• facebook
  • whatsapp
  • telegram

భాష - సమాజం  

* భాష అనే పదం సంస్కృత పదమైన ‘భాష్‌’ నుంచి వచ్చింది. ‘భాష్యతః ఇతి భాష’ అంటే భాష.
* ప్రపంచంలోని భాషల సంఖ్య 7000 కాగా భాషా శాస్త్రవేత్తల ప్రకారం 5000 రకాల భాషలు ఉన్నాయి.
* యునెస్కో అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో 2500 భాషలు అంతరించిపోనున్నాయి. కృత్రిమంగా సృష్టించిన భాషలు 200.
* ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష మాండరిన్ (1,213,000,000).
* ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడుతున్న భాషలు ఇండో యురోపియన్‌ కుటుంబానికి చెందినవి.
* భారతదేశంలో భాషా కుటుంబాలు రెండు
అవి: 1) ఇండో ఆర్యన్‌/హిందూ - ఆర్య భాషా కుటుంబం
     2) ద్రావిడ భాషా కుటుంబం
* ఉత్తర భారతదేశంలో భాషలు ఇండో ఆర్యన్‌ కుటుంబానికి చెందినవి కాగా దక్షిణ భారతదేశంలో ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి.
* ద్రావిడ భాషలు 23.

ద్రావిడ భాషా కుటుంబాలు మూడు
1) దక్షిణ ద్రావిడ భాషలు - 8
2) మధ్య ద్రావిడ భాషలు - 12
3) ఉత్తర ద్రావిడ భాషలు - 3
* తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. 
* గ్రియర్సన్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పది సంపుటాలను ప్రచురించారు.
* గ్రియర్సన్‌ లింగ్విస్టిక్‌ సర్వేను అనుసరించి భారతదేశంలోని భాషల సంఖ్య 175 లేదా 179, మాండలికాల సంఖ్య 54.
* 2001 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో ప్రధాన భాషలు 122, ఇతర భాషలు 1599.
* భారత్‌లో మాట్లాడుతున్న మాతృభాషల సంఖ్య 1365. ప్రభుత్వం గుర్తించిన మాతృభాషలు 234.

 

భాషా సాహిత్యం
* మన భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పేర్లు ఉన్నాయి.
* ఆంధ్రం అనే పదాన్ని మొదటిసారి ‘జాతి’ అనే పదంగా, రెండోసారి ‘దేశం’గా, మూడోసారి ‘భాష’గా ఉపయోగించారు. 
* హితాన్ని కూర్చేది అనే అర్థాన్నిచ్చే పదం ‘సాహిత్యం’.
* సమాన ధర్మాలు గల విశిష్ట కాలాన్ని యుగం అంటారు. తెలుగు యుగాన్ని పోషించిన రాజులను బట్టి కవి ఆరుద్ర యుగాలను 12గా విభజించారు. 
* సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ఆరుద్ర రచించారు.

 

ఆరుద్ర - సాహిత్య విభజన
     1) చాణక్య యుగం
     2) కాకతీయ యుగం
     3) పద్మనాయక యుగం
     4) రెడ్డి రాజుల యుగం
     5) తొలి రాయల యుగం
     6) మలి రాయల యుగం
     7) నవాబుల యుగం
     8) నాయకరాజుల యుగం
     9) కడపటిరాజుల యుగం
     10) కుంపిని యుగం
     11) జమీందారి యుగం
     12) ఆధునిక యుగం

 

పింగళి లక్ష్మీకాంతం వర్గీకరణ
మహాకవుల ప్రాధాన్యాన్ని బట్టి తెలుగు సాహిత్యాన్ని పింగళి లక్ష్మీకాంతం పది యుగాలుగా వర్గీకరించారు. 
     1) ప్రాజ్ఞన్నయ యుగం        - క్రీ.పూ.200 - క్రీ.శ.1000
     2) నన్నయ యుగం           - 11వ శతాబ్దం
     3) శివకవి యుగం            - 12వ శతాబ్దం
     4) తిక్కన యుగం            - 13వ శతాబ్దం
     5) ఎర్రన యుగం              - 1300 - 1350
     6) శ్రీనాథయుగం              - 1350 - 1500
     7) రాయల యుగం            - 1500 - 1600
     8) నాయకరాజుల యుగం      - 1600 - 1775
     9) క్షీణయుగం                - 1775 - 1875
     10) ఆధునిక యుగం          - 1875 - ప్రస్తుతం
* ప్రపంచ కథానిక పోటీల్లో బహుమతి అందుకున్న ‘గాలివాన’ రచయిత పాలగుమ్మి పద్మరాజు.

 

జ్ఞానపీఠ అవార్డు అందుకున్న తెలుగు కావ్యాలు:
1) శ్రీమద్రామాయణ కల్పవృక్షం - విశ్వనాథ సత్యనారాయణ
2) విశ్వంభర - డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి
3) పాకుడు రాళ్లు - రావూరి భరద్వాజ
* ప్రాచీనకాలంలో తిక్కన, మధ్యయుగంలో వేమన, ఆధునిక యుగంలో గురజాడ మన కవిత్రయం - మన మహాకవులు అని పేర్కొన్నది శ్రీశ్రీ.

తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావాలు (అన్యదేశాలు):
* తమిళులు సౌరమానాన్ని, తెలుగువారు చంద్రమానాన్ని పాటిస్తారు.
* తెలుగు సంస్కృత భాష ప్రభావానికి లోనైంది.

 

ఉర్దూ భాష పదాలు:
     దర్యాప్తు, తకరారు, తుకడ, జమాన (జమచేసే)

 

ఆంగ్లభాష పదాలు
నిత్యావసర పదాలు:
కాఫీ, లైట్, స్విచ్, రోడ్డు, బస్సు, కారు, పెన్ను.
పరిపాలనా సంబంధ పదాలు: కోర్టు, ఆఫీసు, ఫైలు, ఆర్డర్‌.
సాంస్కృతిక పదాలు: ఫ్యాషన్, సినిమా, క్లబ్, రేడియో.
* తెలుగు అజంతా లేదా స్వరాంత భాష లేదా క్రియాంత భాష కోవకు చెందింది. డాక్టర్‌ అనే పదాన్ని డాకటరు, కలెక్టర్‌ను కలకటరు, గ్లాసును గలాసు అని మాట్లాడటాన్ని స్వరభక్తి అంటారు.

 

భాష లక్షణాలు:
    1) సామాజికం
    2) అర్థవంతం
    3) సాంకేతికం
    4) పరిణామశీలి/గతిశీలత

 

మానవ భాష లక్షణాలు 
    1) నిర్మాణ వైవిధ్యం
    2) ఉత్పాదకత
    3) శబ్దార్థ సంబంధ కృత్రిమత
    4) వక్తల - శ్రోతల విపరిణామం 
    5) ప్రత్యేకత
    6) ప్రేరణ దూరత
    7) సాంస్కృతిక ప్రసరణ

* భాష యొక్క సహజ లక్షణం గతిశీలత.
 

త్రిభాషా సూత్రం
* త్రిభాషా సూత్రాన్ని 1956లో
CABE (Central Advisory Board of Education) జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. ఈ సూత్రం మనమంతా భారతీయులం అనే భావనను, రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కలిగిస్తుంది. త్రిభాషా సూత్రాన్ని కొఠారి కమిషన్‌ బలపరిచింది.

 

దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్ర క్రమం:
1) మాతృభాష
2) జాతీయ భాష హిందీ
3) అంతర్జాతీయ భాష
* త్రిభాషా సూత్రంలో మాతృభాష మొదటి స్థానంలో ఉంది.
* భారత రాజ్యాంగంలోని 343వ అధికరణ హిందీని అధికార భాషగా గుర్తించింది.

 

హిందీ మాతృభాషగా గల రాష్ట్రాల్లో త్రిభాషా సూత్ర క్రమం:
1) మాతృభాష
2) దక్షిణాది భాష
3) అంతర్జాతీయ భాష
* భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సివస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరే ఇతర భాషకు లేదు. ముఖ్యంగా విజ్ఞాన సాంకేతిక పదజాలానికి ఇది పుట్టినిల్లు.   - జె.బి.ఎస్‌.హాల్డెన్‌
* ఆంగ్లం అధికార భాష, మాతృభాషగా గల రాష్ట్రం నాగాలాండ్‌.
* భారత్‌లో ఆంగ్లాన్ని మెకాలే 1835లో ప్రవేశపెట్టారు. 
* ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్లభాష గవాక్షం చూడాలని నెహ్రూ పేర్కొన్నారు. 
* ఇతర దేశాల్లో బాలబాలికలు చదివినట్లుగా మన దేశంలోని పిల్లలు కూడా 4, 5 భాషలు నేర్చుకోవాలని నెహ్రూ తెలియజేశారు.
* ఇతర భాషలు శైశవం నుంచి అభ్యసిస్తే పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుంది.  - పాల్మర్‌ అండ్‌ జోడ్‌
* బహుభాషాభ్యసనం విద్యార్థి బుద్ధిని వికసింపజేసి, వాక్చాతుర్యాన్ని మెరుగుపరిచి, జ్ఞానాన్ని అభివృద్ధిపరిచి, సహృదయతను పెంపొందింపజేస్తుంది.  - డాక్టర్‌ విల్జియం
* మనం సంస్కృతాన్ని మరిచిపోతే భారతదేశాన్ని మరచినట్లు.   - నెహ్రూ
* త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తికి గొడ్డలిపెట్టు.  - కె.ఎం. మున్షీ

గ్రాంథిక భాష - వ్యవహారిక భాష:
         గ్రాంథిక భాషను కావ్య భాష లేదా సాహిత్య భాష అని కూడా అంటారు.
* భాషోద్యమం 1910లో ప్రారంభమైంది. 
* భాషోద్యమ పాశ్చాత్య ప్రేరకుడు జె.ఎ. ఏట్స్‌.
* వాడుక భాషా యోధ్యుడు గిడుగు రామ్మూర్తి. ఈయన వ్యవహారిక భాషకు ఉద్యమ స్ఫూర్తిని తెచ్చాడు. సామూహిక విద్యా కార్యక్రమానికి కావ్యభాష చాలదని తెలిపారు.
* మార్పు చెందనిది గ్రాంథిక భాష. దీనిలో దీర్ఘసమాసాలు, అరసున్న, బిందుపూర్వక ‘బ’కారం, సమగ్ర వ్యాకరణం ఉంటాయి. 
* మాటకు, రాతకు, సంగీతానికి, మాట్లాడే వారు, రాసేవారు సులభంగా గ్రహించడానికి వీలుండేది వ్యవహారిక భాష. దీన్ని దైనందిన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. 
* భాషోద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకువెళ్లిన కవి శ్రీశ్రీ.
* శైలి సంఘం అధ్యక్షుడు పింగళి లక్ష్మీకాంతం.
* సిద్ధాంత వ్యాసాలను వ్యవహారిక భాషలో రాయవచ్చని మొదటిసారి అంగీకరించింది ఎస్‌వీ విశ్వవిద్యాలయం.
* 1968 నుంచి గ్రాంథిక భాష, వ్యవహారిక భాషకు భేదం లేదు. 
* గ్రీకు పురాణ కథలు - శెట్టి లక్ష్మీనరసింహం

* గ్రామ్యమా, గ్రాంథికమా - మల్లాది సూర్యనారాయణ శాస్త్రి 
* ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శనం - పురాణపండ మల్లయ శాస్త్రి
* ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభిషేకం - గిడుగు రామ్మూర్తి

 

మాండలిక భాష
* మాండలిక భాషను ప్రాదేశిక భాష లేదా ఉపభాష అంటారు.
* భాషలో ప్రాంతీయ భేదాలను మాండలికం అంటారు. పరిమిత ప్రదేశంలో వ్యవహారంలో ఉండేది మాండలిక భాష.
* ఇది ప్రత్యేక ఉచ్చారణ, పలుకుబడిని కలిగి ఉంటుంది.

 

మాండలికాలు ఏర్పడటానికి కారణాలు
1) శీతోష్ణస్థితి పరిస్థితులు
2) వలసలు
3) భౌగోళిక రాజకీయ కారణాలు

 



* భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు ప్రాంతాన్ని నాలుగు మండలాలుగా విభజించారు. 
* పూర్వ మండలంలోని జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం.
* మధ్య మండలంలోని జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు.

* దక్షిణ మండలంలోని జిల్లాలు రాయలసీయ, నెల్లూరు, ప్రకాశం.
* ఉత్తర మండలంలోని జిల్లాలు తెలంగాణ ప్రాంతం.
* పూర్వ మండలంపై ఒరియా భాష ప్రభావం ఉంటుంది. ఇక్కడ గోవులను సొమ్ములు అని పిలుస్తారు. 
* రావిశాస్త్రి ‘సొమ్ములు వస్తున్నాయి’ అనే కథానికను రాశారు.
* ఆరంజ్యోతి అనేది కుల మాండలికం.
* గాబు తీస్తారా అనేది వర్గ, వ్యవసాయ వృత్తి మాండలికం.
* నీ యవ్వారం మాకు తెలియదా అనేది వర్గ నిరక్షరాస్య మాండలికం.
* లచ్చి, బుచ్చి, బువ్వ అనేవి పిల్లల మాండలికం.
* లైట్‌ తీసుకో, అంత సీన్‌ లేదులే అనేవి యువతీ యువకుల మాండలికం.
* ఏం కోడలా ఇంత అన్నమైనా పెడతావా అనేది వృద్ధుల మాండలికం.
* నీ ఆకు చించా, నీ జిమ్మడి పోను అనే పదాలు స్త్రీ మాండలికానికి చెందినవి. 
* గుర్రంబు - గుర్రమ్ము - గుర్రము - గుర్రం అనే పదాలు చారిత్రక మాండలికానికి ఉదాహరణలు.

 

ప్రామాణిక భాష:
* ప్రాంతీయ భేదాలను పరిహారించేది ప్రామాణిక భాష.    - బ్లూం ఫీల్డ్‌

* మార్పుల్ని ఆహ్వానిస్తూ వాటిని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉండేది ప్రామాణిక భాష.    - పాల్‌ గార్విన్‌
* అత్యధిక సంఖ్యాకులకు ఆమోద యోగ్యమయ్యేది ప్రామాణిక భాష. దీన్ని ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

 

ప్రామాణిక భాష లక్షణం
    1) మృదువైన స్థిరత్వం 
    2) నమ్యతతో కూడిన స్థిరత్వం
    3) మేధావీకరణం
    4) సరళమైన వ్యాకరణం ఉండటం

 

ప్రామాణిక భాష ప్రయోజనాలు:
    1) సమైక్యతా సాధనం
    2) అనుసంధాన సాధనం
    3) ప్రతిష్ఠా సాధనం
* ప్రామాణిక భాషను శిష్ట వ్యవహారిక భాష అని కూడా అంటారు. 
* ప్రామాణిక భాషగా పేర్కొనే మండలం మధ్యమండలం.

 

అధికార భాష
* భారత రాజ్యాంగంలోని 345వ అధికరణ ప్రకారం రాష్ట్రాలు, తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించవచ్చు.
* అధికార భాష వ్యాప్తికి ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిన నాయకుడు వావిలాల గోపాల కృష్ణయ్య.
* తెలుగును అధికార భాషగా చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని తెలిపిన పత్రిక ఆంధ్రప్రభ. 
* అధికార భాషా శాసనం 1966లో వచ్చింది.
* సచివాలయం స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వెలువడాలనే శాసానాన్ని 1998లో తీసుకొచ్చారు.
* అధికార భాషా సంవత్సరం 1988.
* అధికార భాష సంఘాన్ని పీవీ నరసింహారావు కమిటీ సిఫారసుల మేరకు 1974లో స్థాపించారు. 
* అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య.
* స్వరాజ్యం అనే పదాన్ని మొదటిసారి దాదాభాయ్‌ నౌరోజి ఉపయోగించారు.
* పాలనలో విలక్షణ అధికారాన్ని టోటెన్‌ హోం అంటారు.
* ఏదైనా ఒక దస్త్రంపై సంతకం కావాలంటే కింది స్థాయి గుమస్తా నుంచి పై స్థాయి అధికారి వరకు సోపాన క్రమంలో వెళ్లే ప్రక్రియే టోటెన్‌ హోం.

 

అనువాదం:
* అనువాదాన్ని భాషాంతరీకరణ, తర్జుమా అంటారు.
* అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ.
* మూల భాష, లక్ష్య భాష అనే పదాలు అనువాద ప్రక్రియకు చెందినవి. 
* ఒక భాషలో విషయ పాఠాన్ని మరొక భాషలోకి మార్చే ప్రక్రియే అనువాదం.
* మూల భాషలో విషయ పాఠాన్ని లక్ష్య భాషలోకి మార్చే సామర్థ్యాన్నే అనువాదం అంటారు.

 

అనువాదం రకాలు:
1) సమాచారానువాదం
2) సాహిత్యానువాదం
3) కవిత్వానువాదం
సమాచారానువాదం: అధికారిక లేఖలు, పరిపాలనా వ్యవహార పత్రాలను అనువదించడాన్ని సమాచారానువాదం అంటారు.
సాహిత్యానువాదం: సృజనాత్మక ప్రక్రియలైన నవల, కథానిక, విమర్శలను అనువదించడం.
కవిత్వానువాదం: తెలుగు కవితా ప్రక్రియలైన పద్యం, పాట, గేయం లాంటివన్నీ అనువదించడం.
మూల విధేయానువాదం: మూలానికి కట్టుబడి చేసే అనువాదాన్ని మూల విధేయానువాదం అంటారు.
స్వేచ్ఛానువాదం: అనువాద అంశాన్ని స్వతంత్ర రచన అనేలా చేసే అనువాద విధానాన్ని స్వేచ్ఛానువాదం అంటారు.

* నన్నయ భారతానువాద విధానం స్వేచ్ఛానువాదం.

 

పద్య ప్రక్రియలు:
     కావ్యాలు మూడు రకాలు
  1) పద్య కావ్యాలు
  2) గద్య కావ్యాలు
  3) చంపూ కావ్యాలు
* కేవలం పద్యాలతోనే రాసేవి పద్య కావ్యాలు.
* కేవలం వచనంలోనే రాసేవి గద్య కావ్యాలు.
* పద్యం, గద్యం రెండింటితో కలిపి రాసేవి చంపూకావ్యాలు.
ఉదా: మహాభారతం
పద్యకావ్యాలు రెండు రకాలు
  1) నిబద్ధ కావ్యాలు
  2) అనిబద్ధ కావ్యాలు
* ప్రకృష్టమైన (గొప్పది) బంధం కలిగి విస్తృత, ఉదాత్తమైన ఇతివృత్తం గల కావ్యాలను నిబద్ధ కావ్యాలు అంటారు.
* ఇతివృత్తం లేని కావ్యాలను అనిబద్ధ కావ్యాలు అంటారు. ఈ కావ్యాల్లో శతకాలు ప్రధానమైనవి.

 

ఇతిహాసం: ఇది ఇలా జరిగింది అనే అర్థాన్ని ఇచ్చే ప్రక్రియ. సురాసురుల యుద్ధం, పారంపర్య ఉపదేశం, కళానుభవం గురించి చెప్పేది ఇతిహాసం.
* మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, భాగవతం.
* సంస్కృతంలో ఆదికావ్యం రామాయణం.
* తెలుగులో ఆదికావ్యం మహాభారతం.

 

ప్రబంధం: ఏకనాయకాశ్రయం, వస్తువు ఐక్యత, నాటకీయత, అలంకారాలు, అష్టాదశ వర్ణనలతో ఉండేది ప్రబంధం.
* రచనా విధానం, కథావస్తువు, పాత్రచిత్రణ, రసపోషణలో కొత్తరీతులను సంతరించుకున్న ప్రక్రియ ప్రబంధం. ఇది నిబద్ధ కావ్యాలకు చెందింది.

 

శతకం: 100 లేదా 108 పద్యాలు గల రచన శతకం. శతకాలన్నీ అనిబద్ధ కావ్యాలే. శతకంలోని పద్యాలు ముక్తకాలై ఉంటాయి. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉండే లక్షణాన్నే ముక్తకం అంటారు.
* సంఖ్యానియమం, మకుట నియమం, ముక్తక నియమం గల కావ్యం శతకం.
* సంపూర్ణ శతక లక్షణాలు గల తొలి శతకం వృషాధిపశతకం (పాల్కురికి సోమనాథుడు).
ఉదాహరణం: విభక్తులతో రాసే కావ్య భేదం. ఇది స్తోత్రరూపమైన పద్యరచన.
* ఉదాహరణంలోని పద్యాల సంఖ్య 24 - 26.

* 8 విభక్తులు, 8 పద్యాలు, 8 కళికలు, 8 ఉత్కళికలు, ఒక సార్వవిభక్తిక పద్యం, ఒక కవినామాంకిత పద్యం ఉండే ప్రక్రియ ఉదాహరణం.
* ఉదాహరణం ప్రక్రియకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. 
* తొలి ఉదాహరణం కావ్యం - బసవోదాహరణం (పాల్కురికి సోమనాథుడు).
* త్రిపురాంతకోదాహరణం - రావుపాటి త్రిపురాంతకుడు
* వెంకటేశోదాహరణం - తాళ్లపాక పెదతిరుమలాచార్యులు

 

గద్య ప్రక్రియలు
విమర్శ:
ఒకరు చేసిన పనిలో మంచి చెడులను వివేచించి చెప్పడాన్నే విమర్శ అంటారు. ఒక వాక్యంలోని మంచి, చెడులను వివేచించడాన్ని సాహిత్య విమర్శ అంటారు.
* తెలుగులో తొలి విమర్శనా గ్రంథం ‘కవితత్వ విచారం’. దీన్ని కట్టమంచి రామలింగారెడ్డి రచించారు.

 

విశ్వనాథ సత్యనారాయణ రచనలు:
    1) నన్నయ ప్రసన్న కథా కవితార్థయుక్తి
    2) అల్లసాని వారి అల్లిక జిగి బిగి
    3) నాచ్చన్న సోముని కథా సంవిధాన శిల్పం
* అక్కిరాజు ఉమాకాంతం - నేటికాలపు కవిత్వం (భావకవిత్వంపై విమర్శ)

* మాచిరాజు దేవీ ప్రసాద్‌ - వికట కవిత్వం
* సినారె - ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగాలు
* శ్రీశ్రీ - అడుగు జాడ గురజాడది

 

నాటకం: నాటకంలో ఉండాల్సిన అంగాలు 5 - 10. శృంగారం, వీరరసం దీనిలోని ప్రధాన రసాలు.
* తొలి స్వతంత్ర నాటకం మంజరీ మధుకరీయం.
* తెలుగులో సుప్రసిద్ధ సాంఘిక నాటకం కన్యాశుల్కం.
   1. మృచ్ఛకటికం - శూద్రకుడు (సంస్కృతం)
   2. ముద్రారాక్షసం - విశాఖదత్తుడు (సంస్కృతం)
   3. మంజరీ మధుకరీయం - కోరాడ రామచంద్ర శాస్త్రి
   4. కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
   5. వరవిక్రయం, చింతామణి - కాళ్లకూరి నారాయణరావు
   6. పాండవోద్యోజ విజయాలు - తిరుపతి వేంకటకవులు
   7. సత్యహరిశ్చంద్ర - బలిజేపల్లి లక్ష్మీకాంతం
   8. నటనాలయం - మోదుకూరి జాన్సన్‌
   9. చలిచీమలు, వెంటాడే నీడలు - పి.వి. రమణ
   10. కప్పలు - ఆత్రేయ

 

నాటిక: నాటకం కంటే చిన్నది నాటిక. దీనిలో ఉండాల్సిన అంగాలు 2 లేదా 3.
* చలం - భానుమతి
* ముద్దుకృష్ణ - టీ కప్పులో తుపాను
* గణేష్‌పాత్రో - ఆదివిష్ణు, జంధ్యాల, పావలా
* జి.వి.కృష్ణారావు - భిక్షాపాత్రిక

 

కథానిక: కథ కంటే చిన్నది కథానిక. దీనికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్లుప్తత, సంక్షిప్తత.
* తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు.

 

కవి పేరు                                  కథానిక

గురజాడ అప్పారావు                     1) దిద్దుబాటు

                                       2) దేవుడు చేసిన మనుషుల్లారా!

                                       3) మీ పేరేమిటి

                                      4) సంస్కర్త హృదయం

                                      5) మతం - విమతం

చలం                                 1) ఓ పువ్వు పూసింది

                                     2) పాపం కళ్యాణి

                                     3) కన్నీటి కాలువ 
                                    
4) కర్మం ఇట్లా కాలింది

వేలూరి శివరామశాస్త్రి                 డిప్రెషన్‌ చెంబు
మునిమాణిక్యం నరసింహారావు        కాంతం కథలు
విశ్వనాథ సత్యనారాయణ             1) ముగ్గురు బిచ్చగాళ్లు
                                   2) మాక్లీ దుర్గంలో కుక్క
శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి                వడ్ల గింజలు

 

జీవితచరిత్ర: ఒకరిని గురించి మరొకరు రాసే రచనను జీవితచరిత్ర అంటారు.
స్వీయ చరిత్ర/ఆత్మకథ: తనను గురించి తానే రాసుకునే కథలను ఆత్మకథలు అంటారు.
* స్వీయ చరిత్రకు ఆద్యుడిని నేనే అని చెప్పుకున్నవారు కందుకూరి వీరేశలింగం.
* 50 సంవత్సరాల జ్ఞాపకాలు - దేవులపల్లి రామానుజరావు
* శ్రీకృష్ణ స్వీయ చరిత్ర - శ్రీపాద కృష్ణమూర్తి
* అనుభవాలు, జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
* యాత్రాస్మృతి - దాశరథి కృష్ణమాచార్యులు
* నాకథ - గుర్రం జాషువా
* అనంతం - శ్రీశ్రీ

 

యాత్రా రచన: ఒక రచయిత చేసిన యాత్రా విశేషాలను, అనుభవాలను రాయడాన్ని యత్రా రచన అంటారు.
* కాశీయాత్ర చరిత్ర - ఏనుగుల వీరస్వామయ్య
* కాశ్మీర దీపకలిక - నాయిని కృష్ణకుమారి
* నా అమెరికా యాత్ర - ఎన్‌. గోపి
* నేను చూసిన అమెరికా - అక్కినేని నాగేశ్వరరావు

 

నవల: 
* తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. దీన్ని కందుకూరి వీరేశలింగం రంచించారు.
* రాజశేఖర చరిత్రకు మూలం వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డ్‌ (ఆంగ్ల భాషకు చెందింది). దీన్ని గోల్డ్‌స్మిత్‌ రచించారు.
* మైదానం - గుడిపాటి వేంకట చలం
* అసమర్థుని జీవయాత్ర - త్రిపురనేని గోపీచంద్‌
* చివరకు మిగిలేది - బుచ్చిబాబు
* గణపతి - చిలకమర్తి లక్ష్మీ నరసింహం
¤* బారిష్టరు పార్వతీశం - మొక్కపాటి లక్ష్మీ నరసింహం
* ఏకవీర - విశ్వనాథ సత్యనారాయణ
* చెంఘిజ్‌ఖాన్‌ - తెన్నేటి సూరి

* మట్టి మనిషి - వాసిరెడ్డి సీతాదేవి
* బలిపీఠం - ముప్పాళ్ల రంగనాయకమ్మ
* పాకుడురాళ్లు - రావూరి భరద్వాజ
* మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ
* చదువు - కొడవటిగంటి కుటుంబరావు
* హిమబిందు - అడవి బాపిరాజు

 

వ్యాసం: 
* వ్యాసానికి మొదటి పేరు ప్రమేయాలు.
* సామినేని ముద్దు నరసింహ వ్యాసాలను ప్రమేయాలు పేరుతో హితవాది పత్రికలో ప్రచురించారు. 
* వ్యాసాలను ఉపన్యాసాల పేరుతో పిలిచింది కందుకూరి వీరేశలింగం.
* వ్యాసం అనే పదాన్ని మొదటిసారి గురజాడ అప్పారావు ఉపయోగించారు. 
* వ్యాస క్రీడలు రచించింది శ్రీశ్రీ.

 

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌