• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం (Our Universe)

1. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరం
జ‌: ఖగోళ ప్రమాణం
 

2. ఒక ఖగోళ ప్రమాణం (1 AU) విలువ
జ‌: 1.496 × 1011 మీ.
 

3. ఒక కాంతి సంవత్సరం (Light Year) విలువ
A) 9.46 × 1015 మీ.              B) 9.46 × 1012 కి.మీ.
C) 6.33 × 104 AU                D) అన్నీ సరైనవే
జ‌: D(అన్నీ సరైనవే)
 

4. దూర ప్రమాణాల్లో పెద్దది
జ‌: పార్‌సెక్
 

5. ఒక పార్‌సెక్ విలువ
జ‌: 3.26 కాంతి సంవత్సరాలు
 

6. కాంతికిరణం ఒక సెకను కాలంలో ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది?
జ‌: 3
 

7. నక్షత్రాల్లో ఉండే వాయువులు
జ‌: H2, He
 

8. నక్షత్రాల్లో జరిగే రసాయన చర్యలు
జ‌: కేంద్రక మేళనం చర్యలు
 

9. ప్రస్తుతానికి గుర్తించిన నక్షత్ర మండలాల సంఖ్య
జ‌: 88
 

10. కిందివాటిలో నక్షత్ర మండలానికి ఉదాహరణలు
A) సిగ్నస్, కరోనా                        B) ఆర్సామైనర్, ఆర్సామేజర్
C) ఒరియాన్, బోరియాలిస్            D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

11. ధృవ నక్షత్రాన్ని, ధృవ నక్షత్ర స్థానాన్ని తెలుసుకోవడానికి సహాయపడే నక్షత్ర రాశులు ఏవి?
జ‌: సప్తర్షి మండలం, శర్మిష్ట రాశి
 

12. ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా ప్రయాణించే సూర్యుడి గమన మార్గాన్ని ఏమంటారు?
జ‌: ఎక్లిప్టిక్
 

13. సూర్యుడి గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టీ లేదా బెల్టు లాంటి భాగాన్ని ఏమంటారు?
జ‌: రాశి చక్రం
 

14. రాశి చక్రంలోని 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టారు. వీటిని ఏమంటారు?
జ‌: రాశి గుర్తులు
 

15. కిందివాటిలో రాశి గుర్తులకు ఉదాహరణ
A) మేషం, వృషభం             B) మిథునం, కర్కాటకం
C) మీనం, కుంభం              D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

16. సౌర కుటుంబంలో దేన్ని గ్రహంగా పరిగణించరు?
జ‌: ప్లూటో
 

17. కుజ గ్రహానికి మరో పేరు
జ‌: అంగారకుడు
 

18. రాత్రిళ్లు ఆకాశంలో నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా, స్థిరంగా ప్రకాశించే వస్తువులను గమనించవచ్చు. అవి ఏమిటి?
జ‌: గ్రహాలు
 

19. సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం తక్కువగా ఉన్న గ్రహం ఏది?
జ‌: బుధుడు
 

20. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమిపై ఏర్పడేవి?
జ‌: రుతువులు
 

21. భూ ఆత్మభ్రమణం వల్ల ఏర్పడేవి
జ‌: రాత్రి, పగలు
 

22. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
జ‌: బుధుడు
 

23. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది?
జ‌: బుధుడు
 

24. బుధ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య
జ‌: 0
 

25. గ్రహాలన్నింటిలో భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
జ‌: శుక్రుడు
 

26. మనకు కనిపించే ప్రకాశవంతమైన గ్రహం ఏది?
జ‌: శుక్రుడు
 

27. వేగుచుక్క (Morning Star) ఏది?
జ‌: శుక్రుడు
 

28. సాయంకాల చుక్క (Evening Star) అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
జ‌: శుక్రుడు
 

29. ఉపగ్రహాలు లేని గ్రహం ఏది?
జ‌: బుధుడు, శుక్రుడు
 

30. జీవరాశి ఉన్న గ్రహం ఏది?
జ‌: భూమి
 

31. సౌర కుటుంబంలో నీలి ఆకుపచ్చ రంగులో ఉన్న గ్రహం ఏది?
జ‌: భూమి
 

32. భూమికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య ఎంత?
జ‌: 1
 

33. భూమి వ్యాసం ఎంత?
జ‌: 12,756 కి.మీ.
 

34. భూమి ద్రవ్యరాశి సుమారుగా
జ‌: 5.98 × 1024 కి.గ్రా
 

35. సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరం ఎంత? 
జ‌: 15 కోట్ల కి.మీ.
 

36. భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరం
జ‌: 3,84,399 కి.మీ.
 

37. సౌర కుటుంబంలో భూకక్ష్యకు బయటివైపు ఉన్న గ్రహాల్లో మొదటిది
జ‌: అంగారకుడు
 

38. సౌర కుటుంబంలో 'అరుణ గ్రహం'గా వ్యవహరించే గ్రహం ఏది?
జ‌: కుజుడు
 

39. అంగారకుడికి ఉన్న సహజ ఉపగ్రహాల సంఖ్య
జ‌: 2
 

40. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?
జ‌: బృహస్పతి
 

41. భూమి పరిమాణంతో పోల్చితే బృహస్పతి పరిమాణం ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది?
జ‌: 1303
 

42. భూమి ద్రవ్యరాశితో పోల్చితే గురు గ్రహం ద్రవ్యరాశి ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది?
జ‌: 318
 

43. సౌర కుటుంబంలో అతి అందమైన గ్రహం
జ‌: శని
 

44. శుక్ర గ్రహం ఆత్మభ్రమణ దిశ
జ‌: తూర్పు నుంచి పడమరకు
 

45. కిందివాటిలో తూర్పు నుంచి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహం ఏది?
A) శని             B) యురేనస్             C) నెప్ట్యూన్           D) భూమి
జ‌: B(యురేనస్)
 

46. కిందివాటిలో అంతర గ్రహం కానిది?
A) భూమి         B) బుధుడు              C) శుక్రుడు           D) గురుడు
జ‌: D(గురుడు)
 

47. కిందివాటిలో అంతర గ్రహం ఏది?
A) అంగారకుడు      B) గురుడు          C) నెప్ట్యూన్            D) శని
జ‌: A(అంగారకుడు)
 

48. కిందివాటిలో బాహ్య గ్రహం కానిది ఏది?
జ‌: భూమి
 

49. కిందివాటిలో బాహ్యగ్రహం ఏది?
A) బృహస్పతి          B) శని              C) యురేనస్            D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

50. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలు ఏవి?
జ‌: అంతర గ్రహాలు
 

51. సూర్యుడికి అత్యంత దూరంలో ఉండే గ్రహాలు
జ‌: బాహ్య గ్రహాలు
 

52. కిందివాటిలో ఏ గ్రహాలకు ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ?
A) అంతర గ్రహాలు                   B) బాహ్య గ్రహాలు
C) అంతర, బాహ్య గ్రహాలు           D) ఏదీకాదు
జ‌: B(బాహ్య గ్రహాలు)
 

53. భూమితో పోల్చితే తక్కువ పరిమాణం ఉన్న గ్రహం ఏది?
జ‌: కుజుడు
 

54. భూమితో పోల్చితే తక్కువ పరిమాణం ఉన్న గ్రహం ఏది?
A) బుధుడు              B) శుక్రుడు          C) కుజుడు              D) అన్నీ
జ‌: D(అన్నీ)
 

55. భూమితో పోల్చితే ఎక్కువ పరిమాణం ఉన్న గ్రహం ఏది?
జ‌: నెప్ట్యూన్
 

56. భూమితో పోల్చితే శని గ్రహం పరిమాణం ఎన్ని రెట్లు ఎక్కువ?
జ‌: 736
 

57. భూవ్యాసంతో పోల్చినప్పుడు బుధ గ్రహం వ్యాసం ఎన్ని రెట్లు ఎక్కువ?
జ‌: 0.38
 

58. భూ వ్యాసార్ధంతో పోల్చినప్పుడు బృహస్పతి వ్యాసం ఎన్ని రెట్లు ఎక్కువ?
జ‌: 11.19
 

59. భూవ్యాసంతో పోల్చినప్పుడు కుజ గ్రహం వ్యాసం ఎన్ని రెట్లు ఎక్కువ?
జ‌: 0.53
 

60. భూమితో పోల్చితే శని గ్రహం వ్యాసం ఎన్ని రెట్లు ఎక్కువ?
జ‌: 9.40
 

61. బుధ గ్రహం ద్రవ్యరాశి 
జ‌: 3.28 × 1023 కి.గ్రా.
 

62. సూర్యుడి నుంచి అతి తక్కువ దూరంలో ఉన్న గ్రహం ఏది?
జ‌: బుధుడు
 

63. సూర్యుడి నుంచి బుధ గ్రహానికి ఉన్న దూరం
జ‌: 5.79 కోట్ల కిలోమీటర్లు
 

64. సూర్యుడి నుంచి శుక్రుడికి ఉన్న దూరం (కోట్ల కి.మీ.లలో)
జ‌: 10.8
 

65. సూర్యుడి నుంచి నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న దూరం ఎంత?
జ‌: 449.7 కోట్ల కి.మీ.
 

66. బుధ గ్రహ పరిభ్రమణ కాలం
జ‌: 88 రోజులు
 

67. శుక్ర గ్రహం పరిభ్రమణ కాలం
జ‌: 225 రోజులు
 

68. భూమి పరిభ్రమణ కాలం
జ‌: 365 రోజులు
 

69. కుజ గ్రహం పరిభ్రమణ కాలం
జ‌: 687 రోజులు
 

70. శని గ్రహం పరిభ్రమణ కాలం
జ‌: 29 సంవత్సరాలు
 

71. సౌర కుటుంబంలో అత్యధిక పరిభ్రమణ కాలం ఉన్న గ్రహం ఏది?
జ‌: నెప్ట్యూన్
 

72. కిందివాటిని జతపరచండి.
గ్రహాలు              ఉపగ్రహాల సంఖ్య
1. కుజుడు               a) 53
2. శని                    b) 27
3. యురేనస్            c)13
4. నెప్ట్యూన్              d) 2
జ‌: C(1 - d, 2 - a, 3 - b, 4 - c)
 

73. 2006 సంవత్సరంలో అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య 'తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించకూడదు అనే నియమాన్ని ఉల్లంఘించిన కారణంగా ఒక గ్రహానికి దాని హోదాను తొలగించారు. ఆ గ్రహం ఏమిటి?
జ‌: ప్లూటో
 

74. ఆస్టరాయిడ్లు ఏయే గ్రహాల కక్ష్యల మధ్య పరిభ్రమిస్తున్నాయి?
జ‌: కుజుడు, బృహస్పతి
 

75. భూమిపై పడే ఉల్కలను ఏమంటారు?
జ‌: ఉల్కాపాతం
 

76. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది?
జ‌: 76
 

77. హేలీ తోకచుక్క తిరిగి ఎప్పుడు మనకు కనిపిస్తుంది?
జ‌: 2062
 

78. 1994 వ సంవత్సరంలో బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టిన తోకచుక్క ఏది?
జ‌: షూమేకర్ - లేవి - 9 తోకచుక్క
 

79. సౌర కుటుంబంలో భూమి కాకుండా మరో గ్రహంపైనా జీవం ఉండటానికి అనుకూల పరిస్థితులున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గ్రహం ఏది?
జ‌: కుజుడు
 

80. భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఏది?
జ‌: ఆర్యభట్ట
 

81. భారతదేశం చంద్రుడి పైకి 'చంద్రయాన్ - 1' ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో పంపింది?
జ‌: 2008 అక్టోబరు 22
 

82. భూపటలం మందం మహాసముద్రాల కింద ఎంత ఉంది?
జ‌: 5 - 12 కి.మీ.
 

83. భూఖండాల కింద భూపటలం (Crust) మందం ఎంత?
జ‌: 35 - 60 కి.మీ.
 

84. భూపటలం (Crust) ఎన్ని రకాల శిలలను కలిగి ఉంది?
జ‌: 3
 

85. మహాసముద్రాల కింద అడుగు భాగంలో ఉన్న శిలలు ఏవి?
జ‌: బసాల్ట్
 

86. భూపటలానికి, కేంద్రానికి మధ్య ఉన్న పొర మందం ఎంత?
జ‌: 2900 కి.మీ.
 

87. భ్రూప్రావారం (Mantle) లో ఎక్కువ భాగం ఏ ఖనిజం ఉంది?
జ‌: ఇనుము, మెగ్నీషియం, సిలికేట్లు
 

88. భూఅంతర కేంద్ర మండలం వ్యాసం
జ‌: 2600 కి.మీ.
 

89. భూ కేంద్ర మండలం ఉష్ణోగ్రత
జ‌: 6000 °C
 

90. భూ అంతరకేంద్ర మండలంలో పూర్తిగా ఏ ఖనిజం నిక్షిప్తమై ఉంది?
జ‌: Fe
 

91. బాహ్య కేంద్ర మండలం మందం
జ‌: 2300 కి.మీ.
 

92. భూమి సాంద్రత
జ‌: 5.5 గ్రా./సి.సి.
 

93. భూపటలం నుంచి మానవుడు వినియోగిస్తున్న శిలల సరాసరి సాంద్రత
జ‌: 2.8 గ్రా./సి.సి
 

94. అగ్ని పర్వతాల నుంచి వెలువడే వాయువులు
జ‌: నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, క్లోరిన్
 

95. భూఅంతర్భాగంలోని శిలా ద్రవాన్ని ఏమంటారు?
జ‌: మాగ్మా
 

96. మాగ్మా ఉష్ణోగ్రత
జ‌: 600 ºC నుంచి 1200 ºC
 

97. భూగర్భంలోకి లోతుగా పోయేకొద్దీ పీడనం, ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారుతాయి?
జ‌: పీడనం, ఉష్ణోగ్రత రెండూ పెరుగుతాయి
 

98. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ‌: డార్విన్
 

99. పూర్వ జీవుల శిథిల శిలా రూపాన్ని ఏమంటారు?
జ‌: శిలాజం
 

100. భూమిపై మొదటి జీవం ఎన్ని సంవత్సరాలకు పూర్వం నీటిలో ఏర్పడింది?
జ‌: 3.5 బిలియన్లు
 

101. సూర్యుడి చుట్టూ గ్రహాల్లా తిరిగే వస్తువులను ఏమని పిలుస్తారు?
జ‌: ఆస్టరాయిడ్స్
 

102. ధృవ నక్షత్ర స్థానం భూమికి సాపేక్షంగా మారకుండా ఉండటానికి కారణం ఏమిటి? 
‌జ‌: అది భూమి భ్రమణాక్షంపై ఉంది
 

103. బయటి అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడే వస్తువును ఏమంటారు?
జ‌: ఉల్కాపాతం
 

104. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడానికి కారణమైన బలం
జ‌: గురుత్వాకర్షణ
 

105. ఒక నక్షత్ర వర్ణం కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
జ‌: ఉష్ణోగ్రత
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌