• facebook
  • whatsapp
  • telegram

సాంఘికశాస్త్రం, స్వభావం - పరిధి

1. 'జీవించడం ఒక కళ, ఆ కళను గురించి అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం' అని అన్నది ఎవరు?
జ: ముఫట్

 

2. ఏ వాదం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సాంఘిక శాస్త్రాన్ని విద్యాప్రణాళికలో చేర్చారు?
జ: వ్యవహారిక సత్తావాదం

 

3. 'భారతీయ విద్యా విధానంలో సాంఘికశాస్త్రం ఒక తులనాత్మక భావనను సూచిస్తుంది' అని అన్నది ఎవరు?
జ: మొదలియార్

 

4. 'సమాజ స్థాపన వికాసాలను అధ్యయనం చేయడమే సాంఘిక విజ్ఞానం' అని పేర్కొన్నది ఎవరు?
జ: అమెరికాలోని సెకండరీ విద్యాకమిటీ

 

5. ఆచరణకు, అభ్యసన అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది?
జ: సాంఘిక శాస్త్రం

 

6. కిందివాటిలో అతి పురాతనమైన శాస్త్రం ఏది?
ఎ) భూగోళం          బి) చరిత్ర           సి) పౌరనీతి            డి) అర్థశాస్త్రం
జ:  భూగోళం

 

7. సాంఘిక అధ్యయనాల్లో అతి ప్రధానమైన అంశం ఏది?
జ:  చరిత్ర

 

8. విద్యార్థుల్లో ఉత్తమ పౌరసత్వాభివృద్ధి పెంపొందించే విషయభాగం ఏది?
జ: చరిత్ర, పౌరనీతి

 

9. చరిత్ర అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అయితే ఆ పదానికి అర్థం ఏమిటి?
జ: అన్వేషించడం

 

10. ఏ తరగతి నుంచి అర్థశాస్త్రాన్ని పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టారు?
జ: ఆరో తరగతి

 

11. కిందివాటిలో సామాజికశాస్త్రం కానిది ఏది?
ఎ) సమాజశాస్త్రం        బి) మనోవైజ్ఞానికశాస్త్రం      సి) అర్థశాస్త్రం       డి) సాంఘికశాస్త్రం
జ: సాంఘికశాస్త్రం

 

12. 'గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదు' అన్న సామెత ఏ పాఠ్య విషయానికి వర్తిస్తుంది?
జ:  చరిత్ర

 

13. 'మానవుడికి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం' అని పేర్కొన్నది ఎవరు?
జ: ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా

 

14. 'మానవ సంబంధాలను అధ్యయనం చేసేదే సాంఘికశాస్త్రం' అని నిర్వచించింది?
జ: జాన్‌లీమైఖీలీన్

 

15. సవరించిన నూతన పాఠ్యప్రణాళిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 1993-94

 

16. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక అధ్యయనాలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ: 1952 విద్యా సంవత్సరంలో

 

17. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని సూచించింది-
జ: యశ్‌పాల్ కమిటీ, N.C.F. 2005

 

18. కిందివాటిలో సరికాని అంశం ఏది?
ఎ) సాంఘికశాస్త్ర విషయాలు సమైక్యంగా బోధించాలి.    
బి) సాంఘికశాస్త్ర విషయాలు విడివిడిగా బోధించాలి.
సి) సాంఘికశాస్త్రం మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది.
డి) సామాజికశాస్త్రాలు మానవ సంబంధాలను అధ్యయనం చేస్తాయి.
జ: సాంఘికశాస్త్ర విషయాలు విడివిడిగా బోధించాలి.

 

19. కిందివాటిలో సామాజిక ప్రమాణం ఏది?
ఎ) సత్యం పలకడం            
బి) సమాజం గురించి తెలుసుకోవడం   
సి) చట్టాలను గౌరవించడం  
డి) అంటరానితనాన్ని నిరోధించడం
జ: సత్యం పలకడం

 

20. గాంధీజీ ప్రతిపాదించిన విద్యావిధానం పేరు?
ఎ) వార్ధా విధానం    
బి) నయీతాలీమ్ విధానం    
సి) వృత్తివిద్యా విధానం    
డి) పైవన్నీ
జ: పైవన్నీ

21. ‘సాంఘిక శాస్త్రం’ అనే పదాన్ని అమెరికా విద్యావిషయక సాహిత్యంలో ఎప్పుడు చేర్చారు?
జ: 1905

 

22. సాంఘిక శాస్త్రం అంటే ‘సమాజ అధ్యయనం’ అని అన్నవారు
జ: ఫారెస్టర్‌

 

23. ఎన్‌.సి.ఎఫ్‌ − 2005 పౌరనీతి శాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని ఏ స్థాయి నుంచి బోధించాలని సూచించింది?
జ: ప్రాథమికోన్నత స్థాయి

 

24. కిందివాటిలో విశ్లేషణాత్మక, నిరంతర పరిశోధనాత్మక ఉపగమం
     1) క్రమబద్ధ శిక్షణా ఉపగమం           2) పరస్పరాధిత ఉపగమం     
     3) బహుళ విభాగ ఉపగమం            4) సమైక్య ఉపగమం
జ: 1 (క్రమబద్ధ శిక్షణా ఉపగమం)

25. కిందివాటిలో సాంఘికశాస్త్ర ముఖ్య లక్షణం కానిది?
     1) అనేక సామాజిక శాస్త్రాల విషయ జ్ఞానాన్ని సమన్వయం చేస్తుంది
     2) భూత, భవిష్యత్, దర్శ మాపనాలకు గల సంబంధాన్ని తెలియజేస్తుంది 
     3) మానవుడు, పరిసరాలతో అతడికి గల సంబంధాన్ని తెలియజేస్తుంది      

    4) సామాజిక శాస్త్రాల కలయిక   
జ: 4 (సామాజిక శాస్త్రాల కలయిక)

 

26. ఏ వాదం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సాంఘిక శాస్త్రాన్ని విద్యా ప్రణాళికలో చేర్చారు?
జ: వ్యవహారిక సత్తావాదం

 

27. సాంఘిక శాస్త్రం ఆవిర్భవించడానికి కారణమైన వాదం
జ: వ్యవహారిక సత్తావాదం

 

28. భారతదేశంలో సాంఘిక శాస్త్రం ఒక నిత్య పాఠ్యవిషయంగా ఎప్పుడు ఆవిర్భవించింది?
జ: 1952

 

29. సాంఘిక శాస్త్రాన్ని ఉన్నత స్థాయి నుంచి వేర్వేరుగా బోధించాలన్నది
జ: కొఠారి కమిషన్‌

 

30. ఏ కమిటీ సూచనల మేరకు భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టారు?
జ: మొదలియార్‌ కమిటీ

31. విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలిచేవి?
జ: స్పష్టీకరణలు

 

32. కింది ఏ విలువ వల్ల వ్యక్తికి తనను తాను పక్కన పెట్టి లక్ష్యాత్మకంగా ఆలోచించే సామర్థ్యం అలవడుతుంది?
 1) సాంస్కృతిక విలువ    2) నైతిక విలువ  

 3) వృత్తి విలువ   4) సృజనాత్మక విలువ
జ: 2 (నైతిక విలువ)

 

33. సహనశీలత, నిస్వార్థం, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం విద్యార్థిలో ఏ విలువ వల్ల పెంపొందుతుంది?
జ: బౌద్ధిక విలువ

 

34. పౌరశాస్త్రాన్ని అభ్యసించిన రాజు అనే విద్యార్థి ఎన్నికల్లో ఓటుహక్కును సక్రమంగా వినియోగించుకున్నట్లయితే అతడిలో నెరవేరిన విలువ?
జ: ఉపయోగిత విలువ

 

35. ఉష్ణోగ్రతా విలోమం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతమాటల్లో చెప్పిన రవి అనే విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
జ: అవగాహన

 

36. భారతదేశ పౌరులందరికీ రాజ్యాంగంలో పేర్కొన్నట్లు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సరిగా అందుతుందని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్న ఏ బోధనా లక్ష్య సాధనకు సంబంధించింది?
జ: వైఖరి

37. ఇచ్చిన ప్రపంచ పటంలో ఉత్తర అమెరికా ఖండాన్ని గుర్తించగలిగిన రాము అనే 5వ తరగతి విద్యార్థిలో నెరవేరిన బోధనా లక్ష్యం
జ: నైపుణ్యం

 

38. జ్ఞానాత్మక రంగంలో అవగాహన తర్వాత వచ్చే సోపానం
జ: వినియోగం

 

39. మానసిక చలనాత్మక రంగాన్ని వర్గీకరించినవారు
జ: ఆర్‌.హెచ్‌.దవే

 

40. సింధు నాగరికత, ఆర్య నాగరికత మధ్య భేదాలు తెలిపిన విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: విషయావగాహన

41. కిందివాటిలో విశ్లేషణ పద్ధతి లక్షణం
     1) నియతమైంది      2) యాదృచ్ఛికమైంది       

    3) ఆలోచనా ఫలితం      4) సంక్షిప్తమైంది
జ: 2 (యాదృచ్ఛికమైంది)

 

42. ‘సాంఘిక పరిసరాల్లో హృదయ పూర్వకంగా నిర్వహించే అనుభవ పూర్వక కృత్యమే ప్రాజెక్టు’ అని పేర్కొన్నవారు
జ: కిల్‌ పాట్రిక్‌

43. కింది ఏ బోధనా పద్ధతి ప్రకారం జ్ఞానమనేది అభేద్యం 
     1) అన్వేషణ      2) ప్రాజెక్టు      3) ప్రయోగశాల      4) క్రీడ
జ: 2 (ప్రాజెక్టు)

 

44. జవాబుకు కావాల్సిన ప్రశ్నయే సమస్య అన్నది ఎవరు?
జ: బైనింగ్‌ అండ్‌ బైనింగ్‌

 

45. కిందివాటిలో గౌణ ఆధారాలు ఏవి?
     1) కోర్టు రికార్డులు      2) ఒప్పంద పత్రాలు       

    3) ఉత్తరాలు      4) ఎన్‌గ్డోటల్‌ రికార్డులు
జ: 4 (ఎన్‌గ్డోటల్‌ రికార్డులు)

 

46. చర్చా పద్ధతిలో నాయకుడిగా వ్యవహరించేది?
జ: ఉపాధ్యాయుడు

 

47. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరం/అవసరం లేదు అనే సమకాలీన అంశంపై తరగతి గదిలో చర్చ నిర్వహించాలంటే ఉపాధ్యాయుడిగా నీవు ఎన్నుకోవాల్సిన ఉత్తమ ఉపగమం?
జ: డిబేట్‌

 

48. సాధారణంగా ఉపాధ్యాయుడు విద్యార్థులను అడిగే ప్రశ్నలను ఏమని పిలుస్తారు?
జ: నియత ప్రశ్నలు

49. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే బోధనా పద్ధతి
జ: సాంఘీకృత బోధనా పద్ధతి

 

50. సమస్యా పరిష్కార పద్ధతికి మూలమైన వాదం
జ: వ్యవహారిక సత్తావాదం

 

51. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గల రహదారి సౌకర్యాలను చూపడానికి అనువైన పటం
జ: రాజకీయ పటం

 

52. తక్కువ అంశాల నుంచి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చే చార్టు
జ: కాలరీతి చార్టు

 

53. నైష్పత్తిక అంశాల ఆధారంగా విషయాన్ని వివరించే గ్రాఫ్‌
జ: పై గ్రాఫ్‌

 

54. తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందించే గ్లోబు
జ: ఆవరణ రేఖ గ్లోబు

55. కిందివాటిలో భౌగోళిక గ్లోబు ద్వారా చూపలేని అంశం?
     1) భూస్వరూపాలు      2) స్వాభావిక మండలాలు      

    3) గ్రిడ్‌      4) సరిహద్దులు
జ: 4 (సరిహద్దులు)

 

56. ప్రవాహ చార్టు దేన్ని పోలి ఉంటుంది?
జ: వంశ చార్టు

 

57. రెండు కంటే ఎక్కువ అంశాల మధ్య పోలికలు, భేదాలు, సంబంధాలు ఏర్పరిచే చార్టు?
జ: టేబుల్‌ చార్టు

 

58. ఒక ముఖ్యాంశం, అందులోని ఉప అంశాలను చూపడానికి ఉపయోగపడే చార్టు
జ: వృక్ష చార్టు

 

59. పరస్పర సంబంధం గల అంశాల్లో పెరుగుదలను, తగ్గుదలను సూచించే గ్రాఫ్‌
జ: రేఖా గ్రాఫ్‌

 

60. వస్తు ఉత్పత్తులు, అమ్మకాలను సూచించడానికి ఉపయోగపడే గ్రాఫ్‌
జ: సచిత్ర గ్రాఫ్‌

 

61. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం
జ: పీరియడ్‌ పథకం

62. యూనిట్‌ పద్ధతిలోని మోరిసన్‌ సోపానాల్లో ‘అభ్యసనం కూసు విద్య’ అనే నానుడిని బలపరిచేది
జ: వల్లెవేయడం

 

63. ‘మాధ్యమిక పాఠశాలలో సామాజిక అధ్యయనాల బోధన’ గ్రంథ రచయిత
జ: బైనింగ్‌ అండ్‌ బైనింగ్‌

 

64. చరిత్ర పాఠ్యాంశాలను అమర్చేటప్పుడు మొగలాయిలు పాఠం కంటే ముందు ఢిల్లీ సుల్తాన్‌ల పాఠాన్ని అమర్చాలని తెలియజేసే పద్ధతి
జ: కాలక్రమయుత పద్ధత

 

65. ఉపాధ్యాయులకు ఒక జ్ఞాన నిధిలా ఉపయోగపడే యూనిట్‌
జ: వనరుల యూనిట్‌

 

66. ప్రస్తుతం 6 నుంచి 8 తరగతుల సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాల పాఠ్యాంశాల అమరికలో ఉపయోగించే పద్ధతి
జ: సమ్మిళిత పద్ధతి

 

67. APSCF − 2011 ను అనుసరించి నూతన పాఠ్యపుస్తకాల తయారీకి సంబంధించిన ఆధార పత్రాలు ఎన్ని?
జ: 18

 

68. ‘వసుదైక కుటుంబమనే భావన’ కింది ఏ మౌలికాంశానికి సంబంధించింది?
     1) చిన్న కుటుంబం                                 2) సాంఘిక పరిధుల తొలగింపు     
     3) సంస్కృతి సంప్రదాయాల పరంపర        4) స్త్రీ పురుష సమానత్వం
జ: 3 (సంస్కృతి సంప్రదాయాల పరంపర)

69. విద్యార్థులు నేర్చుకోవాల్సిన ప్రాతిపదిక అభ్యసన అనుభవాలు
జ: మౌలిక విద్యా ప్రణాళిక


 

70. ప్రస్తుతం 6 నుంచి 8 తరగతుల పాఠ్య పుస్తకాల అమరికలో ఉపయోగించిన ఇతివృత్తాలు?
జ: 6

71. 6 - 9 తరగతుల్లో సాంఘిక శాస్త్ర బోధనలో సంగ్రహణాత్మక మదింపులో మదింపు చేయాల్సిన సామర్థ్యాలు?
జ: 6

 

72. కిందివాటిలో మదింపు లక్షణం కానిది?
     1) ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తుంది                                    2) సరళమైంది
     3) విద్యార్థులకు తెలియకుండా వారిని పరిరక్షిస్తుంది        4) అంతిమ నిర్ణయం
జ: 4 (అంతిమ నిర్ణయం)

 

73. అభ్యసన ప్రక్రియలో ‘పరిపుష్టి’ని అందించే మూల్యాంకనం
జ: రూపణ మూల్యాంకనం

 

74. విద్యార్థులకు యోగ్యతా పత్రాలు ఇవ్వడానికి దోహదపడే మూల్యాంకనం
జ: సంకలన మూల్యాంకనం

75. కిందివాటిలో మాపనం లక్షణం
     1) సమగ్రమైంది     2) నిరంతర ప్రక్రియ    

     3) గుణాత్మకమైంది     4) వర్తమానాన్ని మాత్రమే తెలియజేస్తుంది
జ: 4 (వర్తమానాన్ని మాత్రమే తెలియజేస్తుంది)

 

76. కిందివాటిలో మూల్యాంకనంలో మాత్రమే ఉండే ప్రక్రియ
     1) ప్రశ్నపత్రాల పంపిణీ                  2) సమాధాన పత్రాన్ని సరిచూడటం
     3) సమాధానాలు రాయడం           4) విలువ కట్టడం
జ: 4 (విలువ కట్టడం)

 

77. నిర్మాణాత్మక మదింపు ఎన్ని మార్కులకు నిర్వహించాలి?
జ: 50

 

78. సంకలనాత్మక మదింపులో 6 - 9వ తరగతి వరకు గల సాంఘిక శాస్త్రంలో సమాచార నైపుణ్యాలు అనే సామర్థ్యానికి కేటాయించాల్సిన మార్కులు?
జ: 15

 

79. ప్రశ్నపత్ర రూపకల్పన కోసం కాఠిన్యతా స్థాయి భారత్వ పట్టికను రూపొందించడం వల్ల ప్రశ్నపత్రానికి ఏ లక్షణం పెంపొందుతుంది?
జ: విచక్షణా శక్తి

80. విద్యార్థులు చేసిన కృత్యాలను, సేకరించి వాటిని, ప్రదర్శనలను, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడమే
జ: పోర్టుపోలియో

Posted Date : 23-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌