• facebook
  • whatsapp
  • telegram

సమశీతోష్ణమండల పచ్చిక బయళ్లు (స్టెప్పీ ప్రాంతం)

వర్షపాతం తగినంత లేకపోవడం వల్ల ఈ మండలంలోని విశాలమైన ప్రాంతాలు గడ్డి భూములుగా మారాయి.

* ఈ మండలంలో పచ్చిక బయళ్లు ప్రధాన వనరు.
* పశుపోషణ ఇక్కడ ప్రజల జీవనాధారం.
* ఒయాసిస్సుల వద్ద లేదా విలువైన ఖనిజాలు దొరికే ప్రదేశంలో జనావాసాలు ఉంటాయి.
* యూరేషియాలోని యుక్రైన్, పశ్చిమ ప్రాంతం, కాస్పియస్ సముద్రం ఈ మండలంలోని మధ్య ప్రాంతాలు. వాయువ్య చైనా ప్రాంతంలో ఉన్న లాయస్ మెట్ట భూములు; టర్కీలోని అన్‌టోలియా పీఠభూమి; స్పెయిన్‌లోని స్పానిష్ మెసేటా ఈ మండలంలోని ప్రాంతాలు.
* ఉత్తర అమెరికాలో తూర్పువైపున 100వ రేఖాంశం, పశ్చిమాన ఇంటల్ మౌంటైన్ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది.
* దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో యాండీస్ పర్వతాల వర్షాచ్ఛాయా ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రకృతి సిద్ధమండలాన్ని 'పెటగానియా' అని పిలుస్తారు.
* ఆఫ్రికాలో ఈ ప్రకృతి సిద్ధ మండలం డ్రీకెన్స్‌బర్గ్ పర్వతాల పశ్చిమం వైపున, ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఉన్న ఈస్టర్న్ హైలాండ్స్ పర్వతాలకు పశ్చిమంగా విస్తరించి ఉంది.

శీతోష్ణస్థితి
* ఈ అర్ధశుష్క ప్రాంతాలు అత్యధిక వేడిని, అతి తీవ్రమైన చలిని ప్రతిబింబిస్తాయి.
* ఈ ప్రకృతి సిద్ధ మండల భూభాగాలన్నింటిలో సంవత్సరం పొడవునా వాతావరణ ఆర్ద్రత తక్కువగా, వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండూ శీతోష్ణస్థితి విశిష్ట లక్షణాలు.
* భూమధ్యరేఖ వైపు ఉన్న సరిహద్దుల్లో వేసవి సగటు ఉష్ణోగ్రతలు 16ºo- 27o సెం.గ్రే. వరకు ఉంటాయి.
ఈ ప్రకృతి సిద్ధ ప్రాంతాలన్నింటిలో వేసవి సగటు ఉష్ణోగ్రతలు 16o - 27o సెం.గ్రే. వరకు ఉంటాయి. అత్యధిక వేసవి ఉష్ణోగ్రత 38o కంటే ఎక్కువుగా ఉంటుంది.

* చలికాల ఉష్ణోగ్రతలు -1o నుంచి 9o సెం.గ్రే. వరకూ ఉంటాయి. మంగోలియాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
* అప్పుడప్పుడు అకస్మాతుగా సంభవించే మంచుతుపానులు లేదా ఎడారి ప్రాంతాల నుంచి వీచే వడగాలులు స్థానిక ఉష్ణోగ్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
* ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల రాత్రి, పగలు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అధికంగా ఉంటాయి.
* ఈ మండలంలో వర్షపాతం తక్కువగా సంభవిస్తుంది.
* ఇది ఒక క్రమమైన పద్ధతిలో సంభవించదు.

* ప్రధానంగా వేసవి నెలల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సంవహన వర్షపాతం వస్తుంది.
* ఇక్కడ వర్షపాతం 25 - 50 సెం.మీ. వరకు ఉంటుంది.
* ఇక్కడ తరచుగా వడగండ్ల వర్షాలు పడటం వల్ల పంటలు నాశనం అవుతాయి.
* ఈ మండలంలో వర్షపాతం వరుసగా కొన్ని సంవత్సరాలు సంభవించి ఆ తర్వాత వరుసగా కొన్నేళ్ల పాటు కరవు పరిస్థితులు ఏర్పడతాయి.

 

స్థలాకృతి
* ఈ మండలంలో చదునుగా ఉండే విశాలమైన ఖండాతర్గత మైదానాలు ఉన్నాయి.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని నైరుతి ప్రాంతంలో ఉన్న కొలరాడో పీఠభూమిలో సుమారు 3,33,000 చ.కి.మీ. ప్రాంతంలో ప్రకృతి సిద్ధ ప్రపంచ వింతల్లో ఒకటైన 'ది గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలారాడో' ఉంది.

 

సహజ వృక్ష సంపద
* వర్షపాతం తగినంతగా లేకపోవడం వల్ల ఇక్కడి సహజ వృక్ష సంపద గడ్డి, చిట్టడవులు, ఎడారి వృక్ష సంపదలకు పరిమితమైంది.
* ఎత్తుగా ఉండే భూస్వరుపాల వాలులో, నీటి ప్రవాహాల అంచుల్లో మాత్రమే చెట్లు కనిపిస్తాయి.
* ఈ మండలంలో ఉన్న పచ్చిక బయళ్లను యూరేషియా ప్రాంతంలో స్టెప్పీలు; ఉత్తర అమెరికాలో ప్రయరీలు; దక్షిణ అమెరికాలో పంపాలు; దక్షిణాఫ్రికాలో వెల్డులు; ఆస్ట్రేలియాలో డౌనులు అని పిలుస్తారు.

స్థానిక జంతు సంపద
* ఆస్ట్రియాలోని స్టెప్పీ ప్రాంతాల్లో యాంటిలాప్‌లు, అడవి గాడిదలు, అడవి గుర్రాలు, ఒంటెలు, తోడేళ్లు ఉంటాయి.
* ఉత్తర అమెరికాలో జాక్‌కుందేళ్లు, ప్రయరీ కుక్కలు, అడవి దున్నలు, తోడేళ్లు చాలా కొద్దిగా రక్షిత ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తాయి.
* దక్షిణ అమెరికాలో ఎలుకలు, కుందేళ్లు లాంటి చిన్న జంతువులు మాత్రమే ఉంటాయి.
* దక్షిణాఫ్రికాలో ఉష్ణమండల పచ్చిక బయళ్లలో (సవన్నాలు) నివసించే జంతువులు ఉంటాయి.
* ఆస్ట్రేలియాలో ఎయూసిద్ధ మండలాల్లోని నేలలు సారవంతమైనవి. ఇక్కడి వర్షాభావ పరిస్థితుల వల్ల అవి పశుపోషణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

 

ప్రజలు
* ఈ మండలాల్లో జనాభా తక్కువ.
* స్థిరమైన మానవ ఆవాసాలు మాత్రం ఒయాసిస్సుల వద్ద మాత్రమే ఏర్పడ్డాయి.
* చైనా వాయువ్య ప్రాంతంలో ఉన్న లోయస్ భూముల్లో నీరు సమృద్ధిగా లభిస్తూ, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మాత్రమే జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక ప్రగతి

వ్యవసాయం: ఈ ప్రకృతి సిద్ధ మండలాల్లో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది.
* గోధుమ ఇక్కడి ప్రధాన పంట.

* చైనా స్వతంత్ర రాజ్యాల కామన్వెల్తు, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ పచ్చిక బయళ్లు ప్రపంచ గోధుమ ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి.
* టర్కీ, స్పెయిన్ దేశాలు కూడా పెద్ద మొత్తంలో గోధుమలను పిండి చేస్తున్నాయి.
* సాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో బీట్‌రూట్ దుంపలు, గోధుమ, వరి లాంటివి పండిస్తున్నారు.
* ఈ మండలంలోని అనేక ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో పశుపోషణ చేస్తుంటారు.
* ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గుర్రాలు, గొర్రెలు, మేకలు, యాక్ మృగాలు, ఒంటెలు తదితర జంతువులను మందలుగా పెంచుతారు.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెంచుతున్న అంగోరా జాతి గొర్రెల నుంచి అతి శ్రేష్ఠమైన ఉన్ని లభిస్తుంది.
* పెటగోనియా ప్రాంతంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నారు.
* ఇక్కడ వీటిని ఎస్టాన్షయాస్ అని పలిచే ఎస్టేట్‌లలో పెంచుతారు.

 

మత్స్య గ్రాహణం: ఆసియా ఖండంలో ఈ ప్రకృతి సిద్ధ మండల ప్రాంతాల్లో నల్ల సముద్రం, ఎజోల్ సముద్రం, అరల్ సముద్రం భూపరివేష్టిత సముద్రాల్లో అనేక సరస్సులు, నదుల్లో మత్స్య గ్రహణం చేస్తున్నారు.
* ఈ మండలంలో ప్రధానంగా కార్ప్, హెరింగ్, సాల్మన్, స్టేర్జియాన్ తదితర రకాల చేపలు లభిస్తున్నాయి.

 

ఖనిజ సంపద: ప్రకృతి సిద్ధ మండలంలో శ్రేష్ఠమైన ఇనుప ఖనిజం, నేలబొగ్గు, మాంగనీస్, రాగి, బంగారం, వజ్రాలు తదితర ఖనిజాలు లభిస్తున్నాయి.
* బంగారు నిక్షేపాలకు 'విటవాటర్స్ రాండ్', వజ్రాల నిక్షేపాలకు 'కింబర్లే' ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి.

 

పరిశ్రమలు: వ్యవసాయాధార పరిశ్రమలు ఈ మండలంలో ప్రధానమైనవి.
* మాంసం, పండ్లు, కూరగాయలు డబ్బాల్లో నింపడం, బీట్‌రూట్ దుంపల నుంచి పంచదారను తయారు చేయడం, గోధుమలను పిండి చేయడం, నూలు, పట్టువస్త్రాలను చేతితో అనేక కళాత్మక వస్తువులను తయారు చేయడం, వ్యవసాయ రంగానికి ఉపకరించే ట్రాక్టర్లు తదితర యంత్రాలు, పనిముట్లను తయారు చేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి.
* రసాయనాలు, సిమెంటు, అల్యూమినియం కర్మాగారాలు, నూనెశుద్ధి కర్మాగారాలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఇక్కడ ఇతర పరిశ్రమలు.

విహారయాత్ర కేంద్రాలు: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ పార్కులో అనేక ప్రకృతి వింతలు, చరిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి.
* ఈ దేశంలోని గ్రాండ్ కానియన్ ఆఫ్ ది కొలరాడో, కార్ల్స్, బడ్‌గుహలు తదితర ప్రదేశాలు అధిక సంఖ్యలో విదేశీ పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.
* ఇప్పటికీ జాగ్రత్తగా కాపాడుతున్న 'ఇండియన్‌'ల (రెడ్ ఇండియన్) పురాతన ఆవాసాల శిథిలాలు మెక్సికోకు అనేక మంది పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.

 

నగరాలు: ఈ ప్రకృతి సిద్ధ మండలంలో యూలాన్, బెటోల్, తాష్కెంట్, బాకూ, అంకారా, యాండ్రిడ్, డేన్వర్, న్యూమెక్సికో, సాల్ట్‌లెక్‌సిటీ, మాంటేరే, జోహన్స్‌బర్గ్, ప్రెటోరియా లాంటి అనేక నగరాలు ఉన్నాయి.
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌