• facebook
  • whatsapp
  • telegram

రుసుము - లాభనష్టాలు

అసలు ధర: ఒక వస్తువును కొన్న ధరను అసలు ధర లేదా కొనుగోలు ధర (CP - Cost Price) అంటారు.
అమ్మకం ధర: ఒక వస్తువును అమ్మిన ధరను 'అమ్మకపు ధర' (SP - Selling Price) అంటారు.
లాభ నష్టాలు: వస్తువు కొన్నవెల కంటే అమ్మిన వెల ఎక్కువైతే వచ్చే అధిక డబ్బును 'లాభం' అంటారు.
*  లాభం = అమ్మిన వెల -  కొన్న వెల
*  అమ్మిన వెల = కొన్న వెల + లాభం
  వస్తువు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువైతే నష్టం వస్తుంది.
 *   నష్టం = కొన్నవెల - అమ్మిన వెల
 *  కొన్న వెల = అమ్మిన వెల + నష్టం

 

లాభ, నష్ట శాతాలు:
       లాభశాతం లేదా నష్టశాతాన్ని ఎల్లప్పుడూ కొన్నవెలపై మాత్రమే లెక్కిస్తారు.


* లాభానికి గుర్తు '+', నష్టానికి '-' గుర్తు ఉపయోగించాలి.
* ఒక వస్తువును A% లాభానికి అమ్మితే దాని అమ్మిన వెల = కొన్నవెలలో (100 + A)%
* ఒక వస్తువును B% నష్టానికి అమ్మితే, దాని అమ్మిన వెల = కొన్నవెలలో (100 - B)%

* ఒక వ్యక్తి రెండు ఒకే విధమైన వస్తువులను ఒక దాన్ని x% లాభానికి, రెండో దాన్ని x% నష్టానికి
   అమ్మితే ఆ రెండింటి మీద వర్తకుడు ఎప్పుడూ నష్టమే పొందుతాడు.


ఒక వర్తకుడు కొన్నవెల (CP)కే అమ్ముతున్నానని మభ్యపెట్టి తప్పుడు తూకాలతో అమ్మితే


*  ఒక వస్తువు అసలు వెలలో A% పెరుగుదల ఉంటూ, ఆ తర్వాత అదే A% తరుగుదల ఉంటే దాని చివరి
          వెల దాని అసలు వెల కంటే తక్కువగా ఉంటుంది.
*  ఒక వ్యక్తి మరో వ్యక్తికి వస్తువును A% లాభం లేదా నష్టానికి అమ్మాడు. రెండో వ్యక్తి ఆ వస్తువును మూడో
          వ్యక్తికి B% నష్టానికి అమ్మాడు. మూడో వ్యక్తి ఆ వస్తువును x రూపాయలకు

 ఒక వస్తువును A% లాభం లేదా నష్టానికి అమ్మి, తర్వాత మళ్లీ B% లాభం లేదా నష్టానికి


       x వస్తువుల కొన్నవెల y వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే


       ఒక వ్యక్తి రెండు వస్తువులను రూ.x లకు కొని ఒక దాన్ని A% లాభం లేదా నష్టానికి, రెండో దాన్ని B%
         లాభం లేదా నష్టానికి అమ్మితే రెండింటి అమ్మిన వెలకు సమానమైతే మొదటి వస్తువు

         

       x ను m% లాభంతో y ను n% లాభంతో, z ను p% లాభంతో అమ్మితే మొత్తం మీద రూ.R లాభం వస్తే 
      


       ఒక వ్యక్తి కొన్ని వస్తువులను రూ. x లకు కొన్నాడు. మరికొన్ని వస్తువులను రూ.y లకు కొన్నాడు. ఈ
          రెండు వస్తువులను కలిపి రూ.z లకు అమ్మాడు. అప్పుడు అతడికి వచ్చిన


ఒక వ్యాపారి రెండు రకాల వస్తువులను ఒకే ధరకు అమ్మాడు. మొదటి దానిపై  x%  లాభం,
        రెండోదానిపై  y% నష్టం వచ్చాయి. ఆ వ్యాపారికి వచ్చిన


గమనిక: లాభం లేదా నష్టాన్ని +  లేదా  -  గుర్తు ఆధారంగా నిర్ణయించాలి

      ఒక రూపాయికి x యాపిల్స్, ఒక రూపాయికి y యాపిల్స్ కొని మొత్తం రెండు రకాలు కలిపి ఒక
         రూపాయికి z యాపిల్స్ అమ్మితే మొత్తంగా కొన్న యాపిల్స్


        విలువ ధనాత్మకమైతే లాభం, రుణాత్మకమైతే నష్టం వస్తుంది.

       ఒక వ్యక్తి x వస్తువులను రూ.xలకు కొని రూ.x లకు y వస్తువులను అమ్మితే నష్టశాతం


         (మొదటి సందర్భంలో వస్తువులు = రెండో సందర్భంలో రూపాయలు అయినప్పుడు ఈ సూత్రం ఉపయోగించాలి)

రుసుము
* వర్తకులు ఒక వస్తువు కొన్నవెల (C.P) పై కొంత లాభం (p) వేసుకొని దానిపై కొంత అధికంగా ప్రకటన  వెల నిర్ణయిస్తారు.
* ప్రకటన వెలనే పట్టీ వెల, క్యాటలాగు వెల, లిఖిత మూల్యం, గుర్తించిన వెల అని కూడా అంటారు.
* వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రకటన వెలపై కొంత తగ్గించి అమ్ముతారు. ఈ తగ్గింపును రుసుం,  వర్తక రుసుము, ముదరా డిస్కౌంట్ అంటారు.
* రుసుమును ఎల్లప్పుడూ ప్రకటన వెలపై లెక్కిస్తారు.

 

రుసుముకు సంబంధించిన సూత్రాలు:
        1. రుసుము = ప్రకటన వెల - అమ్మిన వెల 
                 ∴ [d = M.P.
- S.P.]


3. రుసుము ఇచ్చినప్పుడు ప్రకటన వెల = అమ్మిన వెల + రుసుము
                             [M.P. = S.P. + d]


7. రుసుము, లాభం ఇచ్చినప్పుడు కొన్నవెల = ప్రకటన వెల - (రుసుము + లాభం)
                              ∴ [C.P. = M.P. − (d + p)]


 9. రుసుము, లాభం ఇచ్చినప్పుడు ప్రకటన వెల  = కొన్నవెల + (రుసుము + లాభం)
                                  ∴  [M.P. =  C.P. + (d + p)]


1. ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపాయలకు కొని 540 రూపాయలకు అమ్మితే అతడికి లాభమా? నష్టమా?  ఎంత శాతం?
సాధన: వ్యాపారి పెట్టెను కొన్న ధర = రూ.480
                                అమ్మిన ధర = రూ.540
            లాభం = 540 - 480 = రూ.60


           

2. అఖిల్ ఒక టీవీని రూ.15,000 కొని రూ.14,100 అమ్మితే మొత్తం మీద అతడికి లాభమా? నష్టమా? ఎంత శాతం?
సాధన: అఖిల్ టి.వి. కొన్నవెల = రూ.15,000
            అమ్మిన వెల = రూ.14,100
          ∴  నష్టం = 15,000 - 14,100 = రూ.900


        ∴  నష్టం శాతం = 6%

3. 12 మామిడి పండ్ల కొన్నవెల 15 మామిడి పండ్ల అమ్మిన వెలకు సమానమైతే మొత్తం మీద లాభం లేదా నష్టం ఎంత శాతం?
సాధన: కొన్న వెల : అమ్మిన వెల = 15 : 12
            నష్టం = 15 - 12 = 3

4. రాము ఒక స్థలం రూ.24,000 లకు అమ్మడం ద్వారా 20% లాభం పొందాడు. అయితే స్థలం కొన్నవెల ఎంత?
సాధన: రాము స్థలాన్ని అమ్మిన వెల = రూ.24,000
                          లాభం = 20%


                                        
5. ఒక వస్తువును రూ.170 లకు అమ్మితే 15%  నష్టం వస్తుంది. అయితే కొన్నవెల ఎంత?
సాధన: వస్తువు అమ్మిన వెల = రూ.170
                             నష్టశాతం = 15%

                            

6. ఒక వస్తువును రూ.650 లకు కొని అమ్మినప్పుడు 6% లాభం వచ్చింది. అమ్మిన వెల ఎంత?

7. ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒక్కొక్కటి రూ.2,500 లకు అమ్మితే మొదటిదానిపై 20% లాభం, రెండో
     దానిపై 10% నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి లాభమా, నష్టమా? ఎంతశాతం?

8. ఒక కానుక ప్రకటన వెల రూ.176. దుకాణదారుడు దాన్ని రూ.165 లకు అమ్మితే రుసుం, రుసుం శాతం   కనుక్కోండి.
సాధన: కానుక ప్రకటన వెల = రూ.176
                           రుసుము = 176 - 165
                                    = రూ.11


                 
9. ఒక ఫ్యాన్ ప్రకటన వెల రూ.1600. అమ్మకపుదారుడు దానిపై 6% రుసుము ఇస్తే ఫ్యాన్ అమ్మిన వెల ఎంత?
సాధన: ఫ్యాన్ ప్రకటన వెల = రూ.1600 1594
               రుసుము శాతం = 6% 


10. ఒక వడ్రంగి తాను చేసిన వస్తువుపై 15% రుసుము ఇస్తూ రూ.680 లకు అమ్మితే వస్తువు ప్రకటన వెల ఎంత?

11. ఒక వ్యాపారి వస్తువు ప్రకటన వెలను కొన్నవెలపై 25% అంటే నిర్ణయించిన ధరపై కొంత రుసుము ఇచ్చిన 10% లాభం వస్తుంది. అయితే రుసుము శాతం ఎంత?

సాధన:  కొన్నవెల = 100 అనుకోండి
             ప్రకటన వెల = 125
            అమ్మిన వెల = 110
                రుసుము = 125 - 110 = 15


       

12. ఒక రేడియో తయారీదారుడు రేడియోను రూ.1500 లకు కొని అతడు కొన్నవెలపై 20% అధికంగా ప్రకటన వెల నిర్ణయించాడు ,. అయితే ఆ వస్తువుపై ఎంత శాతం రుసుము ఇస్తే 10% లాభం వస్తుంది?
సాధన:        కొన్నవెల = 100 అనుకోండి.
                 ప్రకటన వెల = 120
                అమ్మిన వెల = 110
                    రుసుము = 120 - 100 = 10


          

పన్ను (VAT - విలువ ఆధారిత పన్ను)
        వ్యాపారులు వారు అమ్మిన వస్తువులపై కొంత సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే 'పన్ను' (Tax) అంటారు. ఈ పన్ను అమ్మే వస్తువు ధర ఆధారంగా ఉంటుంది. వ్యాపారులు ఈ సొమ్మును   వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
        VAT అనేది రవాణా చేసే సరకులపై మాత్రమే విధిస్తారు. దీన్ని సేవలపై వేయరు.

 

1. ఒక జత బూట్ల వెల రూ.450. దానిపై 6% అమ్మకం పన్ను విధిస్తే కట్టాల్సిన బిల్లు మొత్తం ఎంత?
సాధన: బూట్ల ఖరీదు = రూ.450
           బిల్లు మొత్తం = 450 + 450 లో 6%


 = 450 + 27
= రూ.477
వ్యాట్‌ను అమ్మకపు వెలపై లెక్కిస్తారు.
వ్యాట్ అనేది అమ్మకపు వెలపై పెరుగుదల శాతం.

2. ఒక ఏసీ ప్రకటన వెల రూ.2,800. దీన్ని 5% వ్యాట్‌తో కలిపి అమ్మితే దాని వెల ఎంత?
సాధన: ప్రకటన వెల = రూ.2,800
        ∴  అమ్మిన ధర = 2800 + 2800 లో 5%

                     
    = 2800 + 140
    అమ్మిన ధర = రూ. 2940

 

3. ఒక వస్తువు ధర రూ.500. ఆ వస్తువుపై వ్యాట్ 8%  అయితే ఆ వస్తువును కొనాలంటే ఎంత చెల్లించాలి?
సాధన: మొత్తం = 500 + 500 లో 8%


    = 500 + 40 
   = రూ.540

4. ఒక వజ్రం ధర ఒక శాతం వ్యాట్‌తో కలిపి రూ.10,100 అయితే దాని ప్రకటన వెల ఎంత?

5. ఒక వస్తువు ధర 5% వ్యాట్‌తో కలిపి రూ.73.50 అయితే ఆ వస్తువు అసలు ధర ఎంత?
సాధన: వస్తువు అసలు ధర ×  అమ్మిన వెల 
            x + xలో 5% = 73.50

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌