• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భౌతికశాస్త్రం

1. ఒక సిద్ధాంతాన్ని అనుసరించి పరమాణువు విభజించడానికి వీల్లేని అతి సూక్ష్మమైన కణం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: డాల్టన్
 

2. కిందివారిలో రుణ ధృవ కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త
A) నీల్స్‌బోర్      B) గోల్డ్‌స్టేయిన్       C) జె.జె. థామ్సన్       D) జేమ్స్ చాడ్విక్
జ: C (జె.జె. థామ్సన్)
 

3. కాథోడ్ కిరణాలు రుజు మార్గంలో చలిస్తాయి. అయితే ఈ కణాలకు ఉండే ఆవేశం
జ: రుణాత్మకం
 

4. కాథోడ్ కిరణాల్లోని కణాలకు 'ఎలక్ట్రాన్' అని పేరుపెట్టిన శాస్త్రవేత్త
జ: జి.జె. స్టోనీ
 

5. పరమాణు సంఖ్య పరమాణువులోని .......... ల సంఖ్యకు సమానం.
జ: ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్‌
 

6. ఆల్ఫా (α) కణాలు ఏ విధంగా లభిస్తాయి?
జ: ఎలక్ట్రాన్‌లను తొలగించిన హీలియం పరమాణువులు
 

7. పరమాణువు ద్రవ్యరాశి మొత్తం దేనిలో ఉంటుంది?
జ: గోళాకారపు పరమాణు కేంద్రకంలో
 

8. ప్రోటాన్ల ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎన్నిరెట్లు ఎక్కువగా ఉంటుంది?
జ: 1837
 

9. ఆల్ఫా కణాలు ఏ ప్రాథమిక కణాలతో నిర్మితమవుతాయి?
జ: రెండు ప్రోటాన్‌లు, రెండు న్యూట్రాన్‌లు
 

10. 'గ్రహ మండల నమూనా' అని ఏ పరమాణు నమూనాను అంటారు?
జ: రూథర్‌ఫర్డ్ నమూనా
 

11. కింది శాస్త్రవేత్తల్లో ఉత్సర్గనాళికను కనుక్కున్నవారు
A) నీల్స్‌బోర్        B) హైసన్‌బర్గ్        C) జె.జె. థామ్సన్        D) విలియం క్రూక్స్
జ: D (విలియం క్రూక్స్)
 

12. X - కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: రాంట్‌జన్
 

13. కాథోడ్ కిరణాలను కొన్ని భారలోహాలపై ప్రసరింపజేస్తే అవి ఉత్పత్తి చేసే కిరణాలు ఏవి?
జ: X - కిరణాలు
 

14. టెలివిజన్ పిక్చర్ ట్యూబ్‌లో ఉపయోగించే కిరణాలు
జ: కాథోడ్ కిరణాలు
 

15. కాథోడ్ కిరణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
A) కంప్యూటర్ డిస్‌ప్లే ట్యూబులుగా
B) ట్యూబు లైట్స్‌గా
C) ప్రకటనలకు వాడే ప్రకాశ చిహ్న ట్యూబులుగా
D) అన్ని సరైనవే
జ: D (అన్ని సరైనవే)
 

16. కిందివాటిలో X - కిరణాల ఉపయోగం కానిది?
A) వస్తువు తయారీలోని లోపాలను, పగుళ్లను తెలుసుకునేందుకు
B) నేర పరిశోధనలో ఉపయోగిస్తారు
C) ప్రకాశ చిహ్న ట్యూబులుగా
D) విరిగిన ఎముకల గురించి తెలుసుకోవడానికి
జ: C (ప్రకాశ చిహ్న ట్యూబులుగా)
 

17. CT (కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ) స్కానింగ్‌లో ఉపయోగించే కిరణాలు ఏవి?
జ: X - కిరణాలు
 

18. కిందివాటిలో పదార్థ నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
A) X - కిరణాలు       B) γ - కిరణాలు       C) β - కిరణాలు       D) UV - కిరణాలు
జ: A (X - కిరణాలు)
 

19. X - కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ్ నాళంలో టార్గెట్ (లక్ష్యం)గా ఉపయోగించే లోహాలు ఏవి?
జ: టంగ్‌స్టన్, మాలిబ్డినం
 

20. మృదు X - కిరణాలను కింది ఏ రంగంలో ఉపయోగిస్తారు?
A) వ్యవసాయ రంగం       B) పారిశ్రామిక రంగం       C) వైద్య రంగం       D) కస్టమ్స్ శాఖ
జ: C (వైద్య రంగం)
 

21. పరమాణు కేంద్రక వ్యాసార్ధం
జ: 10-13 cm
 

22. అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉండే కిరణాలు?
జ: α - కిరణాలు
 

23. అత్యధికంగా చొచ్చుకపోయే కిరణాలు
జ: γ - కిరణాలు
 

24. రేడియోధార్మికతలో వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలు
జ: γ - కిరణాలు
 

25. అయస్కాంత క్షేత్రంలో అపవర్తనం కాని వికిరణాలు
జ: γ - కిరణాలు
 

26. ఒక పరమాణువు నుంచి β - కణం ఉద్గారమైతే దాని పరమాణు ద్రవ్యరాశి సంఖ్య
జ: మారదు
 

27. ఒక పరమాణువు నుంచి α - కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి సంఖ్య తగ్గే పరిమాణం
జ: 4 ప్రమాణాలు
 

28. ఐసోబార్‌లు కింది ఏ పరమాణువులు?
A) ఒకే ద్రవ్యరాశి సంఖ్య   B) ఒకే పరమాణు సంఖ్య  
C) ఒకే న్యూట్రాన్ సంఖ్య   D) ఎలక్ట్రాన్ సంఖ్య
జ: A (ఒకే ద్రవ్యరాశి సంఖ్య)
 

29. అస్థిర పరమాణువు నుంచి γ - కిరణం ఉద్గారమైనప్పుడు దాని
జ: Z, A మారవు
 

30. థోరియం శ్రేణి
జ: 4n శ్రేణి
 

31. బిస్మత్ శ్రేణి దేనికి సంబంధించింది?
జ: 4n + 1 శ్రేణి
 

32. ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉండే విభిన్న మూలక పరమాణువులను ఏమంటారు?
జ: ఐసోబార్లు
 

33. రేడియో ధార్మిక వికిరణాల్లో విద్యుదయస్కాంత ధర్మం ఏ కిరణాలకు ఉంటుంది?
జ: γ - కిరణాలు
 

34. నెప్ట్యూనియం శ్రేణి
జ: 4n + 1 శ్రేణి
 

35. n - p - n ట్రాన్సిస్టర్‌లో సంప్రదాయక ప్రవాహం
జ: ఉద్గారకం ద్వారా వెలుపలకు వస్తుంది
 

36. 1 a.m.u. =
జ: 931.5 MeV
 

37. పరమాణు వ్యాసార్ధం సుమారుగా
జ: 10-10 మీ.
 

38. కేంద్రక వ్యాసార్ధం సుమారుగా
జ: 10-15 మీ.
 

39. కిందివాటిలో పరమాణువులోని ప్రాథమిక కణం ఏది?
A) ఎలక్ట్రాన్       B) ప్రోటాన్       C) న్యూట్రాన్       D) అన్నీ
జ: D (అన్నీ)
 

40. పరమాణువులోని రుణావేశిత కణం
జ: ఎలక్ట్రాన్
 

41. పరమాణువులో ధనావేశిత కణం
జ: ప్రోటాన్
 

42. న్యూట్రాన్‌లపై ఆవేశం
జ: శూన్యం
 

43. న్యూట్రాన్ ద్రవ్యరాశి .............. ద్రవ్యరాశికి సమానం.
జ: ప్రోటాన్
 

44. పరమాణువులోని తటస్థ కణం
జ: న్యూట్రాన్
 

45. న్యూట్రాన్‌పై ఆవేశం
జ: 0
 

46. కిందివాటిలో న్యూట్రాన్ సంకేతం
A) n       B) e       C) p       D) ఏదీకాదు
జ: A (n)
 

47. కిందివాటిలో ఎలక్ట్రాన్ ఆవేశం కూలుంబులలో
A) 0       B) +1.602 × 10-10      C) -1.602 × 10-19        D) +4.8 × 10-10 
జ: C (-1.602 × 10)
 

48. కిందివాటిలో ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి a.m.u లలో
A) 1.0087       B) 2.0057       C) 1.0073       D) 0.00055
జ: D (0.00055)
 

49. కిందివాటిలో ప్రోటాన్ ద్రవ్యరాశి a.m.u.లలో
A) 1.0087       B) 2.0057       C) 1.0073       D) 0.00055
జ: C (1.0073)
 

50. కిందివాటిలో న్యూట్రాన్ ద్రవ్యరాశి a.m.u. లలో
A) 1.0087       B) 2.0237       C) 0.00055       D) 1.0073
జ: A (1.0087)
 

51. కిందివాటిలో ప్రోటాన్ ఆవేశం కూలుంబులలో
A) -4.8 × 10-10        B) -1.602 × 10-19      C) +4.8 × 1010        D) +1.602 × 10-19
జ: D (+1.602 × 10-19)

52. కిందివాటిలో న్యూట్రాన్ ఆవేశం కూలుంబులలో
A) -4.8 × 10-10        B) +1.602 × 10-19        C) +4.8 × 10-10        D) 0
జ: D (0)

53. ఎలక్ట్రాన్ e/m విలువ కనుక్కున్న శాస్త్రవేత్త
జ: జె.జె. థామ్సన్
 

54. విద్యుదావేశ పరంగా పరమాణువు ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?
జ: తటస్థ స్వభావం
 

55. రసాయనిక చర్యలో పాల్గొనే అతి సూక్ష్మ కణం
జ: పరమాణువు
 

56. పరమాణువులో ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్‌ల పంపిణీని వివరించిన శాస్త్రవేత్త
జ: నీల్స్‌బోర్
 

57. పుచ్చకాయ పరమాణు నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ: జె.జె. థామ్సన్
 

58. ఎలక్ట్రానిక్ సాధనాలకు హృదయం లాంటిది
జ: ట్రాన్సిస్టర్
 

59. ఎలక్ట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: జె.జె. థామ్సన్
 

60. ప్రోటాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ: గోల్డ్‌స్టేయిన్
 

61. న్యూట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ: చాడ్విన్
 

62. ధనావేశం మొత్తం కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ: రూథర్‌ఫర్డ్
 

63. ధనావేశం మొత్తం పరమాణు కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుందని రూథర్‌ఫర్డ్ ఎందుకు భావించాడు?
జ: α - కణాలు కేంద్రకంతో వికర్షణకు గురవుతాయి

64. α - కిరణ పరిక్షేపణ వల్ల తెలిసిన పరమాణు నమూనా
జ: రూథర్‌ఫర్డ్ గ్రహ మండల నమూనా

65. ఫెర్మీ విలువ
జ: 10-15 మీ.

66. ఆంగ్‌స్ట్రామ్ విలువ
జ: 10-8  సెం.మీ.

67. రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనా వేటిని వివరించలేక పోయింది?
జ: పరమాణు స్థిరత్వం, హైడ్రోజన్ పరమాణువులో రేఖా వర్ణ పటానికి మూలం
 

68. 1 MeV దేనికి సమానం
జ: 1.6 × 10-13  జౌల్స్

69. పరమాణు ద్రవ్యరాశులను కొలవడానికి ప్రస్తుతం ఏ మూలకాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు?
జ: కార్బన్
 

70. హీలియం పరమాణువులోని ప్రోటాన్‌ల సంఖ్య
జ: 2
 

71. హీలియం పరమాణు ద్రవ్యరాశి
జ: 4 a.m.u.
 

72. కేంద్రకంలోని ప్రోటాన్‌ల సంఖ్య
జ: పరమాణు సంఖ్య
 

73. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య నుంచి పరమాణు సంఖ్యను తీసివేస్తే లభించేది
జ: న్యూట్రాన్‌ల సంఖ్య
 

74.  పరమాణువులోని ప్రోటాన్‌ల సంఖ్య
జ: 92

75.  పరమాణువులోని న్యూట్రాన్‌ల సంఖ్య
జ: 146

76.  పరమాణులోని ద్రవ్యరాశి సంఖ్య
జ: 238

77. డ్యుటీరియం పరమాణువులోని న్యూట్రాన్‌ల సంఖ్య
జ: 1
 

78. ట్రిటియం పరమాణువులోని ప్రోటాన్‌ల సంఖ్య
జ: 1
 

79.  పరమాణువులోని ద్రవ్యరాశి సంఖ్య
జ: 3

80. పరమాణువు పరమాణు సంఖ్యను దేంతో సూచిస్తారు?
జ: Z
 

81. ప‌ర‌మాణువు ద్ర‌వ్య‌రాశి సంఖ్య‌ను దేంతో సూచిస్తారు?
జ: A
 

82. పరమాణువులోని న్యూట్రాన్‌ల సంఖ్యను సూచించే సమీకరణం
జ: N = A - Z
 

83. కిందివాటిలో న్యూట్రాన్‌లు లేని మూలకం?
A) హైడ్రోజన్       B) హీలియం       C) కార్బన్       D) లిథియం
జ: A (హైడ్రోజన్)
 

84. హైడ్రోజన్ కేంద్రకాలతో ఏర్పడిన హీలియం కేంద్రక ద్రవ్యరాశి లోపం
జ: 0.0303 a.m.u.
 

85. ద్రవ్యరాశి, శక్తి మధ్య ఉండే సంబంధాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త
జ: ఐన్‌స్టీన్
 

86. E = mc2 సమీకరణంలో 'c' సూచించేది
జ: కాంతివేగం
 

87. రెండు ప్రోటాన్‌లు, రెండు న్యూట్రాన్‌లు ఉండే కేంద్రకం
జ: హీలియం
 

88. ఒక కి.గ్రా. ద్రవ్యరాశి పూర్తిగా శక్తిగా పరివర్తన చెందినప్పుడు ఏర్పడే శక్తి విలువ?
జ: 9 × 1016 జౌల్స్
 

89. సమాన సంఖ్యలో న్యూట్రాన్‌లను కలిగి ప్రోటాన్ సంఖ్యలు వేరుగా ఉండే పరమాణువులు ఏవి?
జ: ఐసోటోనులు 
 

90. ఐసోటోపులకు ఉదాహరణ

జ: D (అన్నీ) 
 

91. కిందివాటిలో ఐసోటోనులు


     
జ: A ()

92. కిందివాటిలో ఐసోబార్‌లకు ఉదాహరణ


      
జ: C ()

93. ట్రాన్సిస్టర్‌ను కనుక్కున్న తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల పరిమాణం
జ: తగ్గింది
 

94. బంధన శక్తి 'E', ద్రవ్యరాశి లోపం (ΔM) ల మధ్య సంబంధం
జ: E = Δmc2
 

95. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
జ: 0.52 MeV
 

96. కేంద్రక స్థిరత్వం బంధన శక్తిపై ఏ విధంగా ఆధారపడి ఉంటుంది?
జ: కేంద్రక స్థిరత్వం బంధనశక్తిపై ఆధారపడదు.
 

97.  ఆక్సిజన్ కేంద్రక ద్రవ్యరాశి 15.995 a.m.u. అయితే ద్రవ్యరాశి తరుగు
జ: 0.137 a.m.u.

98.  ఆక్సిజన్ కేంద్రక ద్రవ్యరాశి 15.995 a.m.u. అయితే దాని బంధనశక్తిని గణించండి.
జ: 127.6 MeV

99.  కేంద్రక ద్రవ్యరాశి 58.933 a.m.u. అయితే Co బంధనశక్తి
జ: 517.91 MeV

100.  పరమాణువు ద్రవ్యరాశి 226.025 అయితే దాని ద్రవ్యరాశి తరుగు ఎంత?
జ: 11.949 a.m.u.

101. రేడియోధార్మిక పదార్థం అర్ధజీవిత కాలం 30 రోజులు. అయితే 90 రోజుల్లో విఘటనం చెందే పదార్థ శాతం
జ: 87.5%
 

102. ఒక రేడియోధార్మిక పదార్థం 32 రోజుల్లో  

వ వంతు విఘటనం చెందింది. అయితే దీని అర్ధ జీవితకాలం ఎంత?
జ: 8 రోజులు

103. ఒక రేడియోధార్మిక పదార్థం అర్ధ జీవితకాలం 4 సంవత్సరాలు. దాని తొలి పరిమాణంలో  వ వంతుకు తగ్గడానికి పట్టే కాలం
జ: 12 సంవత్సరాలు

104. యురేనియం అర్ధ జీవితకాలం 4500 సంవత్సరాలు. ఒక గ్రాము యురేనియం నుంచి 13500 సంవత్సరాల్లో ఎంత యురేనియం విఘటనం చెందుతుంది?
జ:  గ్రా.

105. 2 గంటల తర్వాత తొలి పరిమాణంలో 16వ వంతు పరిమాణం ఉండే రేడియోధార్మిక ఐసోటోపు విఘటనం చెందకుండా మిగిలి ఉంటే ఆ ఐసోటోపు అర్ధ జీవితకాలం ఎంత?
జ: 30 నిమిషాలు
 

106. ఒక కృత్రిమ రేడియోధార్మిక మూలకంలో  వ వంతు T సెకన్లలో విఘటనం చెందితే దాని అర్ధజీవిత కాలం ఎంత?
జ:  

107. ఒక రేడియోధార్మిక ఐసోటోపు అర్ధ జీవితకాలం 5 నిమిషాలు. అయితే 30 నిమిషాల తర్వాత ఈ ఐసోటోపు ఎంత భాగం విఘటనం చెందకుండా మిగిలిపోతుంది?
జ: 

108. 5 రోజుల్లో ఒక రేడియోధార్మిక మూలకంలో 10% విఘటనం చెందితే, 20 రోజుల తర్వాత మిగిలి ఉండే మూలక శాతం ఎంత?
జ: 65%
 

109. ప్రతి రేడియోధార్మిక శ్రేణి చివరకు ఏ కేంద్రకంతో అంతమవుతుంది?
జ: సీసం
 

110. 'రేడియో ధార్మికత'ను ఎవరు కనుక్కున్నారు?
జ: హెన్రీ బెక్వెరెల్
 

111. రేడియో ధార్మికతకు ప్రమాణం
జ: క్యూరీ
 

112. 1 క్యూరీ =
జ: 3.7 × 1010 విఘటనాలు/ సెకన్
 

113. ఆల్పా (α) కిరణాలు
A) రుణావేశితాలు         B) ధనావేశితాలు         C) తటస్థం         D) ఏదీకాదు
జ: B (ధనావేశితాలు)

114. కిందివాటిలో విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం రెండింటిలోనూ అపవర్తనం చెందనివి
A) α - కణాలు         B) β - కణాలు         C) γ - కిరణాలు         D) ఏదీకాదు
జ: C (γ  - కిరణాలు)

115. విద్యుత్ క్షేత్రంలో రుణ ఫలకం నుంచి దూరంగా అపవర్తనం చెందేవి
జ: β - కణాలు
 

116. విద్యుత్ క్షేత్రంలో రుణావేశ ఫలక వైపుకు వంగి ప్రయాణించేవి?
జ: α - కణాలు
 

117. α - కణ ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి ఎన్ని రెట్లు ఉంటుంది?
జ: 4
 

118. β - కణం ఆవేశం ప్రోటాన్ ఆవేశానికి ఎన్ని రెట్లు ఉంటుంది?
జ: 2
 

119. విద్యుత్ క్షేత్రంలో ధనఫలకం వైపునకు అపవర్తనం చెందే కిరణాలు
జ: β - కణాలు
 

120. రేడియోధార్మిక వికిరణాల్లో దేనికి వేగం తక్కువ?
A) α - కణాలు         B) β - కణాలు         C) γ - కిరణాలు         D) ఏదీకాదు
జ: A (α - కణాలు)

121. α, β, γ కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త
జ: రూథర్‌ఫర్డ్
 

122. α, β, γ కిరణాలు దేని రేడియోధార్మికత వల్ల లభిస్తాయి?
జ: రేడియం
 

123. కింది ఏ కిరణాలకు అయనీకరణ శక్తి కనిష్ఠం?
 A) α - కణాలు         B) β - కణాలు         C) γ - కిరణాలు         D) ఏదీకాదు
జ: C (γ - కిరణాలు)

124. వాయువులను వేటి ద్వారా అయనీకరించవచ్చు?
A) విద్యుత్ ఉత్సర్గం     B) శ్రీ కిరణాలు       C) α, β, γ - కిరణాలు    D) అన్నింటితో
జ: D (అన్నింటితో)
 

125. రేడియంను ఆవిష్కరించింది?
జ: మేడం క్యూరీ
 

126. క్యూరీ దంపతులు కనుక్కున్నది
A) ప్రేరిత రేడియోధార్మికత      B) సహజ రేడియోధార్మికత      C) కేంద్రక విచ్ఛిత్తి     D) ఏదీకాదు
జ: A (ప్రేరిత రేడియోధార్మికత )
 

127. (4n + 2) తో సూచించే రేడియోధార్మిక శ్రేణి?
జ: యురేనియం శ్రేణి
 

128. ఆక్టీనియం శ్రేణిని దేంతో సూచిస్తారు?
జ: (4n + 3) శ్రేణి
 

129. ట్రాన్సిస్టర్‌ను దేనిలో ఉపయోగిస్తారు?
A) డోలకం         B) స్టెబిలైజర్స్         C) వృద్ధీకరణలు       D) అన్నీ
జ: D (అన్నీ)
 

130. కృత్రిమ రేడియోధార్మిక పదార్థం నుంచి పొందిన రేడియోధార్మిక శ్రేణి
జ: నెప్ట్యూనియం శ్రేణి
 

131. ప్రతి రేడియోధార్మిక శ్రేణిలో ఉండే జడవాయు మూలకం ఏది?
జ: రేడాన్
 

132. ప్రకృతిలో లభించని రేడియోధార్మిక మూలకం?
జ: ప్లుటోనియం
 

133. కృత్రిమ రేడియోధార్మికతను కల్పించేవి
A) α - కణాలు    B) ప్రోటాన్‌లు     C) ఇతర అధిక శక్తి కణాలు     D) అన్నీ
జ:  D (అన్నీ)
 

134. 'ట్రేసర్లు'గా వేటిని ఉపయోగిస్తారు?
జ: రేడియో ఐసోటోపులు
 

135. కృత్రిమ పరివర్తన వేటిలో తేలికగా సాధ్యమవుతుంది?
A) ఏ మూలకంలోనైనా         B) భార మూలకంలో        
C) తేలికపాటి మూలకంలో         D) ఏదీకాదు
జ: C (తేలికపాటి మూలకంలో)
 

136. ఏ మూలకం కేంద్రకాన్ని ఆల్ఫా (α) కణాలతో తాడనం చెందించినప్పుడు ఆక్సిజన్ ఏర్పడుతుంది?
జ: నైట్రోజన్ 
 

137.   సమీకరణం ఏ రకమైన కృత్రిమ పరివర్తనను సూచిస్తుంది?
జ: ప్రోటాన్‌ల 

138. α - కణాలను ప్రక్షిప్త కణాలుగా ఉపయోగించి ఫ్లోరిన్‌ను తాడనం చెందిస్తే ఏర్పడే మూలకం?
జ: నియాన్
 

139. α - కణం + అల్యూమినియం  సిలికాన్ + ప్రోటాన్
పై సమీకరణం ఏ రకమైన కృత్రిమ పరివర్తనను సూచిస్తుంది?
జ: ప్రోటాన్‌లతో

140. కేంద్రకంలోని ఒక α - కణం ఉద్గారం చెందినప్పుడు ఆ కేంద్రక పరమాణు భారం, పరమాణు సంఖ్యల్లో మార్పు?
జ: -4, -2
 

141. క్యూరీ దంపతులు తాము చేసిన ప్రయోగంలో α - కణాలతో ఏ పదార్థాన్ని తాడనం చెందించారు?
జ: Al
 

142.  ను ఏ కణాలతో తాడనం చెందిస్తే రేడియోధార్మిక ఐసోటోపు

 ఏర్పడుతుంది?
జ: ప్రోటాన్ 

143. రేడియోధార్మిక ఫాస్ఫరస్ దేనిగా విఘటనం చెందుతుంది?
జ: I

జ:  

జ: ప్రోటాన్

        
జ: D (ఏదీకాదు)

147. పాజిట్రాన్ గుర్తు ఏది?
జ: 

148. మానవ శరీరంలో రక్తం గడ్డకట్టి ఉన్న భాగాన్ని గుర్తించేందుకు ఉపయోగించే రేడియోధార్మిక పదార్థం
జ: రేడియో ఫాస్ఫరస్ 
 

149. కార్బన్ డేటింగ్ దేనికి ఉపయోగపడుతుంది?
జ: శిలాజాల వయసు నిర్ధారణ
 

150. క్యాన్సర్ చికిత్సకు ఏ మూలకం రేడియో ఐసోటోపును ఉపయోగిస్తారు?
జ: కోబాల్ట్
 

151. క్యాన్సర్ చికిత్సకు ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
జ: γ - కిరణాలు
 

152. థైరాయిడ్ గ్రంథి పనిచేసే విధానాన్ని పరిశీలించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు
జ: 

153. థైరాయిడ్ గ్రంథి వ్యాధి నివారణకు దేన్ని ఉపయోగిస్తారు?
జ: రేడియో అయోడిన్
 

154. ఒక నేలలో ఉపయోగించాల్సిన ఉత్తమ ఎరువును ఎంపిక చేయడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు
జ: రేడియో ఫాస్ఫరస్
 

155. భూమి లేదా శిలల వయసును నిర్ధారించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు
జ: 

156. శృంఖల చర్యను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: ఓట్టోహాన్
 

157. తేలికపాటి కేంద్రకాలు భార కేంద్రకంగా కలిసే ప్రక్రియ
జ: కేంద్రక సంలీనం
 

158. భార కేంద్రకం విడిపోయి తేలికపాటి కేంద్రకాలుగా మారే ప్రక్రియ
జ: కేంద్రక విచ్ఛిత్తి
 

159. సహజ రేడియోధార్మిక విఘటనాల్లో విడుదలయ్యే శక్తి
జ: 1 MeV నుంచి 5 MeV
 

160. కేంద్రక విచ్ఛిత్తిలో విడుదలయ్యే శక్తి
జ: 200 MeV
 

161. U − 235 విచ్ఛిత్తిలో ఏర్పడే న్యూట్రాన్ల సగటు సంఖ్య
జ: 2.5
 

162. U − 235 విచ్ఛిత్తి జరపడానికి న్యూట్రాన్ల శక్తి ఎంతకంటే తక్కువగా ఉండాలి?
జ: 0.04 eV
 

163. భార కేంద్రకం దాదాపు సమాన ద్రవ్యరాశి ఉండే కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియ
జ: కేంద్రక విచ్ఛిత్తి
 

164. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
జ: కేంద్రక సంలీనం
 

165. హైడ్రోజన్ బాంబులో కేంద్రక సంలీన చర్యను ప్రారంభించేది?
జ: ఆటంబాంబు
 

166. న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారి ఉపయోగం
జ: న్యూట్రాన్‌ల వేగం తగ్గించడం
 

167. న్యూక్లియర్ రియాక్టర్‌లో నియంత్రణ కడ్డీల ఉపయోగం
జ: న్యూట్రాన్‌లను శోషించడానికి
 

168. కేంద్రక విచ్ఛిత్తి చర్యను ఉపయోగించుకొని శక్తిని నియంత్రితంగా ఏర్పరిచే సాధనం
జ: న్యూక్లియర్ రియాక్టర్
 

169. న్యూక్లియర్ రియాక్టర్‌లోని మితకారి
జ: భారజలం
 

170. న్యూక్లియర్ రియాక్టర్‌లోని నియంత్రణ కడ్డీలు
జ: బోరాన్ లేదా కాడ్మియం 
 

171. న్యూక్లియర్ రియాక్టర్‌లో బోరాన్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
జ: నియంత్రణ కడ్డీలుగా
 

172. హైడ్రోజన్ హీలియంగా పరివర్తనం చెందే కేంద్రక సంలీన ప్రక్రియలో జరిగే కేంద్రక చర్య

జ: D) పైవన్నీ
 

173. కేంద్రక సంలీన చర్యలను ఏమని పిలుస్తారు?
జ: ఉష్ణకేంద్రక చర్యలు
 

174. హైడ్రోజన్ కేంద్రక సంలీనం జరిగే సూర్యుడిలోని మధ్య భాగం పేరు
జ: ఫోటోస్ఫియర్
 

175. కిందివాటిలో అత్యధిక శక్తి అంతరం ఉండేది
A) లోహం         B) అవాహకం         C) పాక్షిక వాహకం         D) డయోడ్
జ: B(అవాహకం)
 

176. అర్ధవాహకపు ఉష్ణోగ్రతను పెంచితే, దానిశక్తి అంతరం
జ: తగ్గుతుంది
 

177. అర్ధవాహకంలో ఆవేశ వాహక కణాలు?
జ: ఎలక్ట్రాన్‌లు, హోలులు
 

178. స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌ల సాంద్రత దేనిలో ఎక్కువ?
జ: రాగి
 

179. p - రకం అర్ధవాహకంలో అధిక సంఖ్యా వాహక కణాలు ఏవి?
జ: హోలులు
 

180. సిలికాన్‌ను కింది మాలిన్యంతో మాదీకరణం చేస్తే p - రకం అర్ధవాహకంగా మారుతుంది
జ: అల్యూమినియం
 

181. కిందివాటిలో విద్యుత్ వాహకాలు?
A) ప్లాస్టిక్      B) సిలికాన్       C) రబ్బరు     D) లోహాలు
జ: D (లోహాలు)
 

182. విద్యుత్ అవాహకం
A) రబ్బరు         B) ప్లాస్టిక్         C) గాజు         D) అన్నీ
జ: D (అన్నీ)
 

183. కిందివాటిలో విద్యుత్ వాహకానికి ఉదాహరణ
A) వజ్రం         B) బంగారం         C) రబ్బరు         D) సిలికాన్
జ: B (బంగారం)
 

184. 0 K ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా లేదా పాక్షికంగా ఎలక్ట్రాన్‌లతో నింపి ఉండే శక్తి పట్టీ ఏది?
జ: సంయోజక పట్టీ
 

185. ఎలక్ట్రాన్‌కు శక్తి లభించని పట్టీ ఏది?
జ: నిషిద్ధ పట్టీ
 

186. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఖాళీగా ఉండే పట్టీ ఏది?
జ: వాహక పట్టీ
 

187. విద్యత్‌బంధకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సాంద్రత
జ: 107 /మీ.3
 

188. విద్యుత్ బంధకాల్లో నిషిద్ధ పట్టీ వెడల్పు
జ: 3 eV
 

189. వాహక పట్టీ, సంయోజక పట్టీలు ఏ పదార్థాల్లో అతిపాతం చెందుతాయి?
జ: విద్యుత్ వాహకాలు
 

190. ఏ పదార్థాల్లో నిషిద్ధ పట్టీ ఉండదు?
జ: విద్యుత్ వాహకాలు
 

191. విద్యుత్ వాహకాల్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌ల సాంద్రత?
జ: 1028 /మీ.3
 

192. అర్ధవాహక పదార్థాల్లో నిషిద్ధ పట్టీ అంతరం?
జ: 1 eV
 

193. అర్ధవాహకాల్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌ల సాంద్రత?
జ: 1017 /మీ.3
 

194. కిందివాటిలో నిషిద్ధ పట్టీ అంతరం వేటిలో చాలా ఎక్కువగా ఉంటుంది?
A) లోహాల్లో         B) అర్ధవాహకాల్లో         C) బంధకాల్లో         D) ఏదీకాదు
జ: C (బంధకాల్లో)
 

195. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద సిలికాన్, జర్మేనియంలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి?
జ: బంధకం
 

196. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ అర్ధవాహకం వాహకత
జ: పెరుగుతుంది 
 

197. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ అర్ధవాహకం వాహకత
జ: తగ్గుతుంది
 

198. అర్ధవాహకాల్లో విద్యుత్ ప్రవాహానికి కారణమైనవి?
జ: ఎలక్ట్రాన్‌లు, హోల్‌లు
 

199. స్వచ్ఛమైన అర్ధవాహకాన్ని ఏమంటారు?
జ: స్వభావజ అర్ధవాహకం 
 

200. స్వభావజ అర్ధవాహకంలోని రంధ్రాల సంఖ్య?
జ: ఎలక్ట్రాన్‌ల సంఖ్యకు సమానం 
 

201. గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన సిలికాన్ శక్తి అంతరం
జ: 1.1 eV
 

202. హోల్‌లు ఎక్కడ ఉంటాయి?
జ: సంయోజక పట్టీ
 

203. మలిన పదార్థాన్ని స్వచ్ఛమైన పదార్థంలోకి ప్రవేశపెట్టడాన్ని ఏమంటారు?
జ: మాదీకరణం
 

204. మాలిన్యాలతో మాదీకరణం చేయడం ద్వారా పాక్షిక వాహకాలుగా మారే పదార్థాలు
జ: అర్ధవాహకాలు 
 

205. సిలికాన్ బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ: 4
 

206. గాలియం బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ: 3
 

207. Al బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య
జ: 3
 

208. p - రకపు అర్ధవాహకంలోని మాలిన్యం సంయోజకత ఎంత?
జ: 3
 

209. n - రకపు అర్ధవాహకంలోని మాలిన్యం సంయోజకత
జ: 5
 

210. p - రకం అర్ధవాహకంలోని మాలిన్య పరమాణువులు
జ: గ్రహీతలు
 

211. కిందివాటిలో గ్రహీత మాలిన్యం
A) అర్సెనిక్         B) ఆంటిమొని         C) ఫాస్ఫరస్         D) ఇండియం
జ: D (ఇండియం)
 

212. జర్మేనియం స్ఫటికానికి ఫాస్ఫరస్‌ను మాదీకరణం చేసినప్పుడు లభించేది
జ: n - రకం అర్ధవాహకం
 

213. p - రకం అర్ధవాహకాన్ని పొందడానికి జర్మేనియంకు కలపాల్సిన మాలిన్యం
జ: బోరాన్
 

214. అర్ధవాహకానికి కలిపిన త్రిసంయోజనీయ మాలిన్యాన్ని ఏమంటారు?
జ: గ్రహీత మాలిన్యం
 

215. స్వభావజ అర్ధవాహకానికి కలిపిన పంచ సంయోజనీయ మాలిన్యాన్ని ఏమంటారు?
జ: దాత మాలిన్యం
 

216. p - రకం అర్ధవాహకంలో అధిక సంఖ్యా వాహక కణాలు
జ: హోల్‌లు
 

217. n - రకం అర్ధవాహకంలో అల్ప సంఖ్యా వాహక కణాలు
జ: హోల్‌లు
 

218. లేమి పొర భాగంలో ఉండనివి
జ: స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు
 

219. p - n జంక్షన్‌లో పాక్షిక వాహకాలు రెండూ ఏ విధంగా పనిచేస్తాయి?
జ: స్విచ్ 
 

220. p - n జంక్షన్‌లో డయోడ్ పురోశక్మ స్థితి వల్ల వలయంలో దేనికి వీలవుతుంది?
జ: అల్ప నిరోధం
 

221. ఎలక్ట్రానిక్ స్విచ్‌గా పనిచేసేది
జ: p - n జంక్షన్ డయోడ్
 

222. జంక్షన్ డయోడ్‌లోని p - n జంక్షన్‌కు దగ్గరగా ఆవేశ వాహక కణాలు లేని ప్రదేశాన్ని ఏమంటారు?
జ: లేమి పొర
 

223. ఒక సంధి డయోడ్ p - భాగాన్ని బ్యాటరీ ధన టెర్మినల్‌కు, n - భాగాన్ని బ్యాటరీ రుణ టెర్మినల్‌కు కలిపినప్పుడు దీన్ని ......... లో ఉందని అంటారు.
జ: వాలు బయోస్
 

224. ఒక సంధి డయోడ్‌లోని p - భాగాన్ని బ్యాటరీ రుణ టెర్మినల్‌కు, n - భాగాన్ని బ్యాటరీ ధన టెర్మినల్‌కు కలిపినప్పుడు దీన్ని ........... లో ఉందని అంటారు.
జ: ఎదురు బయోస్
 

225. వాలు బయోస్ అనువర్తించిన జంక్షన్ డయోడ్ నిరోధం
జ: అతి తక్కువ
 

226. ఎదురు బయోస్ అనువర్తించిన జంక్షన్ డయోడ్ నిరోధం
జ: ఎక్కువ
 

227. p - n జంక్షన్ డయోడ్ వాలు బయోస్‌లో ఉన్నప్పుడు అవరోధ పొటెన్షియల్
A) మారదు     B) పెరుగుతుంది     C) తగ్గుతుంది    D) ఏదీకాదు
జ: B (పెరుగుతుంది)
 

228. అర్ధవాహక డయోడ్‌ను దీనిగా ఉపయోగిస్తారు.
A) ఏక ధిక్కారి          B) శోధకం          C) స్విచ్          D) అన్నీ
జ: D (అన్నీ)
 

229. విద్యుత్ సరఫరా చేసినప్పుడు వెలిగే డయోడ్‌ను ఏమంటారు?
జ: LED
 

230. డయోడ్ గుర్తు
జ: 

231. A.C. విద్యుత్‌ను D.C. విద్యుత్‌గా మార్చే సాధనం
జ: ఏక ధిక్కారి
 

232. టాన్సిస్టర్‌ను కనుక్కున్నది
A) బార్డీన్          B) బ్రాటెన్          C) షాక్లీ          D) అందరూ
జ: D (అందరూ)
 

233. ఒక p - రకం అర్ధవాహకాన్ని రెండు n - రకం అర్ధవాహకాల మధ్య సంధానం చేస్తే ఏర్పడేది
జ: n - p - n ట్రానిస్టర్
 

234. ట్రాన్సిస్టర్‌లోని సంధుల సంఖ్య
జ: 2
 

235. ట్రాన్సిస్టర్ రెండు అర్ధవాహక డయోడ్‌లను ఏ విధంగా కలిపినట్లు భావిస్తారు?
A) శ్రేణిలో          B) సమాంతరంగా          C) A, B          D) ఎదురెదురుగా
జ: D (ఎదురెదురుగా)
 

236. n - p - n, p - n - p టాన్సిస్టర్లలో విద్యుత్ ప్రవాహ దిశలు
జ: వ్యతిరేకం
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌