శోషణ వర్ణపటం
 

86. ఉద్రిక్త హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ n = 6 శక్తి స్థాయి నుంచి n = 3 శక్తి స్థాయికి దూకినప్పుడు హైడ్రోజన్ వర్ణపటం  ఏ శ్రేణిలో వర్ణపట రేఖలు ఏర్పడతాయి?
జ‌: పాషన్
 

87. ఉద్రిక్త హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ n = 4 శక్తి స్థాయి నుంచి n = 2 శక్తి స్థాయికి దూకినప్పుడు హైడ్రోజన్ వర్ణపటం ఏ శ్రేణిలో వర్ణపట రేఖలు ఏర్పడతాయి?
జ‌: బామర్
 

88. n = 2 నుంచి n = 1 కక్ష్యలోకి ఎలక్ట్రాన్ దూకినప్పుడు ఏర్పడే రేఖ శ్రేణి ఏది?
జ‌: లైమన్
 

89. హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ n = 5 నుంచి n = 2 శక్తి స్థాయికి దూకినప్పుడు హైడ్రోజన్ వర్ణపట రేఖలు ఏర్పడే ప్రాంతం
జ‌: దృగ్గోచర
 

90. బోర్ నమూనా కిందివాటిలో దేనికి వర్తిస్తుంది?
A) అన్ని పరమాణువులకు
B) అన్ని అయాన్‌లకు
C) అన్ని అణువులకు
D) ఒకే ఎలక్ట్రాన్ కలిగిన పరమాణువు లేదా అయాన్‌లకు
జ‌: ఒకే ఎలక్ట్రాన్ కలిగిన పరమాణువు లేదా అయాన్‌లకు
 

91. విద్యుదయస్కాంత వికిరణం శక్తికి, పౌనఃపున్యంకు మధ్య ఉండే నిష్పత్తిని ఏమంటారు?
జ‌: ప్లాంక్ స్థిరాంకం
 

92. ప్లాంక్ స్థిరాంకం విలువ
జ‌: 6.626 × 10-27 ఎర్గ్ − సెకన్
 

93. విద్యుదయస్కాంత వికిరణం శక్తి, పౌనఃపున్యంకు ఉండే సంబంధాన్ని తెలియజేసింది
జ‌: ప్లాంక్
 

94. ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం వికిరణ శక్తి (E) కిందివాటిలో దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది?
A) తరంగ వేగం             B) తరంగ దైర్ఘ్యం          C) పౌనఃపున్యం              D) కాలం
జ‌: C ( పౌనఃపున్యం)
 

95. బోర్ పరమాణు నమూనాను దేని ఆధారంగా ప్రతిపాదించారు?
జ‌: ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం
 

96. బోర్ పరమాణు నమూనా ప్రకారం
A) ఎలక్ట్రాన్‌లు స్థిర కక్ష్యల్లో మాత్రమే పరిభ్రమిస్తుంటాయి.
B) ప్రతి స్థిర కక్ష్యకు నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. ఈ స్థిర కక్ష్యలను K, L, M, Nలతో సూచిస్తారు.
C) ఎలక్ట్రాన్ అధిక శక్తి ఉండే కక్ష్య నుంచి తక్కువ శక్తి ఉన్న కక్ష్యలోకి వచ్చినప్పుడు రెండు కక్ష్యల శక్తుల భేదం ఉద్గారం రూపంలో వెలువడుతుంది.
D) పైవన్నీ
జ‌: D( పైవన్నీ)
 

97. ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయి నుంచి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు
జ‌: శక్తి విడుదలవుతుంది
 

98. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి నుంచి అధిక శక్తి స్థాయికి ప్రవేశించినప్పుడు
జ‌: శక్తిని గ్రహిస్తుంది
 

99. కేంద్రకం నుంచి దూరంగా వెళ్లేకొద్దీ కక్ష్య శక్తి
జ‌: పెరుగుతుంది
 

100. కేంద్రకానికి దగ్గరగా ఉండే శక్తి స్థాయి
జ‌: K
 

101. తక్కువ శక్తి ఉండే కక్ష్య
జ‌: n = 1
 

102. ఎలక్ట్రాన్‌లు స్థిర కక్ష్యల్లో తిరుగుతున్నంత వరకు
జ‌: శక్తిలో మార్పు ఉండదు
 

103. బోర్ పరమాణు నిర్మాణం వివరించే వర్ణపటం
A) హైడ్రోజన్           B) He+           C) Li+2                D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

104. అధిక శక్తి ఉన్న కక్ష్య
జ‌: N
 

105. బోర్ పరమాణు నమూనా కింది ఏ అంశాన్ని వివరించలేదు?
A) బహు ఎలక్ట్రాన్ పరమాణువుల వర్ణపటాలను
B) జీమన్ ఫలితాన్ని, స్టార్క్ ఫలితాన్ని
C) రసాయన బంధాల ఏర్పాటును
D) అన్నీ
జ‌:  D( అన్నీ)
 

106. క్వాంటీకరణం చెందడం అంటే
జ‌: నిర్దిష్ట విలువలకు సమానమవడం
 

107. బోర్ పరమాణు నమూనా ప్రకారం ఒక స్థిర కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం
జ‌: 

108. అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు మరికొన్ని సూక్ష్మ రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? 
జ‌: జీమన్ ఫలితం
 

109. విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖలు మరికొన్ని సూక్ష్మ రేఖలుగా విడిపోయే ఫలితం
జ‌: స్టార్క్ ఫలితం
 

110. స్థిర కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం కి ఏవిధంగా ఉంటుంది?
జ‌: పూర్ణాంకంగా

111. దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త
జ‌: సోమర్‌ఫెల్డ్
 

112. హైడ్రోజన్ పరమాణువు సూక్ష్మ వర్ణపటాన్ని వివరించడానికి సోమర్‌ఫెల్డ్ ప్రతిపాదించినవి
జ‌: దీర్ఘవృత్తాకార కక్ష్యలు
 

113. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం (mvr) =
జ‌:   

114. దీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో n విలువ Kకి సమానమైనప్పుడు కక్ష్య
జ‌: వృత్తాకారంగా మారుతుంది.
 

115. సోమర్‌ఫెల్డ్ నమూనా గణితశాస్త్ర పరంగా తప్పు అని తెలిసిన తర్వాత అజిముతల్ క్వాంటం సంఖ్య (K)ను ఏ విధంగా మార్చారు?
జ‌: l
 

116. n = 3 అయినప్పుడు ఆ వృత్తాకార క్షక్యలో ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యల సంఖ్య
జ‌: 2
 

117. n = 4 అయినప్పుడు 'l' గరిష్ఠ విలువ
జ‌: 3
 

118. రెండో స్థిర కక్ష్యలో ఉండే ఉప స్థిర కక్ష్యల సంఖ్య
జ‌: 2
 

119. n = 3 లో ఉండే ఉప స్థిర కక్ష్యలు
జ‌: 3s, 3p, 3d
 

120. L కర్పరంలో ఉండే ఉప కర్పరాలు
జ‌: s, p
 

121. L స్థిర కక్ష్యలో ఉన్న మొత్తం శక్తి స్థాయిలు
జ‌: 4
 

122. n = 5 లో ఉన్న ఉప స్థిర కక్ష్యల రకాలు
జ‌: s, p, d, f, g
 

123. స్థిర కక్ష్యల ఆధారంగా నీల్స్‌బోర్ ప్రతిపాదించిన క్వాంటం సంఖ్య
జ‌: ప్రధాన క్వాంటం సంఖ్య
 

124. ప్రధాన క్వాంటం సంఖ్యను దేనితో సూచిస్తారు?
జ‌: n
 

125. n = 3 అయితే ఆ స్థిరకక్ష్య పేరు
‌జ‌: M - కర్పరం
 

126. M - కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 18
 

127. దీర్ఘ వృత్తాకార కక్ష్యల ఆధారంగా సోమర్‌ఫెల్డ్ ప్రతిపాదించిన క్వాంటం సంఖ్య
జ‌: కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య
 

128. ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l విలువలు
జ‌: 0 నుంచి (n - 1) వరకు ఉంటాయి

129. l = 2 అయినప్పుడు ఆర్బిటాల్
జ‌: d
 

130. n = 4, l = 2 అయితే ఉప స్థిరకక్ష్య పేరు
జ‌: 4d

131. అయస్కాంత క్వాంటం సంఖ్యను ఎవరు ప్రతిపాదించారు?
జ‌: లాండే
 

132. అయస్కాంత క్వాంటం సంఖ్యను దేంతో సూచిస్తారు?
జ‌: ml

133. l = 3 అయితే ml విలువల సంఖ్య
జ‌: 7

134. l = 2 అయినప్పుడు ml విలువలు
జ‌: -2, -1, 0, 1, 2

135. n = 4, l = 3 అయితే ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్య
జ‌: 7

136. n = 3, l = 2 అయిన ఉపకర్పరం సంకేతం
జ‌: 3d

137. l = 3 అయితే ఉపకర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 14

138. స్పిన్ క్వాంటం సంఖ్య (ms) ను ప్రతిపాదించింది
జ‌: ఉలెన్‌బెక్, గౌడ్‌స్మిత్
 

139. బహు ఎలక్ట్రాన్‌లను కలిగిన పరమాణువుల్లో ఒక నిర్దిష్ట ఆర్బిటాల్‌లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్‌లు ఉన్నప్పుడు వాటి దిగ్విన్యాసాలను వివరించే క్వాంటం సంఖ్య
జ‌: స్పిన్ క్వాంటం సంఖ్య
 

140. ఒక కక్ష్య పరిమాణాన్ని తెలియజేసే క్వాంటం సంఖ్య
జ‌: ప్రధాన క్వాంటం సంఖ్య
 

141. స్థిర కక్ష్య పరిమాణం, శక్తిని ఏ క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది?
జ‌: n
 

142. ఒక కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 2n2
 

143. n = 3 కక్ష్యలో ఉండే ఉపస్థాయిల సంఖ్య
జ‌: 3
 

144. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను తెలియజేసేది
జ‌: ఉపకర్పరాన్ని
 

145. n = 2, l = 1 అయితే ఆ శక్తిస్థాయి
జ‌: 2s
 

146. 3d ఆర్బిటాల్‌లో ఉండే ఎలక్ట్రాన్ క్వాంటం సంఖ్యలు
జ‌: n = 3, l = 2, m = 1, s = +

147. కిందివాటిలో సరైన క్వాంటం సంఖ్యల విలువలు
A) n = 1, l = 1, m = −1, s = -            B) n = 2, l = 1, m = −1, s = + 
C) n = 2, l = 0, m = +1, s = -             D) n = 1, l = 0, m = 0, s = + 
జ‌:  A (n = 1, l = 1, m = −1, s = - )

148. బెరీలియం యొక్క నాలుగు సరైన n, l, m, s విలువలు వరుసగా
జ‌: 2, 0, 0, - 

149. కిందివాటిలో సరైన క్వాంటం సంఖ్యల విలువలను చూపనిది
A) n = 2, l = 1, m = 0, s = +           B) n = 2, l = 2, m = -1, s = - 
C) n = 3, l = 2, m = +1, s = +         D) n = 3, l = 0, m = 0, s = -
జ‌: B (n = 2, = 2, m = -1, s = - )

150. l విలువ 2 ఉండే ఉపస్థాయిలోని అత్యధిక ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 10

151. అయస్కాంత క్వాంటం సంఖ్య నిర్దేశించేది
జ‌: కక్ష్య దిగ్విన్యాసం
 

152. అయస్కాంత క్వాంటం సంఖ్య అవధులు
జ‌: -l....0.....+l

153. ఎలక్ట్రాన్ భ్రమణాలను తెలిపే క్వాంటం సంఖ్య
జ‌: స్పిన్ క్వాంటం సంఖ్య
 

154. ఒక ఎలక్ట్రాన్‌కు ఉండే స్పిన్ విలువలు 
జ‌: +,  -

155. ఎలక్ట్రాన్ స్పిన్ +  సూచించేది
జ‌: సవ్య దిశను

156. ఒక ఉపకర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్యను సూచించేది?
జ‌: 2(2l + 1)

157. కిందివాటిలో క్వాంటం సంఖ్యల విలువలను తప్పుగా చూపేది
A) n = 1, l = 0, m = 0, s = -         B) n = 2, l = 1, m = 0, s = +       
C) n = 2, l = 2, m = 5, s = -           D) n = 2, l = 1, m = 0, s = +

 
జ‌:   C (n = 2, = 2, m = 5, s = -

158. L కర్పరంలో ఉన్న ఆర్బిటాళ్లు
జ‌: s, p
 

159. 's' ఆర్బిటాల్ ఏ ఆకృతిలో ఉంటుంది?
జ‌: గోళాకారం
 

160. డంబెల్ ఆకారంలో ఉండే ఆర్బిటాల్
జ‌: p
 

161. డబుల్ డంబెల్ ఆకారంలో ఉండే ఆర్బిటాల్
జ‌: d
 

162. N - కర్పరంలో ఉన్న's' ఆర్బిటాల్‌ను ఏమంటారు?
జ‌: 4s
 

163. కిందివాటిలో నోడల్ తలం లేని ఆర్బిటాల్ ఏది?
A) 4s          B) 5s             C) 2s           D) 1s
జ‌: D (1s)
 

164. p - ఆర్బిటాళ్లు లేని కర్పరం
జ‌: K
 

165. p - ఆర్బిటాళ్ల అజిముతల్ క్వాంటం సంఖ్య
జ‌: l = 1

166. d - ఆర్బిటాళ్లు లేని కర్పరం
జ‌: K - కర్పరం , L - కర్పరం
 

167. d - ఆర్బిటాళ్ల అజిముతల్ క్వాంటం సంఖ్య
జ‌: l = 2

168. O (n = 5) కర్పరంలో ఉన్న d ఆర్బిటాల్‌ను ఏమంటారు?
జ‌: 5d
 

169. (n + l) విలువల ప్రకారం ఆర్బిటాళ్ల సాపేక్ష శక్తుల క్రమం
జ‌: 3s < 3p < 4s < 3d < 4p

170. 


   
    పై పటంలో సూచించిన p − ఆర్బిటాళ్ల అమరిక
జ‌: pz

171.


     
   పై పటం ఏ d ఆర్బిటాళ్ల ఉపరితల సరిహద్దు రేఖా నిర్మాణం
జ‌: dyz

172.


 
పై పటం ఏ d ఆర్బిటాళ్ల ఉపరితల సరిహద్దు రేఖా చిత్రం
జ‌: dx2- y2

173.
    
పై పటంలో సూచించిన p - ఆర్బిటాళ్ల అమరిక
జ‌: px

174. ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు భర్తీ చేయడానికి దోహదపడే నియమం ఏది?
A) ఆఫ్‌భౌ నియమం              B) హుండ్ నియమం
C) పౌలివర్జన నియమం          D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

175. రెండు ఆర్బిటాళ్ల (n + l) విలువలు సమానమైతే కనిష్ఠ 'n' విలువ కలిగిన ఆర్బిటాల్‌ను ఎలక్ట్రాన్ ముందుగా ఆక్రమించుకుంటుంది అని సూచించే నియమం
జ‌: ఆఫ్‌భౌ నియమం

176. ఏ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్‌ను ఆక్రమించుకుంటుంది?
జ‌: ఆఫ్‌భౌ నియమం
 

177. 2p ఆర్బిటాల్ యొక్క (n + l) విలువ
జ‌: 3

178. 4s, 3d ఆర్బిటాల్ యొక్క (n + l) విలువలు వరుసగా
జ‌: 4, 5

179. (n + l) విలువలు ఒకేవిధంగా ఉండే ఆర్బిటాళ్లు
జ‌: 3p, 4s

180. 'సమశక్తి ఆర్బిటాళ్లలో ఒక్కో ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడటం జరుగుతుంది' అని తెలిపే నియమం ఏది?
జ‌: హుండ్ నియమం
 

181. హుండ్ నియమం ప్రకారం కార్బన్ పరమాణువులో ఎలక్ట్రాన్‌ల అమరిక ఏ విధంగా ఉంటుంది?
జ‌: 

182. భూ స్థాయిలో ఉండే ఆక్సిజన్ బాహ్యతమ ప్రధాన శక్తిస్థాయిని సరిగ్గా సూచించే ఆర్బిటాల్
జ‌: 

183. కింది ఎలక్ట్రాన్‌ల అమరికలో హుండ్ నియమాన్ని ఉల్లంఘించేది
జ‌: B ()

184. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఎలక్ట్రాన్ విన్యాసం ఉండే మూలకం
జ‌: Ca

185. పరమాణువులోని ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్‌లు నిండే క్రమాన్ని సూచించేది
జ‌: ఎలక్ట్రాన్ విన్యాసం
 

186. ఆఫ్‌భౌ అనే పదానికి అర్థం
జ‌: ఊర్థ్వ నిర్మాణం
 

187. కిందివాటిలో సరికాని జత
A) Ca - 1s2 2s2 2p6 3s2 3p6 4s2    B) N - 1s2 2s2 2p3
C) Ar - 1s2 2s2 2p6 3s2 3p5            D) Na - 1s2 2s2 2p6 3s1
జ‌: C (Ar - 1s2 2s2 2p6 3s2 3p5 )

188. కిందివాటిలో ఎలక్ట్రాన్‌లు నిండే సరైన క్రమం
a) 1s       b) 3s       c) 4s      d) 2s       e) 3p     f) 4p
జ‌: B (a, d, b, e, c, f)
 

189. n = 1, l = 0, m = 0, s = +  క్వాంటం సంఖ్యలున్న పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం
జ‌:1s1

190. కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం
జ‌: 1s2 2s2 2p2

191. 1s2 2s2 2p6 3s2 3p1 ఎలక్ట్రాన్ విన్యాసం ఉండే మూలకం
జ‌: అల్యూమినియం

192. పరమాణు సంఖ్య 21 ఉండే మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం
జ‌: 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1

193. ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 అయితే దానిలో ఉన్న ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 24


జ‌: నైట్రోజన్
 

195. 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత భేదపరిచే ఎలక్ట్రాన్ ప్రవేశించే ఆర్బిటాల్
జ‌: 4s
 

196. క్రోమియం పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం
జ‌: [Ar] 4s1 3d5
 

197. కాపర్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం
జ‌: [Ar] 4s1 3d10
 

198. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఎలక్ట్రాన్ విన్యాసం ఉండే మూలకం పరమాణు సంఖ్య
జ‌: 20

199. 1s2 2s2 2p6 3s2 3p3 ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 3

200. 3p, 3d, 4s, 4p లలో దేనికి అత్యల్ప శక్తి ఉంటుంది?
జ‌: 3p
 

201. పౌలీ సూత్రం ప్రకారం ఒక ఆర్బిటాల్‌లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ‌: 2
 

202. 'ఒక పరమాణువులో ఏ రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు' అని తెలిపే నియమం
జ‌: పౌలివర్జన నియమం
 

203. దిశా రహిత ఆర్బిటాల్
జ‌: s
 

204. కిందివాటిలో తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్
A) 1s                 B) 2s                C) 2p                D) 3s
జ‌: 1s
 

205. నైట్రోజన్ పరమాణువులో మూడు ఒంటరి ఎలక్ట్రాన్‌లు ఉండటానికి కారణం
జ‌: హుండ్ నియమం
 

206. ఒక పరమాణువు కేంద్రకం, బాహ్య కక్ష్యకు మధ్య ఉండే దూరం?
జ‌: పరమాణు సైజు
 

207. వాయుస్థితిలో ఉన్న పరమాణువు చిట్ట చివరి ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తి
జ‌: అయనీకరణ శక్తి
 

208. అయనీకరణ శక్తికి ప్రమాణాలు 
A) కి.జౌల్ మోల్-1             B) కి.కా. మోల్-1        C) ఎలక్ట్రాన్ వోల్ట్         D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

209. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు
A) కేంద్రకం ఆవేశం     B) పరమాణు సైజు      C) అయాన్ ఆవేశం     D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

210. కేంద్రక ఆవేశం పెరిగేకొద్దీ అయనీకరణ శక్మం
జ‌: పెరుగుతుంది
 

211. పరమాణు సైజు పెరిగేకొద్దీ అయనీకరణ శక్మం
జ‌: తగ్గుతుంది
 

212. అయాన్ ఆవేశం పెరిగేకొద్దీ అయనీకరణ శక్మం
జ‌: పెరుగుతుంది
 

213. వాయుస్థితిలో తటస్థ పరమాణువు భూ స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్‌ను చేర్చితే విడుదలయ్యే శక్తిని ఏమంటారు?
జ‌: ఎలక్ట్రాన్ ఎఫినిటీ
 

214. గరిష్ఠ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండే మూలకం
జ‌: Cl

215. పరమాణు వ్యాసార్ధాన్ని ఏ ప్రమాణాల్లో సూచిస్తారు?
జ‌: ఆంగ్‌స్ట్రాం
 

216. తరంగ ధైర్ఘ్యం, పౌనఃపున్యం, కాంతివేగంల మధ్య సంబంధం
జ‌: v = vλ
 

217. విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు
జ‌: గామా (γ) కిరణాలు
 

218. విద్యుదయస్కాంత వర్ణపటంలో అధిక తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు
జ‌: రేడియో తరంగాలు
 

219. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
జ‌: మాక్స్‌ప్లాంక్
 

220. ఒక నిర్దిష్ట పౌనఃపున్యానికి ఉండే శక్తి (E) =
జ‌:
 

221. E = సమీకరణంలో 'h' దేన్ని సూచిస్తుంది?
జ‌: ప్లాంక్ స్థిరాంకం
 

222. విద్యుదయస్కాంత వికిరణం శక్తికి, పౌనఃపున్యంకు ఉండే నిష్పత్తిని ఏమంటారు?
జ‌: ప్లాంక్ స్థిరాంకం
 

223. లోహం ఆరంభ పౌనఃపున్యం (υ0) 7.0 × 1014 s-1. v = 1.0 × 1015 s-1 పౌనఃపున్యం ఉన్న వికిరణాలు లోహంపై పడినప్పుడు బయటకు వెలువడే ఎలక్ట్రాన్‌ల గతిజశక్తి గణించండి.
జ‌:  1.988 × 10-19 J
 

224. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
జ‌: న్యూటన్
 

225. కాంతి తరంగాన్ని ప్రతిపాదించింది
జ‌: హైగెన్స్
 

226. శూన్యంలో కాంతి వేగం
జ‌: 3 × 108 మీ./సె.
 

227. విద్యుదయస్కాంత తరంగాలన్నింటికీ ఉండే స్వభావం
జ‌: తిర్యక్
 

228. దృశ్య కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న వికిరణాలు
జ‌: IR - కిరణాలు
 

229. పరారుణ కిరణాలను దేనిలో ఉపయోగిస్తారు?
జ‌: ఫిజియోథెరపీ
 

230. ఉపగ్రహ సమాచార  ప్రసారాల్లో కింది ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
A) మైక్రో తరంగాలు                 B) రేడియో తరంగాలు
C) పరారుణ కిరణాలు                D) అతి నీలలోహిత కిరణాలు
జ‌: D (అతి నీలలోహిత కిరణాలు)
 

231. X - కిరణాల తరంగ దైర్ఘ్య అవధి
జ‌: 0.001 nm నుంచి 10 nm
 

232. దృగ్గోచర వర్ణపట తరంగ దైర్ఘ్య అవధి...
జ‌: 0.4 μm నుంచి 0.7 μm
 

233. రాడార్‌లలో ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణాలు...
జ‌: మైక్రో తరంగాలు
 

234. రేడియో ప్రసారాలకు ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణాలు
జ‌: రేడియో తరంగాలు
 

235. కాంతి విద్యుత్ ఫలితాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త.
జ‌: హెర్ట్జ్
 

236. నిర్దిష్టమైన లోహాల (పొటాషియం, రుబీడియం)పై కాంతిపుంజం పడినప్పుడు ఎలక్ట్రాన్‌లు (ఎలక్ట్రిక్ కరెంట్) బయటకు వెలువడటాన్ని ఏమంటారు?
జ‌: కాంతి విద్యుత్ ఫలితం
 

237. వర్ణపటాలను ఉపయోగించి మొదటగా మూలకాలను గుర్తించిన శాస్త్రవేత్త
జ‌: రాబర్ట్ బున్‌సెన్
 

238. కిందివాటిలో వర్ణపట విశ్లేషణం ద్వారా కనుక్కున్న మూలకాలు
A) Rb, Sc          B) Cs, Ga            C) In, Tl            D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

239. ఎలక్ట్రాన్‌కు కచ్చితమైన స్థానం, కచ్చితమైన ద్రవ్యవేగం ఏకకాలంలో నిర్ణయించడం అసాధ్యం అని తెలిపిన శాస్త్రవేత్త
జ‌: హైసన్‌బర్గ్
 

240. హైసన్‌బర్గ్ అనిశ్చితత్వ నియమ గణితాత్మక రూపం
A)                     B) 
C)              D) అన్నీ
జ‌: D (అన్నీ)

241. పరమాణువులో కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్ స్థానాన్ని, శక్తిని తెలుసుకోవడానికి తరంగ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ‌: ఇర్విన్ ష్రోడింగర్
 

242. ష్రోడింగర్ తరంగ సమీకరణ గణిత రూపం

243 .  లు సూచించేది వరుసగా
జ‌: తరంగ ప్రమేయం, ఎలక్ట్రాన్ గతిజశక్తి

244. పరమాణువులో ఏదైనా ఒక బిందువు వద్ద ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత, ఆ బిందువు వద్ద ఆర్బిటాల్ తరంగ ప్రమేయ వర్గానికి ఏవిధంగా ఉంటుంది?
జ‌: అనులోమానుపాతంలో
 

245. సంభావ్యత సాంద్రతగా వ్యవహరించేది
జ‌: తరంగ ప్రమేయ వర్గం ||2

246. పరమాణువులో వేర్వేరు బిందువుల వద్ద సంభావ్యత సాంద్రత |

|2 విలువలు తెలిసినట్లయితే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఉండే గరిష్ఠ సంభావ్యత ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. దీన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
జ‌: ఆర్బిటాల్

247. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతంలో ప్రధానశక్తి స్థాయి (n విలువ), ఉపశక్తిస్థాయి (l విలువ), ఉపశక్తిస్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య (x విలువ) లు ఉంటాయి. వాటిని కింది విధంగా రాస్తాం
A) lnx                B) nlx                  C) lxn               D) nlx
జ‌: D (nl x)

248. Ne మూలకం ఎలక్ట్రాన్ విన్యాస ఆర్బిటాల్ చిత్రం
జ‌: 

249. పూర్తిగా నిండిన కర్పరాల్లోని ఎలక్ట్రాన్‌లను ఏమంటారు?
జ‌: కోర్ ఎలక్ట్రాన్‌లు
 

250. గరిష్ఠ క్వాంటం సంఖ్య ఉన్న ఎలక్ట్రానిక్ కర్పరంలోని ఎలక్ట్రాన్‌లను ఏమంటారు?
జ‌: సంయోజక ఎలక్ట్రాన్‌లు
 

251. Sc నుంచి Zn వరకు ఉన్న వరుస మూలకాల్లో చివరి ఎలక్ట్రాన్‌లు నిండే ఆర్బిటాల్
జ‌: 3d
 

252. 3d - ఆర్బిటాల్‌లు అన్నీ నిండిన తర్వాత 4p - ఆర్బిటాల్‌లో చివరి ఎలక్ట్రాన్లు నిండే మూలకాలు
జ‌: Ga నుంచి Kr వరకు ఉన్న మూలకాలు
 

253. Rb నుంచి Xe వరకు ఉన్న 18 మూలకాల్లో వేలన్సీ ఎలక్ట్రాన్‌లు నిండే ఆర్బిటాల్‌లు
జ‌: 5s, 4d, 5p
 

254. లాంథనం నుంచి మెర్క్యూరీ వరకు ఉన్న వరుస మూలకాల్లోని వేలన్సీ ఎలక్ట్రాన్‌లు ఏ ఆర్బిటాల్‌లో నిండుతాయి?
జ‌: 4f, 5d
 

255. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ స్థితిజశక్తిని కింది ఏ సమీకరణం సూచిస్తుంది?
జ‌: 

256. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ గతిజశక్తిని సూచించే సమీకరణం
జ‌: 

257. కిందివాటిని జతపరచండి.
1. జె.జె. థామ్సన్                   A) ధన ధృవకిరణాలు
2. గోల్ట్‌స్టేయిన్                       B) న్యూట్రాన్‌ను కనుక్కోవడం
3. విలియం క్రూక్స్                   C) రుణ ధృవకిరణాలు
4. జేమ్స్ చాడ్విక్                    D) ఉత్సర్గనాళిక ప్రయోగాలు
జ‌: 1-c, 2-a, 3-d, 4-b
 

258. కిందివాటిని జతపరచండి.
1. ఎలక్ట్రాన్                                A) జేమ్స్ చాడ్విక్
2. ప్రోటాన్                                B) గోల్డ్‌స్టేయిన్
3. న్యూట్రాన్                              C) మోస్లే
4. పరమాణు సంఖ్య                       D) థామ్సన్
జ‌: 1-d, 2-b, 3-a, 4-c
 

259. కిందివాటిని జతపరచండి.

1. E = hν A) ష్రోడింగర్
2.   B) హైసన్‌బర్గ్
3.   C) మాక్స్‌ప్లాంక్
4. D) డీబ్రోలి

జ‌: 1-c, 2-d, 3-b, 4-a

260. 5 × 1014 Hz పౌనఃపున్యం ఉన్న ఒక మోల్ ఫోటాన్‌ల శక్తిని గణించండి.
జ‌: 199.51 KJ/mol
 

261. He+ మొదటి కక్ష్య శక్తిని గణించండి.
జ‌: -8.72 × 10-18 J

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌