• facebook
  • whatsapp
  • telegram

అటవీ సమాజం - వలస వాదం

వలస చట్టాలతో క్రీడగా మారిన వేట!ఆధునిక యుగంలో వలసవాద పాలనలో జరిగిన దుష్పరిణామాలు అన్నీ ఇన్ని కావు. ఆక్రమిత దేశంలో మనుషులను, వనరులను దోచుకోవడమే ఏకైక ధ్యేయంగా సాగిన ఆ అకృత్యాలు తృతీయ ప్రపంచ దేశాలను చిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా స్థానిక అటవీ జాతులు దారుణమైన దోపిడీకి గురయ్యాయి. చరిత్ర అధ్యయనంలో భాగంగా ఐరోపా దేశాల వలసవాదం పూర్వాపరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అటవీ జాతులు, వారి జీవనశైలి, పండించిన పంటలు, సాగుతీరు, వలస విధానాలతో ఈ జాతులు, అడవులకు, వన్యప్రాణులకు కలిగిన నష్టం, ఆసియాతో పాటు భారతదేశంలో వలస పాలనలో చేసిన అటవీ చట్టాలు, వాటి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి.


1. అటవీ నిర్మూలనకు కారణం?

1) భూమిని మెరుగుపరచడం   2) రైలు పట్టాల కింద వేసే స్లీపర్ల కోసం

3) తోటల పెంపకం     4) పైవన్నీ


2. ‘లకోలా’ అనే తెగ ఎక్కడ నివసిస్తుంది?

1) దక్షిణ అమెరికా    2) ఉత్తర అమెరికా   

3) ఫ్రాన్స్‌       4) ఇంగ్లాండ్‌


3. ఆంగ్లేయులు వారి వలస ప్రాంతాల్లో ఏ పంటను ప్రోత్సహించారు?

1) జనపనార 2) చక్కెర 3) గోధుమ 4) పైవన్నీ


4. శ్వేత జాతీయులు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే  సమయానికి ఈ ఖండం ఖాళీగా ఉంది. దానిని ఇలా కూడా అంటారు?

1) టెర్రా నల్లియస్‌       2) టెర్రా కోల్లిస్‌   

3) టెర్రా నిల్లోస్‌       4) పైవన్నీ 


5. 1896లో అమెరికాలోని హండురస్‌ గురించి రాసినవారు?

1) హంటింగ్‌       2) రిచర్డ్‌ హార్డింగ్‌  

3) మెకంజి       4) విలియం మేరిస్‌


6. సింగ్‌భూమ్‌ అడవులున్న ప్రాంతం?

1) మాళ్వా     2) ఛోటానాగ్‌పుర్‌ 

3) పామీర్‌     4) దక్కన్‌ పీఠభూమి


7. 19వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో కనుమరుగైన అడవులు?

1) ఓక్‌ అడవులు       2) మడ అడవులు   

3) చిట్టి అడవులు       4) పైవన్నీ


8. అటవీ వనరుల అన్వేషణకు ఆంగ్లేయులు బృందాలను ఎప్పుడు పంపారు? 

1) 1820   2) 1920   3) 1830  4) 1840


9. ఎప్పటినుంచి రైల్వే లైన్ల విస్తరణ వేగవంతమైంది?

1) 1840  2) 1850   3) 1860   4) 1870


10. భారతదేశంలో అడవులు తరిగిపోవడం వల్ల ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఏ దేశపు అటవీ నిపుణుడిని నియమించారు? అతడి పేరు, పదవులను వరసగా గుర్తించండి.

1) ఇంగ్లాండ్‌ - డైట్రిచ్‌ బ్రాండీస్‌ - ఫారెస్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌

2) జర్మనీ - ఎరియర్‌ ఎల్విన్‌ - సర్వేయర్‌ జనరల్‌

3) జర్మనీ-డైట్రిచ్‌ బ్రాండీస్‌ - ఫారెస్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌

4) ఇంగ్లాండ్‌-ఎరియర్‌ ఎల్విన్‌ - సర్వేయర్‌ జనరల్‌


11. కిందివాటిలో బ్రాండీస్‌ సూచనలు గుర్తించండి.

1) అడవుల పరిరక్షణ శాస్త్రంపై శిక్షణ ఇవ్వాలి.

2) అటవీ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలి.

3) అటవీ వినియోగానికి నిబంధనలు రూపొందించాలి.           4) పైవన్నీ


12. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 

ఎ) 1864 - ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు ఏర్పాటు

బి) 1865 - ఇండియన్‌ ఫారెస్ట్‌ యాక్ట్‌

సి) 1906 - ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ పరిశోధనా సంస్థ, దేహ్రాదూన్‌

1) ఎ, బి 2) బి మాత్రమే 3) ఎ, బి, సి 4) ఎ మాత్రమే 


13. ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ పరిశోధనా సంస్థలో బోధించేది?   

1) సామాజిక శాస్త్రం       2) అటవీ శాస్త్రం   

3) శాస్త్రీయ అటవీ శాస్త్రం    4) వృక్ష శాస్త్రం


14. ప్లాంటేషన్‌ అంటే ఏమిటి?

1) ఒకే రకమైన చెట్లు ఉండే అడవులు నరికి, మరో రకమైన చెట్లు పెంచడం.

2) సహజ అడవులు నరికి, ఒకే రకమైన చెట్లను వరసగా పెంచడం.

3) వాణిజ్య విలువ ఉండే చెట్లు నరికి, అత్యధిక వాణిజ్య విలువ ఉండే చెట్లు పెంచడం.

4) పైవన్నీ


15. 1878 అటవీ చట్టం ప్రకారం అడవుల రకం?

1) రిజర్వు అడవులు      2) రక్షిత అడవులు  

3) గ్రామ అడవులు      4) పైవన్నీ


16. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) గ్రామస్థుల అభిప్రాయంలో ఇంధనం, పశుగ్రాసం, ఆకులు లాంటివి లభించేవి మంచి అడవులు.

బి) ‘ఓడలు, రైల్వే నిర్మాణానికి కావాల్సిన కలప ఇచ్చేది మంచి అడవి.’ అనేది అటవీ అధికారుల అభిప్రాయం.

1) ఎ, బి 2) ఎ మాత్రమే 3) బి మాత్రమే 4) ఏదీకాదు


17. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) ఎండిన సొరకాయను ........ మంచినీళ్ల సీసాగా వాడతారు.

బి) సియాడిలతలు ........ తాళ్ల తయారీకి    వాడతారు.

సి) బూరగ చెట్టు బెరడు ...... కూరగాయలు  తురమడానికి వాడతారు.

డి) మహువ చెట్టు కాయలు...... వంటనూనె తయారీకి వాడతారు.

1) ఎ, బి, డి          2) ఎ, బి, సి, డి 

3) బి, సి, డి          4) ఎ, డి 


18. బర్మాలోని ధారావాడిలో టాంగ్యా సాగు విధానం గురించిన చిత్రాన్ని ఏ సంవత్సరంలో తీశారు?

1) 1920  2) 1921  3) 1923  4) 1922


19. స్వీడన్‌ వ్యవసాయం అంటే?

1) విస్తృత వ్యవసాయం      2) మిశ్రమ వ్యవసాయం  

3) పోడు వ్యవసాయం       4) పైవన్నీ


20. కిందివాటిని జతపరచండి.

 దేశం       విస్తాపన     వ్యవసాయం పిలిచే పేరు

1) ఆగ్నేయ ఆసియా    ఎ) లాడింగ్‌

2) మధ్య అమెరికా     బి) మిల్వా

3) ఆఫ్రికా     సి) చిట్‌మెన్‌/టావి

4) శ్రీలంక     డి) చనా

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ   4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి  


21. భారతదేశంలో పోడు వ్యవసాయానికి పేర్లు?

1) పెండ, బేవార్‌        2) థ్యా  

3) నేవాడ్, ఖాండాడ్, కుమ్రి  4) పైవన్నీ


22. పోడు వ్యవసాయంలో ప్రధానంగా పండించే పంటలు?

1) మధ్య భారతదేశం, ఆఫ్రికాలలో - చిరుధాన్యాలు    2) బ్రెజిల్‌లో - దుంపలు

3) లాటిన్‌ అమెరికాలో - మొక్కజొన్న, చిక్కుడు  4) పైవన్నీ


23. అటవీ చట్టాల వల్ల వేట అనేది ఏవిధంగా మారింది?

1) సంప్రదాయంగా    2) క్రీడగా, సంప్రదాయంగా   

3) క్రీడగా       4) ఏదీకాదు


24. వలస రాజ్యంలో బ్రిటిషర్లు పెద్ద జంతువులను ఎలా భావించారు?  

1) క్రూరమైనవి       2) అనాగరికతకు చిహ్నం

3) ఆటవికతకు గుర్తు    4) పైవన్నీ


25. వలస పాలనా కాలంలో జంతువులను వేటాడిన ప్రముఖులు-

1) సర్గూజ మహారాజ్‌       2) జార్జ్‌ యూల్‌   

3) లార్డ్‌ రీడింగ్‌       4) పైవారందరూ


26. ‘మా వద్ద ఆహార పదార్థాలు లేకపోవడం వల్ల మేం ఆకలితో అలమటిస్తున్నాం, మా గూడలే మాకున్న సంపద...........’’ అని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నది?

1) 1892 - గోండ్లు       2) 1792 - బైగాలు  

3) 1892 - బైగాలు       4) 1892 - ఖోండ్లు


27. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) గ్రామీణ బ్రెజిలియన్‌ అమెజాన్‌లో నివసించే ముండురకు జాతి - ఎత్తయిన ప్రాంతాల్లో   నివసిస్తూ దుంపలు సాగు చేస్తారు.

బి) మధ్యయుగ కాలం నుంచి బంజారాలు -  ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగులతో వ్యాపారం చేస్తారు.

సి) ఝార్ఖండ్‌లోని సంతాల్‌లు, ఓరాన్‌లు - అస్సాం తేయాకు తోటల్లో పనికి వెళ్లేవారు.

1) ఎ, బి, సి  2) ఎ, సి  3) బి, సి  4) ఎ, బి 


28. అమెజాన్‌లోని పుటుమాయోలో రబ్బరు సేకరించే  స్థానిక కార్మికులు-

1) హుట్టోస్‌ 2) నీగ్రోలు 3) గద్దేలు 4) బకర్వాలు


29. ‘నాకు కావాల్సినంత రబ్బరు తేలేనివారు, నా  ఆదేశాలు పాటించని ఇండియన్స్‌ను నిర్మూలించాలనుకుంటున్నాను’ - ఈ వాక్యం దేని నుంచి తీసుకున్నారు?

1) కలోనిలిజం అండ్‌ కల్చర్‌  2) కల్చర్‌ - కమ్యూనిటీ

3) కలోనిలిజం - కమ్యూనిటీ      4) పైవన్నీ


30. బస్తర్‌ తిరుగుబాటు జరిగిన సంవత్సరం?

1) 1910  2) 1920   3) 1930  4) 1810


31. కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి.

ఎ) బస్తర్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ భాగంలో ఉంది.

బి) బస్తర్‌ పీఠభూమికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దులు.

సి) ఈ పీఠభూమికి ఉత్తరంగా ఛత్తీస్‌గఢ్‌ మైదానం, దక్షిణంగా గోదావరి మైదానం ఉంది.

డి) ఇంద్రావతి నది బస్తర్‌ మీదుగా ప్రవహిస్తుంది.

1) ఎ, బి, సి         2) ఎ, బి, సి, డి   

3) బి, సి, డి      4) ఎ, సి, డి


32. బస్తర్‌ పీఠభూమిలో నివసించే గిరిజన సమూహాలు?

1) మరియా, ఛత్రాలు    2) మురియా, హల్బాలు   

3) గోండ్లు, ధుర్వాల్‌       4) పైవారందరూ


33. ఒక గ్రామం మరొక గ్రామంలోని కలప తెచ్చుకోవాలంటే చెల్లించే పన్నులు (రుసుములు)?  

1) దేవ్‌సారి        2) దాండో   

3) మాన్‌       4) పైవన్నీ


34. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) బస్తర్‌ 1947లో కాంకేర్‌ రాజ్యంలో విలీనమై, మధ్యప్రదేశ్‌లో బస్తర్‌ జిల్లాగా మారింది.

బి) 1998లో దీన్ని మళ్లీ కాంకేర్, బస్తర్, దంతెవాడ అనే మూడు జిల్లాలుగా విభజించారు.

సి) 2001లో ఇది ఛత్తీస్‌గఢ్‌లో భాగమైంది.

1) ఎ, సి 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) ఎ మాత్రమే


35. దృవాలు, గుండాధుర్‌లు వరుసగా ఏ ప్రాంతానికి చెందినవారు?

1) కంగేర్‌ - నేతనార్‌    2) నేతనార్‌ - కంగేర్‌   

3) రాంగేర్‌ - నేతనార్‌    4) నేతనార్‌ - దంపుర్‌


36. ‘‘పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్‌ ప్యూన్‌లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్నివైపుల నుంచి జగదల్పూర్‌లోకి ప్రవేశించారు.’’ అని అన్నదెవరు? 

1) విలియం థామస్‌       2) విలియం జోన్స్‌  

3) విలియం వార్డ్‌      4) జేమ్స్‌ విలియం


37. సాల్‌ అడవులకు బదులు ఉష్ణమండలం పైన్‌ వృక్షాలను పెంచాలని ప్రపంచ బ్యాంకు ఎప్పుడు ప్రతిపాదించింది?

1) 1950  2) 1960  3) 1970  4) 1980


38. భోండియా ఎంతమందిని సమీకరించి తిరుగుబాటు చేశాడు?

1) 200    2) 300    3) 400   4) 500


39. జావా నేడు దేన్ని అధికంగా ఉత్పత్తి చేసే దీవిగా ఉంది?

1) గోధుమ  2) వరి  3) చెరకు  4) జొన్న


40. జావాలోని కలాంగ్‌లు దేనిలో సిద్ధహస్తులు?   

1) చెట్లు నరకడం       2) పోడు వ్యవసాయం   

3) 1, 2         4) వ్యాపారంసమాధానాలు


1-4, 2-2, 3-4, 4-1, 5-2, 6-2, 7-1, 8-1, 9-3, 10-3, 11-4, 12-3, 13-3, 14-2, 15-4, 16-1, 17-2, 18-2, 19-3, 20-1, 21-4, 22-4, 23-3, 24-4, 25-4, 26-3, 27-1, 28-1, 29-1, 30-1, 31-2, 32-4, 33-4, 34-3, 35-1, 36-3, 37-3, 38-3, 39-2, 40-3. 

Posted Date : 06-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.