• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక కాలంలో విద్యావిధానం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ప్రధానమైన పురుషార్థం ఏది?
జ: ధర్మ

 

2. బౌద్ధ విద్యావిధానంలో వైద్య విద్య ఎన్ని సంవత్సరాలు?
జ: 7

 

3. మాతృభాషను బోధనా భాషగా ప్రవేశపెట్టిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబు

 

4. ఎవరి దండయాత్ర కాలంలో హిందువుల విద్యాకేంద్రాలు తగ్గిపోయాయి?
జ: గజని

 

5. ఎవరి కృషి ఫలితంగా ఈస్టిండియా కంపెనీ భారత్‌లో విద్యా నిర్వహణకు ఏడాదికి రూ. లక్ష ఖర్చు చేయడానికి నిర్ణయించింది?
జ: డంకన్

 

6. విద్యాభివృద్ధి కోసం 'స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ' అనే సంస్థను స్థాపించింది ఎవరు?
జ: ఎల్విన్‌స్టన్

 

7. ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకత గురించి చెప్పిన మొదటి కమిషన్ ఏది?
జ: ఉడ్స్ తాఖీదు 1854

 

8.మొదటి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరు?
జ: చంద్రముఖీ బసు

 

9. ఏ కమిషన్ ప్రభావంతో భారతదేశంలో ప్రాథమిక పాఠశాలలు స్థాపితమయ్యాయి?
జ: హంటర్ కమిషన్ - 1882

 

10. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1916

 

11. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి గ్రంథాలయాలను స్థాపించాలని పేర్కొన్న కమిటి ఏది?
జ: సార్జంట్ ప్లాన్ - 1944

 

12. ప్రాథమిక విద్యను పూర్తిచేయకుండా మధ్యలో బడి మానివేయడాన్ని ఏమంటారు?
జ: అపవ్యయం

 

13. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ 6 - 14 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొంది?
జ: ఆర్టికల్ 45

 

14. బహుళార్థ సాధక పాఠశాలలు నెలకొల్పాలని పేర్కొన్న కమిషన్ ఏది?
జ: మొదలియార్ కమిషన్ - 1952 - 53

 

15. బాల బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది?
జ: కొఠారి కమిషన్ 1964 - 66

 

16. ఏ కమిషన్ ప్రకారం 12వ తరగతి తర్వాత వృత్తి విద్యాకోర్సులకు విద్యార్థులు అర్హులవుతారు?
జ: మొదలియార్ కమిషన్ - 1952 - 53

 

17. మధ్యాహ్న భోజన వసతి, ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయాలని పేర్కొన్న కమిటి?
జ: కొఠారి కమిషన్ - 1964 - 66

 

18. విద్యా నిర్మాణంలో 10+2+3 విద్యా నిర్మితిని అనుసరించాలని పేర్కొన్న కమిషన్
జ: జాతీయ విద్యావిధానం - 1968

 

19. సామాన్య పాఠశాలలు (Common School System) స్థాపించాలని సూచించిన కమిషన్
జ: జాతీయ విద్యా కమిషన్ - 1964 - 66

 

20. ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే విధంగా విద్య ఉండాలని పేర్కొంది ఎవరు?
జ: నూతన జాతీయ విద్యావిధానం - 1986

 

21. ఆంగ్లభాషను 8వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని పేర్కొన్న కమిటి ఏది?
జ: ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటి - 1977

 

22. విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలని పేర్కొన్న కమిటి
జ: నూతన జాతీయ విద్యావిధానం - 1986

 

23. నల్లబల్ల ప్రక్రియ (OBB) ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులను నియమించాలి?
జ:  ఇద్దరు

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌