• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం

ఆ ద్రావణంతో అవినీతి అధికారి ఆటకట్టు!
ఆమ్లాలు, క్షారాలు కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలు. వాటిలో బలమైన, బలహీనమైన ఆమ్లాలు, క్షారాలు ఉంటాయి. అవి అనేక రకాల రసాయన ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తాయి.  పాలను పెరుగుగా ఆమ్లాలు మారిస్తే, అందరూ ఉపయోగించే సబ్బులను క్షారాలతో తయారు చేస్తారు. నిత్యజీవితాలతో సంబంధం ఉన్న ఇలాంటి అంశాలతోపాటు పరమాణువులు, పరమాణు ద్రవ్యరాశి, పరమాణు సంఖ్య తదితరాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఇంకా వివిధ ద్రావణాలు, మిశ్రమాలపై అవగాహన పెంచుకోవాలి. 

మాదిరి ప్రశ్నలు


1.     ఆమ్లాల ధర్మాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) లెవోయిజర్‌      2) బాయిల్‌    

3) ప్రాస్ట్‌       4) రౌలే 


2.     కిందివాటిలో మొక్కల నుంచి లభించే ఆమ్లాన్ని గుర్తించండి.

1) HCl 2) HNO3

3) H2SO3 4) CH3COOH


3.     కిందివాటిలో ఖనిజ ఆమ్లం-

1) మాలిక్‌ ఆమ్లం     2) ఆగ్జాలిక్‌ ఆమ్లం  

3) టార్టారిక్‌ ఆమ్లం      4) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


4.     కిందివాటిలో బలహీనమైన ఆమ్లాన్ని గుర్తించండి.

1) HCl 2) CH3COOH

3) HNO3 4) H2SO4


5. చింతపండు, ద్రాక్షలో ఉండే ఆమ్లం?

1) ఆస్కార్బిక్‌ ఆమ్లం     2) సిట్రిక్‌ ఆమ్లం 

3) టార్టారిక్‌ ఆమ్లం     4) మాలిక్‌ ఆమ్లం


6.     కిందివాటిలో కాస్టిక్‌ సోడాగా పిలిచే క్షారం?

1) NaOH 2) Ca(OH)2

3) Mg(OH)2 4) NH4OH


7.     కిందివాటిలో బ్రైన్‌ ద్రావణంగా దేన్ని పిలుస్తారు? 

1) పొటాష్‌ ఆలం       2) సోడియం క్లోరైడ్‌ జల ద్రావణం     

3) మెర్క్యురిక్‌ క్లోరైడ్‌          4) అమ్మోనియం క్లోరైడ్‌ 


8.     ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులు?

1) CO2, CaO    2) CO2, CO

3) CO2, NO2    4) SO2, NO2


9.     మాంత్రికులు, గారడి చేసేవాళ్లు నిమ్మకాయను చాకుతో కోసి ఎరుపురంగును తెప్పిస్తారు. వారు చాకుకు పూసే పదార్థమేది?

1) మిథైల్‌ ఆరెంజ్‌      2) ఫినాఫ్తలీన్‌  

3) లిట్మస్‌       4) పసుపు


10. చీమ కుట్టినప్పుడు శరీరంలోకి విడుదలయ్యే ఆమ్లం?

1) ఎసిటిక్‌ అమ్లం      2) ఫార్మిక్‌ ఆమ్లం  

3) ఓలియిక్‌ ఆమ్లం      4) మాలిక్‌ ఆమ్లం


11. క్షారాలు లోహాలతో చర్య జరిపి విడుదల చేసే వాయువు?

1) ఆక్సిజన్‌     2) కార్బన్‌ డై ఆక్సైడ్‌  

3) హైడ్రోజన్‌      4) నైట్రోజన్‌


12. పసుపు క్షారంతో ఎరుపురంగు ఇచ్చినా, ఆమ్లంతో చర్య జరిపితే వచ్చే రంగు?

1) నీలం     2) రంగు ఇవ్వదు  

3) ఆకుపచ్చ     4) ఎరుపు


13. ఆమ్ల వర్షం pH విలువ?

1) 5.6 కంటే ఎక్కువ     2) 5.6 కంటే తక్కువ 

3) 7.5 కంటే ఎక్కువ     4) 5.5 కంటే తక్కువ 


14. ఏసీబీ వారు అవినీతి ఆఫీసర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఫినాఫ్తలీన్‌ పౌడర్‌ ఉన్న అతడి చేతులను ఏ ద్రావణంలో ముంచుతారు?

1) H2SO4 2) HNO3

3) H2CO3 4) Na2CO3


15. అజీర్తి సమయంలో జీర్ణాశయంలో విడుదలయ్యే HCl ను తటస్థీకరించడానికి (Nutralization) ఉపయోగించే పదార్థం?

1) Ca(OH)2     2) NH4OH

3) Mg(OH)2    4) Al(OH)3


16. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణమైన ఆమ్లం? 

1) సిట్రిక్‌ ఆమ్లం     2) ఆగ్జాలిక్‌ ఆమ్లం 

3) ఎసిటిక్‌ ఆమ్లం     4) లాక్టిక్‌ ఆమ్లం 


17. శరీరానికి ఉపయోగించే సబ్బులో ఉండే క్షారం? 

1) NaOH       2) KOH

3) Mg(OH)2  4) NH4OH


18. న్యూట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) జె.జె.స్టోని      2) జేమ్స్‌ చాడ్విక్‌ 

3) గోల్డ్‌ స్టెయిన్‌     4) జె.జె.థామ్సన్‌


19. పరమాణు కేంద్రకం (Nucleus) లో ఉండే  ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌ల సంఖ్యను ఏమంటారు?

1) పరమాణు సంఖ్య     2) పరమాణు ద్రవ్యరాశి 

3) amu       4) అణు ద్రవ్యరాశి 


20. ఒక పరమాణు సంఖ్య 35, దాని ద్రవ్యరాశి సంఖ్య 80 అయితే న్యూట్రాన్‌ల సంఖ్య ఎంత?

1) 40    2) 45    3) 50    4) 55


21. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే ఐసోటోపును గుర్తించండి.

1) అయోడిన్‌      2) యురేనియం 

3) కార్బన్‌       4) కోబాల్ట్‌


22. అత్యధిక ఐసోటోపులను ప్రదర్శించే మూలకం?

1) సోడియం     2) యురేనియం  

3) హైడ్రోజన్‌      4) సీజియం


23. సామాన్య గాయిటర్‌ చికిత్సలో ఉపయోగించే  ఐసోటోపు? 

1) అయోడిన్‌      2) సోడియం 

3) కార్బన్‌     4) కోబాల్ట్‌


24. సంయోజనీయ బంధాన్ని (Covelent Bond) ప్రతిపాదించినవారు?

1) కోసెల్‌      2) జి.ఎన్‌.లూయీస్‌  

3) ఆస్వాల్డ్‌      4) బాయిల్‌


25. ఏదైన ఒక మోల్‌ పదార్థం STP వద్ద ఆక్రమించే ఘనపరిమాణం?

1) 20.5 లీ.       2) 15.5 లీ. 

3) 22.4 లీ.       4) 25.4 లీ.


26. కిందివాటిలో అవగాడ్రో సంఖ్యను గుర్తించండి.

1) 6.0 × 1023       2) 6.022 × 1023   

3) 6.67 × 1023       4) 6.022 × 1023


27. సల్ఫర్‌ అణువు పరమాణుకతను (Atomocity) గుర్తించండి.

1) ఏక పరమాణుకత     2) ద్విపరమాణుకత   

3) చతుఃపరమాణుకత      4) అష్ట పరమాణుకత


28. ఆక్సిజన్‌ సంయోజకత ఎంత?

1) 2      2) 4      3) 3      4) 1


29. డైక్రోమేట్‌ అయాన్‌ ఆవేశం ఎంత?

1) 3      2) 4      3) 2      4) 1


30. ఉప్పు, నాఫ్తలీన్‌ మిశ్రమం నుంచి ఉప్పును తొలగించే పద్ధతి?

1) స్ఫటికీకరణం       2) క్రొమటోగ్రఫి  

3) స్వేదనం       4) ఉత్పతనం


31. పాల నుంచి వెన్నను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి?

1) తేర్చడం     2) వడబోత  

3) అపకేంద్ర యంత్రం      4) స్వేదనం


32. అవలంబనాలను (Suspenssion) వేరు చేసే పద్ధతి?

1) స్వేదనం      2) స్ఫటికీకరణం  

3) అంశిక స్వేదనం      4) తేర్చడం 


33. కిందివాటిలో సజాతీయ మిశ్రమం?

1) పాలు    2) గాలి    3) రక్తం    4) సిరప్‌


34. దూది నుంచి గింజలను తొలగించడాన్ని ఏమంటారు?

1) కార్డింగ్‌  2) జిన్నింగ్‌  3) డైయింగ్‌  4) సార్టింగ్‌


35. జనుము దారాన్ని మొక్క ఏ భాగం నుంచి తీస్తారు?

1) ఆకులు   2) వేర్లు   3) కాండం   4) కాయలు


36. సెల్యులోజ్‌  అనే   కార్బోహైడ్రేట్‌   దేనిలో నుంచి లభిస్తుంది?

1) పత్తి    2) ఉన్ని   3) కొబ్బరి    4) పట్టు


37. తివాచీల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం?

1) సిరిసిల్ల      2) గద్వాల్‌  

3) ధర్మవరం      4) మచిలీపట్నం


38. కిందివాటిలో ఏ దారాన్ని మండిస్తే అది ఎక్కువ జ్వాలతో మండుతుంది? 

1) పట్టు   2) ఉన్ని   3) రేయాన్‌   4) నైలాన్‌


39. చిన్న పిల్లల డైపర్స్‌లో అధికంగా ఉపయోగించే దారం?

1) నైలాన్‌   2) రేయాన్‌  3) ఆక్రలిన్‌  4) పాలిస్టర్‌


40. టెర్లిన్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది? 

1) ప్రసిద్ధి చెందిన నైలాన్‌       2) ప్రసిద్ధి చెందిన ఆక్రలిన్‌

3) ప్రసిద్ధి చెందిన పాలిస్టర్‌     4) ప్రసిద్ధి చెందిన రేయాన్‌


41. మొదటిసారిగా ప్లాస్టిక్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?

1) బేక్‌ల్యాండ్‌     2) స్టాడింగర్‌  

3) అలెగ్జాండర్‌ పార్క్స్‌     4) రుడాల్ఫ్‌ హెర్ట్జ్‌ 


42. కిందివాటిలో థర్మోప్లాస్టిక్‌ను గుర్తించండి.

1) కుక్కర్‌ పిడి     2) కంప్యూటర్‌ క్యాబిన్స్‌ 

3) పీవీసీ      4) మెలమిన్‌


43. కిందివాటిలో థర్మోసెట్టింగ్‌ ప్లాస్టిక్‌కు ఉదాహరణ?

1) పీవీసీ      2) పాలిథీన్‌ కవర్‌  

3) బేకలైట్‌      4) సిరప్‌


1) PET 2) HDPE 3) LDPE 4) PVC


45. వలలు, గొడుగు తయారీకి ఉపయోగించే దారం?

1) నైలాన్‌  2) రేయాన్‌  3) పట్టు 4) ఆక్రలిన్‌ 


46. కిందివాటిలో కలప విచ్ఛిన్నం చెందడానికి పట్టే సమయం?

1) 10 - 15 సంవత్సరాలు         2) 5 - 10 నెలలు 

3) 100 - 500 సంవత్సరాలు     4) 10 - 30 రోజులు


47. గోనె సంచులు, బ్యాగుల తయారీకి ఉపయోగించే దారం?

1) కిత్తనార     2) గోగునార 

3) జనుము దారం      4) అరటినార


48. బిట్యుమినస్‌ అనే కోక్‌లో ఉండే కార్బన్‌ శాతం?

1) 85%  2) 65%   3) 95%  4) 45%


49. 400 డిగ్రీల సెంటీగ్రేడ్‌  వద్ద పెట్రోలియంను శుద్ధి చేస్తే వెలువడేవి?

1) రసాయనాలు      2) పెట్రోల్‌ 

3) కందెనలు     4) వాయు ఇంధనం


50. స్టీల్‌ తయారీకి ఉపయోగించే నేల బొగ్గు ఉత్పన్నం?

1) కోల్‌గ్యాస్‌  2) కోక్‌  3) కోల్‌తార్‌  4) పైవన్నీ


51. సాధారణ పద్ధతిలో మన పూర్వీకులు పెట్రోలియంను శుద్ధి చేసినప్పుడు మొదటగా వెలువడిన పదార్థం?

1) డీజిల్‌ 2) కిరోసిన్‌ 3) పారాఫిన్‌ మైనం 4) పెట్రోల్‌


52. పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే అలోహం? 

1) అయోడిన్‌      2) ఫాస్ఫరస్‌

3) సల్ఫర్‌      4) కార్బన్‌


53. మొక్కల ఎదుగుదలకు ఉపయోగించే పదార్థాలు?

1) Al, S 2) Mg, Cu 3) C, K 4) P, N, K


54. మంట మధ్యస్థ ఉష్ణ భాగం వద్ద వెలువడే రంగు?

1) నీలం  2) ఆకుపచ్చ  3) పసుపు  4) నలుపు


55. కిందివాటిలో రసాయన ద్వంద్వ వియోగాన్ని గుర్తించండి.

1) MgCO3 MgO + CO2

2) CaO + CO2 CaCO3

3) Fe + CuSO4 FeSO4 + Cu

4) ZnCl2 + H2SO4 ZnSO4 + 2HCl


56. కిందివాటిలో కాంతి వియోగచర్య (Sunlight reaction) గుర్తించండి.

1) CaCO3 CaO + CO2

2) 2H2O  2H2 + O2

3) 2AgCl  2Ag + Cl2

4) MgCO3 MgO + CO2సమాధానాలు

1-2; 2-4; 3-4; 4-2; 5-3; 6-1; 7-2; 8-4; 9-1; 10-2; 11-3; 12-2; 13-2; 14-4; 15-3; 16-4; 17-2; 18-2; 19-2; 20-2; 21-4; 22-4; 23-1; 24-2; 25-3; 26-2; 27-4; 28-1; 29-3; 30-4; 31-3; 32-4; 33-2; 34-2; 35-3; 36-1; 37-4; 38-4; 39-2; 40-3; 41-3; 42-3; 43-3; 44-2; 45-1; 46-1; 47-3; 48-2; 49-3; 50-2; 51-2; 52-3; 53-4; 54-3; 55-4; 56-3.

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.