• facebook
  • whatsapp
  • telegram

భాషా నైపుణ్యాలు

మాదిరి ప్ర‌శ్న‌లు


1. కాఫీలోని 'ఫ' అనే ధ్వని- 
జ: దంతోష్ఠ్యం

 

2. 'నన్నయ ఉభయకవి మిత్రుడు' అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది?
జ: భావదోషం

 

3. భాషా కౌశలాలు ఎన్ని? 
జ: 4

 

4. అతి సులభంగా భావ గ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం-
జ: శ్రవణం

 

5. చూపుమేర, పలుకుమేరల సహ సంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందింది? 
జ: పఠనం

 

6. అల్ప ప్రాణం నాదాత్మకమైన భాషా ధ్వని- 
జ: డ

 

7. 'కరము' బదులుగా 'ఖరము' అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుంది? 
జ: అల్పప్రాణం బదులు మహాప్రాణం పలకడం

 

8. ఉభయోష్ఠ్యాలైన ప/ ఫ/ బ/ భ/ మ ధ్వనుల ఉత్పత్తి ఏ భేదం వల్ల కలుగుతుంది? 
జ: ప్రయత్నం

 

9. నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావాల్సిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పఠనం-
జ: విస్తార పఠనం

 

10. భాషణం కేవలం శ్రవణ గోచరం. లేఖనం- 
జ: నయన గోచరం

 

11. భాషా నైపుణ్యాల క్రమం- 
జ: శ్రవణం -భాషణం - పఠనం - లేఖనం

 

12. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైంది- 
జ: పఠనం 

 

13. ధ్వన్యనుకరణ శబ్దాలను అధికంగా ప్రవేశపెట్టవలసిన కథలు- 
జ: నీతి కథలు

 

14. అ - ఉ అనే రెండు స్వరాలు అవ్యవహితంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్తాచ్చు- 
జ: ఔ

 

15. విద్యార్థుల ఉచ్ఛారణ దోషాలను సవరించడానికి ఏ పఠనం చేయించాలి?
జ: బాహ్య పఠనం

 

16. విషయ పరిజ్ఞానానికి చెందిన దోషం- 
జ: భావ దోషం

 

17. భాషా బోధనలో పఠన, లేఖనాల్లో ముందుగా జరిగేది- 
జ: పఠనం

 

18. పంక్తి మధ్య పఠనం, ఆమూలాగ్ర పఠనం అనే పఠన విధానాలను సూచించిన కవి- 
జ:   నెల్లుట్ల వెంకటేశ్వరరావు

 

19. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తుకు తెచ్చుకుంటూ రాసే లేఖనం- 
జ:   ఉక్త లేఖనం

 

20. 'భాష ఆలోచనలకు ఆకృతి' అని చెప్పింది- 
జ:  జాన్సన్

 

21. 'ప్రాతిపదిక నైపుణ్యం' అని ఏ భాషా నైపుణ్యానికి పేరు?
జ:   శ్రవణం

 

22. ఆధునిక పరిభాషలో పరుషాలను ఏమంటారు? 
జ:  శ్వాసాలు

 

23. 'మల్లెమొగ్గ, మల్లెమొగ్గ మెల్లగ వచ్చి గిల్లిపో' అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం-
జ:  శ్రవణం

 

24. కరణం ఒక్కసారిగా వెనక్కువచ్చి పైనున్న స్థానాన్ని తాకి, కిందికి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని- 
జ:   తాడితం

 

25. వర్ణ వ్యత్యయ దోషానికి ఉదాహరణ-
జ:  సుతిలి

 

26. పదపద్ధతిలో పఠనాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించాల్సిన మెరుపు అట్టలు-
జ:  గుర్తింపు అట్ట

 

27. అంతస్థాలను సరిగా ఉచ్ఛరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్ఛారణ దోషం- 
జ:   అంత్రం

 

28. ప్రకాశ పఠనానికి భిన్నమైంది- 
జ:   మౌన పఠనం

 

29. బాహ్య నైపుణ్య చతుష్కంలో 'వాచిక చర్య' అని దేన్ని అంటారు?
జ:  భాషణం

 

30. 'చిన్నది యిదిగో చిటికెన వ్రేల్.... ఉన్నది ప్రక్కన ఉంగరపు వ్రేల్' అనేది-
జ: అభినయ గేయం

 

31. మౌఖికంగా కూర్చే రచన-
జ: ఉక్త రచన

 

32. వర్ణమాలలో తరచుగారాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పఠన పద్ధతి- 
జ: నవీనాక్షర పద్ధతి

 

33. ఒక్కగుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం- 
జ: పలుకుమేర

 

34. 'కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయమొక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు' అన్నది-
 జ: నాష్

 

35. 'లేఖనం' అనేది ఏ పదం నుంచి ఏర్పడింది?
జ: లింపతి

 

36. వివరంగా ఉన్న విషయాన్ని కుదించి, అతి క్లుప్తంగా, సంగ్రహంగా రాయడాన్ని ఏమంటారు?
జ: సంక్షిప్త లేఖనం

 

37. పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా, అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం-
జ: భాషణం 

 

38. వాచిక చర్యను పెంపొందిచడానికి ఏది ఉపకరిస్తుంది? 
జ: కథా కథనం

 

39. పిల్లల్లో జ్ఞాపకశక్తిని, సమస్యా పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞతను కలిగించేవి-
జ: పొడుపు కథలు

 

40. అనునాసిక దోషానికి ఉదాహరణ-
జ: వీన

1. శ్రవణం: చతుర్విధ భాషా నైపుణ్యాల్లో మొదటిది శ్రవణం. అతి సులువుగా భావగ్రహణకు తోడ్పడేది భాషా నైపుణ్యం. భాషా నైపుణ్యాల్లో తొలిమెట్టు శ్రవణం. నిర్దుష్ట భాషణానికి నిర్దిష్ట శ్రవణం అవసరం. అందుకే 'Bad spelling is the result of bad hearing' అంటాడు రైబర్న్.
* 'శ్రవణం' చదివేటప్పుడు నిర్వచనాన్ని, ఉద్దేశాలను, శ్రవణ లక్షణాలను అభ్యర్థులు అభ్యసించాల్సి ఉంటుంది.
ఉదా: 1. శిశువుకు పుట్టుకతోనే అలవడే నైపుణ్యం-
             ఎ) పఠనం              బి) భాషణం
             సి) శ్రవణం              డి) లేఖనం
సమాధానం: సి.


ఉదా: 2. శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశం-

ఎ) రచనా నైపుణ్యం సిద్ధింపజేయడం               
బి) స్పష్టంగా, నిర్దుష్టంగా పఠింపజేయడం
సి)సంఘీభావం ఏర్పడేటట్లు చేయడం
డి) అతి చిన్న ధ్వనులను, పెద్ద ధ్వనులను అవధానంతో విని గుర్తింపజేయడం
సమాధానం: డి


* శ్రవణం అభ్యసించేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన మరో అంశం - 'శ్రవణ నైపుణ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు'.
ఉదా: టెలిఫోను ఆట ద్వారా పెంపొందించదగిన భాషా నైపుణ్యం-
         ఎ) పఠనం              బి) శ్రవణం
         సి) భాషణం            డి) లేఖనం
సమాధానం: బి

 

2. భాషణం: భాషా నైపుణ్యాల్లో రెండోది, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో మొదటిది భాషణం. సాంఘికీకరణలో అతి ప్రధానమైన భాషా నైపుణ్యం భాషణం. ఇది భాషావ్యవహారాల్లో అన్నిటికంటే సులభమైంది. సంభాషణలు, ప్రశ్నావళి, శిశు గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం మొదలైన సాధనాల ద్వారా విద్యార్థుల్లో వాచిక చర్యను మెరుగుపరచవచ్చు. అభ్యర్థులు భాషణ నిర్వచనంతోపాటు ప్రాముఖ్యంపై కూడా దృష్టి సారించాలి.
ఉదా: 'వాచిక చర్య' అని ఏ భాషా నైపుణ్యాన్ని అంటారు?
         ఎ) శ్రవణం                బి) భాషణం
         సి) పఠనం                డి) లేఖనం
సమాధానం: బి.


* భాషణంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినవి భాషణ లక్షణాలు. ఇవి భాషణ నైపుణ్యాన్ని మెరుగుపరచే సాధనాలు.
ఉదా: భాషణం ముఖ్య లక్షణం- 
         ఎ) ఉచ్ఛారణ స్పష్టత            బి) వేగోచ్ఛారణ
         సి) ధ్వనుల తారుమారు        డి) సమవేగరాహిత్యం

సమాధానం: 


ఉదా: చిన్న పిల్లలకు నేర్పించే గీతాలు-

        ఎ) అభినయ గేయాలు          బి) శిశుగీతాలు
        సి) కథాగేయాలు                  డి) పారమార్ధిక గేయాలు
సమాధానం:  బి


* భాషణంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన మరో కీలకాంశం 'వాగింద్రియ నిర్మాణం'
ఉదా:  నోటి పైభాగంలోని వివిధ అవయవ భాగాల్లో ఉండేవి- 

          ఎ) స్థానాలు                 బి) కరణాలు
          సి) ప్రయత్నం              డి) ఆచరణలు
సమాధానం:  ఎ

 

3. పఠనం: భాషా నైపుణ్యాల్లో మూడోది, భావ గ్రహణ నైపుణ్యాల్లో రెండోది పఠనం. దృశ్య సంకేతాలను శబ్దార్థ సంకేతాలుగా మార్చి ఉచ్ఛరించడమే పఠనం. నిర్దుష్ట పఠనం, నిర్దిష్ట భాషణంపై ఆధారపడి ఉంటుంది. ప్రకాశపఠనం, మౌనపఠనం అని ధ్వని భేదంతో పఠనం రెండు రకాలు. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం అనేవి విషయ గ్రహణానికి సంబంధించిన పఠన తరతమ భేదాలు.


* పఠనం జరిగే విధానం, పఠన భేదాలు, లాభాలు మొదలైన అంశాలపై అభ్యర్థులు దృష్టి సారించాలి.
ఉదా:  పఠనంలో పాల్గొనే ఇంద్రియాలు- 
         ఎ) వాగింద్రియాలు                      బి) చక్షురింద్రియాలు 
         సి) వాగింద్రియాలు, చక్షురింద్రియాలు      డి) జ్ఞానేంద్రియాలు
సమాధానం:  సి


* పఠన నైపుణ్యాన్ని మెరుగుపరిచే అంశాలతోపాటు పఠన బోధనా పద్ధతులను అభ్యసించాలి.
ఉదా:  అక్షరసామ్యం ఉన్న లక్షణాలను వర్గాలుగా చేసుకుని విద్యార్థులు తేలికగా గుర్తుంచుకునేటట్లు బోధించే పఠన పద్ధతి? 
ఎ) అక్షర పద్ధతి         బి) నవీనాక్షర పద్ధతి
సి) పదపద్ధతి            డి) వాక్యపద్ధతి
సమాధానం: బి

 

4. లేఖనం: కర్ణగోచరాలైన భాషా ధ్వనులను, అక్షి గోచరాలుగా లిపి రూపంలో రాయడమే లేఖనం. భాషా నైపుణ్య చతుష్కంలో ఇది చివరిది, క్షష్టతరమైంది. పఠనం స్తబ్ధాంశం అయితే లేఖనం కారకాంశం. భాషణం శ్రవణ గోచరమైతే లేఖనం నయనగోచరం. శిశు మనోవిజ్ఞాన శాస్త్రరీత్యా చివరిగా నేర్పదగిన భాషా నైపుణ్యం లేఖనం.
* లేఖన నిర్వచనం, లేఖన బోధనా పద్ధతులు, మంచి దస్తూరి లక్షణాలు, లేఖన శిక్షణ పద్ధతులను అభ్యర్థులు ప్రత్యేకంగా చదవాలి
ఉదా: మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధానమైంది-
        ఎ) స్పష్టత              బి) సమత
        సి) వేగం                డి) రీతి
సమాధానం: ఎ.

Posted Date : 13-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.