1. దివ్య అనే విద్యార్థికి జీవశాస్త్ర పరీక్షలో 70 మార్కులు వచ్చాయి అని తెలపడం?
జ: మాపనం
2. దీప అనే విద్యార్థికి జీవశాస్త్ర పరీక్షలో వచ్చిన 70 మార్కులు సంతృప్తికరంగా ఉన్నాయో, లేదో అని తెలియజేయడాన్ని ఏమంటారు?
జ: మూల్యాంకనం
3. టర్మ్ పరీక్షలు అనేవి?
జ: సంకలన మూల్యాంకనం
4. సమగ్ర పథకంలో పట్టికకు నిట్టనిలువుగా ఉన్న అంశం?
జ: పాఠ్యాంశాలు
5. సమగ్ర పథకంలో పట్టికకు సమాంతరంగా ఉన్న అంశం?
జ: లక్ష్యాలు, ప్రశ్న రకం
6. మూల్యాంకన ఫలితాలను విశ్లేషించడం, వ్యాఖ్యానించడం మూల్యాంకన విధానంలోని ఎన్నో సోపానం?
జ: 5
7. భగత్ సింగ్లో దేశభక్తి అనే లక్షణం ఉందా, లేదా అని తెలిపే మూల్యాంకన సాధనం
జ: చెక్లిస్ట్
8. సమాధానాలను దిద్దడంలో ఆత్మాశ్రయతకు అవకాశం ఉన్న పరీక్ష?
జ: వ్యాసరూప పరీక్ష
9. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరీక్ష
జ: నిష్పాదన
10. మూల్యాంకన విధానంలోని సోపానాల సంఖ్య?
జ: 3
గత డీఎస్సీలో వచ్చిన ప్రశ్నలు
11. మాపన ప్రక్రియలో లేకుండా మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉండే అంశం?
జ: ఫలితాలకు విలువ ఇవ్వడం
12. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష తయారీలో కష్టమైన అంశం?
జ: బ్లూ ప్రింట్ తయారీ
13. లక్ష్యాత్మక పరీక్షలు ఏ రకానికి చెందినవి?
జ: జతపరిచే పరీక్షలు
14. ఒక పరీక్ష 'విశ్వసనీయత' ఏ అంశంపైన ఆధారపడదు?
జ: పరీక్ష నిడివి
15. నికషలో ఉండే ప్రశ్నలు?
జ: వ్యాసరూప, లక్ష్యాత్మక
రచయిత: రాధాకృష్ణ