• facebook
  • whatsapp
  • telegram

బోధనాభ్యసన సామగ్రి  

* ఉపాధ్యాయులు పాఠ్యభాగ విషదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు    - కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి
* ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి, సరైన వ్యాఖ్యానానికి, తొందరగా, తేలికగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది.       - హుమయూన్‌ కబీర్‌
* ఒక వస్తువును లేదా ఉత్పత్తిని, దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చెబుతూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన.  - వెబ్‌స్టర్‌

 

బోధనాభ్యసన ఉపకరణాలు - ఉపయోగాలు
* విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచగలుగుతాయి.
* అభ్యసనం ఆకర్షణీయంగా మారుతుంది.
* పాఠ్య విషయానికి అదనంగా సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి.

 

బోధనోపకరణాల రకాలు
శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు

* కొంత మంది విద్యావేత్తలు ప్రశ్నించడాన్ని ఒక శ్రవ్య బోధనోపకరణంగా భావిస్తారు.
     1) రేడియో
     2) టేపురికార్డర్‌
     3) సీడీ/డీవీడీ ప్లేయర్‌
     4) సెల్‌ఫోన్లు 
     5) సంగీత వాయిద్యాలు
* విద్యార్థుల్లో అవధాన శక్తిని పెంచడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందించే అవకాశం ఉన్న బోధనోపకరణం రేడియో.
* గ్రామఫోన్‌ స్థానాన్ని ప్రస్తుతం టేప్‌రికార్డర్‌ ఆక్రమించింది.
* ఉచ్చారణ దోషాలను సవరించుకోవడానికి తోడ్పడే బోధనోపకరణం టేప్‌రికార్డర్‌.
* టేప్‌రికార్డర్‌ ప్రాధాన్యం తగ్గాక సీడీ ప్లేయర్, డీవీడీ ప్లేయర్‌ దాని స్థానాన్ని ఆక్రమించాయి. 

 

* త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపాధ్యాయుడే సేకరించుకోవాలి.
* సీసీఆర్‌టీ (సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ ) దిల్లీలో ఉంది.
* కంప్యూటర్‌కు అనుసంధానంగా ఉండే బోర్డు - ప్రతిస్పందించే బోర్డు/ ఎలక్ట్రానిక్‌ బోర్డ్‌/ ఇంటరాక్టివ్‌ వైట్‌బోర్డు.
* మన రాతను వెంటనే సరిదిద్దడమే కాకుండా బోర్డు మీద రాసిన ప్రశ్నలకు సమాధానాన్ని ప్రదర్శించేది  ప్రతిస్పందించే బోర్డు.  దీనిపై  లేజర్‌ పెన్‌తో రాస్తారు.
* నల్లబల్ల ఆవశ్యకతను నొక్కిచెప్పిన సంస్థ జిల్లా ప్రాథమిక విద్యా సంస్థ (డీపీఈపీ).
* దృశ్య ప్రసార యంత్రాలు ప్రొజెక్టర్స్‌.
* తెరమీద, తెల్లని గోడమీద చిత్రాలను ప్రదర్శించేవి ప్రొజెక్టర్స్‌.


 
* ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం టెలివిజన్‌.
* పాఠశాల పాఠ్యాంశాలను ప్రసారంచేసే ఛానెల్‌ మన టీవీ.
* పాఠ్యాంశాలను రూపొందించేది ఎస్‌ఐఈటీ. (స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ - రాష్ట్ర విద్యాసాంకేతిక సంస్థ)
* ఎన్‌ఐహెచ్‌ఏ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ హైవే అథారిటీ) - జాతీయ సమాచార రాజవీధి అధికార సంస్థ.
* ఎల్‌సీడీ - లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే
* సీడీ - కంపాక్ట్‌ డిస్క్‌
* భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి అనేక సెలగేమ్స్, పదబంధ ప్రహేళికలను సెల్‌ఫోన్స్‌లో ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్‌ సెల్‌ఎడ్యూ ప్రాజెక్ట్‌.


 

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌