• facebook
  • whatsapp
  • telegram

కొలతలు, ప్రమాణాలు, మితులు

1. తెలియని వస్తు పరిమాణాన్ని తెలిసిన ప్రామాణిక ప్రమాణంతో పోల్చడాన్ని ఏమంటారు?
జ‌: కొలత
 

2. భౌతిక ప్రకృతిని, విశ్వాన్ని వర్ణించేది
జ‌: భౌతికశాస్త్రం
 

3. కిందివాటిలో మూలరాశి ఏది?
A) పొడవు               B) ద్రవ్యరాశి                    C) కాలం               D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

4. కిందివాటిలో మూలరాశి కానిది?
A) కాలం                 B) వేగం                      C) ద్రవ్యరాశి               D) పొడవు
జ‌: C (ద్రవ్యరాశి)
 

5. కిందివాటిలో ఉత్పన్నరాశి ఏది?
A) కాలం                B) ద్రవ్యరాశి               C) ఘనపరిమాణం        D) పొడవు
జ‌: C (ఘనపరిమాణం)
 

6. కిందివాటిలో ఉత్పన్న రాశులు ఏవి?
A) వైశాల్యం, ఘనపరిమాణం        B) సాంద్రత, వేగం
C) బలం, వైశాల్యం                       D) పొడవు, ద్రవ్యరాశి
జ‌: D (పొడవు, ద్రవ్యరాశి)
 

7. కిందివాటిలో ఉత్పన్నరాశి కానిది?
A) బలం      B) సాంద్రత         C) ద్రవ్యరాశి         D) వైశాల్యం
జ‌: C (ద్రవ్యరాశి)
 

8. పొడవును సెంటీ మీటర్లలో, ద్రవ్యరాశిని గ్రాముల్లో, కాలాన్ని సెకండ్లలో కొలిచే పద్ధతి ఏది?
జ‌: C.G.S.
 

9. మూలరాశుల ప్రమాణాలను ఏమంటారు?
జ‌: మూల ప్రమాణాలు
 

10. బ్రిటిష్ పద్ధతిగా వ్యవహరించేది?
జ‌: F.P.S.
 

11. F.P.S. పద్ధతిలో ద్రవ్యరాశికి మూలప్రమాణం ఏది?
జ‌: పౌండ్
 

12. ఉష్ణోగ్రతకు S.I. పద్ధతిలో ప్రమాణం
జ‌: కెల్విన్
 

13. ఒక సెకన్‌లోని 299,792,458వ వంతు కాలవ్యవధిలో శూన్యంలో కాంతి ప్రయాణించే పథం పొడవును ఏమంటారు?
జ‌: మీటర్
 

14. కాంతి ఉద్దీపన తీవ్రతకు S.I. పద్ధతిలో ప్రమాణాలు
జ‌: కాండెలా
 

15. సీజియం (Cs -133) పరమాణువు 9,192,631,770 కంపనాలు చేయడానికి పట్టేకాలాన్ని ఏమంటారు?
జ‌: సెకను
 

16. 10-3 m నుంచి 102 m వరకు ఉండే పొడవులను కొలవడానికి ఉపయోగించే సాధనం
జ‌: స్కేలు
 

17. 10-4 m యథార్థత వరకు పొడవులను దేని సహాయంతో కొలవవచ్చు?
జ‌: వెర్నియర్ కాలిపర్స్
 

18. 10-5 m యథార్థత వరకు పొడవులను దేని సహాయంతో కొలవవచ్చు?
జ‌: స్క్రూగేజి, స్పైరోమీటర్
 

19. స్కేలును ఉపయోగించి కొలవగల అతి చిన్న కొలత ఏది?
జ‌: మిల్లీమీటరు
 

20. మీటరు స్కేలు కనీసపు కొలత
జ‌: 1 మి.మీ.
 

21. చేతి గడియారం కనీసపు కొలత
జ‌: 1 సెకను
 

22. ఒక మాధ్యమిక సౌరదినం =
జ‌: 86400 సెకన్‌లు
 

23. అన్ని పద్ధతుల్లో కాలానికి ప్రమాణం
జ‌: సెకను
 

24. అత్యంత కచ్చితంగా కాలాన్ని కొలిచే సాధనం
జ‌: నీటి గడియారం
 

25. కాలాన్ని కొలిచే గడియారాలను దేని ఆధారంగా రూపొందించారు?
జ‌: వస్తువుల ఆవర్తన చలనం
 

26. వెర్నియర్ కాలిపర్స్‌ను రూపొందించిన శాస్త్రజ్ఞుడు
జ‌: పాల్ వెర్నియర్
 

27. వెర్నియర్ సూత్రం ప్రకారం
  A) (N - 1)S = NV     B) N(S - V) = S
  C)          D) అన్నీ
జ‌: D (అన్నీ)

28. వెర్నియర్ కాలిపర్స్‌లో N వెర్నియర్ స్కేలు విభాగాలు ఏకీభవించే ప్రధాన స్కేలు విభాగాల సంఖ్య
జ‌: (N - 1)
 

29. వెర్నియర్ విభాగపు విలువ 'V', ప్రధాన స్కేలు విభాగపు విలువ 'S' అయితే
జ‌: V < S
 

30. ప్రధాన స్కేలు అంచుతోపాటు కదిలే స్కేలు
జ‌: వెర్నియర్ స్కేలు
 

31. వస్తువుల వ్యాసాలను కొలిచే యాంత్రిక వ్యవస్థ
జ‌: వెర్నియర్ కాలిపర్స్
 

32. వెర్నియర్ కాలిపర్స్ కనీసపు కొలత ఎంత?
జ‌: 0.1 mm
 

33. 1 MSD - 1 VSD =
జ‌: 

34. వెర్నియర్ కాలిపర్స్ కనీసపు కొలత =
జ‌: 

35. వెర్నియర్ కాలిపర్స్ ద్వారా వస్తువు పొడవును కొలిచేటప్పుడు ఉపయోగించే ఫార్ములా
జ‌: M.S.R + (V.C.D × L.C)
 

36. వెర్నియర్ కాలిపర్స్‌లో J1, J2 దవడలను ఏమంటారు?
జ‌: పొడుగు దవడలు
 

37. వెర్నియర్ కాలిపర్స్‌లో అంతర దవడలు
జ‌: J3, J4
 

38. వెర్నియర్ కాలిపర్స్‌లో స్థిర దవడలు
జ‌: J1, J3
 

39. వెర్నియర్ కాలిపర్స్‌లో J2, J4 దవడలను ఏమంటారు?
జ‌: కదిలే దవడలు
 

40. స్థూపకారపు గొట్టం లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి వెర్నియర్ కాలిపర్స్‌లో ఉపయోగించే దవడలు
జ‌: J3, J4
 

41. బోలుగా ఉండే వస్తువుల లోపలి వ్యాసాలను కొలిచే వెర్నియర్ కాలిపర్స్ భాగం
జ‌: పొడవైన పలుచని బద్ద
 

42. ప్రధానస్కేలు శూన్య విభాగానికి కుడివైపున వెర్నియర్ శూన్య విభాగం ఉంటే ఆ దోషం
జ‌: ధనాత్మకం
 

43. ప్రధానస్కేలు శూన్య విభాగానికి ఎడమవైపున వెర్నియర్ శూన్య విభాగం ఉంటే ఆ దోషం
జ‌: రుణాత్మకం
 

44. పరిశీలించాల్సిన విభాగాన్ని నిట్టనిలువుగా గమనించినప్పుడు ఏర్పడే దోషం
జ‌: పారలాక్స్ దోషం
 

45. వెర్నియర్ కనీసపు కొలత 0.05 మి.మీ., ప్రధానస్కేలును మి.మీ.లలో విభజిస్తే
జ‌: 19 M.S.D = 20 V.S.D
 

46. ఒక పరికరం ప్రధానస్కేలుపై ఒక సెం.మీ.కు 20 విభాగాలు ఉన్నాయి. అయితే 24 ప్రధానస్కేలు విభాగాలు 25 వెర్నియర్ విభాగాలతో ఏకీభవిస్తే కనీసపు కొలత ఎంత?
జ‌: 0.002 సెం.మీ.
 

47. వెర్నియర్ శూన్య విభాగం 1.8 సెం.మీ., 1.9 సెం.మీ. మధ్య ఉంటే ప్రధానస్కేలు రీడింగు ఎంత?
జ‌: 1.8 సెం.మీ.
 

48. ఒక వెర్నియర్ కాలిపర్స్‌లో 20 వెర్నియర్ స్కేలు విభాగాలున్నాయి. ప్రధానస్కేలు మీద ఒక సెంటీమీటరును 20 సమాన భాగాలుగా చేశారు. అయితే వెర్నియర్ కనీసపు కొలతను కనుక్కోండి.
జ‌: 0.0025 సెం.మీ.
 

49. వెర్నియర్ కాలిపర్స్‌ను ఉపయోగించి, చాక్‌పీస్ (సుద్దముక్క) పొడవును కొలిచేటప్పుడు ప్రధానస్కేలు రీడింగు 4.6 సెం.మీ., ఏకీభవించే వెర్నియర్ విభాగం 6 గా ఉంది. వెర్నియర్ కనీసపు కొలత 0.01 సెం.మీ., శూన్యాంశ దోషం -0.02 సెం.మీ.గా ఉంటే సుద్దముక్క పొడవును లెక్కించండి.
జ‌: 4.68 సెం.మీ.
 

50. ఒక వెర్నియర్ కాలిపర్సులో ప్రధాన స్కేలును మి.మీ.లలో విభజించారు. 49 ప్రధానస్కేలు విభాగాలు 50 వెర్నియర్ స్కేలు విభాగాలతో ఏకీభవిస్తే కనీసపు కొలత ఎంత?
జ‌: 0.01 మి.మీ.

51. ఒక వెర్నియర్ కాలిపర్సు ప్రధాన స్కేలును మి.మీ.లలో విభజించారు. 10 వెర్నియర్ స్కేలు విభాగాలు 9 ప్రధాన స్కేలు విభాగాలతో ఏకీభవిస్తే కనీసపు కొలతను కనుక్కోండి.
జ‌: 0.1 మి.మీ.
 

52. ప్రధాన స్కేలుపై ఒక అంగుళాన్ని 16 సమాన భాగాలుగా విభజించారు. 7 ప్రధాన స్కేలు విభాగాలను 8 వెర్నియర్ స్కేలు విభాగాలుగా విభజించారు. అయితే కనీసపు కొలత ఎంత?
జ‌: 

53. స్క్రూగేజి ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
జ‌: మరసీల, నట్టు
 

54. మరసీలపై రెండు వరుస నూళ్ల మధ్య దూరం
జ‌: మరభ్రమణాంతరం
 

55. ఒక పూర్తిభ్రమణానికి మరసీల కదిలిన దూరం
జ‌: మరసీల పిచ్
 

56. మరభ్రమణాంతరం =
జ‌:  

57. స్క్రూగేజి కనీసపు కొలత
జ‌: 

58. స్క్రూగేజిలో తీగ వ్యాసం =
జ‌: P.S.R + (C.H.S.R × L.C)
 

59. స్క్రూగేజి సూచీరేఖ వెంట గుర్తించే స్కేలు
జ‌: పిచ్‌స్కేలు
 

60. స్క్రూగేజిలో మరసీలపై ఏటవాలుగా ఉన్న కవచంపై ఉండే స్కేలు
జ‌: తలస్కేలు
 

61. తలస్కేలు శూన్య విభాగం సూచీరేఖకు దిగువన ఉంటే కలిగే శూన్యాంశ దోషం
జ‌: ధన శూన్యాంశ దోషం
 

62. తలస్కేలు శూన్య విభాగం సూచీరేఖకు ఎగువన ఉంటే కలిగే శూన్యాంశ దోషం
జ‌: రుణ శూన్యాంశ దోషం
 

63. స్క్రూగేజి కనీసపు కొలత
జ‌: తలస్కేలుపై ఉండే ఒక విభాగపు భ్రమణానికి మర ప్రయాణించే దూరం
 

64. స్క్రూగేజిలో తలస్కేలు శూన్య విభాగం పిచ్‌స్కేలు సూచీరేఖతో ఏకీభవిస్తే శూన్యాంశ దోషం
జ‌: శూన్యం

65. మరసీల n భ్రమణాలు చేస్తే, మర కదిలిన దూరం x. అయితే మరభ్రమణాంతరం P =
జ‌: 

66. మరభ్రమణాంతరం P తలస్కేలు విభాగాల సంఖ్య N అయితే కనీసపు కొలత LC =
జ‌: 

67. -0.004 సెం.మీ. దోషం ఉన్న స్క్రూగేజి కనీసపు కొలత
జ‌: 0.001 సెం.మీ.
 

68. కనీసపుకొలత 0.01 మి.మీ., శూన్యాంశ దోషం ఉన్న స్క్రూగేజిలో సూచీరేఖకు దిగువన 4 విభాగాలు ఉంటే సవరణ
జ‌: -0.04 మి.మీ.
 

69. కనీసపుకొలత 0.001 సెం.మీ., శూన్యాంశ దోషం ఉన్న స్క్రూగేజిలో సూచీరేఖకు ఎగువన 2 విభాగాలు ఉంటే సవరణ
జ‌: +0.002 సెం.మీ.
 

70. మరభ్రమణాంతరం ఒక మి.మీ., తలస్కేలు మీది విభాగాల సంఖ్య 100 గల ఒక స్క్రూగేజిని ఉపయోగించి కొలవగలిగే అతి తక్కువ కొలత?
జ‌: 0.001 సెం.మీ.
 

71. స్క్రూగేజి కనీసపు కొలత ఎంత?
జ‌: 0.001 సెం.మీ.
 

72. లోహపు స్థూపాకార గొట్టంపైన 10 మి.మీ. పొడవును 10 సమాన భాగాలుగా చేస్తే స్క్రూగేజి మరభ్రమణాంతరం
జ‌: 1 మి.మీ.
 

73. కిందివాటిలో సునిశితత్వాన్ని ఎక్కువగా పెంచే పరికరం
A) సాధారణ స్కేలు       B) టేపు     C) వెర్నియర్ కాలిపర్స్        D) స్క్రూగేజి
జ‌: D (స్క్రూగేజి)
 

74. ఒక స్క్రూగేజి తలను 50 విభాగాలుగా విభజించారు. స్క్రూను రెండు భ్రమణాలు తిప్పినప్పుడు అది ఒక మిల్లీమీటర్ ప్రయాణించింది. అయితే కనీసపు కొలతను కనుక్కోండి.
జ‌: 0.01 మి.మీ.
 

75. స్క్రూగేజి మరపై ఒక సెం.మీ.కు 20 నూళ్లు ఉన్నాయి. మరతల 100 విభాగాలు కలిగిన కనీసపు కొలత
జ‌: 0.05 మీ.
 

76. స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.5 మి.మీ., తలస్కేలుపై 100 విభాగాలను కలిగి ఉంటే దాని కనీసపు కొలత ఎంత?
జ‌: 0.005 మి.మీ.
 

77. స్క్రూగేజిలో ఒక సీసపు గుండు వ్యాసాన్ని కొలుస్తున్నప్పుడు దాని పిచ్‌స్కేలు రీడింగు 7.5 మి.మీ., తలస్కేలు రీడింగు 48గా ఉంది. కనీసపు కొలత 0.01 మి.మీ., శూన్యాంశ దోషం +0.05 మి.మీ. అయితే సీసపు గుండు వ్యాసాన్ని కనుక్కోండి.
జ‌: 7.93 మి.మీ.
 

78. హైడ్రోజన్ పరమాణు పరిమాణం
జ‌: 10-10 మీ.
 

79. ఎర్రరక్త కణం పరిమాణం
జ‌: 10-5 మీ.
 

80. ఎవరెస్టు శిఖరం ఎత్తు (సముద్రమట్టం నుంచి)
జ‌: 104 మీ.
 

81. భూమి వ్యాసార్ధం
జ‌: 107 మీ.
 

82. భూమి నుంచి చంద్రుడి దూరం
జ‌: 108 మీ.
 

83. సూర్యుడి నుంచి ప్లూటోకు గల దూరం
జ‌: 1013 మీ.
 

84. గెలాక్సీ పరిమాణం
జ‌: 1021 మీ.
 

85. 1 ఫెర్మి =
జ‌: 10-15 మీ.
 

86. 1 ఆంగ్‌స్ట్రామ్ =
జ‌: 10-10 మీ.
 

87. ఒక కాంతి సంవత్సరం =
జ‌: 9.46 × 1015 మీ.
 

88. వక్రరేఖ పొడవును కొలవడానికి ఉపయోగించేది?
జ‌: స్కేలు, దారం
 

89. ఒక వస్తువు ద్వారా ఆవరించిన సమతలం కొలతను ఏమంటారు?
జ‌: వైశాల్యం

90. వైశాల్యానికి M.K.S. పద్ధతిలో ప్రమాణాలు
జ‌: చ.మీ.
 

91. 1 సెం.మీ2 =
జ‌: 10-4 మీ.2
 

92. అక్రమాకార ఆకు వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించేది
జ‌: గ్రాఫ్ కాగితం
 

93. ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని ఏమంటారు?
జ‌: ఘనపరిమాణం
 

94. ఒక ఘనం ఘనపరిమాణం =
జ‌: పొడవు × వెడల్పు × ఎత్తు
 

95. ఘనాకార వస్తువుల ఘనపరిమాణం
జ‌: ఘ.మీ.
 

96. 1 మీటరు3 =
జ‌: 106సెం.మీ.3
 

97. 10-6 మీ.3 =
జ‌: 1 సెం.మీ.3
 

98. 1 లీటరు =
జ‌: 1000 సెం.మీ.3
 

99. స్థిర ఘనపరిమాణం ఉన్న ద్రవాలను ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి మార్చడానికి ఉపయోగించేది
జ‌: పిప్పెట్టు
 

100. వస్తువులోని పదార్థ పరిమాణాన్ని తెలియజేసే భౌతికరాశి
జ‌: ద్రవ్యరాశి
 

101. 'దండం మధ్య ఆధార బిందువు నుంచి సమానదూరాల్లో సమాన ద్రవ్యరాశులను వేలాడదీస్తే అది క్షితిజ సమాంతరంగా ఉంటుంది' అనే సూత్రం ఆధారంగా రూపొందించిన ఉపకరణం ఏది?
జ‌: సాధారణ త్రాసు
 

102. వస్తువుల (పదార్థాల) ద్రవ్యరాశులను మిల్లీగ్రాము వరకు కచ్చితంగా కొలిచే త్రాసు
జ‌: ఎలక్ట్రానిక్ త్రాసు
 

103. పరమాణు, ఉప పరమాణు కణాల ద్రవ్యరాశులను కొలవడం కోసం దేన్ని ఉపయోగిస్తారు
జ‌: ద్రవ్యరాశి వర్ణపట గ్రాహకం
 

104. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి (కి.గ్రా. ల్లో)
జ‌: 10-30
 

105. ఎర్రరక్త కణం ద్రవ్యరాశి
జ‌: 10-13 కి.గ్రా.
 

106. దోమ ద్రవ్యరాశి
జ‌: 10-5 కి.గ్రా
 

107. బోయింగ్ - 747 విమానం ద్రవ్యరాశి
జ‌: 108 కి.గ్రా.
 

108. సూర్యుడి ద్రవ్యరాశి
జ‌: 1030 కి.గ్రా.
 

109. పదార్థ ద్రవ్యరాశి, దాని ఘనపరిమాణానికి మధ్య ఉండే నిష్పత్తిని ఏమంటారు?
జ‌: సాంద్రత
 

110. S.I. పద్ధతిలో సాంద్రతకు ప్రమాణం
జ‌: కి.గ్రామ్/మీ.3
 

111. సాంద్రత అనేది ఏ రాశి?
జ‌: ఉత్పన్నరాశి
 

112. సాంద్రతపై ఆధారపడే రాశులు
జ‌: ద్రవ్యరాశి, ఘనపరిమాణం
 

113. పదార్థ సాంద్రతకు, నీటిసాంద్రతకు మధ్య ఉండే నిష్పత్తిని ఏమంటారు?
జ‌: సాపేక్ష సాంద్రత , తారతమ్య సాంద్రత
 

114. ద్రవాల తారతమ్య సాంద్రతను నిర్ణయించడానికి ఉపయోగించేది
జ‌: పిప్పెట్టు
 

115. కిరోసిన్ తారతమ్య సాంద్రత
జ‌: 2.5
 

116. పాదరసం తారతమ్య సాంద్రత
జ‌: 2.5
 

117. బంగారం సాపేక్ష సాంద్రత
జ‌: 13.6

118. గాజు సాపేక్ష సాంద్రత
జ‌:
0.8
 

119. M.K.S. పద్ధతిలో నీటి సాంద్రత
జ‌: 0.8 × 103 కి.గ్రా./మీ.3
 

120. M.K.S. పద్ధతిలో (S.T.P వద్ద) గాలి సాంద్రత
జ‌: 1.29 కి.గ్రా./మీ.3
 

121. M.K.S. పద్ధతిలో (S.T.P వద్ద) హైడ్రోజన్ వాయువు సాంద్రత
జ‌: 8.9 × 10-2 కి.గ్రా./మీ.3
 

122. C.G.S. పద్ధతిలో రాగి సాంద్రత
జ‌: 8.9 గ్రా./సెం.మీ.3
 

123. ఒక వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని ఏమంటారు?
జ‌: భారం
 

124. వస్తువుల భారాన్ని కనుక్కోవడానికి ఉపయోగించేది
జ‌: స్ప్రింగ్ త్రాసు
 

125. వ్యక్తుల భారాలను కనుక్కోవడానికి వైద్యులు ఉపయోగించే త్రాసు
జ‌: సంపీడన స్ప్రింగ్ త్రాసు
 

126. అసమాన భుజాలతో, స్థిరమైన లేదా అస్థిరమైన ఆధారాలతో ఉండే తూని కోలలు ఏవి?
జ‌: రోమన్ స్టీలు యార్డు, డేనిష్ స్టీలు యార్డు
 

127. ఒక పరమాణువు ఉత్తేజిత స్థాయి జీవితకాలం
జ‌: 10-8 సెకన్‌లు
 

128. ధ్వని తరంగం ఆవర్తన కాలం
జ‌: 10-3 సెకన్‌లు
 

129. సూర్యుడి నుంచి భూమిని చేరడానికి కాంతికి పట్టేకాలం
జ‌: 102 సెకన్‌లు
 

130. కృత్రిమ ఉపగ్రహం ఆవర్తనకాలం
జ‌: 104 సెకన్‌లు
 

131. భూభ్రమణపు ఆవర్తన కాలం
జ‌: 105 సెకన్‌లు
 

132. ఏ పరమాణువు 9,192,631,770 కంపనాలు చేయడానికి పట్టే సమయాన్ని సెకనుగా తీసుకున్నారు?
జ‌: సీజియం
 

133. సెకండ్ల లోలకం డోలనావర్తనా కాలం
జ‌: 2 సెకన్లు
 

134. ఒక సెకండ్ల లోలకం పొడవు 100 సెం.మీ. లోలకం పొడవును మార్చి, డోలనావర్తనా కాలాన్ని ఒక సెకనుకు మారిస్తే దాని పొడవెంత?
జ‌: 25 సెం.మీ.
 

135. 70 సెం.మీ. పొడవున్న సామాన్య లోలకం 33.6 సెకండ్లలో 20 డోలనాలను చేస్తుంది. దాని పొడవును 80 సెం.మీ. చేస్తే, డోలనావర్తనా కాలాన్ని కనుక్కోండి.
జ‌: 1.8 సెకన్‌లు
 

136. విద్యుత్ ప్రవాహానికి మితి
జ‌: [A]

137. త్వరణానికి మితీయ ఫార్ములా
జ‌: [M0LT-2]
 

138. [L3] మితులు కలిగి ఉండే భౌతికరాశి ఏది
జ‌: ఘనపరిమాణం
 

139. [M][LT-2] మితులు కలిగి ఉన్న భౌతిక రాశి
జ‌: బలం
 

140. వైశాల్యం మితీయ ఫార్ములా
జ‌: [M0L2T0]
 

141. గతిజశక్తి  మితులు
జ‌: 

142. [ML2T-2] మితీయ ఫార్ములా ఉన్న భౌతికరాశి ఏది?
జ‌: స్థితిజశక్తి
 

143. [ML2T-2] మితీయ ఫార్ములా ఉన్న భౌతికరాశులు ఏవి?
జ‌: పని, శక్తి, బలభ్రామకం
 

144. విశ్వగురుత్వ స్థిరాంకం మితీయ ఫార్ములా
జ‌: [M-1L3T2]
 

145. కిందివాటిలో మితిరహిత స్థిరాంకాలు ఏవి?
A) కోణం, కోణీయ స్థానభ్రంశం      B) త్రికోణమితి నిష్పత్తి, వికృతి
C) దక్షత, వక్రీభవన గుణకం         D) అన్నీ
జ‌: D (అన్నీ)
 

146. కిందివాటిలో సదృశ్య భౌతికరాశులు
A) పని, టార్క్
B) కటక సామర్థ్యం, విఘటన స్థిరాంకం
C) నిరోధం, ప్రేరకత
D) కోణీయవేగం, జడత్వ భ్రామకం
జ‌: A (పని, టార్క్)
 

147. ప్రచోదనంలో కాలానికి మితి
జ‌: -1
 

148. త్వరణంలో పొడవు, కాలం మితులు వరుసగా
జ‌: 1, -2
 

149. వికృతి మితీయ ఫార్ములా
జ‌: [M0L0T0]

150. [ML2T-2] [T-1] మితులు ఉన్న స్థిరాంకం ఏది?
జ‌: ప్లాంక్ స్థిరాంకం 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌