• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణోగ్రత - ఉష్ణోగ్రతను అదుపు చేసే కారకాలు  

ఒక ప్రదేశం వేడిగా లేదా చల్లగా ఉందా అనే విషయాన్ని ఆ ప్రదేశం ఉష్ణోగ్రత ద్వారా తెలుసుకోవచ్చు.
* ఉష్ణోగ్రతను ఉష్ణమాపకం అనే పరికరం ద్వారా కొలుస్తారు.
* వివిధ కొలమానాలను అనుసరించి ఉష్ణోగ్రతను సెల్సియస్, ఫారన్ హీట్, కెల్విన్, డిగ్రీల్లో తెలుపుతారు.
* అయితే శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రతను సాధారణంగా స్వీడన్ దేశానికి చెందిన మాండర్స్ సెల్సియస్ అనే ఖగోళ శాస్త్రవేత్త పేరుతో 'సెల్సియస్ డిగ్రీల్లో' తెలుపుతారు.
* భూ ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత సుమారు 13º సెల్సియస్.
* ఉష్ణోగ్రత భూ ఉపరితలం అంతా ఒకే విధంగా విస్తరించి ఉండదు. ఇది ప్రధానంగా ఒక ప్రదేశం ఎత్తు, అక్షాంశాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది.
* ఉష్ణోగ్రత విస్తరణ అనేది కింది కారణాల వల్ల ప్రభావితం అవుతుంది.
అవి: i) అక్షాంశం
     ii) భూమి, జలాల సాపేక్ష విస్తరణ
     iii) సముద్ర తీరం నుంచి ఉన్న దూరం
     iv) పవనాలు
     v) సముద్ర ప్రవాహాలు
     vi) నేలవాలు
     vii) మేఘాల స్థితి, వర్షపాతం

 

సమ ఉష్ణోగ్రత రేఖలు (ఐసోథెర్మ్): ప్రపంచంలో సమాన ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహా రేఖలు
సమ భారరేఖలు (ఐసోబార్స్): సమాన పీడనం కలిగి ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహా రేఖలు.
సమ వర్ష రేఖలు (ఐసోహైట్): సమాన వర్షపాతం కురిసిన ప్రాంతాలను కలుపుతూ గీసిన ఊహా రేఖలను సమవర్షపాత రేఖలు అని అంటారు.
 ప్రతి 1000 మీ. ఎత్తుకు ఉష్ణోగ్రత 6º చొప్పున తగ్గుతుంది.

 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌