మాదిరి ప్రశ్నలు
1. 'విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయడం' ఇది ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది?
జ: వైఖరి
2. వైఖరి ఏ రంగానికి చెందింది?
జ: భావావేశ రంగం
3. అవగాహన లక్ష్యాన్ని స్పష్టీకరించింది ఎవరు?
జ: బ్లూమ్
4. కిందివాటిలో వినియోగ లక్ష్య స్పష్టీకరణ?
ఎ) ఉదాహరణలివ్వడం బి) సంబంధాలను స్థాపించడం
సి) మాదిరులను సేకరించడం డి) పుస్తకాలను పఠించడం
జ: బి (సంబంధాలను స్థాపించడం)
5. 'సాంద్రతను నిర్వచించండి' అని ప్రశ్నించడం ద్వారా పొందగలిగే లక్ష్యం?
జ: జ్ఞానం
6. ఒక విషయాన్ని అంగీకరించడానికి లేదా నిరాకరించడానికి ఆధారాన్ని కోరితే ఆ లక్ష్యం?
జ: వైఖరి
7. 'విశ్లేషణ చేయగలగడం' అనే స్పష్టీకరణ కిందివాటిలో ఏ లక్ష్యానికి చెందింది?
ఎ) జ్ఞానం బి) నైపుణ్యం సి) వినియోగం డి) అవగాహన
జ: సి (వినియోగం)
8. భావావేశ రంగం అత్యున్నత లక్ష్యం?
జ: శీలనిర్మాణం
9. విద్యకు మార్గదర్శనం చేసేది?
జ: ఉద్దేశాలు
10. పాఠశాల కార్యక్రమాల ద్వారా అంతిమంగా చేరుకోగల దృక్పథాన్ని ఏమంటారు?
జ: లక్ష్యం
11. 'సునిశితత్వం' అనే లక్ష్యం మానసిక చలనాత్మక రంగం క్రమణికలో ఎన్నోది?
జ: 3
12. లక్ష్యానికి, లక్ష్యానికి మధ్య ఉన్న తేడాలను సూచించేవి?
జ: స్పష్టీకరణలు
13. 'సాధారణీకరించడం' ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థిలో సాధించే లక్ష్యం?
జ: అన్వయం
14. కిందివాటిలో లక్ష్యాలు వేటి గురించి చర్చించవు?
ఎ) బోధనా పద్ధతులు బి) పాఠ్యాంశాలు
సి) బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలు డి) ఏదీకాదు
జ: సి (బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలు)
15. 'విశాల భావాలను కలిగి ఉండటం' అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ?
జ: వైఖరి