• facebook
  • whatsapp
  • telegram

 శ్వాసవ్యవస్థ - ప్రాధాన్యం 

నెమ్మదిగా శ్వాసిస్తే హైపాప్నియా!

కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, నడవలన్నా, మాట్లాడాలన్నా శక్తి కావాలి. జీవుల శరీరంలో కణాలు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అందుకోసం తగినంత ఆక్సిజన్‌ సరఫరా ఉండాలి. శ్వాసక్రియ ఆ ఆక్సిజన్‌ను అందిస్తుంది. దాంతోపాటు కార్బన్‌డైయాక్సైడ్‌ లాంటి వ్యర్థ వాయువులను విసర్జిస్తుంది. అందుకే జీవక్రియల్లో శ్వాసక్రియను అత్యంత కీలకమైందిగా పేర్కొంటారు. దాని ప్రాధాన్యాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.  వివిధ జీవుల్లో ఈ అసంకల్పిత చర్య జరిగే తీరును అర్థం చేసుకోవాలి. 


1.   రెస్పిరేషన్‌ అనే పదం ‘రెస్పి రే’ అనే ఏ భాషాపదం నుంచి వచ్చింది? 

1) లాటిన్‌   2) జర్మన్‌   3) గ్రీకు   4) ఇంగ్లిష్‌ 


2.   శ్వాసక్రియకు ఆ పేరును ఏ శతాబ్దంలో  సూచించారు? 

1) 12వ    2) 13వ    3) 14వ    4) 15వ 


3. ‘ప్రయోగాలు పరిశీలనలు’ గ్రంథకర్త.... 

1) ప్రీస్ట్లే     2) లేవోయిజర్‌ 

3) రాబిన్‌సన్‌     4) జాన్‌డాపర్‌ 


4. ‘శ్వాసక్రియ ఒక దహన క్రియ, ఉష్ణం వెలువడే ప్రక్రియ’ అని తెలిపింది? 

1) ప్రీస్ట్లే     2) లేవోయిజర్‌ 

3) రాబిన్‌సన్‌     4) జాన్‌డాపర్‌ 


5. ‘బొగ్గును మండించడం వల్ల ఏర్పడే బూడిద.. బొగ్గు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది.’ అని ఎవరు పేర్కొన్నారు? 

1) ప్రీస్ట్లే     2) లేవోయిజర్‌ 

3) జాన్‌డాపర్‌    4) వాన్‌ హెల్మాంట్‌ 


6.  టాడ్‌పోల్‌ డింబకం శ్వాస అవయవం...

1) మొప్పలు     2) ఊపిరితిత్తులు 

3) చర్మం     4) ఆస్యకుహరం 


7. విడిచే గాలిలో స్థిరమైన వాయువు ఎంత  పరిమాణంలో ఉంటుంది? 


8. కిందివాటిలో పీల్చినప్పుడు, విడిచినప్పుడు స్థిరంగా ఉండే వాయువు ఏది?

1) ఆక్సిజన్‌     2) నైట్రోజన్‌ 

3) కార్బన్‌ డై ఆక్సైడ్‌     4) సల్ఫర్‌ 


9.  కిందివాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. 

1) సముద్ర మట్టం ఆక్సిజన్, 'Hb' తో పూర్తిగా సంతృప్తి చెందుతుంది. 

2) కార్బన్‌డైఆక్సైడ్‌ సాధారణంగా బై కార్బొనేట్‌లను రవాణా చేస్తుంది. 

3) హిమోగ్లోబిన్‌ మధ్యలో మెగ్నీషియం అణువు ఉంటుంది.

4) వాయుప్రసార మార్గం ప్రారంభ ప్రదేశం నాసికా రంధ్రాలు.


10. రక్తంలోకి ఆక్సిజన్‌ వాయుగోణుల నుంచి ఏ విధానం ద్వారా వ్యాప్తి చెందుతుంది? 

1) విసరణ     2) ద్రవాభిసరణ     

3) ద్రవోద్గమం     4) 1, 2 


11. జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి వీలైనవి? 

1) ఆక్సిజన్‌    2) కార్బన్‌డైఆక్సైడ్‌ 

3) నీరు    4) 1, 3 


12. బొద్దింకలో 10 జతల శ్వాసరంధ్రాల్లో, 3 జతల్లో క్రియాత్మక శ్వాసరంధ్రాలుండే విధానాన్ని     ఏమంటారు? 

1) పాలీన్యూస్టిక్‌     2) హోలోన్యూస్టిక్‌ 

3) మోనోన్యూస్టిక్‌     4) 1, 3 


13. ఇంటిమా, టినీడియాలు లేని వాయునాళికల్లోని ప్రొటీన్‌? 

1) ట్రాకియోబ్లాస్ట్‌     2) ఎఫిథిలియం 

3) ట్రేకిన్‌     4) 1, 3 


14. సజీవులైనప్పటికీ శ్వాసక్రియ జరపలేని జీవులు? 

1) బ్యాక్టీరియా   2) వైరస్‌ 

3) శిలీంధ్రాలు   4) 1, 2 


15. మానవుడిలో శ్వాసక్రియ మెదడులోని దేని అధీనంలో ఉంటుంది? 

1) మజ్జాముఖం     2) ద్వారగోర్ధం 

3) అనుమస్థిష్కం     4) 1, 2


16. కింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి.  

1) మానవుడిలో శ్వాసక్రియ ఒక అసంకల్పిత చర్య. 

2) పురుషుల్లో శ్వాసక్రియకు విభాజకపటలం సహాయపడుతుంది. 

3) ఆమ్లజని సహిత వాయువు ఊపిరితిత్తులను   చేరడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు.

4) మానవుడు తీసుకున్న ఆక్సిజన్‌లో 40% మెదడు వినియోగించుకుంటుంది.


17. 2013, జూన్‌ 1న ధూమపాన నిషేధం అమలు పరచిన దేశం? 

1) ఇండియా     2) రష్యా 

3) జపాన్‌     4) యూఎస్‌ఏ


18. ఊపిరితిత్తుల క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం..

1) వాయుగోణులు     2) శ్వాసనాళికలు 

3) రక్తకేశనాళికలు     4) 1, 2 


19. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు.

2) కుడి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది. 

3) కుడి ఊపిరితిత్తిలో రెండు లంబికలు ఉంటాయి. 

4) పెద్దవారిలో ఊపిరితిత్తులు బూడిద వర్ణంలో ఉంటాయి.


20. ప్రోటోజోవా జీవుల శ్వాసేంద్రియం? 

1) చర్మం     2) ప్లాస్ల్మా త్వచం 

3) ట్రాకియా     4) మొప్పలు 


21. కప్పలో శ్వాసక్రియ అవయవం? 

1) ఊపిరితిత్తులు     2) చర్మం 

3) ఆస్యకుహరం     4) పైవన్నీ 


22. కిందివాటిలో పుస్తకాకార ఊపిరితిత్తులుండే జీవి? 

1) తేలు     2) నత్త   

3) సాలీడు     4) 1, 3 


23. కిందివాటిలో కణశ్వాసక్రియను జరిపే కణాంగం? 

1) మైటోకాండ్రియా     2) లైసోసోమ్‌లు 

3) కేంద్రకం     4) రిక్తిక


24. ముక్కు అధ్యయన శాస్త్రం? 

1) లారింగాలజీ     2) గెస్టటాలజీ 

3) రైనాలజీ     4) కాలాలజీ 


25. మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం (లీటర్లలో)? 

1) 1.2    2) 5.8   3) 3.4   4) 2.6  


26. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని ‘శ్వాసక్రియారేటు’ అంటారు

2) శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం రెస్పిరో మీటర్‌. 

3) ఒక జీవి రక్తప్రసరణ, ఉష్ణోగ్రతలు.. దాని  శ్వాసక్రియను ప్రభావితం చేయవు.

4) ఆక్సిజన్‌ సమక్షంలో జరిగే శ్వాసక్రియను ‘వాయుశ్వాసక్రియ’ అంటారు.


 27. వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాస   క్రియలో లేని దశలు? 

1) లింకు చర్య     2) గ్లైకాలసిస్‌ 

3) పైరూవిక్‌ ఆమ్ల చర్య      4) 1, 2 


28. అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య? 

1) 36     2) 4     3) 38     4) 2 


29. గ్లైకాలసిస్‌ ఎక్కడ జరుగుతుంది?

1) మైటోకాండ్రియా     2) క్రిస్టే 

3) కణద్రవ్యం     4) లైసోజోమ్‌లు 


30. చేపల్లో వాయుమార్పిడి జరిగే ప్రదేశం? 

1) నోరు   2) జలశ్వాస పటలికలు 

3) చర్మం     4) పొలుసులు 


31. బ్రీత్‌ అనలైజర్‌లో ఉపయోగించే రసాయనం? 

1) పొటాషియం పర్మాంగనేట్‌   

2) ద్రవరూప బ్రోమిన్‌ 

3) మెర్క్యూరిక్‌ ఆమ్లం       

4) ఇథనాల్‌


32. హైపాప్నియా అంటే? 

1) వేగంగా శ్వాసించడం 

2) నెమ్మదిగా శ్వాసించడం 

3) కొన్ని సందర్భాల్లో శ్వాస ఆగిపోవడం

4) 1, 2 


33. కిణ్వనంలో ఏర్పడే జైమేజ్‌ అనే ఎంజైమ్‌ను ఎవరు కనుకున్నారు? 

1) బుక్నర్‌     2) విలియం మెక్‌నాలి 

3) లోప్‌మాన్‌     4) ప్రీస్ట్లే


34. ఏటీపీని ఎవరు కనుకున్నారు?  

1) సుబ్బారావు     2) లోహ్‌మాన్‌ 

3) ప్రీస్ట్లే     4) పైవన్నీ


35. వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవులు? 

1) బొద్దింక     2) తేలు 

3) రాచపీత     4) రొయ్యలు 


36. శరీరధర్మ శాస్త్రాన్ని రచించింది? 

1) లేవోయిజర్‌     2) జాన్‌డాపర్‌ 

3) రియోక్‌     4) ప్రీస్ట్లే 


37. ఊపిరితిత్తుల్లోని వాయుగోణులను విడదీసి పరిస్తే     ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? 

 1) 160 చ.మీ.     2) 160 చ.సెం.మీ 

3) 160 చ.అడుగులు     4) 160 చ.కి.మీ. 


38. మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని తీసుకుని బయటకు వదులుతాం? 

1) 1200 మి.లీ.     2) 5800 మి.లీ. 

3) 500 మి.లీ.     4) 1600 మి.లీ. 


39. శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్‌ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం? 

1) పైరూవేట్‌     2) లాక్టిక్‌ ఆమ్లం 

3) ఇథనాల్‌     4) 2, 3 


40. ఏటీపీలో నిల్వ ఉండేది?

1) 7200 కిలో కెలొరీలు    2) 4500 కిలో కెలొరీలు

3) 7200 కెలొరీలు     4) 4500 కెలొరీలు


41. సముద్ర దోసకాయల శ్వాసాంగాలు? 

1) శ్వాసవృక్షాలు     2) చర్మం 

3) మొప్పలు     4) టినీడియా


42. నిప్పు కోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం? 

1) శబ్దిని     2) స్టెరిస్‌ 

3) వాయునాళం     4) స్వరపేటిక 


43. కిందివాటిలో వాయు మార్గానికి, ఆహార మార్గానికి కూడలి? 

1) గ్రసని     2) వాయునాళం 

3) శ్వాసనాళం     4) స్వరపేటిక 


44. థైరాయిడ్‌ మృదులాస్థిలో ఉబ్బి ఉండే మధ్య భాగం?

1) ఎరిటినాయిడ్‌     2) హయాయిడ్‌ 

3) ఆడమ్స్‌ ఆపిల్‌     4) టినీడియా 


45. శ్వాసక్రియలో ఏ ప్రక్రియలో శబ్దాలు విడుదలవుతాయి? 

1) ఉచ్ఛ్వాస     2) నిచ్ఛ్వాస 

3) ఉదరవితానం సంకోచం, వ్యాకోచం 

4) 1, 2 


46. వ్యాయామం చేసేవారిలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు? 

1) 12 సార్లు     2) 18 సార్లు 

 3) 25 సార్లు     4) 32 సార్లు 


47. ఆపిల్‌ కోసినప్పుడు రంగు మారడానికి కారణాలు? 

1) పాలిఫినాల్‌     2) ఫినైల్‌ 

3) ఆగ్జాలిక్‌ ఆమ్లం     4) పాలిక్‌ ఆమ్లం 


48. వాయు శ్వాసక్రియలో వెలువడే శక్తి? 

1) 56 కిలో కెలొరీలు     2) 7200 కెలొరీలు  

3) 686 కిలో కెలొరీలు     4) 1, 3 


49. కిణ్వనం, అవాయు శ్వాసక్రియా ఉత్పన్నం కానిది? 

1) ఆల్కహాల్‌     2) మీథేన్‌ 

3) కార్బన్‌డైఆక్సైడ్‌     4) ఆక్సిజన్‌ 


50. కిందివాటిలో శ్వాస సంబంధిత వ్యాధి కానిది? 

1) డిఫ్తీరియా     2) టిటానస్‌ 

3) ఫెర్టుసిస్‌     4) సార్స్‌ (ఎస్‌ఏఆర్‌ఎస్శ్‌


51. ఉరివేసుకున్న వారిలో ఏ ఎముక నశించి పోవడం వల్ల శ్వాస జరగక చనిపోతారు? nn

1) ఎరోటినాయిడ్‌ 2) హయాయిడ్‌ 

3) థైరాయిడ్‌     4) రిమాగ్లాటిడిస్‌


సమాధానాలు
 

1-1; 2-3; 3-1; 4-3; 5-4; 6-1; 7-4; 8-2; 9-3; 10-1; 11-4; 12-1; 13-3; 14-2; 15-1; 16-4; 17-2; 18-1; 19-3; 20-2; 21-4; 22-4; 23-1; 24-3; 25-2; 26-3; 27-1; 28-2; 29-3; 30-2; 31-1; 32-2; 33-1; 34-4; 35-1; 36-2; 37-1; 38-3; 39-1; 40-3; 41-1; 42-4; 43-1; 44-3; 45-2; 46-3; 47-1; 48-3; 49-4; 50-2; 51- 2.

రచయిత: వట్టిగౌనోళ్ల పద్మనాభం 

Posted Date : 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌