• facebook
  • whatsapp
  • telegram

ఆర్ద్రత - అవపాతం  

కీలక పదాలు:
ఆర్ద్రత: గాలిలో ఉన్న నీటి ఆవిరే ఆర్ద్రత.

 

బాష్పీభవనం: నీరు ఆవిరిగా మారే ప్రక్రియే బాష్పీభవనం.
 

ఉత్పతనం: ఒక్కోసారి ఘనరూపంలో ఉన్న మంచు నీరుగా మారకుండా ఆవిరి రూపంలోకి మారడాన్ని ఉత్పతనం అంటారు.
 

భాష్పోత్సేకం: మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటిఆవిరిని విడుదల చేస్తాయి. దీన్ని భాష్పోత్సేకం అంటారు.
 

ఆర్ద్రత

* వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరినే ఆర్ద్రత అంటారు.
* ఉషోగ్రత పెరుగుతుంటే గాలికి తేమను కలిగి ఉండే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
* ఉష్ణోగ్రత తగ్గిన కొద్దీ తేమను భరించే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
* ఉష్ణోగ్రత ఆర్ద్రత ఎక్కువగా ఉంటే మనకు చాలా అసౌకర్యంగా ఉండి చెమట పడుతుంది. ఆ చెమట తొందరగా ఆవిరిగా మారదు. మన శరీరం జిగురుగా ఉండి ఉక్కగా ఉంటుంది.

అవపాతం

     నీటి తుంపరల పరిమాణం బరువు పెరిగినప్పుడు గాలికి ఆ నీటి తుంపరలను భరించే శక్తి ఉండదు. అవి తేమ రూపంలో కిందికి పడతాయి. ఇలా గాలిలోని తేమ భూమిపై పడటాన్ని అవపాతం అంటారు.
* ఈ అవపాతం వర్షం, మంచు, హిమం, పొగమంచు లేదా వడగండ్లుగా అనేక రూపాల్లో ఉంటుంది.

 

ముఖ్యాంశాలు:
ద్రవీభవనం:

     గాలి సంతృప్త స్థితిలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు తుషారస్థాయి కంటే తగ్గితే, ఆ గాలి నీటిఆవిరిని తనలో నిలిపి ఉంచే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. ఈ విధంగా ఆ నీటిఆవిరి నీరుగా (ద్రవ రూపంలోకి) లేదా మంచుగా (ఘన రూపంలోకి) మారడాన్ని ద్రవీభవనం అంటారు.

 

స్లీట్ (Sleet):
     భూ ఉపరితలాన్ని చేరిన నీటి బిందువులు, మంచు అణువులు కలిసి ఘనీభవించి భూమి ఉపరితలంపై ఒక పలుచటి మంచుపొరగా ఏర్పడినట్లయితే దాన్ని స్లీట్ అంటారు.

 

శ్వేతతుహినం:
    వాతావరణం ఉష్ణోగ్రతను అనుసరించి గాలిలోని నీటిఆవిరి ఎన్నో కోట్ల అతి సూక్ష్మమైన నీటి అణువులుగా లేదా మంచు అణువులుగా మారితే దాన్ని శ్వేతతుహినం అంటారు.


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌