• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయ ప్రేరణ - సాధికారత

1. కిందివాటిలో DPEP లక్ష్యాల్లో సరికానిది?
1) పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్య 5% కంటే తగ్గించడం.
2) స్త్రీ విద్యను ప్రోత్సహించడం.
3) 6 - 11 ఏళ్ల బాల బాలికలందరికీ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం.
4) 3 R'S లో విద్యార్థుల ప్రమాణాలను 40% అధికం చేయడం.
జ: 2(స్త్రీ విద్యను ప్రోత్సహించడం.)

 

2. సర్వశిక్షా అభియాన్‌ నినాదం?
జ: అందరూ చదవాలి అందరూ ఎదగాలి!

 

3. LEP (Learning Enhancement Programme) ద్వారా బాలికల విద్య కోసం ఏయే కార్యక్రమాలను ప్రవేశపెట్టారు?
జ: NPEGEL, KGBV

 

4. కిందివాటిలో NCERT కి అనుబంధ సంస్థ కానిది?
1) RIE  2) CIET  3) SIET  4) NIE
జ: 3 (SIET)

 

5. EFLU (English and Foreign Languages University) యొక్క పురాతన నామం?
జ: CIEFL

 

6. డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి కోర్సులను అనేక భాషల్లో అందించేది?
జ: EFLU

 

7. కిందివాటిని జతపరచండి.
i) NCERT       A) 1958
ii) SCERT      B) 2003
iii) SSA        C) 1967
iv) EFLU       D) 1961
జ: i-D, ii-C, iii-B, iv-A

 

8. కిందివాటిలో SCERT విధి కానిది?
1) రాష్ట్రస్థాయి విద్యాపాఠ్య ప్రణాళికను రూపొందించడం.
2) ఉపాధ్యాయ విద్యాసంస్థలను పర్యవేక్షించడం.
3) రాష్ట్రస్థాయిలో సైన్స్‌ ఎగ్జిబిషన్లను నిర్వహించడం.
4) పాఠ్యపుస్తకాలను, పత్రికలను ప్రచురించడం.
జ: 4(పాఠ్యపుస్తకాలను, పత్రికలను ప్రచురించడం.)

 

9. ఉపాధ్యాయ ప్రేరణను ప్రభావితం చేసే బహిర్గత కారకాల్లో లేనిది?
1) ఉపాధ్యాయుడి శారీరక ఆరోగ్యం బాగుండాలి
2) నిర్ణీత వ్యవధిలో పదోన్నతి
3) గుర్తింపుకు ప్రతిఫలంగా అవార్డులు
4) ఉద్యోగ భద్రత
జ: 1(ఉపాధ్యాయుడి శారీరక ఆరోగ్యం బాగుండాలి)

 

10. మండల స్థాయిలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలకు కేంద్రంగా ఉండేది.
జ: MRC

 

11. పాఠశాల రికార్డుల ఆవశ్యకతలో ముఖ్యమైన అంశం కానిది?
1) పాఠశాల సంస్థాగత కార్యక్రమాలను మదింపు చేయడం.
2) ఆర్థిక అవసరాల బడ్జెట్‌ వివరణలను తయారు చేయడం.
3) గృహం, సముదాయంతో సహకార, నిర్మాణాత్మకమైన సంబంధాలను నెలకొల్పడం.
4) ఉపాధ్యాయులకు జీతభత్యాలు, సెలవులు ఇవ్వడం.
జ: 4(ఉపాధ్యాయులకు జీతభత్యాలు, సెలవులు ఇవ్వడం.)

 

12. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శిచినప్పుడు వారు తమ సలహాలను ఏ రిజిస్టర్‌లో పొందుపరచాలి?
జ: లాగ్‌బుక్‌

 

13. పాఠశాల చరాస్థులను సూచించే రిజిస్టర్‌?
జ: స్టాక్‌ రిజిస్టర్‌

 

14. ఉపాధ్యాయుడు ఉద్యోగంలో చేరిన తేది, పుట్టిన తేది, విద్యార్హతలు, జీతం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు లాంటి అంశాలను పొందుపరిచే రిజిస్టర్‌?
జ: సర్వీస్‌ బుక్‌

 

15. కన్సిన్జెంట్‌ రిజిస్టర్‌ అంటే?
జ: పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న చిన్న వస్తువుల కొనుగోళ్ల విషయాలు రాసే రిజిస్టర్‌

 

16. కిందివాటిని జతపరచండి.  

i) అందరికీ విద్య అనే లక్ష్యాన్ని సాధించడానికి నియత, అనియత పద్ధతుల్లో పలు విద్యా కార్యక్రమాల అమలుకు సహకరించేది A)NCERT
ii) వయోజన విద్యావ్యాప్తికి కృషిచేస్తున్న సంస్థలన్నింటికీ శిక్షణ ఇచ్చేది B) SIET
iii) పాఠ్యపుస్తకాలు, పత్రికలను ప్రచురించేది C) DIET
iv) జిల్లా విద్యామండలికి అవసరమైన సలహాలు అందించేది D) SRC

జ: i-B , ii-D, iii-A, iv-C
 

17. SSAకి 9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధుల శాతం వరుసగా
జ: 85 : 15

 

18. జతపరచండి.
 i) మన సంస్కృతి సంప్రదాయాల            A) NCTE
    పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ    
ii) జాతీయస్థాయిలో ఉపాధ్యాయ            B) EFLU
   విద్యాకార్యక్రమాలను సమన్వయం చేసేది  
iii) సాంకేతిక విద్యను విస్తరించి బోధనా      C) CCRT 
     పరికరాలను సిద్ధం చేసేది    
iv) ఆంగ్లం, విదేశీ భాషలకు సంబంధించి     D) CIET
  పలు కార్యక్రమాలను  రూపొందించి ఉపాధ్యాయులకు అందించేది    
జ: i-C, ii-A, iii-D, iv-B

19. కిందివాటిలో DIET ల విధి కానిది?
1) ప్రాథమిక విద్యాస్థాయిలో వృత్తిపూర్వక, వృత్యతర శిక్షణను నిర్వహించడం.
2) జిల్లా విద్యామండలికి అవసరమైన సలహాలు ఇవ్వడం.
3) జిల్లాస్థాయిలో పదో తరగతి మినహా మిగిలిన తరగతులన్నింటికీ ప్రశ్నపత్రాలు రూపొందించడం.
4) మధ్యాహ్న భోజన నిర్వహణ.
జ: 4(మధ్యాహ్న భోజన నిర్వహణ.)

 

20. జిల్లా విద్యా శిక్షణా సంస్థలను ఎప్పుడు స్థాపించారు?
జ: 1989 - 90

 

21. ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక విద్యాపథకంలో ప్రాథమిక తరగతుల గుణాత్మకతను పెంచడానికి రూపొందించిన అభ్యసన సూత్రాల్లో లేనిది?
1) అనుభవాల ద్వారా అభ్యసనాన్ని పెంచడం.
2) బాలికా విద్యకు ప్రాధాన్యాన్ని కల్పించడం.
3) స్థానిక పరిసరాలను సక్రమంగా వినియోగించడం.
4) వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి గదిని అభివృద్ధి పరచడం.
జ:  2(బాలికా విద్యకు ప్రాధాన్యాన్ని కల్పించడం.)

 

22. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE) కి సంబంధించి కిందివాటిని జతపరచండి.
i) తూర్పు ప్రాంతం         A) బెంగళూరు
ii) పశ్చిమ ప్రాంతం        B) జైపూర్‌
iii) ఉత్తర ప్రాంతం         C) భోపాల్‌
iv) దక్షిణ ప్రాంతం         D) భువనేశ్వర్‌
      i         ii       iii      iv
జ:   D        C       B       A

 

23. పాఠశాల స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యల అధ్యయనానికి నియమించిన కమిషన్‌?
జ: ఛటోపాధ్యాయ కమిషన్‌

 

24. కిందివాటిలో జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (NCERT) అనుబంధ సంస్థ కానిది?
1) SCERT  2) CIET   3) RIE   4) NIE
జ: 1 (SCERT)

 

25. ‘నల్లబల్ల పథకం’ ఏ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది?
1) పాఠశాలకు సంబంధించిన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చడం.
2) అదనపు తరగతి గదుల నిర్మాణం.
3) అదనపు ఉపాధ్యాయులను నియమించడం.
4) అన్నీ
జ: 4(అన్నీ)

 

26. ప్రణాళికలను కింది స్థాయి నుంచి తయారుచేసి ఉన్నత స్థాయి వరకు అమలుపరచడానికి వీలుగా రూపొందించిన కార్యక్రమం?
జ: DPEP

 

27. ప్రతి పాఠశాలలో రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ ఏ అంశం ఆధారంగా జరగాలి?
1) విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవడం
2) చట్టపరమైన అవసరాలకు
3) పాఠశాల లోటుపాట్లు గుర్తించి సవరించుకోవడం
4) అన్నీ
జ: 4(అన్నీ)

 

28. మన దేశంలోని వివిధ రకాల సంస్కృతులకు భిన్నంగా ‘జాతీయ విద్యా విధానం - 1986’ ఏ సంస్థకు ఏక రూపకత గల విద్యా విధానాన్ని అప్పగించింది?
జ: NCERT

 

29. జాతీయ స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే విధులను జిల్లా స్థాయిలోని ఏ సంస్థ సమాంతరంగా నిర్వహిస్తుంది?
జ: జిల్లా విద్యా శిక్షణా సంస్థ

 

30. ‘రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌’ లక్ష్యం?
జ: సెకండరీ విద్యను 2017 నాటికల్లా సార్వజనీక అందుబాటులోకి తేవడం, ఆవాస ప్రాంతానికి 5 కి.మీ. దూరంలో ఒక సెకండరీ పాఠశాల ఉండేలా చూడటం. 

 

31. కిందివాటిలో రాష్ట్రస్థాయి దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దేన్ని అంటారు?
1) DRU   2) SIET    3) DIET   4) SCERT
జ: 2(SIET)

 

32. ‘జ్ఞాన్‌ దర్శన్‌’ అనే ఛానెల్‌ను విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ఎవరు ఏర్పాటుచేశారు?
జ: ఇగ్నో, జ్ఞాన్‌దర్శన్‌

 

33. పాఠశాల సముదాయం ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
జ: ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు

 

34. వయోజనుల్లో అక్షరాస్యత పెంచడానికి ఏర్పాటుచేసిన పథకం?
జ: స్టేట్‌ రిసోర్స్‌ సెంటర్‌ , స్టేట్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ అడల్ట్ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌

 

35. విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది నియామకం, వారి పదోన్నతుల బాధ్యతను నిర్వర్తించే స్వయంప్రతిపత్తి గల సంస్థ?
జ: UGC

 

36.  కిందివాటిలో రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణా మండలి విధి?
1) వృత్యంతర శిక్షణ కల్పన              2) పరిశోధనా సంబంధ విధులు
3) ఉపాధ్యాయ విద్యాసంస్థల పర్యవేక్షణ   4) అన్నీ
జ: 4(అన్నీ)

 

37. ‘టెలిస్కూలు’ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ ఏది?
జ: CIET

 

38. NCERT ని ఎప్పుడు స్థాపించారు?
జ: 1961

 

39. కిందివాటిలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించడానికి తోడ్పడని అంశం?
1) తరగతిగది వాతావరణం - బోధనాపరికరాలు     

 2) విద్యార్థుల సాధనకు ఉపకరించే మౌలిక సౌకర్యాలు
3) విద్యార్థి ప్రణాళిక                                                  
4) అన్నీ
జ: 4(అన్నీ)

 

40. సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన సంస్థ?
జ: IASE

 

41. ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి, కనీస సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన ‘నల్లబల్ల పథకం’ను ప్రాథమికోన్నత స్థాయికి కూడా విస్తరించాలని సూచించిన కమిటీ?
జ: జనార్ధన్‌ రెడ్డి కమిటీ

 

42. జాతీయ విద్యాపరిశోధన శిక్షణామండలి ఆధ్వర్యంలో నేషనల్‌ సెర్చ్‌ టాలెంట్‌ టెస్ట్‌ను ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు?
జ: 10వ

 

43. సర్వశిక్షా అభియాన్‌కు సంబంధించి విజ్ఞానం కోసం ఆకాశవాణిలో సోమ, బుధ, శుక్ర వారాల్లో నిర్వహించే కార్యక్రమం?
జ: మన ప్రపంచం

 

44. ఆసియా దేశాల పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళికలను రూపొందించే సంస్థ?
జ: NUEPA

 

45. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రతి జిల్లాలో ‘జిల్లా విద్యా శిక్షణా సంస్థ 'ను ఏర్పాటుచేశారు?
జ: జాతీయ విద్యావిధానం - 1986

 

46. పాఠశాల రికార్డుల్లో దేన్ని విద్యార్థికి ఆత్మ లాంటిదని పేర్కొంటారు?
జ: అడ్మిషన్‌ రిజిస్టర్‌

 

47. నవోదయ పాఠశాలలు ఏ తరగతుల వారికి విద్యను అందిస్తాయి?
జ: 6 - 12

 

48. ఉపాధ్యాయ వృత్తిపరత్వం అంటే?
జ: వృత్తిపర నియమావళికి అనుకూలంగా నడుచుకోవడం

 

49. ఏ కమిటీ మొదటిసారి ఉపాధ్యాయులకు నియమనిబంధనలతో కూడిన ‘వృత్తిపర నియమావళి’ అవసరాన్ని గుర్తించింది?
జ: జాతీయ విద్యావిధానం - 1986

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌