• facebook
  • whatsapp
  • telegram

ధ్వని పరిణామం - భేదాలు

1. వర్ణ సమీకరణం: సమీకరణం అంటే కూడిక. అంటే రెండు భిన్న వర్ణాలు కలిసి ఏక వర్ణంగా మారడాన్ని వర్ణ సమీకరణం అంటారు. ఇవి రెండు రకాలు. అవి:
(i) పూర్వ వర్ణ సమీకరణం:
ఉదా: గది + లు = గదులు
పది + లు = పదులు
ములికి + లు = ములుకులు
పలికి + లు = పలుకులు
(ii) పరవర్ణ సమీకరణం:
గది + కు = గదికి
మది + కు = మదికి
వాని + కు = వానికి
నది + కు = నదికి

 

2. వర్ణ విభేదం: ఒకే ధ్వనిని గాబరా, తడబాటు వల్ల రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని వర్ణ విభేదం అంటారు. ఇది వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైంది.
ఉదా: వచించు + ఇంచు = వచింపించు
ఆవులించు + ఇంచు = ఆవులింపించు
చూచు + ఇంచు = చూపించు

 

3. వర్ణ వ్యత్యయం: ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడం.
ఉదా: నవ్వులాట - నవ్వుటాల
వారణాసి - వాసిణార
గజదొంగ - జగదొంగ
శతకం - తశకం
పున్నాగపూలు - పూగపున్నాలు
మోటతోలాలి - తోటమోలాలి

 

4. వర్ణాగమం: సామ్యం వల్ల ప్రామాణికం కాదనే భావంతో కొత్త వర్ణాలు, పదాల్లో చేరడాన్ని వర్ణాగమం అంటారు.
ఉదా: కోలాటం - కోలాటకం
దొంగాటం - దొంగాటకం
నడిరేయి - నడికిరేయి

5. వర్ణలోపం: ఒక పదంలో ఏదైనా వర్ణం లోపించడం.
ఉదా: నిప్పు + పుల్ల = నిప్పుల్ల
రెప్ప + పాటు - రెప్పాటు
కంచు + చెంబు - కంచెంబు

 

6. అజాదిత్వం: కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడం.
ఉదా: రథం - అరథం
స్కేలు - ఇస్కేలు
స్కూలు - ఇస్కూలు
స్కూటరు - ఇస్కూటరు

 

7. స్వరభక్తి: భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడం.
ఉదా: రాత్రి - రాతిరి
నిద్ర - నిదర
మర్యాద - మరియాద
అల్పము - అలుపము

 

8. తాలవ్యీకరణం: మూల ద్రావిడ భాషలోని పదాది ‘క’కారం ‘చ’కారంగా మారడం
ఉదా: కెందొన - చెందొన
కెంపు - చెంపు
కెందొవ - చెందొవ
కెఱయ్‌ - చెఱయ్‌

 

9. లోపదీర్ఘం: ఒక వర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి పూర్వ స్వరం దీర్ఘమవడం.
ఉదా: గుర్రములు - గుర్రాలు
కంచములు - కంచాలు
వజ్రములు - వజ్రాలు
చివుకు - చీకు

 

10. అనుచిత విభాగం: పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడం.
ఉదా: చిళి + కళ్‌ = చిలుకలు (చిలుక + లు)
ఎళి + కళ్‌ = ఎలికలు (ఎలుక + లు)

 

11. ద్విత్వకల్పనం: కొన్ని పదాల్లో ద్విత్వం లేకపోయినా కల్పించి చెప్పడం.
ఉదా: తలకిందులు - తల్లకిందులు
తెలవారు - తెల్లవారు

Posted Date : 26-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌