• facebook
  • whatsapp
  • telegram

గాంధీయుగం

‘గాంధీయిజానికి మరణం లేదు’సామ్రాజ్యవాద శక్తులను శాంతియుత మార్గంలో జయించి, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ ప్రపంచ చరిత్రలోనే అరుదైన నాయకుడు. సత్యం, అహింసలే సిద్ధాంతాలుగా; సహాయ నిరాకరణ, సత్యాగ్రహాలే ఆయుధాలుగా భారత జాతినంతటినీ ఏకతాటిపై నిలిపి ఆయన చేసిన పోరాటం అపూర్వం. మితవాద, అతివాద, తీవ్రవాద పంథాలో సాగిన నాయకులకు సాధ్యంకాని విజయాలెన్నింటినో ఆయన సాధించారు. ఇరవయ్యో శతాబ్దంలో మానవాళిపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా నిలిచిపోయారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన ప్రవేశం నుంచి మరణం వరకు చోటుచేసుకున్న ప్రతి అంశంపైనా పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. గాంధీజీ చేసిన పోరాటాలు, నాయకుడిగా జాతిని నడిపించిన తీరు, తోటి జాతీయ నేతలు, కాంగ్రెస్‌ పార్టీ, బ్రిటిష్‌ పాలకులపై ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.
 

1. ఏ ఉద్దేశంతో ‘తిలక్‌ స్వరాజ్‌నిధి’ని మహాత్మాగాంధీ ప్రకటించారు?

1) బాలగంగాధర్‌ తిలక్‌ స్మారక నిర్మాణానికి

2) భారత స్వాతంత్య్ర సమరానికి సహాయానికి

3) ప్రపంచ యుద్ధంలో మరణించిన కుటుంబాలకు సహాయానికి

4) కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి


2. కిందివాటిలో ఏ పత్రికను గాంధీజీ నడపలేదు?

1) యుగాంతర్‌       2) నవజీవన్‌   

3) హరిజన్‌          4) ఇండియన్‌ ఒపీనియన్‌


3. రౌలత్‌ చట్టం చేయడానికి కారణం ఏమిటి?

1) జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల  

2) వార్తాపత్రికలను నియంత్రించడానికి

3) జాతీయ కాంగ్రెస్‌ను నియంత్రించడానికి

4) రాజ్యాంగ సంస్కరణల కోసం


4. కిందివాటిలో ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది?

1) చంపారన్‌ సత్యాగ్రహం       2)  అహ్మదాబాద్‌ మిల్లు కార్మికుల సమ్మె

3) ఖేదా రైతు ఉద్యమం        4) రౌలత్‌ సత్యాగ్రహం


5. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన    సంవత్సరం?

1)  1915   2) 1920   3) 1907   4) 1917


6. భారతదేశ చరిత్రలో 13 ఏప్రిల్, 1919 ఎందుకు అత్యంత దుర్దినం?

1) భగత్‌ సింగ్‌ను ఉరితీశారు.

2) కొమగటుమారులోని ప్రయాణికులను చంపారు.

3) జలియన్‌ వాలాబాగ్‌ సామూహిక హత్యాకాండ జరిగింది.

4) చౌరీచౌరా ఉదంతం జరిగింది.


7. ‘స్వరాజ్‌ పార్టీ’ స్థాపకుడు ఎవరు?

1) మోతీలాల్‌ నెహ్రూ    2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) చిత్తరంజన్‌ దాస్‌     4) సుభాష్‌ చంద్రబోస్‌


8. ‘స్వరాజ్‌ పార్టీ’ ఎందుకు స్థాపించారు?

1) విప్లవకారులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించకపోవడంతో

2) శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్‌ అంగీకరించడంతో

3) సుభాష్‌చంద్ర బోస్‌ కాంగ్రెస్‌ను వీడటంతో

4) శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్‌ అంగీకరించకపోవడంతో


9. భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం?

1) చంపారన్‌ సత్యాగ్రహం       2) అహ్మదాబాద్‌ మిల్లు కార్మికుల సమ్మె

3) ఖేదా ఉద్యమం      4) రౌలత్‌ సత్యాగ్రహం


10. గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌         2) సర్వెంట్్స ఆఫ్‌ ఇండియా

3) మద్రాస్‌ మహాజనసభ           4) ఇండియన్‌ అసోసియేషన్‌


11. ముస్లింలీగ్‌ ఏ రోజును ప్రత్యక్ష చర్యాదినంగా పాటించింది?

1) సెప్టెంబరు 16, 1946      2) డిసెంబరు 16, 1946

3) ఆగస్టు 16, 1946             4) మార్చి 16, 1946


12. మహాత్మాగాంధీ దేన్ని ‘దివాళా తీస్తున్న బ్యాంకు  తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు’ అని అన్నారు?

1) కేబినెట్‌ మిషన్‌ ప్రతిపాదనలు       2) క్రిప్స్‌ ప్రతిపాదనలు

3) మాంటెగ్‌ ప్రతిపాదనలు         4) మౌంట్‌బాటన్‌ ప్రణాళిక


13. కమ్యూనల్‌ అవార్డు అంటే....?

1) బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేక నియోజక వర్గాల     విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్య.

2) భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ మధ్య ఒప్పందం.

3) గాంధీజీ, అంబేడ్కర్‌ల మధ్య ఒప్పందం.

4) వివిధ పార్టీలు, కాంగ్రెస్‌ మధ్య ఒప్పందం.


14. కింద పేర్కొన్న స్వాతంత్య్ర సమరయోధుల్లో ఎవరు ఆంధ్రా బ్యాంకు స్థాపకులు?

1) కాశీనాథుని నాగేశ్వరరావు             

2) అయ్యదేవర కాళేశ్వరరావు

3) భోగరాజు పట్టాభి సీతారామయ్య        

4) కొండా వేంకటప్పయ్య


15. కింద పేర్కొన్న ఏ నాయకుడు మొదటిసారిగా ‘ద్విజాతి’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు?

1) మహ్మద్‌ ఇక్బాల్‌     2) మహ్మద్‌ అలీ జిన్నా

3) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌       4) సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌


16. గాంధీజీని ‘అర్ధనగ్న ఫకీర్‌’ అని అన్నది ఎవరు?

1) రామ్సే మెక్‌ డొనాల్డ్‌        2) క్లెమిట్‌ అట్లీ

3) విన్‌స్టన్‌ చర్చిల్‌         4) ఎడ్మండ్‌ బర్క్‌


17. భారత జాతీయ కాంగ్రెస్‌ బహిష్కరించిన రౌండ్‌   టేబుల్‌ సమావేశం ఏది?

1) మొదటి రౌండ్‌టేబుల్‌ సమావేశం  

2) రెండో రౌండ్‌టేబుల్‌ సమావేశం

3) మూడో రౌండ్‌టేబుల్‌ సమావేశం    

4) మొదటి, మూడో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు


18. కిందివాటిలో తప్పుగా జతపరచింది ఏది?

1)  బెంగాల్‌ విభజన- 1905        2) సైమన్‌ కమిషన్‌ - 1925

3) గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం - 1931    4) క్రిప్స్‌ రాయభారం - 1942


19. కిందివాటిలో గాంధీజీకి సంబంధించని ఉద్యమం?

1) సహాయ నిరాకరణోద్యమం           2) శాసనోల్లంఘన ఉద్యమం

3) హోంరూల్‌ ఉద్యమం          4) క్విట్‌ఇండియా ఉద్యమం


20. కిందివారిలో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరుకానివారు?

1) డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌    2) మహ్మద్‌ అలీ జిన్నా

3) మహాత్మా గాంధీ        4) అక్బర్‌ హైదరీ


21. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్‌   సమావేశం?

1) బెల్గాం సమావేశం     2) లాహోర్‌ సమావేశం

3) కలకత్తా సమావేశం     4) బొంబాయి సమావేశం


22. సైమన్‌ కమిషన్‌ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం?

1) అందులో అందరూ తెల్ల జాతీయులు

2) జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనతో ఆంగ్లేయులపై ప్రజలు ఆగ్రహంగా ఉండటం

3) మింటో-మార్లే సంస్కరణలు వైఫల్యం చెందడం

4) సైమన్‌ భారతీయులను కించపరిచేలా మాట్లాడటం


23. కిందివారిలో గాంధీజీకి ‘మహాత్మా’ అని బిరుదు ఇచ్చిన విశిష్ట వ్యక్తి ఎవరు?

1) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌        2) గోపాలకృష్ణ గోఖలే

3) డా.బాబు రాజేంద్రప్రసాద్‌       4) రవీంద్రనాథ్‌ ఠాకుర్‌


24. పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?

1) నెహ్రూ - అంబేడ్కర్‌         2) అంబేడ్కర్‌ - వల్లభాయ్‌ పటేల్‌

3) గాంధీజీ - అంబేడ్కర్‌          4) గాంధీజీ - నెహ్రూ


25. మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని   భావిస్తారు?

1) బాలగంగాధర్‌ తిలక్‌       2) గోపాలకృష్ణ గోఖలే

3) సురేంద్రనాథ్‌ బెనర్జీ      4) యం.జి.రనడే


26. 1929లో జరిగిన లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షులు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ    2) మోతీలాల్‌ నెహ్రూ

3) మహాత్మాగాంధీ      4) వల్లభాయ్‌ పటేల్‌


27. ‘సరిహద్దు గాంధీ’ అని ఎవరిని పిలుస్తారు?

1) మహ్మద్‌ అలీ జిన్నా    2) ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌

3) అబుల్‌ కలాం ఆజాద్‌      4) మహ్మద్‌ అలీ


28. టాల్‌స్టాయ్‌కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది?

1) ద నేషన్‌   2) ద కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఈజ్‌ విత్‌ ఇన్‌ యూ

3) వార్‌ అండ్‌ పీస్‌      4) హానెస్ట్‌


29. ‘సాధించు లేదా మరణించు’ (డూ ఆర్‌ డై) అనే నినాదం ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు?

1) శాసనోల్లంఘన ఉద్యమం    2) సహాయ నిరాకరణోద్యమం 

3) క్విట్‌ ఇండియా ఉద్యమం     4) వందేమాతరం ఉద్యమం


30. భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్ర    దినోత్సవం చేసుకుంటున్న సందర్భంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు?

1) బొంబాయి  2) పుణె  3) నోవఖలి  4) పట్నా


31. గాంధీజీ ఎప్పుడు మరణించారు?

1) 1948, జనవరి 30     2) 1947, ఆగస్టు 20 

3) 1948, ఫిబ్రవరి 05     4) 1947, జనవరి 15


32. ‘గాంధీజీ మరణించినా-గాంధీయిజం మరణించదు’ అని నినదించిన జాతీయ నాయకుడు?

1) సుభాష్‌ చంద్రబోస్‌    2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) పట్టాభి సీతారామయ్య      4) మహ్మద్‌ అలీ జిన్నా


33. కిందివారిలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో      పాల్గొన్నది?

1) మోతీలాల్‌ నెహ్రూ    2) దాదాభాయ్‌ నౌరోజీ

3) గోపాలకృష్ణ గోఖలే     4) అరుణ అసఫ్‌ అలీ


34. కింది సంఘటనలను సరైన కాలక్రమంలో     అమర్చండి.

ఎ) క్రిప్స్‌ కమిషన్‌        బి) కేబినెట్‌ మిషన్‌

సి) జలియన్‌ వాలాబాగ్‌ విషాదం   

డి) శాసనోల్లంఘన ఉద్యమం

1) సి, డి, ఎ, బి      2) ఎ, బి, సి, డి  

3) బి, డి, సి, ఎ      4) బి, ఎ, సి, డి


35. ఖిలాఫత్‌ ఉద్యమం దేని కోసం జరిగింది?

1) ముస్లింలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం

2) ముస్లింలకు ప్రత్యేక దేశం కోసం

3) ఖలీఫా పునరుద్ధరణ కోసం

4) కాంగ్రెస్‌లో ముస్లింల చేరిక కోసం


36. ‘ఫార్వర్డ్‌ బ్లాక్‌’ పార్టీని స్థాపించినవారు?

1) ఆచార్య జె.బి.కృపలాని    2) సుభాష్‌ చంద్రబోస్‌

3) ఆచార్య ఎన్‌.జి.రంగా    4) అజయ్‌ కుమార్‌ మిత్రా


37. ‘దండి మార్చ్‌’లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు?

1) కొండా వెంకటప్పయ్య       2) పట్టాభి సీతారామయ్య

3) దరిశి చెంచయ్య     4) ఎర్నేని సుబ్రమణ్యం


38. గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహి ఎవరు?

1) ఆచార్య వినోబా భావే         2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) మదన్‌ మోహన్‌ మాలవ్వ      4) అబుల్‌ కలాం ఆజాద్‌


39. 1939 జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షుడైన సుభాష్‌ చంద్రబోస్‌ ప్రత్యర్థి?

1) మహాత్మాగాంధీ      2) పట్టాభి సీతారామయ్య 

3) జవహర్‌లాల్‌ నెహ్రూ     4) కృపలాని


40. శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభ సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌/వైశ్రాయ్‌ ఎవరు?

1) లార్డ్‌ కానింగ్‌   2) లార్డ్‌ ఇర్విన్‌    

3) లార్డ్‌ వేవెల్‌       4) లార్డ్‌ రిప్పన్‌సమాధానాలు

1-2; 2-1; 3-1; 4-4; 5-1; 6-3; 7-3; 8-4; 9-1; 10-2; 11-3; 12-2; 13-1; 14-3; 15-2; 16-3; 17-4; 18-2; 19-3; 20-3; 21-1; 22-1; 23-4; 24-3; 25-2; 26-1; 27-2; 28-2; 29-3; 30-3; 31-1; 32-3; 33-4; 34-1; 35-3; 36-2; 37-4; 38-1; 39-2; 40-2.


రచయిత: కె. వెంకటేశ్వర్లు 

Posted Date : 29-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.