• facebook
  • whatsapp
  • telegram

సామాజికశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు  

ఆశయం - నిర్వచనాలు 

* ''సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం చేరినా చేరకపోయినా నక్షత్రం అనేది అవసరం" - వెస్లీ
*''ఆశయం / ఉద్దేశం అనేది మన కళ్ల ముందు ఎప్పుడూ కనిపిస్తూ, మనకి దిశానిర్దేశం చేస్తూ, మనం చేసే ప్రతి పనినీ ప్రభావితపరుస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపేది" - జాన్‌డ్యూయి 

     ఏ పాఠ్య విషయానికైనా ఆశయాలు - లక్ష్యాలు ఉంటాయి. అందుకే ఏ విషయాన్నైతే విద్యార్థులకు బోధించాలనుకుంటామో అది ఎందుకు చేస్తున్నాం? ఎందుకు బోధించాలి? అనే విషయాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్దేశరహితమైన బోధన తెరచాప లేని నావ లాంటిది. విద్యార్థులకు సాంఘిక శాస్త్రాన్ని ఎందుకు బోధిస్తున్నామో తెలియకుండా బోధన జరిపితే దాని వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. ఆశయాలు మనం చేరుకోవడానికి అసాధ్యమైనవిగా, కష్టసాధ్యమైనవిగా కన్పించవచ్చు కానీ అవి నిరుపయోగమైనవి మాత్రం కావు. ఆశయం ఆదర్శవంతంగా ఉండి, కొన్ని తాత్విక లక్షణాలను కలిగి, దూరస్థంగా ఉంటుంది.

ఆశయం - భావన: 
     దిశను కల్పించే సాధారణ ప్రకటనే ఆశయం / ఉద్దేశం. ఆశయం అంటే ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయం. ఉద్దేశించిన ఆశయం మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది. ఆశయాలు విస్తృత పరిధిని కలిగి ఉండి, దీర్ఘకాలంలో సాధించడానికి వీలుగా ఉంటాయి.
* ప్రతీ దేశం తన విద్యావిధానానికి కొన్ని ఆశయాలను ఏర్పరచుకుంటుంది. సాంఘిక శాస్త్రం ఆ ఆశయాలను సాధించడానికి తోడ్పడుతుంది.

 

సాంఘికశాస్త్ర బోధనా ఆశయాలు:
* విద్యార్థుల్లో సామాజిక సమర్థతను పెంపొందించడం.
* వివేచన ఉన్న ప్రజాస్వామ్య పౌరసత్వ భావనను కలిగించడం.
* ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం.
* సాంఘిక, ఆర్థిక సంస్థల పట్ల అభిరుచిని కలిగించడం.
* సాంస్కృతిక వారసత్వ అభినందన.
* పరిసరాలతో పరిచయాన్ని ఏర్పరచడం.
* అంతర్జాతీయ అవగాహన.
* సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడం.
* విరామ కాలాన్ని సద్వినియోగం చేయడం.
* నాది అనే భావనను కలిగించడం.
* మానవ సంబంధాలను పెంపొందించడం.
* సాంఘిక, భౌతిక పరిసరాలను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని కలిగించడం.
* రాజకీయ, ఆధ్యాత్మిక దృక్పధాలపై సమగ్ర అవగాహన కలిగించడం.

 

విలువలు (Values)
     విలువ అనేది ఒక ఆలోచన, మానవ ప్రవర్తనలో వచ్చే మార్పు. ఇవి భావావేశ రంగానికి చెందినవి. వ్యక్తి ప్రవర్తనారీతుల్లో వచ్చే మార్పులనే విలువలు అంటారు.
* విలువలు అనేవి యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించే సూత్రాలు, ప్రమాణాలుగా పేర్కొనవచ్చు.
విలువలు - భావన: ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా వస్తువుకు గౌరవం, ప్రాధాన్యం, ఉపయోగం కలిగిస్తుందో అలాంటి 'గుణాన్ని' విలువ అంటారు.

 

విలువలు - నిర్వచనాలు
* విద్యా లక్ష్యాలే విద్యా విలువలు - కన్నింగ్‌హమ్
* వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు - J.S. బ్రూబేచర్
¤* ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న - ఐన్‌స్టీన్
¤* ఒక వస్తువు, ఒక సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, మంచితనం గురించి దృఢమైన నమ్మకమే విలువ - బాండ్
విలువలు - లక్షణాలు:
1. అమూర్తమైనవి (Abstract) 
2. అంతర్లీనమైనవి (Inherent)
3. సాపేక్షమైనవి (Relative)
4. ఆపాదించబడేవి (Attributed)
5. సమ్యత కలిగినవి (Flexible)

 

సాంఘికశాస్త్ర బోధనా విలువలు:
* బౌద్ధిక విలువలు.           * ఉపయోగితా విలువలు. 
* వృత్తి విలువలు.            * సాంస్కృతిక విలువలు.
* నైతిక విలువలు.            * సౌందర్యాత్మక విలువలు. 
* సృజనాత్మక విలువలు.      * క్రమశిక్షణ విలువలు. 
* శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి.      
* విరామ సమయం సద్వినియోగం చేసుకునే విలువలు.      

లక్ష్యాలు (Objectives) 

     విద్యార్థి ప్రవర్తనలో వాంఛనీయమైన ప్రవర్తనా మార్పును లక్ష్యం అంటారు. ఇది బోధన, అభ్యాసన గమ్యాన్ని సూచిస్తుంది. ఉద్దేశాలలో లక్ష్యాలు ఒక భాగం.
* ''విద్యావిధానం విద్యాలక్ష్యాలవైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును లక్ష్యం" అంటారు.

 

సాంఘిక శాస్త్ర బోధన - లక్ష్యాలు:
* దేశభక్తిని కలిగించడం.
* ఆదర్శ పౌరసత్వాన్ని పెంపొందించడం.
* లౌకిక భావాన్ని పెంపొందించడం.
* స్వీయ క్రమశిక్షణను పెంపొందించడం.
* శాసనాలు, న్యాయాలను గౌరవించడం.
* సాంఘిక దురాచారాల నిర్మూలనకు తోడ్పడటం.

 

లక్ష్యం - లక్షణాలు:
* మనోవిజ్ఞాన సిద్ధాంతాల ఆధారంగా సాధించడం జరుగుతుంది.
* అభ్యసన ఫలితాల్లో కనిపిస్తాయి.
* బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి.
* పాఠ్యాంశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
* తరగతి బోధన ద్వారా తరగతిలో సాధించడం జరుగుతుంది.
* ఆచరణ యోగ్యంగా ఉంటాయి.
* విద్యార్థి ప్రవర్తనామార్పుకు దోహదపడతాయి.


స్పష్టీకరణలు (Specifications) 

     విద్యార్థి నేర్చుకున్న సామర్థ్యాలను స్పష్టీకరణలు తెలియజేస్తాయి. ఉపాధ్యాయుడు తన బోధన తర్వాత విద్యార్థిలో లక్ష్యం నెరవేరింది, లేనిది తెలుసుకోవడానికి దోహదపడేది స్పష్టీకరణలే.
* విద్యార్థి మంచి అభ్యసనం కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలలో స్పష్టంగా పేర్కొనడాన్ని ''స్పష్టీకరణలు" అంటారు.

 

స్పష్టీకరణలు - లక్షణాలు:
* అభ్యసన ఫలితాలలో కనిపిస్తాయి.
* విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
* విద్యార్థి ప్రవర్తనా మార్పుకు దోహదపడతాయి.
* విద్యార్జనకు చెందిన వివిధ స్థాయుల్లో పనిచేస్తాయి.
* మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ప్రాతిపదికగా అభ్యసనకు తోడ్పడతాయి.

లక్ష్యాలు - స్పష్టీకరణలు:
* లక్ష్యాలు - స్పష్టీకరణలు, బోధన - అభ్యసనకు ప్రాణం లాంటివి.
* లక్ష్యాలు - స్పష్టీకరణలు ఒక నాణేనికి బొమ్మ - బొరుసు లాంటివి.
* లక్ష్యాలు - స్పష్టీకరణలు ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.
* విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను తీసుకు వచ్చి, విద్యార్థి వికాసానికి దోహదపడతాయి. కాబట్టి వీటిని 'ప్రవర్తనా లక్ష్యాలు' అంటారు.

 

ప్రవర్తనా లక్ష్యాలు
     ఉపాధ్యాయుడు తన బోధనల ద్వారా బోధనాలక్ష్యాన్ని సాధించినప్పుడు విద్యార్థుల్లో కొన్ని సామర్థ్యాలు పెంపొందుతాయి. ఫలితంగా విద్యార్థి ప్రవర్తనలో అంటే ఆలోచించే తీరులో, మాట్లాడే విధానంలో, పనిచేసే తీరులో, వైఖరుల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పులను పరివర్తన లేదా ప్రవర్తనా మార్పులు అంటారు. విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పులను ప్రవర్తనా లక్ష్యాలు తెలియజేస్తాయి.
* ఉదా: లౌకిక విధానం అనే పాఠ్యాంశం విన్న తర్వాత విద్యార్థి వివిధ మత పండుగల్లో ఆనందంగా పాలు పంచుకోవడం.
* అడవులు పాఠ్యాంశం విన్న తర్వాత పచ్చదనం - పరిశుభ్రత కోసం శ్రమించడం, గ్లోబల్‌వార్మింగ్ పట్ల తగుచర్యలు తీసుకోవడం మొదలైనవి.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌