• facebook
  • whatsapp
  • telegram

భారతీయ విద్యా చరిత్ర, వివిధ కమిటీలు - కమిషన్లు

1. ప్రాచీన విద్యా ప్రారంభ వేడుకలకు సంబంధించి సరికానిది?
    A) బౌద్ధ విద్యా విధానం - సమరోన్నతోత్సవం
    B) వేద విద్యా విధానం - ఉపనయన కార్యక్రమం
    C) ఇస్లాం విద్యా విధానం - మత ధర్మాలు
జ: A, C

 

2. ప్రాచీన విద్య అంతిమ గమ్యాలకు సంబంధించి సరైంది. 
    1) ముస్లిం విద్యావిధాన గమ్యం మతవ్యాప్తి.
    2) బౌద్ధ విద్యావిధాన గమ్యం కోర్కెలను అధిగమించి దుఃఖం నుంచి విముక్తి పొందడం.
    3) హిందూ వేద విద్య గమ్యం ఆత్మసాక్షాత్కారం పొందడం.
    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

3. ప్రాచీన విద్యలో గురువులు
    A) హిందూ ధర్మ వేద విద్య గురువులు బ్రహ్మచర్యం పాటించే సన్యాసులు.
    B) ముస్లిం విద్యావిధాన గురువుల మత గురువులు.
జ: A సరైంది, B సరైంది కాదు

 

4. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
A) ఆశ్రమాలు      i) వేద విద్య తరగతి గది

B) ప్రార్థనాస్థలం   ii) బౌద్ధ విద్య తరగతి గది

C) ఆరామాలు    iii) ముస్లిం విద్య తరగతి గది

జ: A-i, B-iii, C-ii
 

5. విద్యా సంస్థలకు సంబంధించి అనియత విద్యాకేంద్రాలు
: కరస్పాండెన్స్‌ కోర్సులు, వయోజన విద్యాకేంద్రాలు

 

6. వేదవిద్య చతురస్రం ధర్మాల వరుసను గుర్తించండి.
    1) గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్య ఆశ్రమాలు
    2) బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు
    3) బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాస ఆశ్రమాలు
    4) సన్యాస, వానప్రస్థ, బ్రహ్మచర్య, గృహస్థ ఆశ్రమాలు
జ: 2 (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు)

 

7. వేద విద్యా విధానం తిరోగమనం చెందడానికి లోపాలు 
    1) వైయక్తిక, లింగభేదాలు     2) ఒకే వర్గానికి గురు హోదా ఉండటం    
    3) వర్ణ వివక్షత ఉండటం     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

8. బౌద్ధ విద్యావిధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఉపసదస్సు

 

9. ఇస్లామిక్‌ విద్యా నిర్వహణలో ఉన్నతస్థాయి పాఠశాల?
జ: మదరసా

 

10. ముస్లిం బాలికను విద్యాలయంలో చేర్చేటప్పుడు జరిపే ఉత్సవం
జ: జార్పిపాని

 

11. వేదకాలంలో సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువు?
జ: గురువు

 

12. బౌద్ధ విద్యావిధానంలో బోధనా పద్ధతి
జ: ఆచరణాత్మక పద్ధతి

 

13. చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలో (ప్రజల భాష) విద్యాబోధన చేసినవారిలో ఆద్యులు
జ: ముస్లింలు

 

14. బౌద్ధ విద్యావిధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు
జ: 8 సంవత్సరాలు

 

15. ఎవరి విద్యావిధానంలో ‘పబ్బజ్జా’ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభమవుతుంది?
జ: బౌద్ధ విద్యావిధానం

 

16. ఉడ్స్‌ నివేదిక భారతీయ విద్యావిధానంలో మాగ్నాకార్టా లాంటిదని పేర్కొన్నవారు?
జ: హెచ్‌.ఆర్‌. జేమ్స్‌

 

17. ఇస్లాం విద్యావిధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు?
జ: 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు

 

18. బౌద్ధ విద్యావిధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు?
జ: సమనేరులు

 

19. వేద విద్యావిధానంలో ఉండే విద్యాపద్ధతి వాచక పద్ధతి. ఇందులోని 3 దశల్లో కానిది
జ: ఉపవాచకం

 

20. జైనుల బోధనా విధానం
జ: వల్లెవేయడం

 

21. వేద విద్యావిధానంలో ప్రస్తావించిన ‘అపర విద్య’ అంటే?
జ: ముక్తి, మోక్షానికి ఉపయోగపడే విద్య

 

22. భారత్‌లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యావిధానం
జ: ఇస్లాం విద్యావిధానం

 

23. కిందివాటిలో అబాట్‌ ఉడ్స్‌ కమిటీకి సంబంధించి సరికానిది?
    1) ఉపయోగితా విద్యను అందించాలి.                      
    2) శిశు విద్యకు ప్రాధాన్యం కల్పించాలి.
    3) 10 + 2 + 3 విద్యావిధానాన్ని అనుసరించాలి.    
    4) విద్య నిత్యజీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి.
జ: 3 (10 + 2 + 3 విద్యావిధానాన్ని అనుసరించాలి.)

 

24. ఉడ్స్‌ నివేదికకు సంబంధించి అసత్యమైంది? 
    1) విద్యలో ఉచిత నిర్బంధ ప్రాథమికతకు ప్రాధాన్యం ఇవ్వాలి    

    2) ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల ఏర్పాటు
    3) యూనివర్సిటీల స్థాపన జరగాలి                                        
    4) బాలిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
జ: 1 (విద్యలో ఉచిత నిర్బంధ ప్రాథమికతకు ప్రాధాన్యం ఇవ్వాలి)

 

25. ఏ ఆర్టికల్‌ ప్రకారం జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి?
జ: 351

 

26. కింది అంశాల్లో సరికానిది.
    1) ప్రాథమిక విద్యలో వృథా, స్తబ్దత నివారణ - హర్టాగ్‌ కమిటీ
    2) ప్రాథమిక విద్యా సంస్కరణలు - మొదలియార్‌ కమిషన్‌
    3) వృత్తివిద్య సమీక్ష - ఆదిశేషయ్య విద్యా కమిటీ
    4) ఉపాధ్యాయ ఉద్యోగ భద్రత - ఛటోపాధ్యాయ కమిషన్‌
జ: 2 (ప్రాథమిక విద్యా సంస్కరణలు - మొదలియార్‌ కమిషన్‌)

27. ఉడ్స్‌ డిస్పాచ్‌కు సంబంధించి సరైంది.
    1) ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల స్థాపన                
    2) ప్రైవేట్‌ విద్యాసంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇవ్వడం
    3) విద్యావిధానంగా, శ్రేణులుగా విభజించడం        
    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

28. ఇంటర్మీడియట్‌ స్థాయిలో వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టడానికి నియమించిన కమిటీ
జ: మాల్కం ఆదిశేషయ్య కమిటీ

29. యశ్‌పాల్‌ కమిటీ ముఖ్య సిఫారసులు
    1) పూర్వప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో హోమ్‌వర్క్, స్కూల్‌ బ్యాగ్‌ నిషేధించాలి.
    2) విద్యాశాఖ ప్రారంభించిన ఛానల్‌ ద్వారా దృశ్యశ్రవణ పరికరాలతో విద్యాబోధన.
    3) నర్సరీ పరీక్షల ప్రవేశం కోసం ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించకూడదు.
    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

30. కొఠారి కమిషన్‌ సూచనలు
    1) విద్య జాతీయ వికాసం/అభివృద్ధి                      
    2) భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది
    3) ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, 230 పనిదినాలు    
    4) అన్నీ
జ: 4 (అన్నీ)

31. కిందివాటిని జతపరచండి.
A) లెర్నింగ్‌ టు డు

i) బేసిక్‌ విద్యావిధానం

B) భార రహిత అభ్యసనం

ii) జాతీయ విద్యావిధానం

C) విద్యారంగంలో సవాళ్లు

iii) డాక్టర్‌ మాల్కం ఆదిశేషయ్య

D) గాంధీ

iv)  యశ్‌పాల్‌ కమిటీ

జ: A−iii, B−iv, C−ii, D−i
 

32. యుద్ధానంతరం ప్రణాళిక అని దేన్ని అంటారు?
జ: సార్జంట్‌ నివేదిక

 

33. ‘విద్యా వికాసం - భవిష్యత్‌ దృక్పథం’ అనే పేరుతో విధానాలను రూపొందించిన కమిటీ?
జ: NPE − 1986

 

34. Education is the unique investment present and future అనే ఇతివృత్తం గల కమిటీ?
జ: జాతీయ విద్యా విధానం

 

35. మన రాష్ట్రంలో నాన్‌ డిటెన్షన్‌ పద్ధతిని అనుసరించిన సంవత్సరం
జ: 1971

36. మొదలియార్‌ కమిషన్‌ సూచనలు 
    A) 5 + 3 + 4 + 3 విద్యావిధానం ఉండాలి.    B) బహులార్థసాధక పాఠశాలలు ఉండాలి.
    C) హిందీని తప్పనిసరి చేయాలి.                    D) త్రిభాషా విధానాన్ని అమలుచేయాలి.
జ: A, B, C మాత్రమే సరైనవి.

 

37. కింది అంశాలను పరిశీలించండి.
    A) గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించిన కమిటీ - రాధాకృష్ణన్‌ కమిటీ
    B) వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి - NPE −1986
జ: A మాత్రమే సరైంది, B సరైంది కాదు.

 

38. విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని ఏర్పాటుచేయాలని పేర్కొన్న కమిటీ?
జ: జాతీయ విద్యావిధానం − 1986

 

39. 'Towards an Enlightened and Humane Society' నివేదిక కలిగిన కమిటీ?
జ: ఆచార్య రామ్మూర్తి కమిటీ

 

40. నల్లబల్ల పథకాన్ని ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలని పేర్కొన్న కమిటీ?
జ: జనార్ధన్‌ రెడ్డి కమిటీ

 

41. నవోదయ విద్యాలయాలను ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ఏర్పాటుచేశారు?
జ: NPE − 1986

42. ఉపాధ్యాయ ఉద్యోగ భద్రత, జీతభత్యాల గురించి ప్రస్తావించిన కమిటీ?
జ: ఛటోపాధ్యాయ కమిటీ

 

43. విద్యతోపాటు వృత్తి పరమైన బోధనకు ప్రాధాన్యం ఇచ్చిన కమిటీ?
జ: ఆదిశేషయ్య కమిటీ

 

44. యశ్‌పాల్‌ కమిటీ సాధ్యాసాధ్యాలపై సమీక్ష చేసిన కమిటీ?
జ: చతుర్వేది కమిటీ

 

45. విద్యా ఛానల్‌ ద్వారా దృశ్యశ్రవణ బోధనను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?
జ: యశ్‌పాల్‌ కమిటీ

 

46. కిందివాటిని జతపరచండి.
i) వేదకాలంలో విద్యా ధ్యేయం

A) మతవ్యాప్తి కోసం

ii) బౌద్ధకాలంలో విద్యా ధ్యేయం

B) మోక్షానికి దారిచూపడం

iii) మధ్యయుగంలో విద్యా ధ్యేయం

C) దుఃఖాన్ని నివారించడం

జ: i−B, ii−C, iii−A
 

47. విద్య అంటే? 
    1) నిరంతర ప్రక్రియ     2) జీవితాంత జ్ఞానం     

   3) పరిసర ప్రభావం ఆధారంగా జరిగే మార్పు     4) అన్నీ
జ: 4 (అన్నీ)

48. ‘ఆత్మ సిద్ధియే’ విద్య అని పేర్కొన్నది?
జ: శంకరాచార్యులు

 

49. ‘సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడమే విద్య’ అన్నవారు?
జ: డ్యూయీ

 

50. వ్యక్తి తన మత సంస్థ నుంచి విద్యనభ్యసించడం అనేది
జ: విస్తృత అర్థంలో విద్య

 

51. కిందివాటిలో విద్యా ధ్యేయం కానిది?
    1) సంపూర్ణ మూర్తిమత్వం                                        2) సంపూర్ణ అభివృద్ధి 
    3) మానసిక విలువలను మాత్రమే పెంపొందించడం     4) స్వావలంబన - స్వయం అభివృద్ధి
జ: 3 (మానసిక విలువలను మాత్రమే పెంపొందించడం)

 

52. ‘ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును కలిగి ఉండటమే విద్య’ అన్నవారు
జ: అరిస్టాటిల్‌

 

53. విద్యార్థి కళాశాలలో విద్యనభ్యసించడం అనే ప్రక్రియ దేనికి చెందింది?
జ: పరిమిత అర్థంలో విద్య

 

54. ఇస్లాం విద్యావిధానం (ముస్లిం విద్యావిధానం) అని ఏ కాలాన్ని అంటారు?
జ: క్రీ.శ.12 − 18

55. ప్రాథమిక విద్యకు కేంద్రంలో ఒక ప్రత్యేక రోజు, ప్రత్యేక కార్యదర్శిని ఏర్పాటు చేయాలని పేర్కొన్న తీర్మానం?
జ: గోఖలే తీర్మానం − 1911

 

56. ఏ సంవత్సరాల మధ్య కాలాన్ని 'A Decade of Provincial Autonomy' గా పేర్కొంటారు?
జ: 1937 − 47

 

57. 1986 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి, దాని ఆచరణకు కావాల్సిన సిఫారసులు చేయడానికి ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీ − 1990 కేంద్రానికి ఇచ్చిన నివేదిక?
జ: Towards an enlightened humane society

 

58. కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలను ఏ చట్టం అనంతరం రూపొందించారు?
జ: 1813 చార్టర్‌ చట్టం

 

59. ఆంగ్ల విద్యకు పునాది ఏ కమిటీలో ప్రారంభమైంది?
జ: మెకాలే వినిట్స్‌

 

60. ఏ కమిటీ సిఫారసుల మేరకు లార్డ్‌ రిప్పన్‌ అన్ని ఆవాస ప్రాంతాలకు పాఠశాలలను ఏర్పాటుచేశారు?
జ: భారతీయ విద్యా కమిషన్‌

 

61. ‘అబ్జర్వేషన్‌’ గ్రంథ రచయిత ఎవరు?
జ: చార్లెస్‌ గ్రాంట్‌

62. హర్టాగ్‌ కమిటీని ఎప్పుడు ఏర్పాటుచేశారు?
జ: 1929

 

63. వయోజన విద్యాకేంద్రాలు, గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రస్తావించిన కమిటీ?
జ: సార్జంట్‌ కమిటీ

 

64. చార్టర్‌ చట్టాన్ని అనుసరించి భారతీయ భాషలోనే విద్యాబోధన జరగాలని పేర్కొన్నవారు?
జ: ప్రాక్‌వాదులు

 

65. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి విశ్వవిద్యాలయం?
జ: కలకత్తా విశ్వవిద్యాలయం

 

66. విద్యారంగ నిశ్శబ్ద కాలం
జ: 1897 − 1899

 

67. జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటుచేయాలని, తద్వారా విద్యా పటిష్టతను సూచించే కమిటీ?
జ: బి.జి.ఖేర్‌ కమిటీ

 

68. జాతీయ విద్యా వ్యవస్థ స్వరూపం 10 + 2 + 3 గా ఉండాలని ఏ కమిటీ భావించింది?
జ: కొఠారి కమిషన్‌

69. కొఠారి కమిషన్‌కు సంబంధించి సరికానిది?
    1) మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి.          2) విద్యలో పని అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
    3) వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపన వెంటనే జరగాలి.    4) అన్నీ
జ: 3 (వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపన వెంటనే జరగాలి.)

 

70. కిందివాటిలో ఈశ్వరీబాయి పటేల్‌ కమిటీకి (1977) సంబంధించిన అంశాలు?
    1) పాఠశాలలో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ఏర్పాటు చేయాలి.
    2) దీన్ని ‘కరికులమ్‌ రివ్యూ కమిటీ’ అంటారు.
    3) NPE − 1968 అమలుతీరును పరిశీలించిన కమిటీ.
    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

71. స్వాతంత్య్రానంతరం మొదటి కమిషన్‌ అని దేన్ని పిలుస్తారు?
జ: విశ్వవిద్యాలయ కమిషన్‌/రాధాకృష్ణన్‌ కమిషన్‌

 

72. విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యం కలిగించిన కమిటీ?
జ: మాల్కం ఆదిశేషయ్య కమిటీ

73. కిందివాటిలో సరికానిది. 
    1) కొఠారి కమిషన్‌ − 1964                 2) రాధాకృష్ణన్‌ కమిటీ − 1948 
    3) సెకండరీ విద్యా కమిషన్‌ − 1952     4) మాల్కం ఆదిశేషయ్య కమిటీ − 1978
జ: 2 (రాధాకృష్ణన్‌ కమిటీ − 1948)

 

74. కొఠారి కమిషన్‌ విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణా కాలం ఎన్ని సంవత్సరాలు ఉండాలని సిఫారసు చేసింది?
జ: 2 సంవత్సరాలు

 

75. హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్‌?
జ: సెకండరీ విద్యా కమిషన్‌

 

76. పాఠశాల స్థాయిలో మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించిన కమిటీ?
జ: మొదలియార్‌ కమిటీ − 1952

 

77. 5 + 3 + 4 + 3 విద్యా విధానాన్ని రూపొందించాలని సూచించిన కమిటీ?
జ: సెకండరీ విద్యా కమిషన్‌

 

78. కేంద్రీయ మాధ్యమిక పరిషత్‌ను ఏర్పాటుచేయాలని సూచించిన కమిటీ?
జ: సెకండరీ విద్యా కమిషన్‌

79. త్రిభాషా సూత్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కమిటీ
జ: భారతీయ విద్యా కమిషన్‌ − 1964

 

80. పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయాలని సూచించిన కమిటీ?
జ: భావసమైక్యతా కమిటీ

 

81. విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని సూచించిన కమిషన్‌
జ: రాధాకృష్ణన్‌ కమిషన్‌

 

82. జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కమిటీ?
జ: బి.జి.ఖేర్‌ కమిటీ

 

83. బహుళార్థక సాధక ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు ఏ కమిటీ సూచనలకు అనుకూలంగా జరిగింది?
జ: సెకండరీ విద్యా కమిషన్‌

 

84. బ్రంట్‌లాండ్‌ కమిషన్‌ కాలం
జ: 1987

 

85. వేద విద్య యొక్క బోధన ఏ భాషలో జరిగేది?
జ: సంస్కృతం

 

86. ‘అజీవక కేశకంబళి’ ఏ విద్యా విధానానికి చెందినవారు?
జ: చార్వాక విద్య

87. విద్యా విధానాలకు సంబంధించి సరికాని జత. 
    1) వేద విద్యావిధానం − మననం         2) ముస్లిం విద్య − కంఠత
    3) చార్వాక విద్య − సత్య పరిశీలన      4) బౌద్ధ విద్య − ఉపన్యాస
జ: 4 (బౌద్ధ విద్య − ఉపన్యాస)

 

88. విద్యను ద్విధృవ ప్రక్రియగా పేర్కొన్నవారు?
జ: జాన్‌ ఆడమ్స్‌

 

89. ఏ విద్యావిధానంలో ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటాడు?
జ: ఏకధృవ విద్య

 

90. మదరసా విద్యా విధానంలో గణిత శాస్త్రం?
జ: రియాజి

 

91. కిందివాటిని జతపరచండి.
i) మదరసా విద్యా ప్రణాళికలో భౌతిక శాస్త్రం

A) యునాని

ii) మదరసా విద్యా విధానంలో వైద్యశాస్త్రం

B) తాబి

iii) మదరసా విద్యా విధానంలో వేదాంత శాస్త్రం

C) రియాజి

 D) ఇలాహి

జ: i−B, ii−A, iii−D

92. లౌకిక విద్యా విధానాన్ని అనుసరించినవారు?
జ: అక్బర్‌

 

93. మదరసా అంటే?
జ: ఉన్నత పాఠశాల

 

94. సమవయస్కుల సమూహాలను ఏ విద్యాసంస్థగా గుర్తించారు?
జ: యాదృచ్ఛిక విద్య

 

95. మంత్రతంత్రాలను గురించి ప్రస్తావించిన వేదం
జ: అధర్వణ వేదం

 

96. వేద విద్యావిధానంలో ఉన్నత విద్యాలయాలను ఏమని పిలిచేవారు?
జ: పరిషత్‌

 

97. వేద విద్యా కాలంలో విద్యలోని లోపాలు?
    1) గురుహోదా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉండేది     2) వర్ణవివక్షత 
    3) స్త్రీలకు అవకాశం లేకపోవడం                         
4) అన్నీ

జ: 4 (అన్నీ)
 

98. విద్యలో సెమిస్టర్‌ విధానాన్ని అమలుచేయాలని సూచించిన కమిటీ?
జ: జనార్ధన్‌రెడ్డి కమిటీ

99. చతుర్వర్ణ వ్యవస్థ ఏ మతాన్ని ప్రభావితం చేసింది?
జ: వేదమతం

 

100. స్త్రీ విద్య కోసం ప్రత్యేక శాఖను స్థాపించాలని ప్రతిపాదించిన కమిటీ?
జ: శాడ్లర్‌ కమిషన్‌ − 1917

 

101. ‘మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేదే విద్య’ అని తెలియజేసింది
జ: యాజ్ఞవల్క్యుడు

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌