• facebook
  • whatsapp
  • telegram

వ్యాపార గణితం

1. A : B = 2 : 3, B : C = 4 : 5 అయితే A : B : C =
జ: 8 : 12 : 15

 

2. A : B = 2 : 3, B : C = 2 : 5, C : D = 4 : 3 అయితే A : B : C : D =
జ: 16 : 24 : 60 : 45

 

3. 2 : 3, 4 : 5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 : x అయితే x కి సమానమైంది ఏది?
జ: 54

 

4. ఒక నిష్పత్తి 5 : 8 కి సమానం. దాని పూర్వపదం 40 అయితే పరపదం ఎంత?
జ: 64

 

5. x2 + 4y2 = 4xy అయితే x : y =
జ: 2 : 1

 

6.  3/4 A =  5/7 B అయితే A : B =
జ: 20: 21 

 

7.  అయితే (x + 5) : (y + 8) =
జ: 5 : 8


జ: 2
 

9. 0.08, 0.18 ల మధ్యమ అనుపాత సంఖ్య
జ: 0.12

 

10. 12, 30 ల తృతీయ అనుపాత సంఖ్యకు 9, 25 ల మధ్యమ అనుపాత సంఖ్యకు గల నిష్పత్తి
జ: 5 : 1

 

11. 0.75 : x = 5 : 8 అయితే x =
జ: 1.20

 

12. రూ.1400 లను సుమన్, మోహన్‌లు 3 : 4 నిష్పత్తిలో పంచుకుంటే మోహన్‌ వాటా సొమ్ము ఎంత?
జ: రూ.800

 

13. 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. అదే గోడను 30 గంటల్లో కట్టాలంటే ఎంత మంది కూలీలు కావాలి?
జ: 24

 

14. రూ.2400 కంటే రూ.2000 విలువ ఎంత శాతం తక్కువ?
జ: 16 2/3%

15. డాక్టర్లు, లాయర్ల సరాసరి వయసు 40. డాక్టర్ల సరాసరి వయసు 35, లాయర్ల సరాసరి వయసు 50 అయితే డాక్టర్లు, లాయర్ల సంఖ్యల నిష్పత్తి ఎంత?
జ: 2 : 1

 

16. A : B : C = 2 : 3 : 4 అయితే 
జ: 8 : 9 : 24

 

17. ఒక వ్యక్తి 30 శాతం జీతాన్ని ఇంటి అద్దెకు, మిగిలిన జీతంలో 75 శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తే పొదుపు శాతం ఎంత?
జ: 17.5

 

18. ఒక చతురస్ర భుజాన్ని 5 శాతం పెంచితే వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత?
జ: 10.25%

 

19. x : 8 :: 25 : 40 అయితే x =
జ: 5

 

20. కిందివాటిలో 3 : 8 నిష్పత్తికి సమానమైంది?
జ: 37.5%

 

21. 10 శాతం బారువడ్డీ చొప్పున రూ.6880 ఎంత కాలానికి రూ.7224 అవుతుంది?
జ: 6 నెలలు

22. ఒక వస్తువు ప్రతి సంవత్సరం 20% తగ్గుతుంది. 2 సంవత్సరాల తర్వాత దాని విలువ రూ. 19,200 అయితే అసలు విలువ ఎంత?
జ: రూ.30,000

 

23. గత సంవత్సరం చక్కెర ధర కిలో రూ.40. ఈ సంవత్సరం రూ.50. అయితే పెరుగుదల శాతం ఎంత?
జ: 25%

 

24. ఒక వ్యక్తి రెండు సైకిళ్లను ఒక్కొక్కటి రూ.3000కు అమ్మితే ఒకదానిపై 20% లాభం, మరొకదానిపై 20% నష్టం వచ్చింది. మొత్తంమీద అతడికి లాభమా లేదా నష్టమా?
జ: 4% నష్టం

 

25. ఒక నియోజకవర్గంలో 12,000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారు. అయితే ఓటు వేసిన వారి సంఖ్య ఎంత?
జ: 7,200

 

26. 300 యొక్క 50% లో 50% విలువ
జ: 75

 

27. 13, 52ల అనుపాత మధ్యమం
జ: 26

28. కిందివాటిలో అనుపాతంలో లేని క్రమం?
       1) 3, 5, 6, 8        2) 4, 6, 8, 12        3) 2, 4, 6, 12        4) 3, 4, 9, 12
జ: 1 (3, 5, 6, 8)

 

29. ఒక జత బూట్ల ఖరీదు రూ.450. దానిపై 6% అమ్మకపు పన్ను వసూలు చేస్తే మొత్తం బిల్లు ఎంత?
జ: రూ.477

 

30. అసలు రూ.8250పై 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ రేటు చొప్పున వడ్డీ ఎంత?
జ: రూ.1980 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌