• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలు.
1. జాతీయ పార్కులు
2. జూ పార్కులు
3. పక్షి సంరక్షణా కేంద్రాలు
4. వన్యప్రాణుల అభయారణ్యాలు (వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీస్‌)
5. టైగర్‌ రిజర్వ్‌లు
* 1973లో ప్రారంభించిన ‘ప్రాజెక్టు టైగర్‌’ అనే కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ కోసం టైగర్‌ రిజర్వ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
* ప్రస్తుతం మన దేశంలోని మొత్తం టైగర్‌ రిజర్వ్‌ల సంఖ్య 50. కమ్లాంగ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ 50వది.
6. ఎలిఫెంట్‌ రిజర్వ్‌లు
* 1992లో ప్రారంభించిన ‘ప్రాజెక్టు ఎలిఫెంట్‌’ అనే కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణ కోసం ఎలిఫెంట్‌ రిజర్వ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
7. బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు (జీవావరణ ప్రాంతాలు)
* ప్రస్తుతం మన దేశంలోని మొత్తం బయోస్ఫియర్‌ రిజర్వ్‌ల సంఖ్య 18. 18వది పన్నా (మధ్యప్రదేశ్‌)లో ఉంది.
8. చిత్తడి నేలలు (వెట్‌ ల్యాండ్స్‌)
* అనేక రకాల జీవ జాతులకు ప్రధానంగా పక్షులకు ఆవాసంగా ఉంటాయి.
9. కోరల్‌ రీఫ్స్‌ (ప్రవాళ భిత్తికలు లేదా పగడపు దిబ్బలు)
* సముద్ర అంతర్భాగంలో అనేక రకాల జీవ జాతులు ఉంటాయి.
10. బయోడైవర్సిటీ ‘హాట్‌స్పాట్స్‌’ (జీవవైవిధ్య హాట్‌స్పాట్స్‌)
* ఒకప్పుడు అనేక రకాల వృక్ష, జంతు జాతులను కలిగి ఉండి అత్యధిక జీవవైవిధ్యతతో ఉండేవి. మానవ ప్రమేయం వల్ల సహజ ఆవాసాలు గణనీయమైన మార్పులకు లోనవుతూ ప్రస్తుతం అంతరించిపోయే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక జీవ జాతులను కలిగి ఉన్న ప్రాంతాలను ‘హాట్‌స్పాట్స్‌’గా పేర్కొంటారు.
11. మడ అడవులు (‘మాంగ్రూవ్‌’ ఫారెస్ట్స్‌)
* నదులు సముద్రాల్లో కలిసే చోట అంటే తీర ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరిగే అడవులను మడ అడవులుగా పిలుస్తారు.
* తుపాను, సునామీ లాంటి ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలను కాపాడే ‘సహజ రక్షణ వ్యవస్థలు’గా మడ అడవులను పేర్కొంటారు.

విశిష్టమైన లక్షణాలు ఉన్న జాతీయ పార్కులు - సంరక్షణా కేంద్రాలు
1. జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు, ఉత్తరాఖండ్‌
* భారతదేశ మొదటి జాతీయ పార్కు
* బ్రిటిష్‌వారి హయాంలో 1936లో ఏర్పాటు చేసిన ఈ జాతీయ పార్కు పాతపేరు ‘హైలీ జాతీయ పార్కు’.
* బ్రిటన్‌కు చెందిన వేటగాడు, సంరక్షకుడు జిమ్‌ కార్బెట్‌. ఇతడి పేరు మీదే ఈ పార్కుకు జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు అని పేరు పెట్టారు.
* యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ (UP) గవర్నర్‌గా పనిచేసిన బ్రిటన్‌ దేశస్థుడు విలియం మాల్కం హైలీ.
* ఈ జాతీయ పార్కు ‘రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌’కి ప్రసిద్ధిగాంచింది.
2. కీబుల్‌ లామ్‌జావో జాతీయ పార్కు, మణిపూర్‌
* ప్రపంచంలో ‘తేలియాడే’ ఏకైక జాతీయ పార్కుగా ప్రసిద్ధి చెందింది.
* తేలియాడే సరస్సుగా ప్రసిద్ధిగాంచిన మణిపూర్‌లోని లోక్‌తక్‌ సరస్సులో ఈ పార్కు ఉంది.
3. కజిరంగా జాతీయ పార్కు, అసోం
* ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు (రైనో) ప్రసిద్ధిగాంచింది.
4. నందన్‌కానన్‌ జూ పార్కు, ఒడిశా
* తెల్ల పులులకు ప్రసిద్ధిగాంచింది.
5. బీతర్‌కనికా జాతీయ పార్కు, ఒడిశా
* మొసళ్ల సంరక్షణా కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది.
* బీతర్‌కనికా మడ అడవులు ఒడిశాలో ఉన్నాయి.
6. గహిర్‌మాతా మెరైన్‌ సంరక్షణా కేంద్రం, ఒడిశా
* ఆలివ్‌ రిడ్లే సముద్రపు తాబేళ్ల సంరక్షణా కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది.
* సంతానోత్పత్తి కోసం ఆలివ్‌ రిడ్లే సముద్రపు తాబేళ్లు ఒడిశాలోని గహిర్‌మాతా బీచ్‌కి వచ్చే సమయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సముద్రంపై చేపల వేటను నిషేధిస్తుంది.
7. విక్రమశిల గాంగెటిక్‌ డాల్ఫిన్‌ సంరక్షణా కేంద్రం, బిహార్‌
* గంగానది ‘డాల్ఫిన్‌ల’ సంరక్షణా కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది.
* జాతీయ డాల్ఫిన్‌ పరిశోధన కేంద్రాన్ని బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని 2018, అక్టోబరులో నిర్ణయించారు.
* ఆసియాలోనే మొదటి డాల్ఫిన్‌ పరిశోధన కేంద్రంగా ఇది గుర్తింపు పొందనుంది.
8. గిర్‌ జాతీయ పార్కు, గుజరాత్‌
* ఆసియా సింహాలకు ప్రసిద్ధిచెందింది.
9. ఘనా జాతీయ పార్కు, రాజస్థాన్‌
* పక్షులకు ప్రసిద్ధిగాంచింది.
* దీన్నే భరత్‌పూర్‌ లేదా కియోలడియో లేదా కేవ్‌లాదేవ్‌ జాతీయ పార్కు అని కూడా అంటారు.
* ప్రముఖ ఆర్నిథాలజిస్టు, పక్షి శాస్త్రవేత్త డాక్టర్‌ సలీం అలీ చేసిన కృషి మేరకు ఈ జాతీయ పార్కుని నెలకొల్పారు.
10. డాక్టర్‌ సలీం అలీ
* ఈయన ‘బర్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందారు.
* ఆత్మకథ The fall of a Sparrow
* సలీం అలీ జాతీయ పార్కు జమ్మూ కశ్మీర్‌లో ఉంది.
* సలీం అలీ పక్షి సంరక్షణా కేంద్రం గోవాలో ఉంది.
* ‘సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ అండ్‌ నేచురల్‌ హిస్టరీ’ అనే పక్షి పరిశోధన కేంద్రం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది.
* పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ‘ఆర్నిథాలజీ’.
11. మహావీర్‌ హరిణ వనస్థలి జాతీయ పార్కు, హైదరాబాద్‌ (తెలంగాణ)
* జింకలకు ప్రసిద్ధి.
12. రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం, కర్నూల్‌ (ఆంధ్రప్రదేశ్‌)
* అంతరించిపోయే స్థితికి చేరుకున్న అత్యంత అరుదైన పక్షి బట్టమేకల పిట్టకి ఈ కేంద్రం ప్రధాన ఆవాసంగా ఉంది.
13. శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణా కేంద్రం, వై.ఎస్‌.ఆర్‌ కడప (ఆంధ్రప్రదేశ్‌)
* ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షిగా భావించే అంతరించిపోయే స్థితిలో ఉన్న కలివికోడి అనే పక్షికి ఈ కేంద్రం ప్రధాన ఆవాసంగా ఉంది.
14. సైలెంట్‌ వ్యాలీ లేదా నిశ్శబ్ద లోయ జాతీయ పార్కు, కేరళ
* సింహ తోక కోతులకు ప్రసిద్ధిచెందింది.
15. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ జాతీయ పార్కు, ఉత్తరాఖండ్‌
* పూలకు ప్రసిద్ధిగాంచింది.
16. బన్నేర్‌ఘట్టా జాతీయ పార్కు, బెంగళూరు
* బెంగళూరు నగరానికి సమీపంలో ఉన్న ఈ పార్కు సీతాకోకచిలుకలకు ప్రసిద్ధిగాంచింది.
* భారతదేశ మొదటి బటర్‌ఫ్లై పార్కుని ఇక్కడే నెలకొల్పారు.
17. బందీపూర్‌ జాతీయ పార్కు, కర్ణాటక
* ఏనుగులకు ప్రసిద్ధిచెందింది.
18. గిండీ జాతీయ పార్కు, చెన్నై (తమిళనాడు)
* పాములకు ప్రసిద్ధిగాంచింది.

ముఖ్యమైన పక్షి సంరక్షణా కేంద్రాలు
1. భరత్‌పూర్‌ - రాజస్థాన్‌
2. నేలపట్టు - నెల్లూరు (ఆంధ్రప్రదేశ్‌)
3. రంగనతిట్టు - కర్ణాటక
4. వెట్టంగూడి - తమిళనాడు
5. వేదంతగళ్‌ - తమిళనాడు
6. ఫ్లెమింగో కాలనీ - గుజరాత్‌
7. సుల్తాన్‌పూర్‌ - హరియాణా
8. సలీం అలీ - గోవా
9. తట్టేకద్‌ - కేరళ

రామ్యులస్‌ విటేకర్
* అమెరికా దేశస్థుడు, ప్రముఖ హెర్పటాలజిస్టు, వన్యప్రాణి సంరక్షకుడు.
* సరీసృపాల పరిశోధన, సంరక్షణకు ఎనలేని కృషిచేసినందుకు భారత రాష్ట్రపతి ఈయనను 2018లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
* ఈయన ‘స్నేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు పొందారు.
* ఈయన చేసిన విశేషమైన కృషి వల్ల గిండీ జాతీయ పార్కులో ప్రత్యేకంగా ‘చెన్నై స్నేక్‌ పార్కు’ని, ‘మద్రాస్‌ క్రొకొడైల్‌ బ్యాంక్‌ ట్రస్ట్‌ అండ్‌ సెంటర్‌ ఫర్‌ హెర్పటాలజీ’ని నెలకొల్పారు.
* సరీసృపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ‘హెర్పటాలజీ’.
* సర్పాల (పాములు) గురించి అధ్యయనం చేసే శాస్త్రం ‘ఓఫియాలజీ’.

యునెస్కో - ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకున్న భారత జాతీయ పార్కులు, అభయారణ్యాలు
* ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యునెస్కో’ (ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) ఏటా విడుదల చేసే ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుంచి కింది జాతీయ పార్కులకు, అభయారణ్యాలకు చోటు దక్కింది.
1. 1985 - కజిరంగా జాతీయ పార్కు - అసోం
2. 1985 - మానస్‌ వన్యప్రాణి అభయారణ్యం - అసోం
3. 1985 - కేవ్‌లాదేవ్‌ జాతీయ పార్కు - రాజస్థాన్‌
4. 1988 - నందాదేవి, వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ జాతీయ పార్కులు - ఉత్తరాఖండ్‌
5. 1987 - సుందర్బన్స్‌ జాతీయ పార్కు - పశ్చిమ్‌ బంగ
6. 2012 - పశ్చిమ కనుమలు
* తమిళనాడు నుంచి గుజరాత్‌ వరకు (మొత్తం 6 రాష్ట్రాల్లో) పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి.
7. 2014 - గ్రేట్‌ హిమాలయన్‌ జాతీయ పార్కు - హిమాచల్‌ ప్రదేశ్‌
8. 2016 - కాంచన్‌జంగ జాతీయ పార్కు - సిక్కిం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌