• facebook
  • whatsapp
  • telegram

గణిత బోధనలో గల సాంకేతిక విధానాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పలుమార్లు ఒకే మాదిరి సమస్యలను సంఖ్యా మార్పులతో చేయడం ఏ సాంకేతిక విధానాన్ని సూచిస్తుంది?
జ: ఆవర్తనం

 

2. ఊర్ధ్వ, అధః కోణాలను తెలుసుకుని కొండలు, భవనాల ఎత్తులను గణించే విధానాన్ని బోధించడానికి ఉపయోగపడేది
జ: రేఖాగణితంలో మౌఖికపని

 

3. పనిలో పరిపూర్ణత ఇచ్చేది
1) మౌఖిక‌ప‌ని     2) నియోజ‌నం    3) ఆవ‌ర్తనం     4) రాత‌ప‌ని
జ: 4(రాతపని)

 

4. కన్నులను, చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించే సాంకేతిక విధానం
జ: మౌఖికపని

 

5. వ్యక్తి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఆధారపడి ఉండే సాంకేతిక విధానం
1) మౌఖిక‌ప‌ని     2) రాత‌ప‌ని     3) నియోజ‌నం    4) ఆవ‌ర్తనం
జ: 1(మౌఖికపని)

 

6. మౌఖికపని వల్ల అభివృద్ధి చెందేది
1) ఆలోచించడం        2) మానసిక సంసిద్ధత         3) చురుకుదనం       4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

7. ఆవర్తనానికి సమయం
జ: 20 నిమిషాలకు మించకూడదు

 

8. విద్యార్థిలో స్వయం అధ్యయనశక్తిని పెంపొందించే గణిత బోధనా సాంకేతిక విధానం
జ: నియోజనం

 

9. ఆవర్తన విధానం వల్ల ఉపయోగం
1) నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది
2) సమస్య పట్ల వెచ్చించే కాలాన్ని పొదుపు చేస్తూ ఉన్నతికి తోడ్పడుతుంది
3) వివిధ సన్నివేశాల్లో ఎలా నడచుకోవాలో తెలుపుతుంది
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

10. ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత భావనలను, పాఠ్యాంశాలను విద్యార్థులు అర్థం చేసుకుని దానిలో గల అంతర, బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారని చెప్పినవారు
1) లాంగ్      2) గెస్టాల్ట్     3) శామ్యూల్      4) లెస్టర్ బి. శాండ్స్‌
జ:  2(గెస్టాల్ట్)

 

11. బోధనలో ఏ సాంకేతిక విధానం ద్వారా ఉచ్ఛారణ దోషాలను సరిచేయవచ్చు?
జ: మౌఖికపని

 

12. గణితశాస్త్రంలో భావనలు, సూత్రాలు, నియమాల స్థిరీకరణకు తోడ్పడేది?
జ: ఆవర్తనం

 

13. బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇచ్చేది
జ: నియోజనం

 

14. నియోజనం ద్వారా ఇవ్వదగింది
1) గణిత సమస్యలను సాధించడం
2) పజిల్స్
3) ఒక శీర్షికకు సంబంధించిన చారిత్రక విషయాలను అధ్యయనం చేయడం
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

15. కిందివాటిలో గణితశాస్త్ర అభ్యసనకు సరిపోయేది
1) మౌఖిక‌ప‌ని      2) రాత‌ప‌ని     3) ఆవ‌ర్తనం     4) నియోజ‌నం
జ: 3(ఆవర్తనం)

 

16. నియోజనం లక్షణం కానిది
1) విద్యార్థి స‌మ‌స్యా సాధ‌నా నైపుణ్యం పెంపొందుతుంది.
2) విద్యార్థి పూర్వజ్ఞాన‌, అనుభ‌వాల‌తో సంబంధం ఉండాలి.
3) పూర్తిచేయ‌డానికి కాల నిర్ణయం ఉండాలి.
4) లిఖిత పూర్వక‌మైన‌వి కావచ్చు లేదా ప్రయోగాత్మకం కావ‌చ్చు
జ: 1(విద్యార్థి సమస్యా సాధనా నైపుణ్యం పెంపొందుతుంది.)

 

17. గణితశాస్త్రానికి రెండు కళ్లు లాంటివి
జ: వేగం, కచ్చితత్వం

 

18. వేగం పెంపొందించే మార్గం
1) కచ్చితత్వాన్ని పెంపొందించడం
2) అలవాటు చేయడం
3) సులభ మార్గాలను అనుసరించడం
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

19. వేగం పెంపొందించే మార్గం కానిది
1) ఉప‌క‌ర‌ణాల ఉప‌యోగాన్ని త‌గ్గించ‌డం     2) క‌చ్చిత‌త్వాన్ని పెంపొందించ‌డం
3) స‌మ‌స్యను స‌రిగ్గా విశ్లేషించ‌డం           4) సుల‌భ మార్గాల‌ను, ప‌ద్ధతుల‌ను అనుస‌రించ‌డం
జ: 3(సమస్యను సరిగ్గా విశ్లేషించడం)

 

20. నియోజనాలను విద్యార్థుల స్థాయికి తగిన విధంగా తయారుచేయడానికి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి?
జ: నిత్య అభ్యాసకుడిగా

 

21. సిలబస్‌లో గల ఖాళీలను పూరించేవి
జ: నియోజనం

 

22. నియోజనం ఆవశ్యకత
1) బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి
2) పాఠ్యాంశానికి సంబంధించి అధిక సమాచార సేకరణకు
3) గణిత వాజ్ఞ్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

23. రాతపనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త
1) సమయ నిర్దేశం ఉండాలి
2) అందరికీ అర్థమయ్యేలా ఉండాలి
3) శుభ్రతకు గల ప్రాధాన్యాన్ని విద్యార్థి గ్రహించేలా చేయాలి
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌