• facebook
  • whatsapp
  • telegram

బోధనా పద్ధతులు, ఉపగమనాలు, మెలకువలు  

1. ప్రాచీన కాలంలో బోధన, అభ్యసన ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు?

జవాబు: ఉపాధ్యాయుడు

2. ఉత్తమమైన ప్రణాళిక, సరైన బోధనా పద్ధతులు సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటాయి అని పేర్కొన్నది?

జవాబు: డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్

3. మంచి బోధనా పద్ధతి లక్షణం ఏది?

1) విద్యార్థులకు ఆసక్తి కలిగించేది     2) సృజనాత్మక శక్తులను వెలికితీసేది    
3) వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలు ఇచ్చేది    4) పైవన్నీ
జవాబు: 4 (పైవన్నీ)

 

4. మేధోమథనం ఉపయోగం ఏమిటి?

1) కొత్త విషయాలను ఆలోచింపజేస్తుంది     2) ఆలోచనలను ఒక అంశంపై కేంద్రీకరింపచేస్తుంది.
3) విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవకాశం కల్పిస్తుంది.     4) పైవన్నీ

జవాబు: 4 (పైవన్నీ)

5. 'సింపోజియం' వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని అన్నదెవరు?

జవాబు: స్ట్రక్

6. వాగ్వాదం నిర్వహించేటప్పుడు సమన్వయకర్తగా (Moderator) వ్యవహరించేదెవరు?

జవాబు: ఉపాధ్యాయుడు

7. సామాజీకృత కథనం ఉద్దేశాలు తెలిపిన విద్యావేత్త ఎవరు?

జవాబు: హెరాల్డ్ బెంజిమెన్
 

8. బోధన సామాన్యంగా పిలిచే చర్యల వరుస క్రమంలోని లాంఛనమైన స్వరూపం అని నిర్వచించింది ఎవరు?

జవాబు: బ్రేడి

9. చర్చా పద్ధతిలో చర్చను నిర్వహించేటప్పుడు నాయకుడు ఎవరు?

జవాబు: ఉపాధ్యాయుడు

10. సాంఘీకృత ఉద్గార పద్ధతి రూపం ఏది?

జవాబు: సింపోజియం

11. సాంఘీకృత కథనంలో లేని సోపానం ఏది?

1) ప్రణాళిక       2) సంసిద్ధత         3) నిర్వహణ          4) నివేదిక

జవాబు: 2) సంసిద్ధత

12. చర్చాపద్ధతికి ఒక రూపాంతరంగా చెప్పే కృత్యం ఏది?

జవాబు: వక్తృత్వం

13. ఏ పద్ధతిని ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు?

జవాబు: చర్చ

14. సాంఘీకృత ఉద్గార పద్ధతి విజయవంతం కావడానికి దోహదపడే అంశం ఏది?

1) స్నేహపూరిత వాతావరణం     2) విద్యార్థుల మధ్య స్పర్థలు లేకుండా చూడటం.

3) విద్యార్థులపై నియంత్రణ ఉండటం     4) పైవన్నీ

జవాబు: 4 (పైవన్నీ)

15. ఆధునిక బోధన పద్ధతులకు మూలపురుషుడెవరు?

జవాబు: జాన్ అమోఘస్ కొమినియస్

16. ''మొత్తం నుంచి భాగాలకు వెళ్లడం" అనేది ఒక ....

జవాబు: నియమం

17. విద్యార్థులు అభ్యసనంలో క్రియాశీలురుగా, ఉత్సాహంగా, ఆసక్తితో పాల్గొనడానికి దోహదపడే పద్ధతి ఏది?

జవాబు: శిశు కేంద్రీకృత పద్ధతి

18. సామాజీకృత కథనాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే విధానం ఏది?

జవాబు: నియత, అనియత పద్ధతులు
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌