• facebook
  • whatsapp
  • telegram

మొహంజోదారోలో గడ్డం పురోహితుడు!

ప్రాచీన కాలంలో మతం, లిపి, శిల్పం, కట్టడాలు

భారత ఉపఖండం నాగరికతకు పుట్టినిల్లు మాత్రమే కాదు. అనాది కాలంలోనే భాష, మత, సాంస్కృతిక, సాంఘిక వికాసం జరిగిన కర్మభూమి కూడా. విశ్వ ఆవిర్భావం నుంచి తాత్విక అంశాల వరకు అనంత జ్ఞానాన్ని భారతీయ వేదాలు, ఉపనిషత్తులు ప్రాచీన కాలంలోనే వివరించాయి. నాడు నదీ తీరంలో అభివృద్ధి చెందిన పట్టణాల ఆనవాళ్లు, దేశమంతా విస్తరించిన కట్టడాల శిథిలాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఆసక్తితో పాటు విజ్ఞానాన్ని పంచే పురాతన భారతదేశ చరిత్రను, నాటి సమాజ గమనాన్ని పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. పురాణ ఇతిహాసాల్లోని ఆసక్తికర అంశాలు, ఇక్కడే ఉద్భవించిన మతాల బోధనలు, సూచించిన జీవన విధానాలపై అవగాహనతో ఉండాలి.


1.    కర్ణాటకలోని పశుపోషకులను ఏ పేరుతో పిలుస్తారు?

1) యాదవ  2) కురుబ  3) ధంగర్‌  4) గొల్ల


2.     అతిపురాతన ప్రదేశమైన ‘ముండిగావ్‌’ ఎక్కడ ఉంది?

1) భారతదేశం       2) అఫ్గానిస్థాన్‌   

3) బంగ్లాదేశ్‌       4) పాకిస్థాన్‌


3.     సింధు నాగరికతను ‘హరప్పా నాగరికత’ అనడానికి  కారణం?

1) హరప్పా పాకిస్థాన్‌లో ఉన్న ఒక ముఖ్య పట్టణం.

2) హరప్పా రావి నది ఒడ్డున ఉంది.

3) సింధు నది హరప్పాలో ప్రవహిస్తుంది.

4) సింధు నాగరికత తవ్వకాలు ప్రారంభించిన ప్రదేశం హరప్పా.


4.     ఏ ప్రదేశంలో సింధు ప్రజల కాలం నాటి గొప్ప స్నానవాటిక బయల్పడింది?

1) మొహంజోదారో       2) కాళీభంగన్‌   

3) లోథాల్‌       4) హరప్పా


5.     వేదాల్లో ప్రాచీనమైంది?

1) రుగ్వేదం       2) యజుర్వేదం   

3) సామవేదం       4) అధర్వణ వేదం


6.     కిందివారిలో ఆర్యుల యుద్ధ దేవుడు ఎవరు?

1) అగ్ని   2) సోమ   3) వరుణ   4) ఇంద్ర


7.     ప్రారంభంలో వేదాలు...........?

1) వేదాలను రచించారు.

2) వేదాలు గోడలు, గుహల మీద చిత్రరూపంలో చెక్కారు.

3) వేదాలు దేవుళ్లు మాత్రమే పఠించేవారు.

4) గురువు శిష్యులకు వేదాలను చెప్పేవారు.


8.     కింది ఏ మొక్కను అర్యులు ప్రధాన దైవంగా భావించారు?

1) సోమ  2) రావి  3) తులసి  4) ఏదీకాదు 


9.     హరప్పా ప్రజల ప్రధాన దైవం?

1) పశుపతి       2) అమ్మతల్లి   

3) విష్ణువు       4) రుద్రుడు


10. సింధు నాగరికత కాలంలో అమ్మతల్లి బొమ్మలు దేనితో చేశారు?

1) నల్లరాయి       2) కంచు, రాగి

3) కాల్చిన బంకమట్టి      4) తెల్లటి సున్నపురాయి


11. ‘రాక్షసగుళ్లు’ నిర్మాణం ఏ ప్రాంతంలో కనిపిస్తుంది?

1) దక్షిణ భారత్‌       2) ఈశాన్య భారత్‌   

3) కశ్మీర్‌ ప్రాంతం       4) పైవన్నీ


12. జనపదాలు ఏ నదీ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి?

1) గంగా      2) సింధు  

3) గోదావరి       4) కావేరి


13. నచికేతుడు-యముడి సంభాషణ మనకు కనిపించే ఉపనిషత్తు ఏది?

1) ఈశోపనిషత్తు       2) బృహదారణ్యకోపనిషత్తు   

3) కఠోపనిషత్తు           4) మాండ్యుకోపనిషత్తు


14. ఉపనిషత్తులు దేని గురించి చెప్పాయి?

1) కర్మకాండలు       2) యజ్ఞ యాగాలు   

3) తాత్విక విషయాలు       4) ప్రార్థనా శ్లోకాలు


15. కిందివారిలో పరివ్రాజకులను గుర్తించండి.

1) గౌతమబుద్ధుడు    2) వర్ధమాన మహావీరుడు   

3) మక్కలి గోసల     4) పైవారందరూ


16. ‘జినుడు’ అంటే అర్థం?

1) అత్యున్నత రాజనీతిజ్ఞుడు       2) గొప్ప మేధస్సుగలవాడు

3) కోరికలు కలిగినవాడు     4) కోరికలను జయించినవాడు


17. వర్ధమాన మహావీరుడు స్థాపించిన మతం?

1) బౌద్ధమతం       2) జైనమతం   

3) అజీవక మతం       4) చార్వాక మతం


18. బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ఏమంటారు?

1) అష్టాంగ మార్గాలు       2) ఆర్య సత్యాలు   

3) త్రిపీఠకాలు       4) ద్వాదశ అంగాలు


19. కిందివాటిలో ‘మధ్యేమార్గం’ను అనుసరించాలని చెప్పిన మతం?

1) బౌద్ధమతం       2) జైనమతం   

3) అజీవక మతం       4) పైవన్నీ


20. జైనమతం, బౌద్ధమతం స్థాపకులైన వ్యక్తులు ఏ వర్ణానికి చెందినవారు?

1) బ్రాహ్మణులు       2) క్షత్రియులు   

3) వైశ్యులు       4) శూద్రులు


21. సుత్త, వినయ, అభిదమ్మ అనేవి?

1) బౌద్ధ గ్రంథాలు       2) జైన గ్రంథాలు   

3) హిందూ గ్రంథాలు       4) అజీవకమత గ్రంథాలు


22. సింధు ప్రజల లిపి ఏది?

1) హోరియోగ్లైఫిక్‌       2) మాండరిన్‌   

3) ఫిక్టోగ్రఫి       4) దేవనాగరి


23. వేదాలు ఏ భాషలో రచించారు?

1) సంస్కృతం       2) హిందీ   

3) తమిళం       4) ఉర్దూ


24. విశ్వ ఆవిర్భావం గురించి ప్రస్తావించిన మొదటి వేదం?

1) రుగ్వేదం       2) యజుర్వేదం   

3) సామవేదం       4) అధర్వణ వేదం


25. ‘బుద్ధచరితం’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?

1) పతంజలి       2) అశ్వఘోష   

3) ఆర్యభట్ట       4) వసుమిత్రుడు


26. ‘కిసాగోతమి కథ’ ఏ మతానికి చెందింది?

1) బౌద్ధం      2) జైనం  

3) అజీవకం     4) చార్వాకం


27. కిసాగోతమి కథ ప్రధాన అర్థం?

1) కష్టం లేనిదే ఫలితం ఉండదు.       2) ఆత్మ చాలా పవిత్రమైంది.

3) మరణం లేని జీవి ఉండదు.       4) కోరికలు ఉండకూడదు.


28. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం?

1) సారనాథ్‌  2) వైశాలి  3) గయ  4) మల్ల


29. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం?

1) రామాయణం       2) మహాభారతం   

3) జెండ్‌ అవెస్థా       4) ఏదీకాదు


30. బుద్ధుడి జన్మ వృత్తాంతాలను తెలియజేసేది?

1) బుద్ధచరితం        2) త్రిపీఠకాలు   

3) జాతక కథలు       4) ద్వాదశ అంగాలు


31. ‘చరకసంహిత’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) చరకుడు       2) శుశ్రుతుడు   

3) నాగార్జునుడు       4) పతంజలి


32. ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) అల్లసాని పెద్దన       2) కాళిదాసు   

3) పతంజలి       4) తిక్కన


33. ‘అమరకోశం’ గ్రంథం దేనికి సంబంధించింది?

1) కావ్యం       2) నాటకం       

3) నిఘంటువు       4) వ్యాకరణం


34. ‘అమరసింహుడు’ అనే సంస్కృత నిఘంటువు కర్త ఏ రాజు ఆస్థానానికి చెందినవాడు?

1) సముద్రగుప్తుడు      2) రెండో పులకేశి  

3) శ్రీకృష్ణ దేవరాయలు     4) రెండో చంద్రగుప్తుడు


35. మహాభారతాన్ని ఏ విధంగా కూడా పిలుస్తారు?

1) జయసంహితం      2) శతసహస్ర సంహిత  

3) పంచమ వేదం      4) పైవన్నీ


36. గడ్డం ఉన్న పురోహితుడి విగ్రహం లభించిన సింధు నాగరికత ప్రాంతం ఏది?

1) మొహంజోదారో      2) కాళీభంగన్‌  

3) లోథాల్‌      4) రూపార్‌


37. సింధు నాగరికతకు చెందిన నాట్య బాలిక విగ్రహం ఏ లోహంతో చేశారు?

1) కాంస్యం      2) ఇనుము  

3) రాగి       4) వెండి


38. కిందివాటిలో హరప్పా సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభించని ప్రాంతం? 

1) గుజరాత్‌      2) బెలుచిస్థాన్‌  

3) రాజస్థాన్‌      4) కర్ణాటక


39. సింధు ప్రజల నౌకాశ్రయం ఏది?

1) లోథాల్‌      2) కాళీభంగన్‌  

3) హరప్పా      4) చాన్హుదారో


40. మొహంజోదారోలోని మహాస్నానవాటిక కొలతలు ఏవి?

1) 11.8 మీ. × 9 మీ.       2) 11.5 మీ. × 19 మీ.   

3) 11.8 మీ. × 7 మీ.  4) 10 మీ. × 7 మీ.


41. సింధు నాగరికత సంస్కృతిలో భాగమైన ‘దైమాబాద్‌’ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర      2) గుజరాత్‌   

3) హరియాణా      4) ఉత్తర్‌ ప్రదేశ్‌


42. కిందివాటిలో సింధు నాగరికత ముఖ్య లక్షణం?

1) పట్టణ నాగరికతను కలిగి ఉండటం.            2) మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండటం.

3) సువిశాల రహదార్లు నిర్మించి ఉండటం.     4) పైవన్నీ


43. కింది కవులను వారి రచనలతో జతపరచండి.

1) మృచ్ఛకటికం     ఎ) పాణిని

2) అమరకోశం     బి) శూద్రకుడు

3) అష్టాధ్యాయి     సి) అశ్వఘోషుడు

4) బుద్ధచరిత్ర     డి) అమర సింహుడు

1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి   2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి    4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ


44. నవరత్నాల్లో అగ్రగణ్యుడు ఎవరు?

1) అల్లసాని పెద్దన     2) కాళిదాసు 

3) పతంజలి     4) పాణిని


45. రామాయణ, మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రచించినవారు? 

1) పొన్నకవి     2) బాసకవి 

3) పాణిని     4) కాళిదాసు


46. శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఏ ఇతిహాసంలో కనిపిస్తుంది?

1) రామాయణం     2) మహాభారతం 

3) జెండ్‌ అవెస్థా     4) సావిత్రి


47. సంగమ సాహిత్యం ఏ ప్రాంతానికి సంబంధించింది?

1) తమిళ  2) తెలుగు      3) కన్నడ      4) హిందీ


48. ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) ఆర్యభట్ట   2) వరాహామిహిర 

3) శుశ్రుతుడు  4) శంఖుడు


49. కిందివాటిలో ‘ఆదికావ్యం’ అని దేన్ని పిలుస్తారు?

1) మహాభారతం     2) అభిజ్ఞాన శాంకుతలం 

3) రామాయణం     4) అగట్టీయం


50. ‘నాసదీయ సూక్త’ అనేది ఏ వేదంలో భాగం?

1) రుగ్వేదం     2) యజుర్వేదం 

3) సామ వేదం     4) అధర్వణ వేదం

సమాధానాలు


1-2, 2-2; 3-4; 4-1; 5-1; 6-4; 7-4; 8-1; 9-2; 10-3; 11-4; 12-1; 13-3; 14-3; 15-4; 16-4; 17-2; 18-3; 19-1; 20-2; 21-1; 22-3; 23-1; 24-1; 25-2; 26-1; 27-3; 28-3; 29-2; 30-3; 31-1; 32-2; 33-3; 34-4; 35-4; 36-1; 37-1; 38-4; 39-1; 40-3; 41-1; 42-4; 43-2; 44-2; 45-2; 46-2; 47-1; 48-1; 49-3; 50-1


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 01-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.