• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళిక రచన

* ఐచ్చిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంతో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక. − వైడో

ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:
     1) తరగతిలోని విద్యార్థుల స్థాయి
     2) ఆ సంవత్సరం విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు


ప్రణాళికల ప్రయోజనాలు:
* బోధన సులువుగా ఉంటుంది.
* అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు.
* లక్ష్యాత్మక విద్యను సులభంగా అందించవచ్చు.

ప్రణాళికలు - రకాలు
విద్యా ప్రణాళిక: విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక.

* విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. 
* విద్యావ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశిస్తుంది.
* విద్యా ప్రక్రియకు పునాది విద్యా ప్రణాళిక.
* వర్తమాన విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక − 1986 NPE.

జాతీయ విద్యా విధానం − 1986లో సూచించిన పది మౌలిక అంశాలు
     1) మనదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
     2) రాజ్యాంగం − బాధ్యతలు
     3) జాతీయ సమైక్యత
     4) మన వారసత్వం − సంస్కృతి
     5) సమ సమాజం లౌకిక చట్టాలు − స్త్రీ సాధికారత
     6) ప్రజాస్వామ్యం − విలువలు
     7) శాస్త్రీయ దృక్పథం − ప్రచారం
     8) చిన్న కుటుంబ భావం − విస్తరణ
     9) సామాజిక రుగ్మతల నిర్మూలన
     10) వాతావరణం − పర్యావరణ పరిరక్షణ

* ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ విద్యా ప్రణాళికను తయారుచేస్తుంది.

విషయ ప్రణాళిక:
* ఆధునిక సమాజంలో బాలలు జీవించడానికి అవసరమైన విషయ జ్ఞానాన్ని అందించే ప్రణాళిక.

విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:
     1) విద్యా ప్రణాళిక మూల భావనలు
     2) విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు
     3) సామాజిక అవసరాలు, దృక్పథాలు
     4) మనదేశంలోని విద్య, తాత్విక ఆలోచనలు
     5) అందుబాటులో ఉన్న వనరులు


వార్షిక ప్రణాళిక:
* శరీర రక్షణ ద్వారా శరీరం ఎలా దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో ఆత్మవికాసం కూడా దానికి తగిన అభ్యాసం ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది. − మహాత్మా గాంధీ
* విషయ ప్రణాళికను అనుసరించి తయారుచేసేదే వార్షిక ప్రణాళిక.
* విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి తరగతికి తమ పాఠ్యాంశాల బోధనకు తయారుచేసుకునే ప్రణాళికే వార్షిక ప్రణాళిక.
* ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి బోధించడానికి తయారుచేసేదే వార్షిక ప్రణాళిక.
* ఒక సంవత్సరంలో బోధించాల్సిన పాఠాలను నెలల వారీగా విభజించుకునే ప్రణాళిక.
* నెలల వారీగా నిర్ణయించే అదనపు కార్యక్రమాలుండే ప్రణాళిక.
* మాసాల పేర్లు, పాఠాల పేర్లు, పీరియడ్లు, వనరులు లాంటి అంశాలుండే ప్రణాళిక.
* వార్షిక ప్రణాళికను డీసీఈబీ/ఉపాధ్యాయుడు రూపొందించుకోవాలి.
* విద్యా సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళికను రూపొందించుకోవాలి. 
* పాఠశాల మొత్తం పని దినాల సంఖ్య 220.
* ప్రథమ భాషగా మాతృభాషకు గల పీరియడ్ల సంఖ్య 220.
* పాఠ్య పుస్తకాన్ని బోధించడానికి గల పీరియడ్ల సంఖ్య 160/170.

యూనిట్‌ ప్లాన్‌: (పాఠ్య ప్రణాళిక/అంశ ప్రణాళిక)
* తెలుగులో ఒక పాఠంను యూనిట్‌ అంటారు.
* అధిక సామర్థ్యం ఉండే విద్యార్థులు యూనిట్‌ పరిధిని దాటి వెళ్లడానికి అవకాశం ఉండాలి.
* యూనిట్‌లోని సమైక్య లక్షణాలు ఏర్పరచడానికి వీలవుతుంది.
ఉపాంశ ప్రణాళిక/పాఠ్య పథకం/పీరియడ్‌ ప్లాన్‌

* పాఠ్య ప్రణాళిక ఆధారంగా రూపొందించే ప్రణాళికనే పాఠ్యపథకం అంటారు.
* పాఠ్యపథకంలో సోపానాలు

1) ప్రవేశం − ప్రదర్శన పునర్విమర్శ − ఇంటిపని (లేదా) విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు
2) తరగతి గదిలో ఉపాధ్యాయుడు సాధించాల్సిన లక్ష్యాలు
3) బోధనాభ్యసన కృత్యాలు
4) బోధనాభ్యసన ఉపకరణాలు
5) అభ్యసన మూల్యాంకనం


సంస్థాగత ప్రణాళిక
* బోధన ప్రణాళికను, అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు అనువైనవనే వాదనను సైకో లోగిజం అంటారు.
* పాఠశాలకు, సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం సంస్థాగత ప్రణాళిక ఉద్దేశం. 
* పాఠశాల ధ్యేయం, గమ్యం, అవసరాలు; పాఠశాలకు సమాజం నుంచి లభించే వనరులు, ప్రభుత్వం ద్వారా వచ్చిన వనరులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను రూపొందిస్తారు. 
* ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా సంఘం, పర్యవేక్షణ అధికారులు, విషయ నిపుణుల సంఘం సంస్థాగత ప్రణాళిక తయారీలో పాల్గొంటారు.

సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు
1) పాఠశాల గత చరిత్ర − ప్రస్తుత లక్ష్యాలు
2) పాఠ్య కార్యక్రమాలు
3) అదనపు పాఠ్య కార్యక్రమాలు
4) సహపాఠ్య కార్యక్రమాలు
5) విద్యాసంస్థ రోజువారీ పాలన
6) ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, మానవ శక్తివనరుల సమీకరణం, వారి వినియోగం
7) భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ
8) విద్యార్థుల కోసం సంక్షేమ చర్యలు
9) సమాజం కోసం పాఠశాల నిర్వహించాల్సిన కార్యక్రమాలు
10) సమాజ కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొనాల్సిన సందర్భాలు
11) ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌