• facebook
  • whatsapp
  • telegram

సామాజికశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు  

1. విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలిచేవి ఏవి?
జ: స్పష్టీకరణలు

 

2. విద్యార్థుల్లో అనుచిత ప్రవర్తనా మార్పులు తీసుకువచ్చి, విద్యార్థి వికాసానికి దోహదపడే అంశాలు ఏవి?
జ: లక్ష్యాలు - స్పష్టీకరణలు

 

3. సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత ఉన్న సంస్థ ఏది?
జ: పాఠశాల

 

4. 'ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయం' అని దేన్ని పిలుస్తారు?
జ: ఆశయం

 

5. విద్యావిధానం విద్యాలక్ష్యాలవైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయులను సూచించే బిందువును ఏమంటారు?
జ: లక్ష్యం

 

6. విద్య మానవుని శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేయాలని పేర్కొన్నది ఎవరు?
జ: ప్లేటో

 

7. సామాజిక సమర్థతను పెంపొందించడమనేది ఒక ....
జ: ఆశయం

 

8. సాంఘికశాస్త్ర బోధనా ఆశయం కానిది ఏది?
1) సామాజిక అర్హతను ఏర్పరచడం    2) సాంస్కృతిక వారసత్వ అభినందన
3) అంతర్జాతీయ అవగాహన             4) లౌకిక భావనను పెంపొందించడం
జ: లౌకిక భావనను పెంపొందించడం

 

9. నేటి సమాజంలో విలువల విలువ క్రమంగా తగ్గడానికి, దిగజారడానికి కారణం ఏది?
   1) ఆధునికీకరణం        2) పాశ్చాత్యీకరణం       3) నగరీకరణం        4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

10. నేడు అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడింది ఎవరు?
జ: కొఠారీ కమిషన్

 

11. విలువల లక్షణం ఏది?
    1) అంతర్లీనం        2) అమూర్తం       3) ఆపాదించడం        4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌