• facebook
  • whatsapp
  • telegram

మొగల్‌ సామ్రాజ్యం

ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!
 

చరిత్రలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యాల్లో మొగల్‌ సామ్రాజ్యం ఒకటి. బాబర్‌ నుంచి ఔరంగజేబు వరకు రెండు శతాబ్దాల పాటు కేంద్రీకృత పాలన సమర్థంగా సాగింది. పాలకులు మూలాలపరంగా పరదేశీయులైనప్పటికీ భారతీయ సంస్కృతి, విశ్వాసాలతో మిళితమయ్యారు. మొగల్‌ చక్రవర్తుల వరుస క్రమం, పాలనా విధానాలు, సాంఘిక, సాంస్కృతిక మార్పులు,   పాలకుల వారీగా జరిగిన యుద్ధాలు, తిరుగుబాట్లను తెలుసుకోవాలి. తెలుగు ప్రాంతాలతో మొగల్‌ పాలకులకు ఉన్న సంబంధం, ముఖ్య సంఘటనలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. 


1.    భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం?
1) తరైన్‌ యుద్ధం         2) మొదటి పానిపట్టు యుద్ధం

3) రెండో పానిపట్టు యుద్ధం  4) తళ్లికోట యుద్ధం


2.  కింది మొగల్‌ చక్రవర్తుల్లో పేరు దృష్ట్యా అదృష్టవంతుడని పిలిచే వ్యక్తి?

1) బాబర్‌     2) షాజహాన్‌ 
3) జహంగీర్‌     4) హుమాయున్‌


3.  ఔరంగజేబు 1687లో ఆక్రమించిన దక్కన్‌ రాజ్యం?

1) అహ్మద్‌నగర్‌     2) గోల్కొండ    3) బీజాపుర్‌     4) మహారాష్ట్ర


4.  కింది ఏ ప్రాంతాన్ని పాలించిన రాజపుత్రులు మొగల్‌ అధికారాన్ని దీర్ఘకాలం అంగీకరించలేదు?
1) అంబర్‌     2) జోధ్‌పుర్‌    3) మేవాడ్‌     4) పైవన్నీ


5.  మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం?

1) 1526  2) 1556    3) 1761  4) 1818


6. కిందివాటిలో మన్సబ్‌దారీ విధానానికి సంబంధించి సరైన వాక్యం గుర్తించండి.
1) ఈ విధానం మొగలుల కాలం నాటిది.

2) మన్సబ్‌దారీ పదవి వంశపారంపర్యం కాదు.

3) మన్సబ్‌దార్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు.

4) పైవన్నీ


7.  జబ్త్‌ విధానం దేనికి సంబంధించింది?

1) రెవెన్యూ విధానం     2) న్యాయ విధానం    3) సైనిక విధానం     4) ఏదీకాదు


8.  అక్బర్‌ ఆర్థికమంత్రి ఎవరు?

1) తిమ్మరుసు     2) రాజా బీర్బల్‌ 

3) మాన్‌సింగ్‌     4) తోడర్‌మల్‌


9.  ‘అక్బర్‌ నామా’ అనే గ్రœంథాన్ని రచించింది ఎవరు?

1) అమీర్‌ ఖుస్రూ     2) అబుల్‌ ఫజల్‌ 

3) తాన్‌సేన్‌     4) ఆల్‌బెరూని


10. హుమాయున్‌ని ఓడించిన పాలకుడు ఎవరు?

1) సఫావిద్‌ షా     2) ఇబ్రహీం లోడి 

3) షేర్‌ఖాన్‌     4) సంగ్రామ్‌ సింహా


11. జబ్త్‌ విధానం ప్రవేశపెట్టిన మొగల్‌ చక్రవర్తి?

1) అక్బర్‌     2) హుమాయున్‌ 

3) షాజహాన్‌     4) జహంగీర్‌


12. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

1) జహంగీర్‌ అసలు పేరు సలీమ్‌.     2) షాజహాన్‌ అసలు పేరు ఖుర్రం.

3) ఔరంగజేబు ‘అలంగీర్‌’ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు.

4) మొగలుల దక్కన్‌ విధానం ఔరంగజేబుతో ప్రారంభమైంది.


13. సుల్హ్‌-ఇ-కుల్‌ అంటే

1) చట్ట సమానత్వం     2) అత్యున్నత అధికారం

3) ప్రపంచ శాంతి     4) సమాన అవకాశాలు


14. అక్బర్‌ వివిధ మతాలకు చెందిన పెద్దలతో ఎక్కడ చర్చలు జరిపేవాడు?

1) ఇబాదత్‌ ఖానా     2) రంగమహల్‌   3) ఎర్రకోట     4) పంచమహల్‌


15. సర్దార్‌ సర్వాయి పాపన్న ఏ జిల్లాకు చెందినవారు?

1) వరంగల్‌     2) హనుమకొండ    3) నల్గొండ     4) ఆదిలాబాద్‌


16. చిన్‌ ఖులిచ్‌ ఖాన్‌ ఎలా ప్రసిద్ధి చెందాడు?

1) ముజఫర్‌ జంగ్‌    2) నాసిర్‌ - ఉద్‌ - ద్దౌలా

3) నిజాం - ఉల్‌ - ముల్క్‌     4) సలాబత్‌ జంగ్‌


17. కింది అసఫ్‌జాహీ పాలకుల్లో నిజాం అనే బిరుదును పొందని వ్యక్తులు/పాలకులు?

1) నాజర్‌ జంగ్‌     2) ముజఫర్‌ జంగ్‌    3) సలాబత్‌ జంగ్‌     4) పైవారందరూ


18. మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కాలంలో నిర్మించని సంస్థ- 

1) అసఫియా గ్రంథాలయం    2) విక్టోరియా స్మారక అనాథశాల

3) ఉస్మానియా విశ్వవిద్యాలయం   4) మహబూబియా బాలికల పాఠశాల


19. ఔరంగజేబు కాలంలో ఏ సిక్కు గురువును ఉరి తీశారు?

 1) గురు గోవింద్‌ సింగ్‌     2) గురు అర్జున్‌ సింగ్‌

3) గురు రామదాసు    4) గురు తేజ్‌ బహదూర్‌


20. కింది మొగల్‌ చక్రవర్తులను వారి వారసులతో జతపరచండి.

1) బాబర్‌ ఎ) జహంగీర్‌ 
2) హుమాయున్‌   బి) హుమాయున్‌
3) అక్బర్‌ సి) షాజహాన్‌
4) జహంగీర్‌ డి) అక్బర్‌

1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి    2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ     4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


21. బీజాపుర్, గోల్కొండను మొగల్‌ సామ్రాజ్యంలో కలిపిన చక్రవర్తి ఎవరు?

1) షాజహాన్‌     2) ఔరంగజేబు    3) జహంగీర్‌     4) అక్బర్‌


22. కిందివాటిలో మన్సబ్‌దారుల విధి కానిది?

1) చక్రవర్తి భవంతిని కాపాడటం    2) ఒక ప్రాంతాన్ని పరిపాలించడం

3) తిరుగుబాట్లను అణచివేయడం     4) రాజప్రసాదంలో మత సంస్కరణ చేయడం


23. సున్నీ, షియా అనే శాఖలు ఏ మతానికి చెందినవి?

1) ఇస్లాం  2) హిందూ  3) క్రైస్తవం  4) సిక్కు


24. మన్సబ్‌దార్లు తమ జీతాలను పొందే విధానం?

1) జాగీర్ల ద్వారా వచ్చే ఆదాయం నుంచి      2) చక్రవర్తి ప్రత్యక్షంగా చెల్లించేవాడు

3) జమీందార్లు చెల్లించేవారు     4) ఆర్థికశాఖ మంత్రి స్వయంగా చెల్లించేవాడు


25. రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొదటి మొగల్‌ చక్రవర్తి?

1) జహంగీర్‌     2) షాజహాన్‌ 

3) అక్బర్‌     4) ఔరంగజేబు


26. సూర్‌ వంశ స్థాపకుడు-

1) సికిందర్‌ సూర్‌     2) షేర్షా సూర్‌ 

3) ఇస్లామ్‌షా సూర్‌     4) ఎవరూకాదు


27. సర్వాయి పాపన్న రాజధాని ప్రాంతం?

1) తోరణకోట     2) ఖిలాషాపుర్‌ 

3) భువనగిరి     4) తాటికొండ


28. ఔరంగజేబు మరణించిన సంవత్సరం-

1) 1707   2) 1762   3) 1506  4) 1605


29. కిందివారిలో ఏడో నిజాంను గుర్తించండి.

1) మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌    2) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

3) నిజాం-ఉల్‌-ముల్క్‌     4) నిజామ్‌ అలీఖాన్‌


30. సర్దార్‌ సర్వాయి పాపన్నను అణచివేయమని ఆదేశాలిచ్చిన మొగల్‌ చక్రవర్తి ఎవరు?

1) జహంగీర్‌     2) అక్బర్‌    3) ఔరంగజేబు     4) హుమాయున్‌


31. కిందివాటిలో అక్బర్‌ పాలించిన ప్రాంతాల్లో లేనిది?

1) అంబర్‌     2) మాల్వా    3) అహ్మద్‌ నగర్‌     4) గోల్కొండ


32. ఫతేపుర్‌ సిక్రీ నగర నిర్మాత ఎవరు?

1) అక్బర్‌     2) బాబర్‌    3) హుమాయున్‌     4) షాజహాన్‌


33. అక్బర్‌ మరణించిన సంవత్సరం?

1) 1556    2) 1605    3) 1656    4) 1526


34. ఏ మొగల్‌ చక్రవర్తి పాలనా కాలంలో మొగల్‌ పాలన కనుమరుగై సూర్‌ వంశ పాలన ప్రారంభమైంది?

1) అక్బర్‌     2) హుమాయున్‌    3) జహంగీర్‌     4) ఔరంగజేబు


35. హల్దీఘాట్‌ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?

1) అక్బర్, రాణాప్రతాప్‌     2) అక్బర్, హేమురాజ్‌    3) బాబర్, ఇబ్రహీంలోడి    4) బాబర్, రాణాసంగ


36. బాబర్‌ కాబూల్‌ను ఆక్రమించిన సంవత్సరం?

1) 1504    2) 1502    3) 1526    4) 1540


37. కింది మొగల్‌ చక్రవర్తుల్లో అతి తక్కువ వయసులో పరిపాలనకు వచ్చిన వ్యక్తి?

1) బాబర్‌     2) అక్బర్‌     3) జహంగీర్‌     4) ఔరంగజేబు


38. ఔరంగజేబు పాలనాకాలంలో ఏ ప్రాంతంలో తిరుగుబాటు వచ్చింది?

1) అస్సాం     2) పంజాబ్‌    3) దక్కన్‌     4) పైవన్నీ 


39. అక్బర్‌ భార్య జోధాబాయి ఏ ప్రాంతరాజకుమారి?

1) అంబర్‌  2) మేవాడ్‌  3) సింధ్‌   4) శ్రీలంక


40. అక్బర్‌ స్థాపించిన కొత్త మతం పేరు?

1) సుల్హ్‌ - ఇ - కుల్‌     2) దీన్‌ - ఇ - ఇలాహి

3) జొరాష్ట్రియన్‌     4) జిల్‌ - ఎ - ఇలాహి

41. మన్సబ్‌దార్ల సంఖ్యను ఎక్కువగా పెంచిన మొగల్‌ చక్రవర్తి?    

1) ఔరంగజేబు     2) షాజహాన్‌    3) జహంగీర్‌     4) అక్బర్‌


42. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

1) సాధారణంగా మన్సబ్‌దార్‌ వంశపారంపర్యంగా నియమితులయ్యేవారు.

2) జమీందారులు మొగల్‌ కాలంలో వంశపారంపర్యంగా బాధ్యతలు పొందేవారు.

3) చక్రవర్తి నియమించిన అధికారులు జాగీర్‌ పరిపాలన చూసేవారు.

4) మొగల్‌ కాలంలో జాగీర్‌లు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేవి.


43. సర్దార్‌ సర్వాయి పాపన్నను శిరచ్ఛేదనం చేసిన సంవత్సరం?

1) 1707   2) 1708   3) 1712  4) 1720


44. చివరి దిల్లీ సుల్తాన్‌గా పేరొందినవారు- 

1) ఇబ్రహీం లోడి    2) సికిందర్‌ లోడి

3) హేమురాజ్‌    4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


45. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన నిజాం?

1) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌     2) మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌

3) నిజామ్‌ అలీఖాన్‌     4) సికిందర్‌ జా



46. కింది మొగల్‌ చక్రవర్తుల్లో నిరక్షరాస్యుడు ఎవరు?

1) అక్బర్‌      2) బాబర్‌    3) హుమాయున్‌     4)జహంగీర్‌


47. బాబర్‌ చేసిన యుద్ధాల్లో అత్యంత క్లిష్టమైంది?

1) మొదటి పానిపట్టు యుద్ధం   2) కాణ్వా యుద్ధం

3) గోగ్రా యుద్ధం    4) హల్దీఘాట్‌ యుద్ధం


48. కిందివారిలో చివరి మొగల్‌ చక్రవర్తి?

1) ఔరంగజేబు           2) మొదటి బహదూర్‌షా

3) జహందర్‌ షా        4) రెండో బహదూర్‌షా 


49. కిందివారిలో గెరిల్లా యుద్ధంలో గొప్ప నిపుణులను గుర్తించండి.

1) ఛత్రపతి శివాజీ    2) సర్దార్‌ సర్వాయి పాపన్న

3) ఔరంగజేబు        4) 1, 2


50. సాలార్‌జంగ్‌ నిజాం రాజుల వద్ద దివాన్‌గా పని చేసిన కాలం?

1) 1853-1883     2) 1870-1890  

3) 1920-1940     4) 1820-1850



సమాధానాలు

1-2; 2-4; 3-2; 4-3; 5-1; 6-4; 7-1; 8-4; 9-2; 10-3; 11-1; 12-4; 13-3; 14-1; 15-1; 16-3; 17-4; 18-3; 19-4; 20-1; 21-2; 22-4; 23-1; 24-1; 25-3; 26-2; 27-2; 28-1; 29-2; 30-3; 31-4; 32-1; 33-2; 34-2; 35-1; 36-1; 37-2; 38-4; 39-1; 40-2; 41-1; 42-1; 43-3; 44-1; 45-1; 46-1, 47-2, 48-4, 49-4, 50-1.


 

రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 


 

Posted Date : 30-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.