• facebook
  • whatsapp
  • telegram

పీడనం - ప్రపంచ పీడన మేఖలు  

      వాయువు ఇతర పదార్థాల్లా బరువును కలిగి భూమి మీద, కింది పొరలపై పీడనాన్ని కలగజేస్తుంది.
 

వాతావరణ పీడనం
* ఒక నిర్ణీత ప్రదేశంలో దానిపై ఉన్న (ఆ ప్రదేశంపై) వాయురాశి బరువును వాతావరణ పీడనం అంటారు.
* వాయు పీడనాన్ని తెలుసుకోవడానికి భారమితి (పీడన మాపకం) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
* వాయువు భారమితిలో పాదరస మట్టం 760 మి.మీ. లేదా 1013.2 మిల్లీబార్లు. ఈ విధంగా ఉన్నప్పుడు అది ఎంత ఒత్తిడిని కలిగిస్తుందో దాన్ని ప్రామాణిక వాతావరణ పీడనం లేదా సామాన్య వాతావరణ పీడనం అంటారు.
* ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వాతావరణ పీడనం 1083.3 మిల్లీబార్లు. ఈ పీడనాన్ని సైబీరియాలోని అగాట వద్ద 1963, డిసెంబరు 31న నమోదయ్యింది.
* అత్యల్ప వాతావరణ పీడనం 870 మిల్లీబార్లు. దీన్ని టిప్ అనే తుపాను కేంద్రంలో 1979, అక్టోబరు 12న నమోదయ్యింది.

 

వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు
i) సరాసరి సముద్ర మట్టం నుంచి ఒక ప్రదేశం ఎత్తు
ii) ఉష్ణోగ్రత

iii) నీటి ఆవిరి
iv) వాతావరణ పీడనం, వాయు ప్రవాహాలు
* ఉష్ణోగ్రతకు - పీడనానికి, ఉష్ణోగ్రతకు - ఎత్తుకు, ఉష్ణోగ్రతకు - నీటిఆవిరికి మధ్య 'విలోమ సంబంధం' ఉంటుంది.

 

పీడన మేఖలు
* ఉష్ణోగ్రత, ఎత్తు; వాతావరణంలోని నీటిఆవిరి అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఒకేవిధంగా లేకపోవడం వల్ల భూమిపై కొన్ని ప్రదేశాల్లో అధిక పీడన ప్రాంతాలు, మరికొన్ని ప్రదేశాల్లో అల్ప పీడన ప్రాంతాలు ఏర్పడతాయి. 'వీటినే పీడన మేఖలు' అంటారు.
* భూమిపై మొత్తం నాలుగు రకాలకు చెందిన 7 పీడన మేఖలు ఉన్నాయి.
i) భూమధ్య రేఖ అల్పపీడన మేఖల (1)
ii) ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల (2)
iii) ఉప ధృవ అల్ప పీడన మేఖల (2)
iv) ధృవ అధిక పీడన మేఖల (2)

 

పీడన మేఖల విస్తరణ


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌