• facebook
  • whatsapp
  • telegram

టండ్రా మండలం

టండ్రా ప్రాంతాలు చాలా వరకు జనావాసాలు లేని శీతల ఎడారులు.
* అవి ధృవ ప్రాంతాన్ని నిరంతరం కప్పి ఉంచే మంచుపొరకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి.
* టండ్రా ప్రాంతాలు చాలా వరకూ ఉత్తరార్ధగోళానికి పరిమితమై ఉన్నాయి.
* ఇవి సుమారుగా ఆర్కిటిక్ వలయానికి, ధృవ హిమాచ్ఛాదిత ప్రాంతాలకూ మధ్య విస్తరించి ఉన్నాయి.
* ఈ ప్రాంతాలు ఉత్తర అమెరికా, కెనడాల ధృవం వైపు అంచుల్లో ప్రధానంగా ఉన్నాయి.
* గ్రీన్‌లాండ్ సముద్రతీర ప్రాంతాలు, ఆర్కిటిక్ మహాసముద్రంలో ద్వీపాలు ఉన్నాయి.
* అంటార్కిటికా ఖండం సముద్రతీర అంచుల్లో అక్కడక్కడా ఉన్న చిన్న ప్రాంతాలు కూడా ఈ మండలానికే చెందినా.. అంతగా ప్రాముఖ్యంలేని ప్రాంతాలుగా చెప్పవచ్చు.

 

శీతోష్ణస్థితి
* ఈ మండలంలో చలికాలం ఎక్కువ రోజులు ఉంటుంది. చలి చాలా అధికంగా ఉంటుంది.
* టండ్రా ప్రాంతాల్లో వేసవికాలంలో సుమారు మూడు నెలల పాటు వరుసగా ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు.

* సూర్యకిరణాలు ఏటవాలుగా ఉండటం వల్ల ఆ కిరణాల ద్వారా ప్రసారమయ్యే శక్తి చాలా వరకూ ఆ ప్రాంతాల్లోని భూమిని కప్పి ఉన్న మంచును కరిగించేందుకు ఉపయోగపడుతుంది.
* చలికాలంలో సూర్యుడు అసలు కనిపించడు. దీంతో చీకటి రాజ్యమేలుతుంది.
* సూర్యాస్తమయానికి తర్వాత, సూర్యోదయానికి ముందు చాలాకాలం పాటు ఆకాశంలో సంధ్యా వెలుతురు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో కటిక చీకటి ఏర్పడదు.
* ఈ కాలంలో భూమిని కప్పి ఉంచే మంచుపొర మీద పడి పరావర్తనం చెందే నక్షత్రాల కాంతి, ఆకాశంలో అప్పుడప్పుడూ ఏర్పడే ఆకుపచ్చ, ఎరుపురంగు తెరలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి.
* ఈ రంగు తెరలను 'అరోరా బోరియాలిస్' అంటారు.సంవత్సరంలో తొమ్మిది నెలలపాటు ఉష్ణోగ్రత, నీరు ఘనీభవించే స్థానం కంటే తక్కువగా ఉంటుంది.
* జనవరి, ఫిబ్రవరీల్లో వరుసగా - 34o, - 40o సెం.గ్రే. ఉష్ణోగ్రతలతో అతి తక్కువగా సరాసరి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
* సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంచెం అధికంగా ఉంటాయి.
* వేసవి కాలం చలిగా నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఆ కాలంలో పగటి పరిమాణం ఇతర కాలాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది.

* సరాసరి నెలవారీ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ 10oC కంటే తక్కువగా ఉంటాయి.
* వేసవికాలంలో అత్యధిక దైనిక ఉష్ణోగ్రతలు మాత్రం 21oC లను అధిగమించవచ్చు.
* ఈ ప్రకృతిసిద్ధ మండల అవపాతం ప్రధానంగా చక్రవాత రకానికి చెందింది.
* సంవత్సర సరాసరి అవపాతం సుమారుగా 25 సెం.మీ. వరకు ఉంటుంది.
* మిగతా కాలాల్లో కంటే వేసవికాలంలో అవపాతం ఎక్కువగా సంభవిస్తుంది.
* ఈ కాలంలో కొద్దిపాటి వర్షం కూడా సంభవిస్తుంది.
* ఈ ప్రాంతాల్లో చెట్లు లేని కారణంగా ఇక్కడ వీచే బలమైన గాలులు పిండిలా ఉండే మంచును తొలగించడం వల్ల విశాలమైన ప్రాంతాల్లో చలికాలంలో కూడా మంచుపొర కనిపించదు.


సహజవృక్ష సంపద
* టండ్రా మండలంలోని శీతోష్ణస్థితి, ఇతర పరిస్థితులు చెట్లు పెరగడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి.
* ఇక్కడి నేలల్లో నీరు నిరంతరం ఘనీభవించి ఉంటుంది.
* ఈ మండలంలో చెట్లు పెరగడానికి అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి.

 

టండ్రాలోని పొదలు
* టండ్రా ప్రాంతపు సరిహద్దుల్లో భూమిలో ఆల్టర్, బిర్చ్, విల్లో రకానికి చెందిన పొదలు పెరుగుతాయి.
* ఇవి కొద్ది ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి.

టండ్రాలో గడ్డి భూములు
* టండ్రాలో పొదల సరిహద్దుల్లో ప్రారంభమయ్యే గడ్డి భూములు విశాలమైన ప్రాంతాలను ఆక్రమిస్తాయి.
* ఈ భూముల్లో లైచెన్లు, సెడ్జిలు, అనేక రకాల పూలమొక్కలు పెరుగుతాయి.

 

టండ్రాలో ఎడారి వృక్షసంపద
* ధృవం వైపు చిన్న రకానికి చెందిన అంచుల్లో, విశాలమైన శిలామయ భూముల్లో అక్కడక్కడా ఏర్పడే వేసవికాలంలో మొక్కల పెరుగుదలకు సంబంధించిన వివిధ దశలను అత్యంత వేగంగా సాధిస్తాయి.
* మంచు కరిగిన వెంటనే చిన్న పూలమొక్కలు రంగు రంగుల పూలతో విశాలమైన ప్రాంతాల్లో రంగు తివాచీలను పరిచినట్లుగా ఉంటాయి.
* ఇక్కడ ప్రధానంగా పాపీ, తిల్లీ, బటర్‌కప్, వయెలెట్ లాంటి పూల మొక్కలు పెరుగుతాయి.

 

స్థానిక జంతు సంపద
* ఈ మండలంలో జీవించే జంతువుల్లో కస్తూరి మృగం, ధృవపు జింక, ధృవపు తోడేలు, ధృవపు గుంటనక్కలు, ధృవపు కుందేళ్లు, లెమింగ్ లాంటివి ముఖ్యమైనవి.
* వేసవికాలంలో లెక్కలేనన్ని కీటకాలు కనిపిస్తాయి.

* సంవత్సరం పొడవునా టార్మిగాన్, ధృవపు గుడ్లగూబ లాంటి వివిధ రకాల పక్షులు కూడా జీవిస్తాయి.
* రకరకాలుగా జీవించే పక్షులు గుంపులుగా ఉంటాయి. ఇటువంటి ప్రాంతాలను 'రూకరే' అంటారు.
* రెయిన్‌డీర్ మృగాల చర్మాలపై ఏర్పడే పొడవైన వెంట్రుకలు చివరలో మందంగా ఏర్పడటంతో శరీరానికి గాలి తగలని పొరగా ఏర్పడతాయి
* ఈ పొర శీతాకాలంలో శరీరానికి అవసరమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.
* ఇక్కడ జంతువుల చర్మాలు పరిసరాల నేలలు కప్పి ఉంచే మంచు పొరతో సమంగా తెల్లగా కనిపిస్తాయి. దీంతో శత్రువుల దృష్టిని మరల్చి వాటిని రక్షించుకోవడానికే కాకుండా శరీరం నుంచి అతితక్కువ ఉష్ణాన్ని మాత్రమే కోల్పోయేందుకు కూడా ఉపయోగపడతాయి.

 

ప్రజలు
* ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం పూర్తిగా జంతువులపైనే ఆధారపడతారు.
* వలసజీవనానికి అలవాటుపడ్డారు.
* వారి ప్రధాన వృత్తి వేటాడటం, చేపలను పట్టడం.
* యూరేషియాలోని టండ్రా మండలంలో కొద్ది సంఖ్యలో నివసించే లాప్‌లు మాత్రం రెయిన్‌డీర్‌ల పెంపకం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు.

* వీరు సముద్రజలాల్లో జీవించే వెచ్చని నెత్తురు ప్రసరించే మృగాలను వేటాడతారు.
* ధృవపు జింక అక్కడి ప్రజలకు మాంసం, పాలు, చర్మాన్ని అందిస్తుంది, రవాణాకు ఉపయోగపడుతుంది.
* ఇక్కడ దాదాపు పది నుంచి పద్నాలుగు స్లెడ్జ్ కుక్కలు గంటకు మూడు నుంచి ఏడు కిలోమీటర్ల వేగంతో ఒక టన్ను బరువు సరకును లాగగలవు.
* ఉత్తర అమెరికాలోని టండ్రా భూముల్లో ఎస్కీమోలు నివసిస్తున్నారు.
* వీరు కూడా యురేషియాలోని లాప్‌ల లాగా సంచార జీవితాన్ని కొనసాగిస్తూ వేట, చేపలు పట్టడం ద్వారా జీవనాన్ని గడుపుతున్నారు.
* అభివృద్ధి చెందిన శ్వేతజాతీయులు ఈ ధృవ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోలేదు.

 

ఆర్థిక ప్రగతి
* ఇటీవల స్థానిక ప్రభుత్వాలు ఈ ప్రకృతి స్థితి మండల ప్రాంతాల్లో ధృవపు జింకల పెంపకం క్షేత్రాలను నెలకొల్పాయి.
* ఈ ధృవపు జింకల క్షేత్రాల ద్వారా స్థానిక వాసుల ఆహార అవసరాలను పూర్తిగా తీర్చి వీరు సంచార జీవనాన్ని విడిచిపెట్టి స్థిర నివాసాలను ఏర్పరచుకోవడానికి చర్యలను చేపడుతున్నాయి.


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌