• facebook
  • whatsapp
  • telegram

PARTS OF SPEECH

     గ్రామర్‌లో అత్యంత ప్రాముఖ్యం ఉన్న బేసిక్స్‌లో మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటినే భాషాభాగాలు అంటారు. ఇంగ్లిష్ వ్యాకరణ రచనకు కావాల్సిన పరిజ్ఞానానికి ఇది తొలి మెట్టు. ఒక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని (మాట) అది చేసే పనిని బట్టి ఒక భాషాభాగంగా నిర్ణయించారు. ఆ క్రమంలో ఇంగ్లిష్‌లోని పదాలన్నింటినీ (మాటలను) మొత్తం ఎనిమిది విభాగాలుగా విభజించారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని వ్యవహరిస్తారు. నిజానికి వీటిపై గట్టి పట్టు ఉంటేనే ఇంగ్లిష్‌లో పటిష్ఠమైన వాక్యరచన సాధ్యమవుతుంది. 
          Words in English are divided into eight kinds according to their use in sentences, which are called Parts of Speech in English. The Part of Speech of a particular word in a sentence is decided by the context in which it is used. This is important to be rememberedin identifying the parts of speech of words in English. ఇంగ్లిష్‌లోని ఎనిమిది భాషాభాగాల గురించి వివరంగా తెలుసుకుందాం
There are eight Parts of Speech in English. They are:
1. Noun
2. Pronoun
3. Verb
4. Adjective
5. Adverb
6. Preposition
7. Conjunction
8. Interjection

1. NOUN: A Noun is the name of a person, place or ANY thing. అంటే వ్యక్తులు, స్థలాలు, వస్తువుల పేర్లు Concrete Nouns  అవుతాయి. అయితే courage, education, idea, love, luck మొదలైనవి కూడా Nouns అని గ్రహించాలి. ఎందుకంటే గుణాలు, పనులు, స్థితులు, కళలు, శాస్త్రాల పేర్లను తెలియజేసే పదాలు abstract  (గ్రహించదగినవి మాత్రమే) sense లో ఉంటాయి. అందువల్ల వాటిని Abstract Nouns అంటారు. Nouns విషయంలో ఇది గ్రహిస్తే చాలు.
e.g.: Shreya (వ్యక్తి పేరు);             Ooty (స్థలం పేరు);              pencil ; (వస్తువు పేరు);
         
student  (కామన్ నౌన్);       army(సమూహం పేరు);     iron (పదార్థం పేరు);
 
poverty  (స్థితికి పేరు);        grammar  (శాస్త్రం పేరు);          laughter (పనికి పేరు);
         
beauty  (గుణానికి పేరు);    dream (అనుభవానికి పేరు);      pleasure (అనుభూతికి పేరు);
       
 paramecium (జీవికి పేరు); penicillin (ఔషధానికి పేరు)...
So,  ఈ విధంగా పేర్లను తెలిపే అన్ని పదాలను Nouns గా పరిగణించాలి
. -ness, -dom, -ship, -ion, -ation, - ist, -ance, -ence, -or, -er, -ity, -ment, -ian  మొదలైన Suffix లు కూడా Nouns ను ఏర్పాటు చేస్తాయి.
e.g.: neatness, wisdom, friendship, tension, inforrmation, dentist, attendance, evidence, convenor, teacher, brevity, move ment,
technician . . .

కొన్ని సందర్భాల్లో వేరే భాషా భాగానికి చెందిన పదాలు కూడా Nouns గా  పనిచేస్తాయి. నిజానికి మనం జాగ్రత్తగా ఉండాల్సింది సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే!
e.g.: He wants to watch the T.V. at night.
                            Verb
He looked at his watch immediately.
                         Noun

* అదే పదం Verb గా మరియు Noun గా వాడిన సందర్భాలివి.
e.g.:   He is a rich man.
                    Adj.
        Don’t believe the rich.
                                  Noun
*  
అదే పదం Adjective గా మరియు Noun గా వాడిన సందర్భాలివి.

2. PRONOUN: A Pronoun is a word used in the place of a noun. It helps us to avoid
repetition of nouns.
అంటే నామవాచకాలకు బదులుగా ఉపయోగించే మాటలను సర్వనామాలు అంటారు.
                              e.g.: Ravi built a house.    It is nice.
                                                      Noun      PronounNote: Who, What, Which, Where, Whom, Whose, Why
మరియు How లను Question Words అంటారు.  కానీ వీటిని చాలా సందర్భాలలో  Interrogative Pronouns గా కూడా ఉపయోగిస్తారు. అందుకే ఒక పదం యొక్క Parts of Speech ను ఉపయోగించిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి.
e.g.:   A triangle whose three sides are equal is called equilateral.
                           Pronoun
         This is the boy that I spoke of.
                             Pronoun    
He said that he would go home.
                 Conjunction

* ఒక పదం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు భాషాభాగంగా ఉండొచ్చు. అందుకే Parts of Speech of a certain word depends on the context in which it is used.

3. VERB: A Verb is a word which expresses the action of doing, being or possessing.
అంటే పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు. పనులను, స్థితులను, కలిగి ఉండటాన్ని తెలియజేసే పదాలను Verbs  అని పిలుస్తారు.
e.g.:   The pen is black. (action of being)
                     Verb
          I have a house. (action of possessing)
          Verb
         Children play games. (action of doing)
                      Verb

పనులు మూడు విధాలుగా జరుగుతాయని చూశారు కదా!
*  స్థితులను తెలియజేసే
Verbs ను ‘be’ forms  అంటారు. అవి am, is, are, was, were
*  
కలిగి ఉండటాన్ని తెలియజేసే Verbs ను ‘Possessive’ forms of Verbs అంటారు. అవి have, has, had.
* చేసే పనులను తెలియజేసే Verbs
ను '‘do’ forms of Verbs అంటారు. అవి walk, run, eat, sleep, do, sit . . .... మొదలైనవి.
* అనేక సందర్భాల్లో సహాయక క్రియలుగా వచ్చే
Verbs ను Helping Verbs  లేదా Auxiliary Verbs అంటారు. అవి can, could, shall, should, will, would, may, might, must మొదలైనవి మరికొన్ని.
* ప్రతి Verb మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటో విభాగం
V1 (Simple Present);  రెండో విభాగం V2 (Simple Past)  మూడో విభాగం V3 (Past Participle). ఉదాహరణకు go- went- gone. ఈ మూడు విభాగాలలో ఉన్న పదాలన్నీ క్రియలే.
   ఈ విధంగా క్రియలను గుర్తించాలి. అయితే వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ కింద చూడండి.
* కొన్ని సార్లు క్రియాపదం (Verb) ) వేరే భాషాభాగంగా కూడా ఉండొచ్చు.

e.g.: We want to visit our Chairman shortly.
                             Verb
We paid a visit to him last summer.
                 Noun
Visit మొదటి వాక్యంలో Verb గా, రెండవ వాక్యంలో Noun గా వాడారు. మరొక ఉదాహరణ... |
I saw a saw, is sawing a saw, such a saw I never saw!
  Verb     Noun                   Noun           Noun           Verb
*  -fy, -en, -ateమొదలగు suffix లు కూడా Verbs ను రూపొందిస్తాయి.
e.g.: identify, strengthen, decorate


4. ADJECTIVE: An ‘Adjective’ tells the quality, quantity, colour and number of nouns/pronouns. అంటే స్వభావాన్ని, పరిమాణామాన్ని, రంగును, సంఖ్యను తెలిపే పదాలు. ఇవి నామవాచకాలను లేదా సర్వనామాలను వర్ణిస్తాయి.
e.g.: great, much, double, this, each, whose, same, green . . . మొదలైనవి.
* ఒక పదం యొక్క భాషాభాగాన్ని దాన్ని వాడిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి ఇతర భాషాభాగాలకు చెందిన పదాలు కూడా Adjectives అయ్యే వీలుంది. అందుకని దీన్ని వివరంగా చూడాలి.
* ఒక Adjective  అనేది Noun/Pronoun ను గురించి తెలియజేస్తుంది. కాబట్టి వాక్యంలో అది
Noun/ Pronoun ముందే ఉండాలా? అనే సందేహానికి జవాబుగా 'అక్కర్లేదు' అని చెప్పవచ్చు.
e.g.:    She has melodious  voice.
                          Adjective    Noun
వివరణ:  Noun
కు ముందు వచ్చి దాని గురించి తెలిపే Adjectiveను ‘epithet’ (Attributive Adjective) అంటారు.
e.g.:     Her voice is melodious.
                     Noun    Adjective
వివరణ: ఇక్కడ Adjective
అనేది వాక్యంలో Noun  తర్వాత ఉంది. దీన్ని Predicative Adjective  అంటారు. అయితే రెండు వాక్యాల భావార్థం ఒకటే!
ఇప్పుడు Adjective లో రకాలేంటో చూద్దాం.

* Qualitative Adjectives: Shapeని  size ని colour ని taste ని condition ని behaviour ని అవి కలిగించే impression ని తెలియజేసేవి.
e.g.: round, narrow, white, bitter, weak, cruel, smooth, great, attractive, beautiful. . .
* Quantitative Adjectives:
పరిమాణం, పరిమితిని తెలియజేసేవి.
e.g.:   much, little, any, no, many, some, all . . .
          I  have a little knowledge of English.
                          Adj.
*  Numeral Adjectives: Numbers (definite/indefinite/multiplicative)
ను తెలియజేసేవి.
e.g.:   two, five, first, tenth, double, bi-fold . . .
         We have been living in the twenty-first century.
                                                           Adjective
*  Demonstrative Adjectives:
'ఫలానా' అని నిర్దేశించేవి.
e.g.: this, that, these, those, such, same, the, other, certain . . .
A certain man went down from Kashmir to Cape Comarin.

 

Adjective
* Distributive Adjectives: వస్తువులు/ వ్యక్తులు ఒక్కొక్కటిగా తీసుకునేలా తెలియజేసేవి.
e.g.: each, every, either, neither . . .
Every boy praised Raghu yesterday.
  Adj.
* Interrogative Adjectives: Nouns  
ముందు వాడుతూ ప్రశ్నలు వేయడానికి ఉపయోగపడేవి.
e.g.: what, which, whose . . .
        which boy got the prize in the race?
     Adjective


*  Relative Adjectives: 'సంబంధిత' అనే అర్థంలో వాడేవి.
e.g.: which, what, whose . . . Relative Adjectives కూడానూ
         This is Ramu whose pen was stolen.
                              Adjective
*
 ఒక వాక్యంలో రెండు Nouns పక్కపక్కనే వచ్చినప్పుడు మొదటి Noun, Adjective అవుతుంది.
Pronoun
లుగా స్ఫురించే కొన్ని పదాలు Adjective  కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందువల్ల ఆయా సందర్భాల్లో వాటిని Adjectives  గానే గుర్తించాలని తెలుసుకున్నారు కదా! అందుకే Parts of Speech ఆద్యంతం ఆసక్తికరం. వాటి ఉపయోగాల వెనక ఉన్న స్వల్ప తేడాలను గ్రహిస్తే వాక్య రచనాశైలి మెరుగుపడుతుంది. ఇందులో సందేహమే లేదు.
మీకు తెలుసా?

When you put more than one adjective together, the order of the adjectives is important.

Order of Adjectives
(OSASCOMP)
1. opinion (= what you think about something)
2. size
3. age
4. shape
5. colour
6. origin (=where something comes from)
7. material (= what something is made of)
8. purpose (=what something is used for)
e.g.:    a    clever,   big,   old,   round,    black,   Chinese,   pet   dog.
      Adj.  Adj.    Adj.   Adj.     Adj.       Adj.         Adj.       Adj.   Noun

 

5. ADVERB: ఒక Verb  (క్రియ) తెలియజేసే పని ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు జరుగుతుందో తెలియజేసే పదాలు, Adjectives  (విశేషణాలు) పరిమితిని తెలియజేసే మాటలను క్రియా విశేషణాలు (ADVERB) ) అంటారు. అలాగే ఒక Adverb కొన్ని సందర్భాల్లో మరొక Adverb యొక్క పరిమితిని కూడా తెలియజేస్తుంది.
So, an ‘Adverb’ is a word which qualifies or adds to the meaning of a verb, an adjective or another adverb.
e.g.: Raju came  yesterday. (
పని 'ఎప్పుడు' జరిగింది అని తెలిపే Adverb)
               Verb  Adverb
        Raju spoke  gently. (
పని 'ఎలా' జరిగింది అని తెలిపే Adverb)
                Verb   Adverb
        Raju eats   slowly. (
పని 'ఏవిధంగా' జరిగింది అని తెలిపే Adverb)
               Verb  Adverb
        Raju lived   here. (
పని 'ఎక్కడ' జరిగింది అని తెలిపే Adverb)
               Verb  Adverb      
Raju is very   handsome. (‘Adjective’
పరిమితిని తెలిపే Adverb)
                Adverb  Adjective
        Raju sang enough  sweetly. ( ‘Adverb’
పరిమితిని తెలిపే మరొక Adverb)
                     Adverb   Adverb
        Raju’s house is extremely  busy. (
ఎంతమేరకు అని తెలిపే Adverb)
                               Adverb    Adverb

ఈ విధంగా ఒక Verb యొక్క,  Adjective  యొక్క, మరొక Adverb  యొక్క అర్థాన్ని విశదీకరించి చెప్పే పదాలను ADVERBS గా గుర్తించాలి. భాషాభాగాలను గుర్తించే ప్రక్రియలో Adverbs ను గుర్తించడం కష్టతరం. ఇపుడు వీటిలో ఉన్న రకాలను తెలుసుకుందాం.
ADVERB ల రకాలు

 

1. Adverbs of Time: సమయ నిర్దేశం చేసేవి, ఒక వాక్యంలో Verb కి ‘When’ అనే ప్రశ్నవేస్తే వచ్చే జవాబే ఈ Adverbs of Time.. ఉదాహరణకు now, then, since, ago, before, already, soon, presently, immediately, instantly, early, late, today, tomorrow, yesterday, afterward, next లాంటివి..
e.g.: Lakshmi will arrive tomorrow.

 

2. Adverbs of Place:  స్థల నిర్దేశం చేసేవి. '‘Where’ అని అడిగితే వచ్చే జవాబులు. ఉదాహరణకు here, there, hence, thence, hither, thither, in, out, within, without, above, below, far, near, inside, outside, up, down, beyond లాంటివి..
e.g.: We find him everywhere.

 

3. Adverbs of Number:  'ఎన్నిసార్లు' అని నిర్దేశించేవి. ‘How often’ అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచే Adverbs. ఉదాహరణకు once, twice, thrice, again, always, seldom, never, frequently, sometimes, often, firstly, secondly, four-fold, five-fold  లాంటివి.
e.g.: I helped him once.

 

4. Adverbs of Manner:  పని జరిగిన తీరును నిర్దేశించేవి. ‘How’ అనే ప్రశ్నకు జవాబుగా వచ్చే పదాలు. ఉదాహరణకు surely, probably, ertainly, meanly, extremely, so, conveniently, happily, sadly, well, ill, badly, quickly, loudly లాంటివి.
e.g.: She did the job happily.

 

5. Adverbs of Degree or Extent or Quantity: ఏ పరిమాణం మేరకు, ఎంతవరకు ఒక పని జరిగిందో నిర్దేశించేవి. ఉదాహరణకు  too, almost, fully, rather, quite, very, wholly, partly,  somewhat, (a) little, much, enough, pretty, half, so లాంటివి.
e.g.: The student’s answer is quite right.

 

6. Adverbs of Affirmation and Negation:  అవును/ కాదు, ఉంది/ లేదు అని సరళంగా నిర్దేశించే పదాలు ఉదాహరణకు: yes, surely, certainly, definitely, no, not లాంటివి.
e.g.: Lalitha does not make false promises.

 

7. Adverbs of Reason:  కాబట్టి/ అందువల్ల అని తెలిపేవి. ‘Why’ అని అడిగితే వచ్చే జవాబు పదాలు ఈ Adverbs ఉదాహరణకు as, because, therefore, hence, since లాంటివి.
e.g.: I therefore stopped talking to him.

 

8. Adverbs of Interrogation:  ప్రశ్నించడానికి వాడే పదాలన్ని ఈ రకం Adverb లే. ఉదాహరణకు why, where, when, how మొదలైనవి.
e.g.: How do you drink that bad?
*
ఇవే కాకుండా Adverbial Particles  కొన్ని ఉన్నాయి. అవి up, down, in, out, on, off, away,
back
లాంటివి.
e.g.: Take off your coat.
*
ఇతర భాషాభాగాలకు చెందిన పదాలు కూడా Adverbs గా పనిచేయడం గమనార్హం.
e.g. He has been sleeping since morning.
* -ly
తో అంతమయ్యే పదాలు చాలా వరకు Adverbs అయి ఉంటాయి.
e.g.; The cup was nearly full.

 

POSITION OF ADVERBS IN A SENTENCE

*  e.g.: Mayuri danced well in the auditorium last Sunday.
                               Adv.                 Adv.                Adv.                              

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌