• facebook
  • whatsapp
  • telegram

సహజ వనరులు (గాలి, నీరు)

బిట్లు


1. గాలిలో ఉండే వాయువులు
    A) నైట్రోజన్, ఆక్సిజన్                          B) కార్బన్ డై ఆక్సైడ్, నీటిఆవిరి
    C) ఆర్గాన్, దుమ్ము, ధూళి                    D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

 

2. గాలికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
    A) వస్తువులు మండటానికి గాలి అవసరం
    B) గాలి పీడనం కలిగిస్తుంది
    C) వేడిచేస్తే గాలి వ్యాకోచిస్తుంది
    D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

 

3. గాలి కలగజేసే పీడనం ఏది?
    A) ఊర్థ్వపీడనం     B) అధోపీడనం      C) పార్శ్వపీడనం      D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

 

4. గ్లాసు నిండా నీటిని పోసి దానిపై పేపరు ముక్కను ఉంచి, గ్లాసును తలకిందులుగా చేస్తే, పేపరు ముక్క కిందపడిపోదు. కారణం?
జ‌: గాలి ఊర్థ్వపీడనం

 

5. ప్లాస్టిక్ మినరల్ సీసాలో వేడినీటిని పోసి మూతపెట్టి ఉంచితే సీసా పక్క భాగాలు లోపలికి నెట్టబడటానికి కారణం?
జ‌: గాలి పార్శ్వపీడనం

 

6. ఘనపరిమాణం రీత్యా గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్‌ల నిష్పత్తి...
జ‌: 4 : 1

 

7. గాలిలో నత్రజని ఎంతశాతం ఉంటుంది?
జ‌: 78.09%

 

8. గాలిలో ఆక్సిజన్ ఎంతశాతం ఉంటుంది?
జ‌: 20.93%

 

9. గాలిలో ఆర్గాన్ శాతం....
జ‌: 0.93%

 

10. గాలిలో CO2 శాతం ఎంత?
జ‌: 0.04%

 

11. వస్తువులు మండటానికి సహకరించే వాయువు ఏది?
జ‌: O2

 

12. సున్నపుతేట పాలలా తెల్లగా మారడానికి కారణం గాలిలోని ....
జ‌: CO2

 

13. గాలి వేడెక్కి పైకి వెళ్లినప్పుడు ఆ ప్రదేశ పీడనం
జ‌: తగ్గుతుంది

 

14. ఏ వ్యత్యాసాల కారణంగా భూమి మీద పవనాలు కదలికలకు గురవుతున్నాయి?
జ‌: ఉష్ణోగ్రత

 

15. ఏ సమయంలో భూమి నుంచి గాలులు సముద్రం మీదకి వీస్తాయి?
జ‌: రాత్రి వేళలో

 

16. గాలి పీడనంలో తేడా వల్ల ఏర్పడే అధిక పీడన గాలులు దేనికి దారితీస్తాయి?
జ‌: తుపానులు

 

17. గాలి సాంద్రత పెరిగితే పీడనం
జ‌: పెరుగుతుంది

 

18. పెనుగాలులు
జ‌: ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి వీస్తాయి.

 

19. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
     A) గాలి ఎక్కువ వడితో వీచేటప్పుడు అది కలగజేసే పీడనం ఎక్కువ.
    B) బంధించిన వాయువుపై పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది.
    C) ఆర్ద్రత కలిగిన గాలికి పొడిగాలి కంటే ఎక్కువ సాంద్రత ఉంటుంది.
    D) ఎత్తు పెరిగితే వాతావరణ పీడనం పెరుగుతుంది.
జ‌: B (బంధించిన వాయువుపై పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది)

 

20. ఒక లీటరు గాలి బరువు గ్రాముల్లో ఎంత?
జ‌: 1.29

 

21. స్ట్రా, సిరంజి, ఇంక్ ఫిల్లర్లు దేని ఆధారంగా పనిచేస్తాయి?
జ‌: గాలి ఒత్తిడిలోని తేడా వల్ల

 

22. భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుమండలాన్ని ఏమంటారు?
జ‌: వాతావరణం

 

23. గాలి వేగాన్ని, దిశను కొలిచేందుకు ఉపయోగించేది
జ‌: అనిమోమీటర్

 

24. వాతావరణ పీడనాన్ని కొలిచేందుకు ఉపయోగించే సాధనం
జ‌: భారమితి

 

25. తొట్టి భారమితిని నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: టార్‌సెల్లీ

 

26. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం
జ‌: 76 సెం.మీ.

 

27. పాదరస భారమితిలో టారిసెల్లీ శూన్య ప్రదేశం ఎత్తు సముద్రమట్టం వద్ద ఎంత ఉంటుంది?
జ‌: 24 సెం.మీ.

 

28. సముద్రమట్టం కంటే దిగువ ఉన్న ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎలా ఉంటుంది?
జ‌: ఎక్కువగా

 

29. సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ వాతావరణ పీడనం
జ‌: తగ్గుతుంది

 

30. ఒక ప్రదేశం సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందో తెలుసుకునేందుకు దేన్ని ఉపయోగిస్తారు?
జ‌: భారమితి (పాదరస స్తంభం ఎత్తు)

 

31. సముద్రమట్టం నుంచి ప్రతి 272.7 మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఎంత పీడనం తగ్గుతుంది?
జ‌: 2.54 సెం.మీ.

 

32. పాదరస భారమితిలో పాదరస మట్టం నిదానంగా తగ్గితే అది దేన్ని సూచిస్తుంది?
జ‌: రాబోయే వర్షాన్ని సూచిస్తుంది.

 

33. పాదరస భారమితిలో పాదరస మట్టం ఒక్కసారిగా తగ్గితే అది దేన్ని సూచిస్తుంది?
జ‌: తుపానుల రాకను

 

34. విమానాల్లో ఎత్తును కొలిచేందుకు ఉపయోగించే సాధనం
జ‌: అల్టీమీటర్

 

35. వెర్నియర్ స్కేలును అమర్చి ఉన్న ప్రామాణిక భారమితి ఏది?
జ‌: ఫార్టిన్ భారమితి

 

36. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకుపోయేందుకు వీలుగా ఉండే భారమితి ఏది?
జ‌: అనార్ద్ర భారమితి

 

37. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయు ఘనపరిమాణం, దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుందని తెలియజేసే నియమం ఏది?
జ‌: బాయిల్ నియమం

 

38. మన గదిలో సీలింగ్ ఫ్యాను తిరిగేటప్పుడు గోడకు ఉన్న క్యాలెండర్ కాగితాలు ఫ్యాను వైపునకు ఎగరడానికి కారణమయ్యే నియమం ఏది?
జ‌: బెర్నౌలీ నియమం

 

39. తుపాను వచ్చినప్పుడు గాలి చాలా ఎక్కువ వేగంతో వీస్తుంది. అప్పుడు తాటాకు పూరిళ్ల కప్పులు పైకి ఎగిరిపోవడానికి కారణం?
జ‌: బెర్నౌలీ నియమం

 

40. కిందివాటిలో బెర్నౌలీ నియమం అనువర్తనం ఏది?
      A) విమానాలు, హెలికాప్టర్‌లు గాలిలో పైకి ఎగరడం.
      B) గాలిపటం గాలిలో పైకి ఎగరడం.
      C) స్ప్రేయర్‌తో రైతు పురుగుమందులను పంటలపై పిచికారీ చేయడం.
      D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

 

41. సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరిగితే
జ‌: సాంద్రత తగ్గుతుంది

 

42. డైన్/సెం.మీ.2 దేనికి ప్రమాణం
జ‌: పీడనం

 

43. ఒక రాయి బరువు గాలిలో 20 గ్రా., నీటిలో 15 గ్రా. అయితే దాని సాపేక్ష సాంద్రతను లెక్కించండి.
జ‌: 3

 

44. ఒక ఇనుపగోళం బరువు గాలిలో 40 గ్రా., ఇనుము సాపేక్ష సాంద్రత 8 దాని బరువు నీటిలో ఎంత ఉంటుంది?
జ‌: 35 గ్రా.

 

45. ఒక వస్తువు బరువు గాలిలో 40 గ్రా., నీటిలో 20 గ్రా., ద్రవంలో 24 గ్రాములు అయితే ద్రవం సాపేక్ష సాంద్రతను లెక్కించండి.
జ‌: 0.8

 

46. కిందివాటిలో సార్వత్రిక ద్రావణి ఏది?
       A) ఆల్కహాల్         B) పెట్రోల్          C) నీరు               D) గ్లిసరిన్
జ‌: C (నీరు)

 

47. ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉండే పదార్థం
జ‌: హైడ్రోజన్ మోనాక్సైడ్

 

48. నీటి రసాయన నామం ఏది?
జ‌: హైడ్రోజన్ మోనాక్సైడ్

 

49. మానవ శరీరంలో ఉండే నీటిశాతం సుమారుగా
జ‌: 60 - 70%

 

50. మొదటిసారి కృత్రిమంగా నీటిని ప్రయోగశాలలో రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: కావెండిష్

 

51. ప్రపంచంలోని నీటి లభ్యతలో మహాసముద్రాల శాతం
జ‌: 97.33%

 

52. ప్రపంచ నీటి లభ్యతలో భూగర్భ జలాల శాతం
జ‌: 0.61%

 

53. ప్రపంచ నీటి లభ్యతలో ధృవాల వద్ద మంచు హిమానీల శాతం
జ‌: 2.04%

 

54. ప్రపంచ నీటి లభ్యతలో సముద్రాల శాతం
జ‌: 0.008%

 

55. వాయుప్రావస్థలో జలాణువు ఆకృతి
జ‌: కోణీయం

 

56. నీటి అణువులో HOH బంధకోణం
జ‌: 104º31'

 

57. నీటి అణువులో O - H బంధదైర్ఘ్యం
జ‌: 95.7 pm

 

58. నీటి ఘనపరిమాణాత్మక సంఘటనంలో హైడ్రోజన్, ఆక్సిజన్‌ల నిష్పత్తి
జ‌: 2 : 1

 

59. సబ్బుతో నీటి చర్యను బట్టి నీటిని ఎన్నిరకాలుగా విభజించారు?
జ‌: 2

 

60. కరిగిన కాల్షియం, మెగ్నీషియం లవణాలు లేని నీటిని ఏమంటారు?
జ‌: మృదుజలం

 

61. సబ్బుతో తేలికగా నురగను ఇచ్చే జలం?
జ‌: మృదుజలం

 

62. హైడ్రోజన్ కార్బోనేట్, క్లోరైడ్, సల్ఫేట్, కాల్షియం, మెగ్నీషియం లవణాలు ఉన్న జలాన్ని ఏమంటారు?
జ‌: కఠినజలం

 

63. సబ్బుతో త్వరగా నురగను ఇవ్వని జలం ఏది?
జ‌: కఠినజలం

 

64. మంచి నీటి లవణీయత శాతం ఎంత?
జ‌: 1.8 %

 

65. నీటిలో ఏవి కరగడం వల్ల దానికి తాత్కాలిక కఠినత్వం ఏర్పడుతుంది?
జ‌: మెగ్నీషియం, కాల్షియం, హైడ్రోజన్ కార్బోనేట్

 

66. నీటి తాత్కాలిక కఠినత్వాన్ని దేని ద్వారా తొలగించవచ్చు?
జ‌: నీటిని మరిగించడం, క్లార్క్ పద్ధతి ద్వారా

 

67. తడి సున్నాన్ని కలపడం ద్వారా నీటి తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు?
జ‌: క్లార్క్ పద్ధతి

 

68. నీటిలో ఏవి కరగడం వల్ల దానికి శాశ్వత కఠినత్వం ఏర్పడుతుంది?
      A) మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్   B) మెగ్నీషియం సల్ఫేట్
      C) కాల్షియం సల్ఫేట్                              D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

69. వాషింగ్ సోడా రసాయన నామం ఏది?
జ‌: సోడియం కార్బోనేట్

 

70. కఠినజలంలో కరిగి ఉన్న కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్‌లు, సల్ఫేట్‌లు దేనితో చర్య జరిపి కరగని కార్బోనేట్లుగా ఏర్పడతాయి?
జ‌: Na2CO3

 

71. Na6P6O18 ని కఠిన జలానికి కలిపి శాశ్వత కఠినత్వాన్ని తొలగించే పద్ధతిని ఏమంటారు?
జ‌: కాల్గన్ పద్ధతి

 

72. పెర్‌మ్యూటిట్ పద్ధతితో నీటిలోని ఏ కఠినత్వాన్ని తొలగించవచ్చు?
జ‌: శాశ్వత కఠినత్వాన్ని

 

73. పెర్‌మ్యూటిట్ పద్ధతిలో సాధు జలాన్ని త్వరగా పొందేందుకు ఏ పదార్థాన్ని కలుపుతారు
జ‌: NaCl

 

74. నీటిలోని శాశ్వత కఠినత్వాన్ని తొలగించేందుకు దోహదపడే పద్ధతి
       A) కాల్గాన్ పద్ధతి                         B) జియోలైట్ పద్ధతి
      C) అయాన్ల మార్పిడి పద్ధతి           D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

 

75. సోడియం పెర్‌మ్యూటిట్ ఫార్ములా
జ‌: NaAlSiO4

 

76. అయాన్ల మార్పిడి పద్ధతిలో Na+, Ca2+, Mg2+ లాంటి కాటయాన్‌లను వేటి ద్వారా స్థానభ్రంశం చెందిస్తారు?
జ‌: H+

 

77. అయాన్ల మార్పిడి పద్ధతిలో రుణ అయాన్లను ఏ అయాన్ల ద్వారా స్థానభ్రంశం చెందిస్తారు?
జ‌: OH

 

78. కఠినజలంలోని రుణ అయాన్లు ఏవి?
        A)

         B) Cl          C)             D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

79. కఠినజలంలో ఉన్న ధన అయాన్లు ఏవి?
      A) Na+      B) Ca2+        C) Mg2+           D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

80. విషపూరిత లోహాలు, వాట సమ్మేళనాలతో కలుషితమైన నీటి వల్ల కలిగేది
      A) అతిసార వ్యాధి                        B) చర్మ క్యాన్సర్
     C) చర్మ వ్యాధులు                        D) అన్నీ సరైనవే
జ‌: D (అన్నీ సరైనవే)

మాదిరి ప్రశ్నలు

81. నేలబొగ్గు, ఇతర శిలాజ ఇంధనాల దహనం వల్ల ఏ రకమైన కాలుష్యం ఏర్పడుతుంది?
జ‌: గాలి కాలుష్యం.

 

82. అడవుల నరికివేత వల్ల ఏ వాయువుల పరిమాణం పెరుగుతుంది?
జ‌: CO2, CO, SO2.

 

83. నీటి కాలుష్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే విలువలు ఏవి?
జ‌: BOD, COD విలువలు.

 

84. వాహనాల పొగలో 80% ఉండే వాయువు ఏది?
జ‌: Co

 

85. గాలిలో CO2 శాతం ఎంత?
జ‌: 0.03%.

 

86. ప్రధాన హరితగృహ వాయువు ఏది?
జ‌: CO2.

 

87. లోహ ధాతువులను కరిగించే ప్రక్రియలో బొగ్గు, కోక్ వాడకం వల్ల అధికంగా విడుదలయ్యే వాయువు ఏది?
జ‌: SO2.

 

88. అణుపరీక్షల వల్ల గాలిలోకి చేరే కాలుష్య కారక పదార్థం ఏది?
జ‌: స్ట్రాన్షియం 90.

 

89. ఊపిరి పీల్చుకోవడంలో బాధ కలిగించే కాలుష్య కారక పదార్థం ఏది?
జ‌: CO2.

 

90. విషపూరితం, మరణకారకం, బద్దకం, తలనొప్పి, మానసిక బాధలు కల్గించే కాలుష్య కారక వాయువులు ఏవి?
జ‌: CO2, SO2.

 

91. ఆకుల్లో పత్రహరితాన్ని, వృక్షాలను నాశనం చేసి, మొక్కల పెరుగుదలను అరికట్టే కాలుష్య కారక వాయువు ఏది?
జ‌: SO2.

 

92. ఏ కాలుష్య పదార్థం మానవులకు, జంతువులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది?
జ‌: SO2.

 

93. చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఎలర్జీలను కలగజేసే కాలుష్య పదార్థాలు ఏవి?
జ‌: జింక్, క్రోమియం, సీసపు అణువుల పొగలు.

 

94. క్యాన్సర్ వ్యాధికి, జంతు వృక్షాలకు హాని కలిగించే కాలుష్య కారక పదార్థం ఏది?
జ‌: స్ట్రాన్షియం 90.

 

95. చెవుడు, కేంద్రనాడీ మండలం వైఫల్యం, మానసిక వైకల్యం కలిగించేవి?
జ‌: అతిధ్వనులు.

 

96. నీటిలోకి క్లోరిన్ వాయువును పంపి సూక్ష్మజీవుల్ని సంహరించడాన్ని ఏమంటారు?
జ‌: క్లోరినేషన్.

 

97. తాగునీటిని శుభ్రపరచడంలో సెడిమెంటేషన్ ట్యాంకులో ఏ పదార్థాన్ని కలుపుతారు?
జ‌: పటిక (Alum)

 

98. తాగునీటి శుద్ధీకరణ ప్రక్రియలో ఏ భాగంలో బరువైన మలినాలు తేర్చబడతాయి?
జ‌: సెడిమెంటేషన్ ట్యాంక్‌లో.

 

99. తాగునీటి శుద్ధీకరణ ప్రక్రియలో తేలికైన, తేలియాడే మురికి కణాలను ఎక్కడ వేరు చేస్తారు?
జ‌: వడపోత ట్యాంకు.

 

100. నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియ ఏది?
జ‌: బాష్పీభవనం.

 

102. నీటిఆవిరి గాలికంటే తేలికగా ఉండటం వల్ల ఏర్పడేవి ఏవి?
జ‌: మేఘాలు.

 

102. వర్షించే మేఘాల రంగు ఏది?
జ‌: నలుపు.

 

103. గాలిలోని నీటిఆవిరి చిన్న నీటి బిందువులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
జ‌: తుషారం.

 

104. సాంద్రీకరణం చెందిన తుషార బిందువుల సమూహాన్ని ఏమంటారు?
జ‌: మేఘం.

 

105. మేఘాలు వేటిని తాకినప్పుడు వర్షాన్ని ఇస్తాయి?
జ‌: గాలి.

 

106. వర్షపు నీరు అంటే?
జ‌: చల్లారిన నీటిఆవిరి.

 

107. వర్షపాతాన్ని కొలిచేందుకు ఉపయోగించే సాధనం ఏది?
జ‌: వర్షమాపకం.

 

108. భారీ పెనుగాలులతో కూడిన వర్షం వల్ల ఏర్పడేది?
జ‌: తుపాను.

 

109. ''నిశ్చల స్థితిలో ఉన్న ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనం పెంచితే అది ఆ ద్రవంలోని అన్ని బిందువులకు, అన్ని దిశలకు సమానంగా మార్పులేకుండా వ్యాపిస్తుంది''. అని తెలిపే నియమం ఏది?
జ‌: పాస్కల్.

 

110. జలయంత్రాలు, బ్రామాప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తాయి?
జ‌: పాస్కల్ సూత్రం.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌