• facebook
  • whatsapp
  • telegram

విద్యాహక్కు చట్టం - 2009

1. విద్యాహక్కు చట్టం - 2009 మన దేశంలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?

జ: 2010, ఏప్రిల్ 1

2. విద్యాహక్కు చట్టం ప్రకారం బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకూ ....
జ: ఒకే తరగతిలో మళ్లీ రెండో సంవత్సరం విద్యార్థిని కొనసాగించకూడదు.

 

3. కిందివాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత కాని దాన్ని గుర్తించండి.
       1) ఉపాధ్యాయులకు సెలవులు, జీతాన్ని మంజూరు చేయడం
       2) పాఠశాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించడం
       3) పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడంలో సహకరించడం
       4) విద్యార్థుల ప్రగతిని పరిశీలించడం
జ: 1(ఉపాధ్యాయులకు సెలవులు, జీతాన్ని మంజూరు చేయడం)

 

4. కిందివాటిలో విద్యాహక్కు చట్టం గురించి సరైన వాక్యమేది?
       1) ప్రతి విద్యా సంవత్సరం బోర్డు పరీక్షలను నిర్వహించడం
       2) జనన ధ్రువీకరణ పత్రం ఉన్నవారిని మాత్రమే పాఠశాలలో చేర్చుకోవడం
       3) పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు అవసరంలేదు
       4) ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు అవసరంలేదు
జ: 4 (ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు అవసరంలేదు)

5. '14 సంవత్సరాల్లోపు బాలబాలికలను గనులు, ఫ్యాక్ట్టరీలు ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదు' అని తెలిపే ఆర్టికల్ ఏది?
జ: 14

 

6. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పని చేయవలసి ఉంటుంది?
జ: 200

 

7. బాలల విద్యాహక్కు చట్టం - 2009 పరిధిని గుర్తించండి.
       1) దేశవ్యాప్తంగా అమల్లో ఉంది.
       2) జమ్ము - కశ్మీర్ మినహా దేశం మొత్తం అమల్లో ఉంది.
       3) జమ్ము - కశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే అమల్లో ఉంది.
       4) ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశం మొత్తం అమల్లో ఉంది.
జ: 2(జమ్ము - కశ్మీర్ మినహా దేశం మొత్తం అమల్లో ఉంది.)

 

8. పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (CCE) అమలు చేయాలని విద్యాహక్కు చట్టం ఏ సెక్షన్‌లో తెలియజేస్తుంది?
జ: 29

9. విద్యాహక్కు చట్టం - 2009లో ఉన్న అధ్యాయాలు, సెక్షన్లు వరుసగా-
జ: 7, 38

 

10. ప్రాథమిక పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థి నుంచి ఆ పాఠశాల యాజమాన్యం రూ.10 వేలు బిల్డింగ్ ఫండ్‌గా వసూలు చేసింది. ప్రభుత్వం ఆ పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా విధించవలసి ఉంటుంది?
జ: రూ.లక్ష

 

11. ఒక ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి?
జ: ఇద్దరు SGTలు

 

12. ఒక ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థికి ఎంపిక పరీక్ష నిర్వహించినందుకు ఆ పాఠశాల యాజమాన్యానికి జరిమానా విధించినా, ఆ పాఠశాల మళ్లీ ఎంపిక పరీక్ష నిర్వహిస్తే తర్వాత ఎంత జరిమానా విధించాలి?
జ: రూ.50 వేలు

 

13. విద్యాహక్కు చట్టం ప్రకారం సరికానిది ఏది?
       1) సెక్షన్ - 16 - అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు
       2) సెక్షన్ - 17 - ఏ విద్యార్థిని శారీరకంగాను, మానసికంగాను శిక్షించరాదు
       3) సెక్షన్ - 29 - పాఠ్య ప్రణాళిక తయారీ
       4) సెక్షన్ - 18 పాఠాలకు గుర్తింపు అవసరం
జ: 1(సెక్షన్ - 16 - అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు)

14. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం బిల్లును పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?
జ: 2009, ఆగస్టు 26

 

15. 'విద్యకు సంబంధించిన ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి' అని విద్యాహక్కు చట్టంలో తెలిపే సెక్షన్ ఏది?
జ: 7

 

16. ఎలాంటి విద్యార్హత లేని పన్నెండు సంవత్సరాల బాలుడు ఒక పాఠశాలకు వెళ్లి తనను పాఠశాలలో వయసుకు తగిన తరగతిలో చేర్చుకోమని అడిగితే...
జ: వెంటనే చేర్చుకోవాలి

 

17. విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే ....
జ: 6 - 14 సంవత్సరాలు ఉన్న బాలబాలికలు

 

18. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది?
జ: 86వ

 

19. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం కిందివాటిలో సరికాని వాక్యమేది?
       1) పాఠశాలలో 10% మించి ఖాళీలు ఉండరాదు
       2) విద్యార్థిని శారీరకంగా శిక్షించవచ్చు
       3) పాఠశాలలో SMC కమిటీలు ఏర్పాటు చేయాలి
       4) పైవన్నీ
జ: 2(విద్యార్థిని శారీరకంగా శిక్షించవచ్చు)

20. RTE - 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి?
జ: 1 కి.మీ.

 

21. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఇతరత్రా అంశాల్లో సంబంధం లేకుండా పాఠశాల ప్రవేశాలకు సూచించిన సాధారణ కాలవ్యవధి?
జ‌: జూన్ - 12 ఆగస్టు - 31

 

22. విద్యాహక్కు చట్టానికి సంబంధించి సరైన వాక్యం ఏది?
    A) ఉపాధ్యాయ ఖాళీలు 10 శాతం కంటే మించకూడదు.
    B) ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగించకుండా కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి.
    C) విద్యా ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి.
జ‌: A, B, C

 

23. విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కుల్లో కింది ఏ వర్గీకరణలో ఉంటాయి?
    ఎ) అభివృద్ధి చెందే హక్కు                బి) రక్షణ హక్కు
    సి) స్వేచ్ఛా హక్కు                           డి) జీవించే హక్కు
జ‌: ఎ (అభివృద్ధి చెందే హక్కు)

24. విద్యాహక్కు చట్టానికి సంబంధించి సత్యవాక్యం ఏది?
   ఎ) విద్యార్థికి బదిలీ ధ్రువపత్రం లేదనే కారణంతో ఆ విద్యార్థికి ప్రవేశం నిరాకరించవచ్చు
   బి) విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో జూన్ నెలలో మాత్రమే ప్రవేశం కల్పించాలి.
   సి) విద్యార్థికి బదిలీ పత్రం లేదనే కారణంతో ప్రవేశం నిరాకరించకూడదు.
  డి) ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయొచ్చు లేదా చేయకపోవచ్చు.
జ‌: సి (విద్యార్థికి బదిలీ పత్రం లేదనే కారణంతో ప్రవేశం నిరాకరించకూడదు.)

 

25. విద్యాహక్కు చట్టం - 2009 లో ...?
జ‌: 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు ఉన్నాయి

 

26. ఉపాధ్యాయులు జనగణన, ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం లాంటి పనులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్న సెక్షన్ ఏది?
జ‌: సెక్షన్ 27

 

27. భారతదేశంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయని రాష్ట్రం ఏది?
జ‌: జమ్మూ- కశ్మీర్

 

28. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది?
జ‌: పాఠశాల యాజమాన్య కమిటీ

29. ఒక విద్యా సంవత్సరంలో ఒక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల కనీసం ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలని విద్యాహక్కు చట్టం పేర్కొంది?
జ‌: 200 - 220 రోజులు

 

30. ప్రతి ఆవాస ప్రాంతానికి ఎంత దూరంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలని విద్యాహక్కు చట్టం 2009 పేర్కొంది?
జ‌: ప్రతి 3 కి.మీ.

 

31. కింది అంశాల్లో ఏది విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం సరికాదు?
    ఎ) సెక్షన్ 3 ప్రకారం 6 - 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంటుంది.
    బి) సెక్షన్ 10 ప్రకారం 6 - 14 ఏళ్ల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం తల్లితండ్రుల బాధ్యత
    సి) సెక్షన్ 8 ప్రకారం పూర్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
    డి) సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక తరగతికి ఎలాంటి ఎంపిక ఫీజు లేదు
జ‌: సి (సెక్షన్ 8 ప్రకారం పూర్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.)

 

32. విద్యాహక్కు చట్టంలో సెక్షన్ 21 ఏ అంశానికి సంబంధించింది?
జ‌: బడిలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు

 

33. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి అంటే...?
      ఎ) ప్రభుత్వ అధీనంలో ఉన్న పాఠశాలలు          బి) ఎయిడెడ్ పాఠశాలలు
      సి) అన్ ఎయిడెడ్ పాఠశాలలు                          డి) అన్నీ
జ‌: డి (అన్నీ)

34. విద్యా హక్కు చట్టం - 2009 ఎలిమెంటరీ విద్యగా కింది ఏ తరగతులను పేర్కొంది?
     ఎ) 1 - 5 తరగతులు                             బి) 1 - 8 తరగతులు
     సి) 1 - 10 తరగతులు                          డి) 1 - 7 తరగతులు
జ‌: బి (1 - 8 తరగతులు)

 

35. ఒక ప్రాథమిక పాఠశాలలో 51 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు కనీసం ఎంత మంది ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టం పేర్కొంది?
జ‌: ఇద్దరు

 

36. ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాల నిర్వహించినట్లయితే ఎంత జరిమానా విధించాలి?
జ‌: రూ.1,00,000

 

37. విద్యాహక్కు చట్టం ప్రకారం కిందివాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది ఏది?
     ఎ) ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా ప్రతినెలా జీతం మంజూరు చేయడం
     బి) పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో సలహాలు, సూచనలు ఇవ్వడం
     సి) పాఠశాల ప్రగతిని పరిశీలించడం
     డి) మధ్యాహ్న భోజన పథకం అమలు పర్యవేక్షణ
జ‌: ఎ (ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా ప్రతినెలా జీతం మంజూరు చేయడం)

38. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఏ పాఠశాల అయినా బాలలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తే ప్రభుత్వం ఎంత జరిమానా విధిస్తుంది?
జ‌: మొదటి తప్పుకి రూ.25,000, రెండోసారి ప్రతి తప్పుకి రూ.50,000.

 

39. NCF - 2005 ప్రకారం విద్యార్థి అభ్యసించే సబ్జెక్టుల మధ్య పరిధులను తొలగించాలి. ఎందుకంటే .....?
    ఎ) అభ్యసన ప్రక్రియ జ్ఞాన నిర్మాణపరంగా ఉండాలి.
    బి) విద్యార్థికి జ్ఞాన ప్రసారం సమైక్య జ్ఞానంగా ఉండాలి.
    సి) అవగాహన చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించాలి.
    డి) పైవన్నీ
జ‌: డి( పైవన్నీ)

 

40. జాతీయ పాఠ్య ప్రణాళిక చ‌ట్టం - 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి నిర్దేశించిన సూత్రాల్లో లేనిది?
జ‌: అభ్యసన ప్రక్రియ పాఠ్యపుస్తకానికి అనుకూలంగానే ఉండాలి.

 

41. పాఠశాల ప్రమాణాల విషయంలో ఏ అంశంలో బోధించడానికి 6 నుంచి 8 తరగతులకు పాక్షిక కాల ఉపాధ్యాయులను నియమించాలని విద్యాహక్కు చట్టం పేర్కొంది?
జ‌: ఆర్ట్స్ బోధించే ఉపాధ్యాయుడు

42. జాతీయ ప్రణాళిక చట్టం భారం లేని అభ్యసనాన్ని కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంటే...?
      ఎ) పరీక్షా విధానంలో మార్పులను తీసుకు రావాలి.
      బి) పాఠ్యప్రణాళిక నుంచి పాఠ్య పుస్తకాల వరకూ మార్పులు తీసుకు రావాలి.
      సి) విద్యార్థి నిజజీవితానికి పాఠశాల జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి.
      డి) పైవన్నీ
జ‌: డి( పైవన్నీ)

 

43. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం కేటాయించారు?
జ‌: 45 గంటలు

 

44. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సింది?
జ‌: శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు

 

45. జాతీయ ప్రణాళికా చట్టం - 2009 ప్రకారం బోధన ఉద్దేశం ఏది?
జ‌: విద్యార్థికి జ్ఞాన నిర్మాణం అందించడం

 

46. విద్యా విధానంలో బోధన ప్రక్రియ ఎలా ఉండకూడదు?
జ‌: అమూర్త అంశాల నుంచి మూర్త అంశాలకు

 

47. గణిత విద్యాబోధన లక్షణాన్ని జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం ఏమని పేర్కొంది?
జ‌: పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడం

48. బోధనాభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి?
జ‌: పిల్లల్లో సృజనాత్మకత పెంచే విధంగా

 

49. బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం అంటే....?
జ‌: పిల్లలు, ఉపాధ్యాయుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడం

 

50. జాతీయ ప్రణాళికా చ‌ట్టం - 2005 నాణ్యత ప్రమాణాంశాల్లో కిందివాటిలో దేనికి అధిక ప్రాముఖ్యం ఇచ్చింది?
     ఎ) భౌతిక వనరులు
     బి) అర్హతలు, ఔత్సాహికత కలిగిన ఉపాధ్యాయులు
     సి) విద్యార్థి అభ్యసనానుభవాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక సంస్కరణ
     డి) ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆలోచనలు
జ‌: సి (విద్యార్థి అభ్యసనానుభవాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక సంస్కరణ)

 

51. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీలో మహిళలు ఎంత శాతం ఉండాలి?
జ‌: 50%

 

52. జాతీయ ప్రణాళికా చట్టం - 2005 ప్రకారం సహ పాఠ్య కార్యక్రమాల్లో వేటికి ప్రాధాన్యం ఉంది?
       ఎ) కళా విద్య                                బి) ఆరోగ్య వ్యాయామ విద్య
       సి) పని అనుభవ విద్య                  డి) పైవన్నీ
జ‌: డి (పైవన్నీ)

53. పిల్లలను శారీరకంగా, మానసికంగా శిక్షించకూడదని విద్యాహక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది?
జ‌: సెక్షన్ 17

 

54. జాతీయ ప్రణాళికా చట్టం - 2005లో ఉన్న అధ్యాయాల సంఖ్య?
జ‌: 5

 

55. విద్యార్థికి జనన ధృవీకరణ పత్రం లేదనే నెపంతో ప్రవేశం నిరాకరించకూడదు అని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది?
     ఎ) సెక్షన్ 14          బి) సెక్షన్ 3            

     సి) సెక్షన్ 5         డి) సెక్షన్ 7
జ‌: సెక్షన్ 14

 

56. కిందివాటిలో ఏది విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి కాదు?
       ఎ) అన్వేషణ పద్ధతి                            బి) కృత్యాధార పద్ధతి
       సి) సమస్యా పరిష్కార పద్ధతి               డి) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
జ‌: డి (ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి)

57. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత?

జ: అయిదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు + ఒక ప్రధాన ఉపాధ్యాయుడు

58. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని?
జ: 800

 

59. ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అదనంగా రూ.1,500 వసూలు చేశారు. అయితే విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఈ పాఠశాలకు ఎంత జరిమానా విధించాలి?(రూపాయల్లో)
జ: 15,000

60. విద్యాహక్కు చట్టంలో సెక్షన్‌ 6 దేన్ని తెలియజేస్తుంది?

జ: ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కి.మీ. దూరంలో ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ. దూరంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి.
 

61. విద్యాహక్కు చట్టం 2009లో ఉన్న సెక్షన్లు, అధ్యాయాలు వరుసగా ....
జ: 38, 7

 

62. RTE - 2009 ప్రకారం సెక్షన్‌ 26 దేన్ని తెలియజేస్తుంది?
జ: ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయడం.

 

63. కిందివాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది?
    1) మధ్యాహ్న భోజన అమలును పర్యవేక్షించడం
    2) ఆవాస ప్రాంతంలోని బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడటం
    3) బడి అభివృద్ధి ప్రణాళికను తయారుచేయడం
    4) పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడం
జ: 4 (పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడం)

 

64. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ‘బాలలు’ అంటే....
జ: 6 - 14 సంవత్సరాల పిల్లలు

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌