• facebook
  • whatsapp
  • telegram

గుప్త సామ్రాజ్యం

సాటిలేని మేటివీరుడు కవిరాజు!

 సామ్రాజ్యంలో విస్తృత ప్రగతిని సాధించి, స్వర్ణయుగంగా చరిత్రలో నిలిచిపోయింది గుప్తుల కాలం. చక్కటి పాలనతోపాటు కళలు, శాస్త్రాల అభివృద్ధిలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. గొప్ప పాలకులతో పాటు, ప్రసిద్ధ కవులు, శాస్త్రవేత్తలు ఏకకాలంలో అప్పట్లో ఆవిర్భవించారు. సాంస్కృతిక, వాణిజ్య, రాజకీయ పాలన శిఖర స్థాయికి చేరింది. గుప్తుల పాలనా విధానాలు, రాజుల గొప్పదనాలు, రాజ్యవిస్తరణ తీరు, చేసిన యుద్ధాలు, వేసిన శాసనాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. నాటి ప్రసిద్ధ రచనలు, అందులోని ఇతివృత్తాలు, రచయితల ప్రత్యేకతలను తెలుసుకోవాలి.
 

1.    మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసిన రాజు?

1) సముద్రగుప్తుడు         2) రెండో చంద్రగుప్తుడు  3) మొదటి చంద్రగుప్తుడు    4) కుమారగుప్తుడు


2.     కిందివారిలో ‘నవరత్నాలు’లో భాగం కానివారు- 

1) కాళిదాసు      2) అమరసింహుడు  

3) వరాహమిహిరుడు      4) ఆర్యభట్ట 


3.     ‘ఇండియన్‌ నెపోలియన్‌’ అని ఎవరిని పిలుస్తారు?

1) సముద్రగుప్తుడు      2) కుమారగుప్తుడు  

3) రెండో చంద్రగుప్తుడు     4) స్కంధ గుప్తుడు


4.     భారతదేశంలో అంటరానితనం గురించి తెలియజేసిన విదేశీయుడు ఎవరు?

1) మెగస్తనీస్‌     2) హుయాన్‌ త్సాంగ్‌ 

3) ఇత్సింగ్‌     4) ఫాహియాన్‌ 


5.     ‘అభిజ్ఞాన శాకుంతలం’ గ్రంథ రచయిత ఎవరు?

1) కాళిదాసు      2) అమరసింహుడు  

3) విశాఖదత్త     4) వరరుచి


6.     మగధను పరిపాలించిన వైశ్య వర్గం ఏది?

1) మౌర్యులు      2) గుప్తులు  

3) కుషాణులు      4) శాతవాహనులు 


7.     సతీసహగమనం గురించి పేర్కొన్న మొదటి శాసనం?

1) మెహ్రౌలి శాసనం     2) జునాగఢ్‌ శాసనం 

3) ఎరాన్‌ శాసనం     4) అలహాబాదు శాసనం


8.     కిందివారిలో ‘కవిరాజు’ అనే బిరుదు ఎవరిది?

1) సముద్ర గుప్తుడు     2) నరసింహ గుప్తుడు  

3) రెండో చంద్రగుప్తుడు     4) శ్రీ గుప్తుడు 


9.     ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసిన మహిళ ఎవరు?

1) రుద్రమదేవి     2) రజియా సుల్తాన్‌ 

3) ప్రభావతి గుప్త     4) వసంత సేన


10. కిందివాటిని జతపరచండి.

ఎ) మాళవికాగ్నిమిత్రం      1) వరాహమిహిరుడు 

బి) బృహత్‌ సంహిత       2) అమరసింహుడు 

సి) అమరకోశం          3) కాళిదాసు

డి) నీతిసారం           4) కమాండకుడు

1) ఎ-3, బి-1, సి-2, డి-4    2) ఎ-3, బి-4, సి-1, డి-2

3) ఎ-3, బి-1, సి-4, డి-2    4) ఎ-1, బి-2, సి-3, డి-4


11. అలహాబాదు స్తంభ శాసనాన్ని రచించింది ఎవరు?

1) అమరక దేవుడు     2) యతి వృషభుడు 

3) హరిసేనుడు      4) రవికీర్తి


12. సముద్ర గుప్తుడిని చేతిలో ఓడిపోయిన కంచి రాజు ఎవరు?

1) హస్థి వర్మ     2) మహేంద్రుడు  

3) విష్ణుగోప     4) ఉగ్రసేన


13. అమరసింహుని ‘అమర కోశం’ దేనికి సంబంధించింది?

1) ఈ గ్రంథం రాజుల విజయాలను వివరిస్తుంది    2) ఈ గ్రంథం ఒక ప్రేమ కావ్యం

3) ఇదొక వ్యాకరణ గ్రంథం    4) ఇదొక నిఘంటువు


14. మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం?

1) క్రీ.శ.300      2) క్రీ.శ.320  

3) క్రీ.పూ.320      4) క్రీ.పూ.400


15. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు?

1) కుమార గుప్తుడు     2) స్కంధ గుప్తుడు  

3) రెండో చంద్రగుప్తుడు      4) భాను గుప్తుడు


16. ‘ఇండియన్‌ మాకియవెల్లి’ అని ఎవరిని పిలుస్తారు?

1) కౌటిల్యుడు      2) విశాఖదత్త 

3) మెగస్తనీస్‌      4) స్ట్రాబో


17. కిందివారిలో ఒకరి దాడి గుప్త సామ్రాజ్య పతనానికి కారణం?

1) శకులు     2) కణ్వలు 

3) కుషాణులు     4) హూణులు


18. కిందివారిలో ‘శకారి’ అని ఎవరిని పిలుస్తారు?

1) మొదటి చంద్రగుప్తుడు     2) రెండో చంద్రగుప్తుడు 

3) స్కంధ గుప్తుడు     4) నరసింహ గుప్తుడు


19. కాళిదాసు రచనల్లో తొలి రాయబార కావ్యం ఏది?

1) కుమార సంభవం     2) రుతు సంహారం 

3) మేఘదూతం     4) రఘువంశం


20. కిందివారిలో మ్లేచ్చులను ఓడించినట్లు తెలిపే స్కందగుప్తుని శాసనం ఏది? 

1) జునాగఢ్‌ శాసనం     2) ఎరాన్‌ శాసనం 

3) మాండసోర్‌ శాసనం     4) మెహ్రౌలి శాసనం 


21. సముద్రగుప్తుడిని సాటి లేని మేటివీరుడు అన్న చరిత్రకారుడు ఎవరు?

1) వి.ఎ.స్మిత్‌     2) మజుందార్‌ 

3) ఆర్‌.ఎస్‌.శర్మ     4) రాయ్‌చౌదరి


22. గుప్త శకాన్ని ప్రారంభించింది ఎవరు?

1) మొదటి చంద్రగుప్తుడు     2) సముద్ర గుప్తుడు 

3) కుమార గుప్తుడు     4) స్కంధ గుప్తుడు 


23. ప్రాచీన చరిత్రలో రత్నసాగర, రత్న రంజన అనేవి?

1) గ్రంథాలయం     2) విద్యాలయం 

3) కోశాగారం     4) న్యాయస్థానం


24. కిందివాటిలో సరికానిది?

1) గుప్తుల్లో తొలి స్వతంత్ర రాజు మొదటి చంద్ర గుప్తుడు    2) ఓటమి ఎరుగని వీరుడు సముద్ర గుప్తుడు  

3) హూణులను ఓడించింది కుమార గుప్తుడు 4) రెండో చంద్రగుప్తుడి కాలం ‘స్వర్ణయుగం’


25. కిందివాటిలో ఒకటి సముద్రగుప్తుడి నాణెం కాదు?

1) వీణ వాయిస్తున్నట్లుండే నాణెం 2) అశ్వమేథ ప్రతిమ ఉన్న నాణెం 

3) గండ్రగొడ్డలి ప్రతిమ ఉన్న నాణెం   4) గరుత్మంతుడి ప్రతిమ ఉన్న నాణెం


26. ‘మహారాజాధిరాజ‘ అనే బిరుదు పొందిన మొదటి గుప్తరాజు?

1) కుమార గుప్తుడు    2) రెండో చంద్రగుప్తుడు     3) మొదటి చంద్రగుప్తుడు     4) స్కంధ గుప్తుడు 


27. గుప్తరాజ వంశ స్థాపకుడు?

1) శ్రీ గుప్తుడు     2) శ్రీముఖుడు 

3) చంద్ర గుప్తుడు     4) స్కంధ గుప్తుడు


28. కిందివారిలో ఎవరిని ‘లిచ్చావీ-దౌహిత్ర’ అని పిలిచారు?

1) కుమార గుప్తుడు  2) మొదటి చంద్ర గుప్తుడు 

3) రెండో చంద్ర గుప్తుడు     4) సముద్ర గుప్తుడు


29. కిందివారిలో సముద్ర గుప్తుడి కాలంలో కంచి పాలకుడు ఎవరు?

1) హస్థివర్మన్‌     2) విష్ణుగోపుడు 

3) మహేంద్రుడు     4) ఉగ్రసేనుడు


30. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్త రాజు? 

1) రెండో చంద్ర గుప్తుడు     2) నరసింహ గుప్తుడు 

3) సముద్ర గుప్తుడు     4) శ్రీ గుప్తుడు


31. ఏ రాజ్యాల విషయంలో సముద్ర గుప్తుడు ‘గ్రహణం - మోక్షం - అనుగ్రహం’ అనే విధానం పాటించాడు?

1) ఆర్యవర్తన రాజ్యాలు  2) దక్షిణ భారత రాజ్యాలు 

3) సరిహద్దు రాజ్యాలు  4) పశ్చిమ భారత రాజ్యాలు 


32. ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల ప్రకారం సముద్ర గుప్తుడి అనంతరం పాలకుడు?

1) రెండో చంద్ర గుప్తుడు     2) కచ గుప్తుడు 

3) రామ గుప్తుడు     4) కుమార గుప్తుడు


33. కిందివారిలో రెండో చంద్ర గుప్తుడి భార్య ఎవరు?

1) ద్రువాదేవి     2) కుభేర నాగ 

3) ప్రభావతి గుప్త     4) 1, 2 


34. ఫో-కువో-కి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?

1) ఫాహియాన్‌     2) హుయాన్‌ త్సాంగ్‌ 

3) ఇత్సింగ్‌     4) మెగస్తనీస్‌


35. సముద్ర గుప్తుడు 9 మంది రాజుల కూటమిని ఏ యుద్ధంలో ఓడించాడు?

1) పానిపట్టు యుద్ధం     2) కౌశాంబి యుద్ధం 

3) కళింగ యుద్ధం     4) నర్మదానది యుద్ధం


36. ఫాహియాన్‌ భారత్‌లోని ఏ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించాడు?

1) తక్షశిల     2) నలంద 

3) విక్రమశిల     4) బెనారస్‌


37. కిందివాటిలో అలహాబాదు శాసనానికి సంబంధించి సరికానిది ఏది?

1) దీనిని హరిసేనుడు వేశాడు

2) ఈ శాసనం సముద్రగుప్తుడిని భూమిపై నడయాడే దైవం అని పేర్కొంది

3) 100 యుద్ధాల వీరుడు అని పేర్కొంది    4) సింహవిక్రమ అని ప్రశంసించింది


38. అమరకదేవుడు, శబర వీరసేనుడు ఎవరి వద్ద మంత్రులు?

1) రెండో చంద్రగుప్తుడు 2) మొదటి చంద్ర గుప్తుడు 

3) విష్ణు గుప్తుడు     4) సముద్ర గుప్తుడు 


39. కిందివాటిలో ‘గుప్తుల అర్థశాస్త్రం’ అని దేన్ని పిలుస్తారు?

1) నీతిసారం     2) అమరకోశం 

3) బృహత్‌ సంహిత     4) కుమార సంభవం


40. ‘ఉజ్జయిని’ని రాజధానిగా పాలించిన గుప్త రాజు?

1) రెండో చంద్రగుప్తుడు     2) కుమార గుప్తుడు  

3) భాను గుప్తుడు     4) స్కంధ గుప్తుడు 


41. కిందివాటిలో ‘చిలికిట’ మహారాజు ఎవరు?

1) శ్రీ గుప్తుడు     2) ఘటోత్కచుడు 

3) భానుగుప్తుడు    4) బుద్ధగుప్తుడు 


42. కిందివాటిలో సరైన జత కానిది-

1) ముద్రారాక్షసం - విశాఖదత్తుడు     2) కథాసరిత్సాగరం - సోమదేవుడు 

3) కౌముది మహోత్సవం - శూద్రకుడు     4) చంద్ర వ్యాకరణం - చంద్రగోమిన్‌ 


43. కింది ఏ దాడిని స్కంధ గుప్తుడు ఎదుర్కొన్నాడు?

1) హూణులు     2) పుష్యమిత్రులు 

3) మ్లేచ్చులు     4) పై అందరూ 


44. సముద్ర గుప్తుడి సంగీత ప్రావీణ్యానికి ఆధారం?

1) సముద్రగుప్తుడి నాణెం     2) అలహాబాదు శాసనం

3) 1, 2     4) నాణెంతోపాటు ఎరాన్‌ శాసనం 


45. ‘ఇండియన్‌ షేక్‌స్ఫియర్‌’ అని ఎవరిని పిలుస్తారు? 

1) కాళిదాసు     2) అమరసింహుడు 

3) వరరుచి     4) ధన్వంతరి


46. గుప్తులు ఎవరికి సామంతులై ఉండొచ్చు?

1) శకులు 2) కుషాణులు 3) మౌర్యులు 4) పుష్యభూతి 


47. సతీసహగమనం గురించి చెప్పే మొదటి శాసనం?

1) అలహాబాదు శాసనం     2) ఎరాన్‌ శాసనం 

3) జునాగఢ్‌ శాసనం     4) ఐహోలు శాసనం 


48. ‘కలియుగ రాజవృత్తాంతం’ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?

1) విశాఖదత్తుడు     2) కాళిదాసు 

3) చంద్రగోమిన్‌     4) ఎవరూకాదు 


49. నెమలి గుర్తున్న నాణేలను ముద్రించిన గుప్త రాజు?

1) కుమార గుప్తుడు  2) రెండో చంద్రగుప్తుడు 

3) స్కంధ గుప్తుడు  4) మొదటి చంద్రగుప్తుడు 


50. కింది ఏ వివాహ సంబంధం గుప్త రాజ్య మలుపుగా చెప్పొచ్చు? 

1) లిచ్చావి సంబంధం      2) నాగవంశ సంబంధం 

3) వాకాటక సంబంధం     4) కదంబులతో సంబంధం సమాధానాలు


1-2; 2-4; 3-1; 4-4; 5-1; 6-2; 7-3; 8-1; 9-3; 10-1; 11-3; 12-3; 13-4; 14-2; 15-1; 16-1; 17-4; 18-2; 19-3; 20-1; 21-2; 22-1; 23-1; 24-3; 25-4; 26-3; 27-1; 28-4; 29-2; 30-1; 31-2; 32-3; 33-4; 34-1; 35-2; 36-1; 37-4; 38-1; 39-1; 40-1; 41-1; 42-3; 43-4; 44-3; 45-1; 46-2; 47-2; 48-4; 49-1; 50-1.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు  
 

Posted Date : 06-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.