• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక, సామాజిక శాస్త్రాల మధ్య పోలికలు  

1. సమాజంలో వ్యక్తి కార్యకలాపాల గురించి తెలియజేసేది ఏది?
జ: సామాజిక శాస్త్రం

 

2. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రమేది?
జ: సాంఘిక శాస్త్రం

 

3. 'ఓకియోనామస్' అంటే-
జ: గృహనిర్వహణాధికారం

 

4. పరిసరాల విజ్ఞానం 1, 2 లను వేర్వేరుగా బోధించాలని పేర్కొంది
జ: ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ

 

5. 'హిస్టోరియా' అంటే అర్థమేమిటి?
జ: పరిశోధన, పరిశీలన

 

6. 'సివిటాస్' అనే పదం ఏ భాష నుంచి ఆవిర్భవించింది?
జ: లాటిన్

 

7. ప్రాథమిక స్థాయిలో సాంఘికశాస్త్రాన్ని సూక్ష్మంగా బోధించాలని పేర్కొంది
జ: కొఠారీ కమిషన్

 

8. పాఠ్యపుస్తకాల బరువును, ఇంటి పనిభారాన్ని తగ్గించాలని పేర్కొన్న కమిటీ ఏది?
జ: యశ్‌పాల్ కమిటీ

 

9. సాంఘికశాస్త్ర స్వభావం ఏమిటి?
జ: సాంకేతికపరమైన, మానవ సంబంధమైన, సాంఘికపరమైన

 

10. 6, 7 తరగతుల్లో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించింది-
జ: ఎన్.సి.ఎఫ్. 2005

 

11. ఏ విద్యా సంవత్సరం నుంచి పరిసరాల విజ్ఞానం-I, IIలను వేర్వేరుగా బోధిస్తున్నారు?
జ: 1979-80

 

12. ప్రస్తుతం 1-5 తరగతుల్లో సాంఘిక, సామాన్య శాస్త్రాలను ఏమని పిలుస్తున్నారు?
జ: పరిసరాల విజ్ఞానం

 

13. 'పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం' అని అన్నదెవరు?
జ: గాంధీజీ

 

14. 'మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి, రాబోయే తరాల వారికి అందించడం' అనేది
జ: పరిపోషిత వికాసాభివృద్ధి

 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌