• facebook
  • whatsapp
  • telegram

ప్రధాన భూస్వరూపాలు  

ప్రాథమిక భూస్వరూపాలు

* భూ ఉపరితలంపై భూభాగం కంటే జల భాగమే ఎక్కువగా ఉంటుంది. జలభాగం 71%, భూభాగం 29%గా ఉంది.
* సముద్రమట్టానికి పైన ఉండే భూమిని భూభాగం అని పిలుస్తారు.

 

ఖండచలన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెజెనర్ ప్రతిపాదించాడు. దీని ప్రకారం పూర్వం భూభాగం సంఘటితంగా ఇమిడి ఒకే భూఖండ భాగంగా ఉండేది. దీన్నే 'పేంజియా' అంటారు.
 

పెంథాల్సా: పేంజియాకు అన్ని వైపులా 'పెంథాల్సా' అనే మహాసముద్రం, మధ్యలో 'టెథిస్' అనే సముద్రం ఉండేవి.
 

లారెన్షియా: టెథిస్ సముద్రానికి ఉత్తరంగా 'లారెన్షియా' అనే భూభాగం ఉండేది. దీన్నే 'అంగారా' భూమి అని కూడా అంటారు.
 

గోండ్వానా: టెథిస్ సముద్రానికి దక్షిణంగా గోండ్వానా భూమి ఉంటుంది.

* వెజనర్ అభిప్రాయం ప్రకారం అంతర్జనిత శక్తి వల్ల పేంజియా విచ్ఛిన్నమై దానిలోని భూఖండాల్లో చలనం ప్రారంభమవుతుంది.
* లారెన్షియా భూభాగం ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలుగా ఏర్పడింది.
* గోండ్వానా భూభాగం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలుగా మార్పుచెంది, ఖండాలు ఏర్పడ్డాయి.
* ఖండాల్లో పెద్ద ఖండం ఆసియాకాగా, చిన్న ఖండం ఆస్ట్రేలియా.

 

ఖండాలు


ఖండాలు మొత్తం 7 అవి:
  1) ఆసియా
  2) ఆఫ్రికా
  3) ఉత్తర అమెరికా
  4) దక్షిణ అమెరికా
  5) యూరప్
  6) అంటార్కిటికా
  7) ఆస్ట్రేలియా

మహాసముద్రాలు: భూ ఉపరితలంపై ఉన్న విశాలమైన ఉప్పు నీటి భాగాలనే మహా సముద్రాలు అంటారు.
మహా సముద్రాలు అయిదు అవి:
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
5) అంటార్కిటిక్ మహాసముద్రం (దక్షిణ మహాసముద్రం)
* కొన్ని సందర్భాల్లో అంటార్కిటికా ఖండం చుట్టూ ఉన్న పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల దక్షిణ భాగాలను వేరే ఒక మహాసముద్రంగా పరిగణిస్తున్నారు. దాన్ని దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటికా మహాసముద్రం అని పిలుస్తారు.
* మహాసముద్రాలన్నింటిలో పసిఫిక్ మహాసముద్రం పెద్దది. ఆర్కిటిక్ చిన్నది.
* ఉత్తరార్ధగోళంలో భూభాగం, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటాయి.

 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌