1. జాతీయస్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు?
జ: CIET
2. 'ఉపాధ్యాయుడికి వృత్తి, విషయం, విద్యార్థి పట్ల ప్రేమ ఉండాలి' అని ఎవరన్నారు?
జ: సర్వేపల్లి రాధాకృష్ణ
3. 'నన్ను గుడ్ టీచర్ అని అందరూ అంటారు. నిజానికి అందులో సత్యం లేదు. నేను చేసిందల్లా నా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే' అని అన్నదెవరు?
జ: సోక్రటీస్
4. జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం?
జ: శాస్త్రీయ దృక్పథం
5. పునరభ్యసన కృత్యాలను ఎవరికి ఇవ్వాలి?
జ: నెమ్మదిగా అభ్యసించేవారికి
6. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు పోషించాల్సిన పాత్రలు?
1) సమన్వయకర్త 2) సౌకర్యకర్త 3) మధ్యవర్తి 4) అన్నీ
జ: 4 (అన్నీ)
7. కిందివాటిలో పాఠ్యప్రణాళిక రచనలో లేని అంశం?
1) వార్షిక పథకం 2) పీరియడ్ పథకం 3) వ్యక్తిగత భేదాలకు పథక రచన 4) సైన్స్ క్లబ్లు
జ: 4 (సైన్స్ క్లబ్లు)
8. కిందివాటిలో సహపాఠ్య ప్రణాళిక రచనలో లేని అంశం?
1) సైన్స్ క్లబ్లు 2) వైజ్ఞానిక ప్రదర్శనలు 3) వ్యక్తిగత భేదాలకు పథక రచన 4) పీరియడ్ పథకం
జ: 3 (వ్యక్తిగత భేదాలకు పథక రచన)
9. 'సైన్స్ కార్నర్'ను ఏర్పాటు చేయడంలో ఉపాధ్యాయుడి పాత్ర?
జ: నిర్వాహకుడు
10. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు సహ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాలనా యంత్రాంగంతో ఎలా మెలగాలి?
జ: సమన్వయకర్త
రచయిత: రాధాకృష్ణ