• facebook
  • whatsapp
  • telegram

ఏకశిల నగరులో.. తుంగభద్ర తీరంలో! 

కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు

తెలుగు జాతిని ఏకం చేసి, ఘనమైన పరిపాలనతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన కాకతీయులు, విజయనగర రాజులు చరిత్రలో శాశ్వత కీర్తిని సంపాదించుకున్నారు. సాగునీటి వనరులను పెంచి, సువిశాల ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజాక్షేమం కోసం పాటుపడిన గొప్ప పాలకులుగా నిలిచారు. కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించారు. అద్భుత కట్టడాలెన్నింటినో నిర్మించారు. ఈ రెండు సామ్రాజ్యాల భౌగోళిక పరిధి, కేంద్ర స్థానాలు, పాలనా విధానాలు, పన్నుల వ్యవస్థ గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.  ఆ కాలాల్లో ప్రసిద్ధ పాలకులు, కవులు, వారి గొప్పతనం, రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయల అసమాన శక్తిసామర్థ్యాలతో పాటు ఉజ్జ్వలంగా వెలిగిన వారి సామ్రాజ్యాలు అంతరించడానికి కారణాలపై అవగాహన పెంచుకోవాలి.


1.     ‘క్రీడాభిరామం’ గ్రంథ రచయిత- 

1) ఏకామ్రనాథుడు            2) రుద్రదేవుడు

3) వినుకొండ వల్లభరాయుడు  4) విద్యానాథుడు


2.     కిందివారిలో ‘ఆంధ్ర రాజులు’ అని ఎవరిని పిలిచారు?

1) విష్ణుకుండినులు     2) కాకతీయులు

3) విజయనగర రాజులు     4) రాష్ట్రకూటులు


3.     కిందివారిలో కాకతీయుల చివరి పాలకుడు?

1) గణపతిదేవుడు      2) మొదటి ప్రతాపరుద్రుడు

3) మొదటి బేతరాజు            4) రెండో ప్రతాపరుద్రుడు


4.     ‘ఏకశిలానగరం’గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం?

1) అనుమకొండ     2) ఓరుగల్లు

3) పాలంపేట     4) కరీంనగర్‌


5. రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు?

1) మార్కోపోలో     2) అబ్దుల్‌ రజాక్‌

3) నికోలో కాంటి     4) ఇబన్‌ బటూటా


6.     రాణి రుద్రమదేవి ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించింది?

1) గోన గన్నారెడ్డి     2) చాళుక్య వీరభద్ర

3) మహాదేవుడు     4) కాయస్థ అంబదేవుడు


7.     ‘చందుపట్ల’ అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?

1) నల్గొండ     2) ఖమ్మం

3) కరీంనగర్‌     4) ఆదిలాబాద్‌


8.     నాయంకర విధానం ఎవరి కాలానికి చెందింది?

1) కాకతీయులు   2) విజయనగర సామ్రాజ్యం

3) బహమనీ సామ్రాజ్యం     4) 1, 2


9.     బొల్లి నాయకుడు క్రీ.శ.1270లో జారీ చేసిన   శాసనంలో రుద్రమదేవిని ఏ విధంగా పేర్కొన్నారు?

1) రుద్రమాంబ           2) రాయగజకేసరి

3) రుద్రదేవ మహారాజు     4) రుద్రమదేవి


10. ‘మోటుపల్లి అభయ శాసనం’ జారీ చేసిన రాజు ఎవరు? 

1) గణపతి దేవుడు  2) రుద్ర దేవుడు

3) మహాదేవుడు    4) రెండో ప్రతాపరుద్రుడు 


11. కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ         2) ఫిరోజ్‌ షా తుగ్లక్‌ 

3) నసీరుద్దీన్‌ మహ్మద్‌     4) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 


12. ‘పల్నాటి వీరుల చరిత్ర’ను ఎవరు రచించారు? 

1) బమ్మెర పోతన    2) ఆతుకూరి మొల్ల

3) శ్రీనాథుడు            4) డిండిమ భట్టు


13. కాకతీయుల కాలంలో అహిత గజకేసరి అనేది ఒక? 

1) బంగారు నాణెం        2) వెండి నాణెం

3) రాగి నాణెం           4) ఏదీకాదు 


14. కింది కాకతీయ రాజుల్లో అత్యధిక కాలం పరిపాలించినవారు?

1) మహాదేవుడు        2) బేతరాజు 

3) గణపతిదేవుడు        4) రుద్రమదేవి 


15. కింది ఏ శాసనం విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతుంది? 

1) అనుమకొండ శాసనం     2) విలస శాసనం 

3) మోటుపల్లి శాసనం       4) చందుపట్ల శాసనం 


16. కాకతీయుల మొదటి రాజధాని ఏది? 

1) అనుమకొండ       2) వరంగల్‌   

3) రేఖపల్లె        4) కొండవీడు

17. రుద్రమదేవిని ఏ ఢిల్లీ సుల్తాన్‌తో పోలుస్తారు? 

1) రజియా సుల్తానా        2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ 

3) ఝాన్సీ లక్ష్మీబాయి       4) గుల్‌బదన్‌ బేగం


18. ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే గ్రంథాన్ని రచించినవారు? 

1) వినుకొండ వల్లభరాయుడు 2) రేచర్ల రుద్రుడు 

3) ఏకామ్రనాథుడు      4) విద్యానాథుడు


19. వేయిస్తంభాల గుడిని నిర్మించింది ఎవరు? 

1) రుద్రదేవుడు         2) మహాదేవుడు 

3) ప్రోలరాజు    4) గణపతి దేవుడు 


20. ‘నృత్యరత్నావళి’ అనే గ్రంథాన్ని రచించినవారు ఎవరు? 

1) రేచర్ల రుద్రుడు        2) జయపసేనాని

3) ఏకామ్రనాథుడు        4) శ్రీనాథుడు


21. విద్యారణ్యస్వామి ఆశీస్సులతో స్థాపించిన రాజ్యం?

1) విజయనగర సామ్రాజ్యం  2) కాకతీయ రాజ్యం 

3) గోల్కొండ రాజ్యం      4) రెడ్డి రాజుల రాజ్యం


22. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం?

1) సాలువ  2) సంగమ 3) తులువ 4) అరవీటి


23. ‘అమరనాయంకర విధానం’ ఎవరి కాలంనాటిది?

1) కాకతీయులు    2) విజయనగర సామ్రాజ్యం 

3) ఢిల్లీ సుల్తానులు 4) రాష్ట్ర కూటులు


24. శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవారు?

1) సంగమ 2) సాలువ 3) తులువ 4) అరవీటి


25. తళ్లికోట యుద్ధం/ రక్కసి తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం?

1) 1526  2) 1565  3) 1614  4) 1580


26. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు, అతడి భార్యల విగ్రహాలు ఏ లోహంతో తయారయ్యాయి?

1) బంగారం  2) కాంస్యం  3) రాగి  4) వెండి    


27. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు?

1) గోదావరి     2) తుంగభద్ర 

3) యమునా     4) కృష్ణా 


28. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ప్రసిద్ధ గ్రంథం?

1) ఆముక్తమాల్యద     2) ఉషా పరిణయం 

3) జాంబవతీ కల్యాణం     4) పైవన్నీ


29. కిందివారిలో ‘అష్టదిగ్గజాలు’లో లేని వ్యక్తి ఎవరు?

1) రామరాజు భూషణుడు             2) మాదయగారి మల్లన 

3) మల్లిఖార్జున పండితుడు     4) తెనాలి రామకృష్ణుడు


30. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం ఏది?

1) సంగమ  2) సాలువ  3) తులువ 4) అరవీటి


31. కందుకూరి రుద్రకవి ఎవరి ఆస్థానానికి చెందినవారు?

1) హసన్‌ గంగూ     2) మహ్మద్‌ కులీ కుతుబ్ షా

3) ఇబ్రహీం కుతుబ్‌ షా     4) అబ్దుల్లా కుతుబ్‌ షా


32. పేరిణి అనే నాట్యం ఎవరి కాలంలో ప్రముఖ నాట్యంగా పేరుగాంచింది?

1) కాకతీయ రాజులు     2) విజయనగర రాజులు 

3) బహమనీ రాజులు     4) రెడ్డి రాజులు


33. దరిశనం, అప్పనం అనేవి..?

1) పన్నులు     2) నాణెలు 

3) రాజోద్యోగులు     4) రాజప్రసాదాలు


34. ఓరుగల్లు కోట నగర నిర్మాణాన్ని ప్రారంభించిన కాకతీయ పాలకుడు ఎవరు?

1) రుద్రదేవుడు     2) గణపతి దేవుడు

3) మహాదేవుడు     4) రుద్రమదేవి


35. కాకతీయ కళాతోరణం మీద కనిపించే పక్షి?

1) కోకిల   2) నెమలి   3) హంస  3) చిలుక


36. కాకతీయ వంశపాలన ముగిసిన సంవత్సరం?

1) 1320  2) 1346  3) 1332  4) 1323


37. కాకతీయులు ఆరాధించిన కాకతి ఎవరికి మరొక రూపం?

1) రేణుకాదేవి     2) కాళీమాత 

3) దుర్గాదేవి     4) లక్ష్మీదేవి


38. కింది రచనల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.

1) పాల్కురికి సోమనాథుడు - బసవ పురాణం

2) నన్నెచోడుడు - కుమార సంభవం

3) వల్లభరాయుడు - ప్రతాపరుద్రీయం

4) జయపసేనాని - నృత్యరత్నావళి


39. వేయిస్తంభాల ఆలయంలోని నంది విగ్రహాన్ని ఏ శిలతో నిర్మించారు?

1) డోలరైట్‌     2) కార్నీలియస్‌ 

3) గ్రానైట్‌     4) అమెథిస్ట్‌


40. రామప్ప దేవాలయం నిర్మించిన వ్యక్తి ఎవరు?

1) జయపసేనాని     2) రుద్రదేవుడు

3) రేచర్ల రుద్రుడు     4) ప్రోలరాజు


41. అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు ఎవరు?

1) కాళిదాసు             2) అల్లసాని పెద్దన

3) తెనాలి రామకృష్ణుడు     4) నంది తిమ్మన్న


42. అబ్దుల్‌ రజాక్‌ అనే పర్షియన్‌ యాత్రికుడు ఏ రాజు కాలంలో విజయ నగరం సామ్రాజ్యాన్ని సందర్శించాడు?

1) హరిహరరాయలు     2) శ్రీకృష్ణదేవరాయలు

3) అచ్యుతరాయలు     4) రెండో దేవరాయలు


43. విజయనగర రాజుల్లో ప్రసిద్ధి చెందిన రాజు?

1) రెండో దేవరాయలు     2) శ్రీకృష్ణదేవరాయలు

3) అళియరామరాయలు         4) రెండో వేంకటపతిరాయలు


44. విజయనగర రాజుల కాలంలోని అమరనాయంకర విధానానికి సంబంధించి సరికానిది ఏది?

1) వీరు కోటలను, సాయుధ దళాలను నియంత్రిస్తారు.

2) అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు.

3) అమర నాయకులను తరచుగా బదిలీలు చేస్తుంటారు.

4) పైవన్నీ


45. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు?

1) హరిహర రాయలు     2) బుక్కరాయలు

3) రెండో దేవరాయలు     4) 1, 2


46. కిందివారిలో ఎవరిని ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అంటారు?

1) అల్లసాని పెద్దన     2) పింగళి సూరన

3) తెనాలి రామకృష్ణుడు     4) అన్నమాచార్యులు


47. ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అని తెలిపిన వ్యక్తి ఎవరు?

1) రెండో చంద్రగుప్త  2) రెండో ప్రతాపరుద్రుడు

3) శ్రీకృష్ణదేవరాయలు 4) గణపతి దేవుడు


48. కింది ఏ రాజ్యం ఫిరంగి దళాన్ని తమ సైన్యంలో కలిగి ఉంది?

1) విజయనగర సామ్రాజ్యం     2) కాకతీయ రాజ్యం

3) రాష్ట్రకూట రాజ్యం 4) పశ్చిమ చాళుక్య రాజ్యం


49. తమిళ కవయిత్రి ఆండాల్‌ గురించి తెలియజేసే రచన కిందివాటిలో ఏది?

1) ఉషాపరిణయం         2) జాంబవతి కల్యాణం

3) ఆముక్తమాల్యద         4) పైవన్నీ


50. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తులను గుర్తించండి.

1) అబ్దుల్‌ రజాక్‌    2) డొమింగోఫేస్‌

3) డువార్టే బార్బోసా    4) 2, 3


సమాధానాలు


1-3, 2-2; 3-4; 4-2; 5-1; 6-4; 7-1; 8-1; 9-3; 10-1; 11-4; 12-3; 13-1; 14-3; 15-3; 16-1; 17-1; 18-4; 19-1; 20-2; 21-1; 22-2; 23-2; 24-3; 25-2; 26-2; 27-2; 28-4; 29-3; 30-2; 31-3; 32-1; 33-1; 34-1; 35-3; 36-4; 37-3; 38-3; 39-1; 40-3; 41-2; 42-4; 43-2; 44-3; 45-4; 46-1; 47-3; 48-1; 49-3; 50-4.


 


 

రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 
 

Posted Date : 17-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.