• facebook
  • whatsapp
  • telegram

భారతీయ విద్యా చరిత్ర, వివిధ కమిటీలు - కమిషన్లు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ప్రాచీన విద్యా ప్రారంభ వేడుకలకు సంబంధించి సరికానిది?
A) బౌద్ధ విద్యా విధానం - సమరోన్నతోత్సవం
B) వేద విద్యా విధానం - ఉపనయన కార్యక్రమం
C) ఇస్లాం విద్యా విధానం - మత ధర్మాలు
జ: A, C

 

2. ప్రాచీన విద్య అంతిమ గమ్యాలకు సంబంధించి సరైంది. 
1) ముస్లిం విద్యావిధాన గమ్యం మతవ్యాప్తి.
2) బౌద్ధ విద్యావిధాన గమ్యం కోర్కెలను అధిగమించి దుఃఖం నుంచి విముక్తి పొందడం.
3) హిందూ వేద విద్య గమ్యం ఆత్మసాక్షాత్కారం పొందడం.
4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

3. ప్రాచీన విద్యలో గురువులు
A) హిందూ ధర్మ వేద విద్య గురువులు బ్రహ్మచర్యం పాటించే సన్యాసులు.
B) ముస్లిం విద్యావిధాన గురువుల మత గురువులు.
జ: A సరైంది, B సరైంది కాదు

4. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
A) ఆశ్రమాలు                i) వేద విద్య తరగతి గది
B) ప్రార్థనాస్థలం             ii) బౌద్ధ విద్య తరగతి గది
C) ఆరామాలు              iii) ముస్లిం విద్య తరగతి గది

జ: A - i, B - iii, C - ii
 

5. విద్యా సంస్థలకు సంబంధించి అనియత విద్యాకేంద్రాలు
జ: కరస్పాండెన్స్‌ కోర్సులు, వయోజన విద్యాకేంద్రాలు

 

6. వేదవిద్య చతురస్రం ధర్మాల వరుసను గుర్తించండి.
1) గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్య ఆశ్రమాలు
2) బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు
3) బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాస ఆశ్రమాలు
4) సన్యాస, వానప్రస్థ, బ్రహ్మచర్య, గృహస్థ ఆశ్రమాలు
జ: 2 (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు)

 

7. వేద విద్యా విధానం తిరోగమనం చెందడానికి లోపాలు 
1) వైయక్తిక, లింగభేదాలు             2) ఒకే వర్గానికి గురు హోదా ఉండటం
3) వర్ణ వివక్షత ఉండటం     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

8. బౌద్ధ విద్యావిధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఉపసదస్సు

 

9. ఇస్లామిక్‌ విద్యా నిర్వహణలో ఉన్నతస్థాయి పాఠశాల?
జ: మదరసా

 

10. ముస్లిం బాలికను విద్యాలయంలో చేర్చేటప్పుడు జరిపే ఉత్సవం
జ: జార్పిపాని

 

11. వేదకాలంలో సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువు?
జ: గురువు

 

12. బౌద్ధ విద్యావిధానంలో బోధనా పద్ధతి
జ: ఆచరణాత్మక పద్ధతి

 

13. చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలో (ప్రజల భాష) విద్యాబోధన చేసినవారిలో ఆద్యులు
జ: ముస్లింలు

 

14. బౌద్ధ విద్యావిధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు
జ: 8 సంవత్సరాలు

 

15. ఎవరి విద్యావిధానంలో ‘పబ్బజ్జా’ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభమవుతుంది?
జ: బౌద్ధ విద్యావిధానం

 

16. ఉడ్స్‌ నివేదిక భారతీయ విద్యావిధానంలో మాగ్నాకార్టా లాంటిదని పేర్కొన్నవారు?
జ: హెచ్‌.ఆర్‌. జేమ్స్‌

 

17. ఇస్లాం విద్యావిధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు?
జ: 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు

 

18. బౌద్ధ విద్యావిధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు?
జ: సమనేరులు

 

19. వేద విద్యావిధానంలో ఉండే విద్యాపద్ధతి వాచక పద్ధతి. ఇందులోని 3 దశల్లో కానిది
జ: ఉపవాచకం

 

20. జైనుల బోధనా విధానం
జ: వల్లెవేయడం

 

21. వేద విద్యావిధానంలో ప్రస్తావించిన ‘అపర విద్య’ అంటే?
జ: ముక్తి, మోక్షానికి ఉపయోగపడే విద్య

 

22. భారత్‌లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యావిధానం
జ: ఇస్లాం విద్యావిధానం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌