• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం

నీటిలో కరగని నాఫ్తలిన్‌.. రన్‌వే బల్బుల్లో నియాన్‌!


ఒక పదార్థం మరో పదార్థంతో కలిసినప్పుడు రసాయన ప్రక్రియ జరుగుతుంది. పదార్థాల సంయోగం, వియోగం సంభవించేటప్పుడు కొన్ని రసాయన బంధాలు సడలిపోయి కొత్తవి ఏర్పడతాయి.  పదార్థాల్లోని అలాంటి లక్షణాలను రసాయన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. దీని పరిధి విస్తారం. అణువుల మధ్య బంధం నుంచి వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలో మార్పులు, మానవ శరీర భాగాల్లో జరిగే రసాయన చర్యలు, లోహ అలోహాలు, ఆమ్ల క్షారాల స్వభావాలు వంటివన్నీ అందులో భాగమే. నిత్య జీవితంలో వినియోగించే రకరకాల పదార్థాల రసాయన స్వభావాలు, వాటిలోని మూలకాలు, తయారీ క్రమంలో జరిగే భౌతిక మార్పుల గురించి పరీక్షార్థులకు శాస్త్రీయ అవగాహన ఉండాలి. ఔషధాల తయారీలో వాడే మిశ్రమాలు, వాయువుల ఉపయోగాలు, సంబంధిత ఫార్ములాల గురించి తెలుసుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


1.     కిందివాటిలో భౌతిక మార్పును గుర్తించండి.

ఎ) టపాకాయలు పేల్చడం         బి) సిగరెట్‌ కాల్చడం

సి) ట్యూబ్‌లైట్‌ వెలిగించడం     డి) ఆహారం జీర్ణమవడం


2.     వాతావరణంలో ఎక్కువగా ఉండే జడవాయువు?

ఎ) ఆర్గాన్‌     బి) హీలియం 

సి) నియాన్‌     డి) క్రిప్టాన్‌


3.     మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా అని దేన్ని పిలుస్తారు?

ఎ) మెగ్నీషియం క్లోరైడ్‌         బి) మెగ్నీషియం సల్ఫేట్‌

సి) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌     డి) మెగ్నీషియం నైట్రేట్‌


4.     కిందివాటిలో దహన దోహదకారి వాయువును గుర్తించండి.

ఎ) ఆక్సిజన్‌     బి) హీలియం 

సి) హైడ్రోజన్‌     డి) నైట్రోజన్‌


5.     కిందివాటిలో వాసన లేని ఆమ్లాన్ని గుర్తించండి.

ఎ) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం     బి) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం

సి) నత్రికామ్లం     డి) ఎసిటిక్‌ ఆమ్లం


6.     కిందివాటిలో ద్రవస్థితిలో ఉన్న అలోహన్ని గుర్తించండి.

ఎ) మెర్క్యురీ బి) అయోడిన్‌ సి) ఫాస్ఫరస్‌ డి) బ్రోమిన్‌


7.     డ్యూటీరియం ఆక్సైడ్‌ అంటే?

ఎ) మురుగుజలం     బి) భారజలం     

సి) వర్షపు జలం     డి) ఆమ్ల వర్షం


8.     విమానాశ్రయాల్లో రన్‌వేకు ఇరువైపులా ఉండే బల్బుల తయారీలో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు?

ఎ) హీలియం     బి) నియాన్‌ 

సి) ఆర్గాన్‌     డి) ఆక్సిజన్‌


9.     లోహ, ఆలోహ, అర్ధలోహాలు కలిగిన బ్లాక్‌ను గుర్తించండి.

ఎ) s-బ్లాక్‌      బి) p-బ్లాక్‌ 

సి) d-బ్లాక్‌     డి) f-బ్లాక్‌


10. లాలాజలం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?

ఎ) ఆమ్ల     బి) క్షార 

సి) తటస్థ    డి) ఏ స్వభావం ఉండదు


11. కిరణజన్య సంయోగక్రియలో అవసరమయ్యే, విడుదలయ్యే వాయువులు?

ఎ) CO2, O2      బి) O2, CO2 

సి) CO2, O3      డి) CO2, NO2


12. కాలుష్య నియంత్రణలో వాడే మూలకాన్ని గుర్తించండి.

ఎ) నికెల్‌     బి) ప్లాటినం 

సి) పెల్లాడియం     డి) మాంగనీస్‌


13. మానవుల రక్తం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?    

ఎ) ఆమ్ల      బి) క్షార      సి) తటస్థం   డి) ఏ స్వభావం ఉండదు


14. కిటికీల గ్లాస్‌లను శుద్ధి చేయడంలో ఉపయోగించే పదార్థం?

ఎ) ఆమ్మోనియం క్లోరైడ్‌     బి) అమ్మోనియం హైడ్రాక్సైడ్‌

సి) అమ్మోనియం కార్బోనేట్‌      డి) అమ్మోనియం సల్ఫేట్‌


15. అప్పుడే పిండిన పాల pH విలువను గుర్తించండి.

ఎ) 2.0    బి) 3.0    సి) 5.2    డి) 6.0


16. భోపాల్‌ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు?

ఎ) మిథైల్‌ ఐసోసైనేట్‌      బి) ఇథైల్‌ ఐసోసైనేట్‌

సి) మీథేన్‌              డి) ప్రొడ్యూసర్‌ గ్యాస్‌


17. ఓజోన్‌ పొర నాశనానికి కారణమైన పదార్థం?

ఎ) మీథేన్‌      బి) ఈథేన్‌      

సి) CFC      డి) అమ్మోనియా


18. అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత కలిగిన మూలకం?

ఎ) టంగ్‌స్టన్‌      బి) కోబాల్ట్‌ 

సి) వెండి     డి) ఐరన్‌


19. బ్రెయిన్‌ ట్యూమర్‌ను గుర్తించడంలో ఉపయోగపడే ఐసోటోపు?

ఎ) అయోడిన్‌ - 131     బి) అయోడిన్‌ - 121 

సి) అయోడిన్‌ - 111     డి) అయోడిన్‌ - 91


20. కిందివాటిలో తక్కువ తియ్యదనం కలిగిన చక్కెర? 

ఎ) ఫ్రక్టోజ్‌  బి) గ్లూకోజ్‌  సి) సుక్రోజ్‌ డి) లాక్టోజ్‌


21. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు?

ఎ) క్లోరోఫ్రిన్‌ రబ్బరు      బి) బ్యూన రబ్బరు

సి) సహజ రబ్బరు      డి) నియోఫ్రిన్‌ రబ్బరు


22. నాఫ్తలిన్‌ కింది దేనిలో కరగదు?

ఎ) ఈథర్‌  బి) కిరోసిన్‌    సి) ఇథిలీన్‌      డి) నీరు


23. ఇటీవల కాలంలో మద్యానికి బానిసైన వాళ్లు దగ్గు మందును కూడా తాగుతున్నారు? ఇందులో ఉండే పదార్థం?

ఎ) ఆమ్లం బి) క్షారం సి) లవణం డి) ఆల్కహాల్‌


24. HCl + NaOH ⎯→ NaCl + H2O ఈ చర్యను గుర్తించండి.

ఎ) రసాయన సంయోగం     బి) రసాయన వియోగం 

సి) రసాయన స్థానభ్రంశం     డి) రసాయన ద్వంద్వ వియోగం


25. బేబీ సోప్స్‌ తయారీలో వాడే ఆమ్లాన్ని గుర్తించండి.

ఎ) నత్రికామ్లం            బి) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 

సి) ఫాస్ఫారిక్‌ ఆమ్లం        డి) హైపోక్లోరస్‌ ఆమ్లం


26. గ్లూకోజ్‌ను ఇథైల్‌ ఆల్కహాల్‌గా మార్చడంలో ఉపయోగపడే ఎంజైమ్‌?

ఎ) జైమేజ్‌              బి) ఇన్వర్టేజ్‌

సి) జైమేజ్, ఇన్వర్టేజ్‌        డి) జైమేజ్, CO2


27. కిందివాటిలో విద్యుత్‌ వాహకం కాని ద్రావణాన్ని గుర్తించండి.

ఎ) ఉప్పు ద్రావణం         బి) క్షార ద్రావణం

సి) ఆమ్ల ద్రావణం          డి) చక్కెర ద్రావణం


28. పౌడర్‌లో సువాసన కోసం వాడే పదార్థం ఏది?

ఎ) ఏలిఫాటిక్‌             బి) ఏరోమాటిక్‌

సి) హెటిరోసైక్లిక్‌           డి) ఏదీకాదు


29. మనం తాగుతున్న టీలో ఉండే ఆమ్లం ఏది?

ఎ) స్పిరిక్‌ ఆమ్లం          బి) యూరిక్‌ ఆమ్లం

సి) అమైనో ఆమ్లం        డి) టానిక్‌ ఆమ్లం


30. కిందివాటిలో ఏడిపించే వాయువును గుర్తించండి.

ఎ) ట్రైక్లోరో నైట్రోమీథేన్‌      బి) డైక్లోరో నైట్రోమీథేన్‌

సి) టెట్రాక్లోరో మీథేన్‌         డి) మిథిలిన్‌ క్లోరైడ్‌


31. ట్రిటియం ఐసోటోపు దేనికి సంబంధించింది?

ఎ) కార్బన్‌               బి) ఆక్సిజన్‌

సి) నైట్రోజన్‌             డి) హైడ్రోజన్‌


32. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఎక్కువగా విడుదల చేసే దేశం?

ఎ) రష్యా  బి) భారత్‌  సి) చైనా  డి) పాకిస్థాన్‌


33. హైడ్రోజన్‌ ఐసోటోపులోని రేడియోధార్మిక ఐసోటోపును గుర్తించండి.

ఎ) డ్యూటీరియం      బి) ప్రోటియం  

సి) ట్రిటీయం      డి) గాలియం


34. సున్నపురాయి దేని ఖనిజమో తెలపండి.

ఎ) సోడియం            బి) కాల్షియం

సి) అల్యూమినియం       డి) సిలికాన్‌


35. వాతావరణంలో ఎంత PPm దాటితే SO2 వాయువు వల్ల మరణం సంభవిస్తుంది?

ఎ) 50 50 PPm                బి) 100 PPm

సి) 150 PPm             డి) 200 PPm


36. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే పొగమంచు ఎలా ఏర్పడుతుంది?

ఎ) ఎక్కువ               బి) తక్కువ

సి) స్థిరం                డి) పెరిగి తగ్గుతుంది


37. క్లోరోఫిల్‌లో ఉన్న లోహ మూలకాన్ని గుర్తించండి.

ఎ) మెగ్నీషియం     బి) కాల్షియం

సి) సోడియం      డి) పొటాషియం


38. కాపర్‌ సల్ఫేట్‌ ద్రావణం రంగును గుర్తించండి.

ఎ) ఎరుపు బి) నీలం సి) పసుపు డి) ఆకుపచ్చ


39. హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్‌ అణుఫార్ములాలోని పరమాణుకతలు వరుసగా?

ఎ) 2, 2, 8     బి) 2, 2, 6 

సి) 2, 2, 4     డి) 2, 2, 2


40. వాతావరణ కాలుష్యానికి కారణమైన ఇంధనం?

ఎ) పెట్రోలియం     బి) చెత్త ఇంధనం    

సి) సోలార్‌ పవర్‌     డి) విండ్‌ పవర్‌


41. నాఫ్తలిన్‌ గోళీలు టేబుల్‌పై ఉంచితే వాటి పరిమాణం తగ్గడానికి కారణం?

ఎ) ద్రవీభవించడం      బి) ఉత్పతనం

సి) బాష్పీభవనం     డి) ఘనీభవనం


42. పిండిపదార్థాన్ని పరీక్షించేందుకు ఉపయోగించే మూలకం?

ఎ) క్లోరిన్‌ బి) ఫ్లోరిన్‌ సి) బ్రోమిన్‌ డి) అయోడిన్‌


43. 9F19 అనే సంకేతంలో పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలు వరుసగా?

ఎ) 9, 19  బి) 19, 9     సి) 10, 9  డి) 9, 10


44. గడ్డం గీసేందుకు వాడే సబ్బులు ఏ పదార్థాన్ని అధికంగా కలిగి ఉంటాయి?

ఎ) స్టియరిక్‌ అమ్లం      బి) పూరకాలు

సి) సువాసన ద్రవ్యాలు     డి) గ్లిజరాల్‌


45. బొమ్మల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్‌ పదార్థం?         

ఎ) LDPE         బి) HDPE    

సి) PVC         డి) నైలాన్‌ 66


46. వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ)లో ప్రధానంగా ఉండే వాయువు?

ఎ) బ్యూటేన్‌ బి) ఈథేన్‌ సి) ప్రొపేన్‌ డి) పెంటేన్‌


47. ప్రొటీన్‌లు ఏ పదార్థాలతో నిర్మితమవుతాయి?

ఎ) కార్బోహైడ్రేట్లు        బి) అమైనో ఆమ్లాలు

సి) విటమిన్లు           డి) ఖనిజ ఆమ్లాలు


48. బెల్లం నుంచి తయారుచేసిన ఇథైల్‌ ఆల్కహాల్‌ను ఏమంటారు?

ఎ) గుడుంబా         బి) ఇప్పసారా

సి) ఆల్కహాల్‌        డి) అసహజ స్పిరిట్‌


49. తేలు కుట్టిన చోట ఉపయోగించే రసాయనాన్ని గుర్తించండి.

ఎ) టార్టారిక్‌ ఆమ్లం  బి) పొటాషియం పర్మాంగనేట్‌

సి) టార్టారిక్‌ ఆమ్లం, పొటాషియం పర్మాంగనేట్‌  డి) పొటాషియం అయోడైడ్‌


50. బటర్‌మిల్క్‌లో ఉండే ఆమ్లాన్ని గుర్తించండి.

ఎ) ఎసిటిక్‌ ఆమ్లం       బి) లాక్టిక్‌ ఆమ్లం

సి) బ్యుటరిక్‌ ఆమ్లం     డి) మాలిక్‌ ఆమ్లం


51. వంకాయలు, యాపిల్‌లను కోసిన తర్వాత తెల్లటి భాగం ఎర్రగా మారే చర్య?       

ఎ) భౌతిక చర్య     బి) ద్విగత చర్య 

సి) రసాయన చర్య      డి) అద్విగత చర్య


సమాధానాలు


1-సి; 2-ఎ; 3-సి; 4-ఎ; 5-బి; 6-డి; 7-బి; 8-బి; 9-బి; 10-ఎ; 11-ఎ; 12-సి; 13-సి; 14-బి; 15-డి; 16-ఎ; 17-సి; 18-ఎ; 19-ఎ; 20-డి; 21-బి; 22-డి; 23-డి; 24-డి; 25-డి; 26-ఎ; 27-డి; 28-బి; 29-డి; 30-బి; 31-డి; 32-సి; 33-సి; 34-బి; 35-ఎ; 36-ఎ; 37-ఎ; 38-బి; 39-ఎ; 40-ఎ; 41-బి; 42-డి; 43-ఎ; 44-ఎ; 45-బి; 46-ఎ; 47-బి; 48-ఎ; 49-సి; 50-బి; 51-సి.

Posted Date : 17-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.