• facebook
  • whatsapp
  • telegram

క్షేత్రగణితం


1. ఒక టవల్‌ను ఉతికినప్పుడు దాని పొడవులో 20%, వెడల్పులో 10% తగ్గితే వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత?
జ: 28%

 

2. ఒక చక్రం వ్యాసార్ధం 28 సెం.మీ. అయితే 10 భ్రమణాల్లో ఆ చక్రం ఎంత దూరం ప్రయాణిస్తుంది?
జ: 1760 సెం.మీ.

 

3. 24.64 మీ2. వైశాల్యం గల వృత్త పరిధి?
జ: 17.6 మీ.

 

4. వృత్త వ్యాసార్ధాన్ని 10% తగ్గిస్తే, దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత?
జ: 19%

 

5. సమఘనం సంపూర్ణతల వైశాల్యం 864 చ.సెం.మీ. అయితే దాని పక్కతల వైశాల్యం? (చ.సెం.మీ.లలో)
జ: 576

 

6. 7 సెం.మీ., 24 సెం.మీ. కర్ణాలు గల రాంబస్‌ చుట్టుకొలత ఎంత?
జ: 50 సెం.మీ.

 

7. సమబాహు త్రిభుజం ఎత్తు 4సెం.మీ. అయితే దాని చుట్టుకొలత?
జ: 24 సెం.మీ.

8. ఒక వృత్త వ్యాసం, పరిధిల నిష్పత్తి
జ: 1 : 
π

 

9. ఒక కంకణం లోపలి వ్యాసార్ధం 3 సెం.మీ., బయటి వ్యాసార్ధం 4 సెం.మీ. అయితే కంకణం మొత్తం వైశాల్యం ఎంత?
జ: 125.7 సెం.మీ.2

 

10. ట్రెపీజియం సమాంతర భుజాల పొడవులు 10.4 సెం.మీ., 6.6 సెం.మీ. వాటి మధ్య దూరం 4 సెం.మీ. అయితే దాని వైశాల్యం? (చ.సెం.మీ.లలో)
జ: 34

 

11. ఒక గోళం వ్యాసం 6 మీ. అయితే ఆ గోళం ఘనపరిమాణం ఎంత?
జ: 36 
π మీ.3

 

12. రాంబస్‌లోని ఒక కర్ణం పొడవు రెండోదానికి రెట్టింపు. దాని వైశాల్యం 25 చ.సెం.మీ. అయితే కర్ణాల పొడవుల మొత్తం ఎంత?
జ: 15 సెం.మీ.

 

13. సెక్టారు వైశాల్యం 56 చ.సెం.మీ., చాపం పొడవు 16 సెం.మీ. అయితే వృత్త వ్యాసార్ధం? (సెం.మీ.లలో)
జ: 7

 

14. ఒక త్రిభుజ భుజాలు 3 సెం.మీ., 4 సెం.మీ., 5 సెం.మీ. ఆ భుజాల మధ్య బిందువులను కలపగా వచ్చే త్రిభుజ వైశాల్యం? (చ.సెం.మీ.లలో)
జ: 1.5

15. ఒక చతురస్ర వైశాల్యం 72 చ.మీ. అయితే చతురస్ర కర్ణం పొడవు ఎంత?
జ: 12 మీ.

 

16. అర్ధవృత్తం చుట్టుకొలత
1) (2 +
π)r         2) 36/7 r          3)  36/14 d          4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

17. కిందివాటిలో సరికానిది.
    1) 1 హెక్టారు = 10,000 చ.మీ.       2) 1 లీటరు = 1000 ఘ.సెం.మీ.
    3) 1 ఏర్‌ = 100 చ.మీ.             4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

 

18. 1728 ఘ.సెం.మీ. ఘనపరిమాణం కలిగిన ఒక ఘనం యొక్క భుజం పొడవు ఎంత?
జ: 12 సెం.మీ.

 

19. 6 సెం.మీ., 8 సెం.మీ., 10 సెం.మీ.లను వ్యాసార్ధాలుగా కలిగిన మూడు ఘనగోళాలను కరిగించి ఒకే గోళంగా తయారు చేస్తే దాని వ్యాసార్ధం
జ: 12 సెం.మీ.

 

20. ఒక ఘనం యొక్క కర్ణం పొడవు, దాని భుజం పొడవునకు ఎన్ని రెట్లు?
జ: 

21. 10 మీ. × 10 మీ. × 5 మీ. కొలతలు కలిగిన ఒక దీర్ఘఘనాకార గదిలో ఉంచగలిగే కర్ర యొక్క గరిష్ఠ పొడవు?
జ: 15 మీ.

 

22. రెండు గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి 64 : 27 అయితే వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి?
జ: 16 : 9

 

23. 64 ఘ.సెం.మీ. ఘనపరిమాణం గల మూడు ఘనాలను పక్కపక్కన కలిపితే ఏర్పడే దీర్ఘఘన సంపూర్ణతల వైశాల్యం ఎంత?
జ: 224 చ.సెం.మీ.

 

24. 316.8 మీ. పొడవు, 6.5 మీ. వెడల్పు కలిగిన ఒక స్థలంలో 1.3 మీ. × 1.1 మీ. కొలతలు ఉన్న ఎన్ని రాతి పలకలను ఉంచవచ్చు?
జ: 14,400

 

25. ఒక గార్డెన్‌ రోలర్‌ వ్యాసం 1.4 మీ., పొడవు 2 మీ. అయితే అది 5 పూర్తి భ్రమణాల్లో చదునుచేసే వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)
జ: 44

 

26. 1.5 సెం.మీ. వ్యాసార్ధం గల అర్ధగోళం ఘనపరిమాణం ఎంత?
జ: 7.07 ఘ.సెం.మీ.

27. శంకువు వ్యాసార్ధం 7 సెం.మీ., ఏటవాలు ఎత్తు 25 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం?
జ: 1232 ఘ.సెం.మీ.

 

28. ఒక చతురస్రం, ఒక సమబాహు త్రిభుజాల చుట్టుకొలతలు సమానం. చతురస్ర కర్ణం 12

 సెం.మీ. అయితే త్రిభుజ వైశాల్యం ఎంత?
జ:  64చ.సెం.మీ.
 

29. 18 సెం.మీ. పొడవు, 14 సెం.మీ.ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రంలో అంతర్లిఖితమైన గరిష్ఠ వృత్త వైశాల్యం?
జ: 154 చ.సెం.మీ.

 

30. వృత్త వైశాల్యంలో  1/3 వ వంతు వైశాల్యం గల సెక్టారు కోణం?
జ: 120º

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌