• facebook
  • whatsapp
  • telegram

ఫ్రెంచి విప్లవం

అతివలకు అణచివేతలను ప్రతిఘటించే హక్కు!

సంప్రదాయ రాచరిక పాలనను సవాలు చేసి స్వేచ్ఛÄ, సమానత్వం, సోదర భావాల ఆదర)ాలను ప్రపంచమంతా ప్రతిధ్వనించే విధంగా చేసిన విప్లవం అది. ఆధునిక ప్రజాస్వామ్యానికి, మానవహక్కులకు మార్గాలను సుగమం చేసింది. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని చాటి చెప్పింది. తర్వాతి కాలంలో తలెత్తిన ఉద్యమాలకు దిశానిర్దేశం చేసింది. ఆ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలపై పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. నాటి భీతావహపాలన వివరాలను, హక్కుల కోసం స్త్రీలు జరిపిన పోరాటాలను తెలుసుకోవాలి. 


1.    ఫ్రాన్స్‌ రాజు 16వ లూయి రాజ్యాంగంపై సంతకం చేసిన తరువాత ఏ రాజుతో రహస్య మంతనాలు జరిపారు?

1) ఇంగ్లాండ్‌   2) ఇటలీ 3) ప్రష్యా  4) ఆస్ట్రియా


2. 1792లో ఏర్పడిన జాతీయ శాసనసభ ఏ దేశం/ దేశాలపై యుద్ధం ప్రకటించింది?

1) ఆస్ట్రియా  2) రష్యా  3) 1, 2  4) ఇంగ్లాండ్‌


3. ఫ్రాన్స్‌ జాతీయ గీతాన్ని ఎవరు రచించారు?

1) వర్సయిల్స్‌ - డాంటన్‌  

2) మార్సెయిల్స్‌ - రోగెట్‌ - డి - ఎల్‌ - ఐల్‌

3) వర్సయిల్‌ - రోగెట్‌ - డి - ఎల్‌ - ఐల్‌  

4) మార్సెయిల్స్‌ - రాబిస్పెయిర్‌


4. సెయింట్‌ జాకబ్‌ పేరు మీదుగా ఏర్పడిన ఫ్రాన్స్‌లోని క్లబ్‌?

1) ఫ్రాన్స్‌ క్లబ్‌      2) జాకోబిన్స్‌ క్లబ్‌  

3) సెయింట్‌ క్లబ్‌      4) పైవన్నీ


5. జాకోబిన్స్‌ క్లబ్‌ నాయకుడు ఎవరు?

1) డాంటన్‌      2) మీరాబు  

3) రాబిస్పియర్‌      4) పై అందరూ


6.    మతపరమైన జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం

1) కాన్వెంట్‌  2) పీఠం  3) చర్చి   4) మఠం 


7. స్వేచ్ఛకు ఉపమానంగా ఉన్న స్త్రీ చిత్రాన్ని (లిబర్టీ) గీసింది?

1) నవీన్‌ వెలైన్‌    2) లేబ్బారియర్‌

3) జాక్వెస్‌ లూయిడేవిడ్‌       4) జేమ్స్‌మిల్‌


8. కిందివాటిలో సరైనవి?

1) కార్మికులు వేసుకునే పొడవాటి చారల ప్యాంటును జాకోబిన్స్‌ డాక్‌ ధరించారు.

2) జాకోబిన్స్‌ను సన్స్‌ - కులెట్స్‌ అని పిలుస్తారు.

3) సన్స్‌ - కులెట్స్‌ ధరించే ఎరుపు రంగుటోపి స్వేచ్ఛకు చిహ్నం.

4) పైవన్నీ


9. 1792లో ఎన్నికైన కన్వెన్షన్‌ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల వయసు వారికి ఓటుహక్కు ఇచ్చింది?

1) 21    2) 22     3) 24     4) 18 


10. కన్వెన్షన్‌ ప్రభుత్వం 16వ లూయి ని ప్లేస్‌ డి లా కానోకార్డ్‌ వద్ద ఎప్పుడు ఉరి తీసింది?

1) జనవరి 11, 1794      2) జనవరి 21, 1793

3) మార్చి 11, 1789       4) జనవరి 25, 1793


11. ఫ్రాన్స్‌లో భీతావహ పాలన ఎప్పుడు జరిగింది?

1) 1793-1794          2) 1794-1795

3) 1792-1793          4) 1795-1796


12. భీతావహ పాలన కాలంలో తీవ్ర నియంత్రణ విధానం అనుసరించింది? 

1) మీరాబు               2) రాబిస్పియర్‌

3) డాంటన్‌              4) నెపోలియన్‌


13. గెలిటెన్‌ అనే యంత్రం కనిపెట్టింది?

1) డాక్టర్‌ గెలిటెన్‌         2) డాక్టర్‌ మీరాబు

3) డాక్టర్‌ డాంçన్‌          4) 16వ లూయి 


14. భీతావాహ పాలనలోని అంశాల్లో సరైనవి గుర్తించండి.

1) ప్రభుత్వ వేతనాలు ధరలపై గరిష్ఠ పరిమితిని విధించారు.

2) మాంసం, రొట్టెలకు రేషనింగ్‌ విధించారు.

3) తెల్లపిండిని ఉపయోగించరాదు. గోధుమపిండి వాడాలి.

4) ఫ్రెంచ్‌ పురుషులను సిటోయెన్‌ అని, స్త్రీలను సిటోయెన్నీ అని పిలవాలి.

1) 1, 2, 3, 4          2) 2, 3, 4 

3) 1, 2, 3              4) 2, 3 


15. రాబిస్పియర్‌ను ఎప్పుడు ‘గెలిటెన్‌’ ద్వారా చంపారు? 

1) 1793, జులై      2) 1794, జులై 

3) 1795, జులై     4) 1796, జులై


16. ‘కామిల్లె డెస్మోలిస్‌’ అనే విప్లవ పాత్రికేయుడు 1793లో దేని గురించి తన పత్రికలో రాశారు?

1) సమానత్వం     2) సోదర భావం 

3) ప్రజాస్వామ్యం     4) స్వేచ్ఛ


17. 1794, ఫిబ్రవరి 7న కన్వెన్షన్‌లో ఎవరి ప్రసంగం ‘‘లీమానిటర్‌ యానివర్సెల్‌’’ పత్రికలో వచ్చింది?    

1) డాంటన్‌      2) డెసాల్మిన్‌ 

3) రాబిస్పియర్‌     4) 16వ లూయి


18. జాకోబిన్స్‌ పరిపాలన ముగిసిన తర్వాత ఎవరి పాలన ప్రారంభమైంది?

1) నెపోలియన్‌           2) డైరెక్టరీ పాలన  

3) ప్రజాస్వామ్య పాలన      4) లూయి బ్లాంక్‌ పాలన


19. ఫ్రాన్స్‌ సమాజంలో మహిళల కోసం 60కి పైగా ఏర్పడిన క్లబ్‌ల్లో ప్రధానమైంది?

1) జాకోబిన్‌ మహిళా క్లబ్‌ 

2) సొసైటీ ఆఫ్‌ ఉమెన్‌ 

3) సొసైటీ ఆఫ్‌ రెవె ల్యూషనరీ అండ్‌ రిపబ్లిక్‌ ఉమెన్‌  

4) నేషనల్‌ ఉమెన్‌ క్లబ్‌


20. ఫ్రాన్స్‌లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం?

1) 1945   2) 1946   3) 1947   4) 1948


21. ఫ్రాన్స్‌లో విప్లవ మహిళగా పేరొందిన మహిళ?

1) మేరీ ఆంటోనెట్‌       2) ఒలింపే - డి - గోజస్‌

3) ఐసబిల్లా - డి - ఎస్టీ       4) మేరియా థెరిస్సా


22. ఒలింపే - డి - గోజస్‌ తన డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని అంశాలు?

1) స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది. ఆమెకు ప్రాథమిక హక్కులుంటాయి.

2) స్త్రీకి అణచివేతను ప్రతిఘటించే హక్కు ఉంటుంది.

3) స్త్రీ - పురుషుల సమైక్యతతో ఏర్పడిన దేశానికే సౌర్వభౌమాధికారం. 

4) చట్టం విషయంలో స్త్రీ మినహాయింపు కాదు.

1) 2, 3           2) 1, 2, 3, 4 

3) 2, 3, 4         4) 1, 2, 3 


23. 1793లో జాకోబిన్‌ రాజకీయ నాయకురాలు ‘చేమెట్’ ను కింది ఏ విధంగా పేర్కొంది?

1) మహిళా క్లబ్‌ల మూసివేతను వ్యతిరేకించింది.

2) మహిళా క్లబ్‌ల మూసివేతను సమర్థించింది.

3) మహిళా సంఘాలను స్థాపించింది.

4) ఆనాటి సమాజంలో పురుషాధిక్యతను సమర్థించింది.


24. ఫ్రాన్స్‌ కరేబియన్‌ దీవుల్లోని ఏ దీవిలో బానిసత్వం రద్దు చేసింది?

1) మార్టినిక్‌     2) గ్వాడెలోప్‌ 

3) శాన్‌డోమింగో     4) పైవన్నీ


25. 17వ శతాబ్దంలో ఏ దేశాల త్రైపాక్షిక ఒప్పందంలో బానిసల వ్యాపారం ప్రారంభమైంది?

1) ఐరోపా, ఆఫ్రికా, అమెరికా       2) ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా

3) ఆసియా, ఆఫ్రికా, అమెరికా  4) ఐరోపా, ఆసియా, ఆఫ్రికా


26. ఫ్రెంచ్‌ వ్యాపారులు ఏ ఓడరేవుల ద్వారా ప్రయాణించి ఆఫ్రికన్‌ తీరాలకు చేరేవారు?

1) బోర్టియాక్స్‌  2) లిస్బన్‌ 3) నాంటెస్‌  4) 1, 3


27. ఫ్రెంచ్‌ కాలనీల్లో చివరిగా బానిసత్వం ఎప్పుడు రద్దయింది?

1) 1847   2) 1848   3) 1849  4) 1850


28. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో దక్షిణాన ఉన్న స్థానిక ప్రజలను ఏమని పిలుస్తారు?

1) నీగ్రోలు  2) బానిసలు  3) పిగ్మీలు 4) పైవన్నీ


29. ఫ్రాన్స్‌లో పత్రికలపై ‘సెన్సార్‌షిప్‌’ను ఏ సంవత్సరంలో రద్దు చేశారు?

1) 1787   2) 1788   3) 1789   4) 1790


30. లూయిస్‌ లియోపోల్డ్‌ బాయిలీ గీసిన చిత్రం?

1) మారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం

2) నెపోలియన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం

3) మెటర్నిచ్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం

4) డాంటన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం


31. నెపోలియన్‌ తనని చక్రవర్తిగా ప్రకటించుకున్న సంవత్సరం?

1) 1802   2) 1803   3) 1804  4) 1805


32. 1774లో ఫ్రాన్స్‌కు రాజు అయినవారు?

1) 14వ లూయి       2) 15వ లూయి 

3) 16వ లూయి       4) 12వ లూయి


33. ఫ్రాన్స్‌లోని ప్రజలు చెల్లించే ప్రత్యక్ష పన్ను?

1) టైర్‌   2) టెయిలే   3) లివర్‌   4) పైవన్నీ


34. రాచరికం దైవ దత్తం అని అన్నవారు?

1) రూసో  2) లాక్‌  3) మాంటెస్కో  4) లూయి


35. ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ ది లాస్‌’ అనే గ్రంథాన్ని రాసిన వారు?

1) రూసో  2) లాక్‌  3) మాంటెస్కో  4) లూయి


36. ఫ్రాన్స్‌ జాతీయ అసెంబ్లీని ఏమని పిలుస్తారు? 

1) జాతీయ అసెంబ్లీ       2) కాంగ్రెస్‌  

3) పార్లమెంట్‌           4) ఎస్టేట్స్‌ జనరల్‌


37. 1789, మే 5న కొత్త పన్నుల విధింపునకు ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను సమావేశపరిచినవారు? 

1) 14వ లూయి       2) 13వ లూయి  

3) 16వ లూయి       4) 15వ లూయి


38. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం?

1) జూన్‌ 14      2) జులై 14  

3) ఆగస్టు 15      4) జులై 4


39. ఫ్రాన్స్‌ డైరెక్టరీ పాలనలోని సభ్యుల సంఖ్య?

1) 3      2) 4     3) 5     4) 6


40. ఫ్రాన్స్‌లో దోషులను చంపేందుకు వాడే యంత్రం?

1) గెలిటెన్‌      2) హత్యాయంత్రం 

3) గెల్లాన్‌     4) పైవన్నీ


41. లాంగ్‌ పార్లమెంటు ఏ సంవత్సరాల మధ్య కొనసాగింది?

1) 1540 - 1650      2) 1340 - 1360 

3) 1643 - 1666      4) 1640 - 1660


42. బాస్టిల్‌ కారాగారంపై ఏ రోజు దాడి చేశారు? 

1) జులై 1 2) జులై 14 3) జూన్‌ 14 4) ఆగస్టు 15


43. ఏ వలసలు ‘ప్రాతినిధ్యం లేనిదే పన్నులు లేవు’ అనే నినాదాన్ని లేవనెత్తాయి? 

1) అమెరికా 2) ఫ్రెంచి 3) పారిస్‌ 4) లాటిన్‌


44. మొదటి చార్లెస్‌ను ఎప్పుడు ఉరితీశారు? 

1) 1649   2) 1549   3) 1449   4) 1749


45. 1781లో అమెరికా ప్రజలు ఎవరి సహాయంతో యుద్ధంలో విజయం సాధించారు? 

1) జర్మనీ  2) స్పెయిన్‌  3) ఫ్రాన్స్‌ 4) ఇటలీ


46. వలస ప్రాంతాలను అణచివేయడానికి ప్రయత్నించిన రాజు? 

1) పదో లూయి      2) మూడో జేమ్స్‌ 

3) మూడో జార్జి         4) పదో చార్లెస్‌ 


47. ఏ రాజు లాంగ్‌ పార్లమెంటులో మంత్రులను శిక్షించాడు? 

1) పదహారో లూయి     2) మొదటి చార్లెస్‌ 

3) మూడో జార్జి        4) మొదటి జేమ్స్‌ 


48. 1774లో ఏ వలస ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన వలస రాష్ట్రాల ప్రతినిధులు ఫిలడెల్ఫియాలో సమావేశమయ్యారు?  

1) కాలిఫోర్నియా          2) జార్జియా  

3) అలబామా          4) ఫ్లోరిడా
సమాధానాలు


1-3; 2-3; 3-2; 4-2; 5-3; 6-1; 7-1; 8-4; 9-1; 10-2; 11-1; 12-2; 13-1; 14-1; 15-2; 16-4; 17-3; 18-2; 19-3; 20-2; 21-2; 22-2; 23-2; 24-3; 25-1; 26-4; 27-2; 28-1; 29-3; 30-1; 31-3; 32-3; 33-2; 34-2; 35-1; 36-4; 37-3; 38-2; 39-3; 40-1; 41-4; 42-2; 43-1; 44-2; 45-3; 46-3; 47-2; 48-2.  
 

Posted Date : 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.